praksam district
-
మాకు కావాల్సింది మాక్ పోలింగ్ కాదు.. అవసరమైతే సుప్రీంకు వెళ్తా : బాలినేని
ప్రకాశం,సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం.. అభ్యర్ధుల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదే. హైర్టులో న్యాయం జరక్కపోతే సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈసీని ఫలితాల్ని రీ వెరిఫికేషన్ చేయాలని కోరినట్లు తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. కేవలం మాక్ పోలింగ్ చేస్తుండడంతో అభ్యంతరం చెప్పామని అన్నారు. ఈవీఎంల్లో అవకతవకలు.. ఈసీకి బాలినేని ఫిర్యాదుసార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించేందుకు ఈసీ అధికారులు కేంద్రానికి తరలి వచ్చాయి. ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. -
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలింగ్ సజావుగా జరగకుండా టీడీపీ కుట్ర పన్నుతోందని ఎస్పీకి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. టీడీపీ గొడవలకు ప్లాన్ చేస్తోంది. మాకు ఉన్న సమాచారంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాం. టీడీపీ ‘‘వుయ్’’ యాప్‌లో ఓటర్ల డేటా తీసుకొని మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ‘వుయ్’ యాప్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కోరారు. -
చంద్రబాబు మోసాలతో పోటీ పడలేం: సీఎం జగన్
సాక్షి, వెంకటాచలంపల్లి: రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి. విలువలులేని, విశ్వసనీయతలేని రాజకీయాలు వచ్చేశాయి. వీటిని మార్చేందుకు మీ బిడ్డగా అడుగులు ముందుకు వేస్తున్నాను అని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లే అని సూచించారు. కాగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర పదకొండో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..‘గత ప్రభుత్వంలో ఎంత మందికి పెన్షన్ వచ్చేది. అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేదో మీకు గుర్తుందా?. కొన్ని విషయాలు ఆలోచించాలని అవ్వాతాతలను కోరుతున్నాను. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. మీ బిడ్డ ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి. అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక. అవ్వాతాతల ఆత్మగౌరవం గురించి నేను ఆలోచన చేశాను. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. వాలంటీర్లతో నేరుగా అవ్వతాతల ఇంటికే పెన్షన్ పంపించాం. 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీన ఉదయమే పెన్షన్ అందించాం. గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్ ఇస్తూ ఉంటే దానిని మార్పు చేశాం. అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందించాం. ప్రతీ గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేశాం. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలేదు. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు. ఏ రోజైనా చంద్రబాబు మీ గురించి ఆలోచన చేశాడా?. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి. విలువలులేని విశ్వసనీయతలేని రాజకీయాలు వచ్చేశాయి. వీటిని మార్చేందుకు మీ బిడ్డగా అడుగులు ముందుకు వేస్తున్నాను. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పారు. ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు. చంద్రబాబు, వారి కూటమిలా నొటికొచ్చిన అబద్ధాలు చెప్పలేను. మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తాడు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రూ.3వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. నెలకు రూ.2వేల కోట్లు పెన్షన్లలకే ఇస్తున్నాం. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డ ప్రభుత్వంలో 99 శాతం హామీలను అమలు చేశాం. రంగు రంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మెదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అసలు నమ్మకండి. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లే’ అని అన్నారు. -
అప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడు వద్దంటున్నారు!
వాడుకోవడం.. వదిలేయడం అనే కామెంట్ వినిపిస్తే వెంటనే గుర్తుకొచ్చే పేరు నారా చంద్రబాబు. పచ్చ పార్టీ అధినేతగా వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరుపొందారు చంద్రబాబునాయుడు. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. అక్కడ నాలుగేళ్ళుగా పార్టీని నడిపించిన నేతకు చెక్ పెడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మా ఇన్చార్జ్ దేవుడు అన్న కొందరు నేతలు ఇప్పుడు ఆయన వద్దని డిమాండ్ చేస్తున్నారట. అసలు ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గానికి ఓ రాజకీయ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కమ్మ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండటంతో సహజంగానే తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ పోటీ ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి టీడీపీ తరపున 2014లో గెలిచిన పోతుల రామారావు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ హవాలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోగానే పోతుల రామారావు ఒక్కసారిగా రాజకీయాలకు దూరం జరిగారు. టీడీపీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడంలేదు. దీంతో ఆయన స్థానంలో ఇంటూరి నాగేశ్వరరావును కందుకూరు ఇన్చార్జ్గా టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. అప్పటి నుండి నియోజకవర్గంలో టీడీపీకి కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. కందుకూరులో కచ్చితంగా ఏడాది క్రితం చంద్రబాబు నిర్వహించిన సభలో తొమ్మిది మంది చనిపోవడంతో చంద్రబాబు సభలంటే ప్రజలలో ఒకరకమైన భయం ఏర్పడింది. కందుకూరులో సభ ఏర్పాట్లపై ఇంటూరి నిర్లక్ష్యం, తప్పిదాల వల్లే తొక్కిసలాట జరిగిందంటూ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్చార్జ్గా ఉన్న ఇంటూరికి బాబాయి కొడుకు ఇంటూరి రాజేష్ రూపంలో అసమ్మతి వర్గం ఏర్పడింది. సొంత కుటుంబంలోనే ఏర్పడిన అసమ్మతిని తగ్గించుకోవడంలో ఇంటూరి నాగేశ్వరరావు విఫలం అయ్యారని కార్యకర్తలే అంటున్నారు. వివాదరహితుడిగా పేరున్న ఇంటూరి నాగేశ్వరరావుని ఆ పార్టీలోని రెండో వర్గమే వివాదాస్పదుడిగా చిత్రీకరించిందని ఆయన వర్గం మండిపడుతోంది. నాలుగు సంవత్సరాలపాటు తనతో డబ్బు ఖర్చుపెట్టించి ఎన్నికలు వచ్చేసరికి తనకు టిక్కెట్ దక్కకుండా చేయాలనే దుష్ప్రచారం ప్రారంభించారని ఇంటూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంటూరి నాగేశ్వరరావుకు పార్టీలోను, సొంత కుటుంబంలోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. బాబాయి కొడుకు ఇంటూరి రాజేష్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుతో కలిసి తన వ్యతిరేక వర్గంగా ఏర్పడటాన్ని నాగేశ్వరరావు వర్గీయులు జీర్నించుకోలేకపోతున్నారు. కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన బిజేపి మహిళా మోర్చా అద్యక్షురాలు ఉన్నం నళినీదేవి పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ కలిసి మరో వర్గంగా ఏర్పడటం కూడా నాగేశ్వరరావుకు మింగుడు పడటంలేదు. వాడుకొని వదిలేసే అలవాటు ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు..ఇప్పుడు ఇంటూరి నాగేశ్వరరావుని వదిలించుకోవడానికే బీజేపీ నుంచి నళినీదేవిని పార్టీలోకి తీసుకున్నారని తెలుగుతమ్మళ్లే చెబుతున్నారు. అందుకే కొంతమంది కార్యకర్తలను ఉసిగొల్పి నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారనే టాక్ నడుస్తోంది. చంద్రబాబు యూజ్ అండ్ త్రో విధానానికి కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు బలవుతున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇంటూరితో నాలుగు సంవత్సరాల పాటు పార్టీ కోసం ఖర్చు పెట్టించి ఇప్పుడు పక్కన పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి టిక్కెట్ రాకపోతే ఇంటూరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్
సాక్షి, ప్రకాశం జిల్లా: కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీగా జనం వస్తారని ఆశ పడ్డ టీడీపీకి నిరాశే ఎదురైంది. ఊహించిన రీతిలో సభ సక్సెస్ కాకపోవడంతో టీడీపీ నేతలు షాక్ తిన్నారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తుండగానే జనం కుర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు ఎదురుగా దర్శనమిస్తున్నప్పటికీ తన ప్రసంగాన్ని చంద్రబాబు కొనసాగించారు. తన పాత స్టైల్లోనే వెలిగొండ ప్రాజెక్టుకు తానే శిలా ఫలకం వేశానని, తానే ప్రారంభిస్తానంటూ ఊదరగొట్టారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలంటే చంద్రబాబుకు ముందు నుంచి చిన్నచూపు. తాగునీటికి, సాగునీటికి రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పశ్చిమ ప్రకాశం వైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణానికి రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, పొదిలి పెద్దచెరువుకు సాగర్ నీటి సరఫరా, వైద్యశాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అడిగినా వారిపై కన్నెర్రచేశారు. ఆయన పాలనలో ఈ ప్రాంతమంతా దుర్భిక్షంగా మారింది. 2019లో అధికారంలోనికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో పాటు, మార్కాపురానికి రూ.475 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం, రూ.720 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు నీటిని అన్నీ గ్రామాలకు అందించే ఇన్‌టెక్‌వెల్ ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, జిల్లా వైద్యశాలలో అభివృద్ధితో పాటు, ఏడుగురు ఉన్న డాక్టర్ పోస్టులను 34 మందికి పెంచారు. 100 బెడ్లను 330 బెడ్ల స్థాయికి పెంచడంతో ఇప్పుడిప్పుడే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇదీ చదవండి: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు -
కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: తనపై కొద్ది రోజులుగా పనిగట్టుకుని ఆరోపణ చేస్తున్నారని, రాజకీయంగా తనను హింసించడమే ధ్యేయంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ మరణం తర్వాత పార్టీని అంటిపెట్టుకొని ఉన్నానని అయినా తనపైన నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని వాపోయారు. హవాలా కుంభకోణం నుంచి భూ కుంభకోణం దాకా అన్నీ నా మీద రుద్ది ఒక పద్ధతి ప్రకారం అభాసుపాలు చేస్తున్నారని బాలినేని మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. తనను తన కుమారుడిని రాజకీయంగా వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఎవరు ఏం చేసినా తాను వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని బాలినేని స్పష్టం చేశారు. పార్టీలో బాధ్యత గల వ్యక్తిగా తను ఒకరి గురించి మాట్లాడనని బాలినేని అన్నారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ -
‘చంద్రబాబు వీధి రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులపై ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు మంత్రి మేరుగ. ‘ నిన్న చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నారో చూశాం. దళితులపై ఎలా దాడులు చేయించారో చూశాం. చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని దిక్కులేక రోడ్డున పడ్డారు. తండ్రి, కొడుకులు బరితెగించిన రాక్షసులు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. దళితులు ఏం పీకుతారు? అని లోకేష్ అన్నాడు. అనలేదని కుటుంబం మీద ఒట్టేసి చెప్పగలవా?, అమలాపురంలో కూడా దళితుల ఇళ్లపై దాడులు చేయించారు. మా దళితులపై ఎందుకంత కక్ష? , మమ్మల్ని అవమానించిన చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయమని హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని ముళ్లపొదల్లో పడేయించిన వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిస్తున్నారు. అదీ జగన్‌కి దళితులపై ఉన్న ప్రేమ. రాజధానిలో దళితులు ఉండకూడదని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైఎఎస్సార్సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలటంతో చంద్రబాబుకు వణుకు పుట్టింది.అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మావాళ్లపై రాళ్లతో దాడి చేశారు.కుట్రలు చేయటంలో చంద్రబాబు సిద్దహస్తుడు’అని ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున -
Nallamala Forest: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
నల్లమల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల ఆటకట్టించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వేటగాళ్లపై నిరంతర నిఘా పెట్టి వారి కదలికను నియంత్రిస్తున్నారు. అభయారణ్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు గూడేలలో గార్డుల నిఘాతోపాటు కొరియర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. ఇటీవల కాలంలో 15 కేసులు నమోదు చేసి 35 మంది వేటగాళ్లను జైలుకు పంపారు. మార్కాపురం: ప్రకాశం జిల్లాలో 3568 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించింది. మార్కాపురం, పెద్దదోర్నాల, పెద్దారవీడు, అర్థవీడు, కంభం, గిద్దలూరు, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, యర్రగొండపాలెం, పుల్లలచెరువు పరిధిలో ఉన్న అటవీ సమీప గ్రామాల్లో వన్యప్రాణులను వేటాడడం, అటవీ సంపదను వేటగాళ్లు దోచుకుంటున్నారు. మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిధిలో మార్కాపురం, దోర్నాల, కొర్రపోలు, నెక్కంటి, గంజీవారిపల్లి, యర్రగొండపాలెం, విజయపురి సౌత్‌లో అటవీ శాఖ అధికార కార్యాలయాలు ఉన్నాయి. వీరి పరిధిలో ఏడుగురు రేంజ్ ఆఫీసర్లు, పది మంది డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, 14 మంది సెక్షన్ ఆఫీసర్లు, 60 మంది బీట్ అధికారులు ఉన్నారు. వేటగాళ్ల ఆగడాలను అరికట్టేందుకు అభయారణ్యంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఏమాత్రం కదలికలు కనిపించినా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో వేటగాళ్లు గిరిజన గూడేలు, సమీప గ్రామాలను ఎంపిక చేసుకుని నిరంతరం వన్యప్రాణులను సంహరిస్తున్నారు. జింకలు, దుప్పులు, కణుతులు, కుందేళ్లను రాత్రిపూట వేటకు వెళ్లి ఉచ్చులేసి చంపి విక్రయిస్తున్నారు. దీంతో రేంజ్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు గార్డులు, నిఘా పెట్టారు. కొరియర్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఐదు నెలల కాలంలో 35 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులకు సంబంధించి మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయ పరిధిలో 35 మంది వేటగాళ్లను అరెస్టు చేశారు. దాదాపు 2.25 లక్షల అపరాధ రుసుము విధించారు. మార్కాపురం పరిధిలో 9 కేసుల్లో 19 మందిని, పెద్దదోర్నాల పరిధిలో 3 కేసుల్లో 10, యర్రగొండపాలెం పరిధిలో 1 కేసులో 3, విజయపురి సౌత్ పరిధిలో 2 కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. రాత్రిపూట అటవీశాఖ సిబ్బంది గస్తీని పెంచారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వేటాడితే కఠిన చర్యలు వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అటవీ జంతువులు కనిపిస్తే ఎవరూ చంపవద్దు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. 1972 వన్యప్రాణి చట్టం ప్రకారం శిక్షలు అమలవుతాయి. – విఘ్నేష్ అప్పావ్, డీడీ, మార్కాపురం ముఖ్య సంఘటనలు ► సెప్టెంబర్ 24న కలుజువ్వలపాడు దగ్గర కుందేళ్లను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు. ► సెప్టెంబర్ 1న కొనకనమిట్ల మండలం మునగపాడు వద్ద ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ► నవంబర్ 7న పట్టణంలోని బాపూజీ కాలనీకి చెందిన ముగ్గురు వేటగాళ్లను అరెస్టు చేశారు. వీరితో పాటు దోర్నాల మండలం కొత్తూరు వద్ద అడవిపందిని పట్టుకుని చంపి మాంసం విక్రయిస్తున్న వేటగాళ్లను అరెస్టు చేశారు. మార్కాపురం మండలం చింతగుంట్ల పరిధిలో ఇద్దరు వేటగాళ్లను, బోడపాడు వద్ద అక్టోబర్‌లో ఇద్దరు వేటగాళ్లను అరెస్టు చేశారు. గత నెలలో గిద్దలూరులో కూడా పలువురు వేటగాళ్లను అరెస్టు చేశారు. -
మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ
సాక్షి, అమరావతి/మార్కాపురం(ప్రకాశం జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఎర్రగొండపాలెంలోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి థెరీసమ్మ (85) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. థెరీసమ్మ భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మంత్రి నివాసానికి తీసుకొచ్చారు. సాయంత్రం స్థానిక జార్జి గ్రీన్స్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు సురేష్ మంత్రికాగా.. రెండో కుమారుడు డాక్టర్ సతీష్ జార్జి విద్యాసంస్థల కార్యదర్శి. ఆమె అల్లుడు తిప్పేస్వామి అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే. మార్కాపురంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసిన థెరీసమ్మ ప్రస్తుతం ఆమె భర్త డాక్టర్ శామ్యూల్ జార్జి నెలకొల్పిన విద్యాసంస్థలకు చైర్‌పర్సన్‌గా కొనసాగారు. చదవండి: పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
స్కిల్ మస్తు.. జాబ్ పక్కా.. యువతకు ఉద్యోగాల వెల్లువ
మార్కాపురం(ప్రకాశం జిల్లా): డిగ్రీ పట్టా ఉంటే చాలదు.. ఉద్యోగం సాధించాలంటే టెక్నాలజీకి అవసరమైన నైపుణ్యం అవసరం.. ఆ దిశగా రాష్ట్ర పభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నియోజకవర్గానికో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి ద్వారా స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. నిరంతరం జాబ్‌మేళాలు నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో 7,147 మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఐదేళ్లపాటు ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు తీసుకున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థను పటిష్టపరచడం, సంస్థ సేవలను విస్తృతం చేయడం ద్వారా పెద్ద పెద్ద నగరాల్లోని ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అధికారులు జిల్లాలో 10 స్కిల్ హబ్‌లు, ఒంగోలు నగరంలో 2 శిక్షణ కేంద్రాలతో పాటు స్కిల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఎటువంటి అదనపు అర్హత లేకపోయినా డిగ్రీ పాసై ఉంటే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాలో మొత్తం 23,853 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారిలో 7,147 మంది నెల్లూరు, చిత్తూరు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర పట్టణాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఒక నియోజకవర్గంలో మెగా జాబ్‌మేళా, మూడో మంగళవారం మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతున్నారు. ఒంగోలు నగరంలో బాలురు, బాలికల ఐటీఐల్లో రెండు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. బాలికల ఐటీఐలో ప్రత్యేకంగా మహిళల కోసం హౌసింగ్, ఎల్రక్టీషియన్ కోర్సులు నిర్వహిస్తున్నారు. మరో కేంద్రంలో ఇండ్రస్టియల్, పిట్టర్ ఎరోకేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. గిద్దలూరులో సెక్యూరిటీ గార్డు, టెలీకాలర్స్, కొండపిలో రిటైల్ అసిస్టెంట్, అసిస్టెంట్ బ్యూటీషియన్, దర్శి, మార్కాపురంలో ఇండ్రస్టియల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. సంతనూతలపాడులో సీయింగ్ వెకేషన్, బ్యూటీథెరపిస్టులో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులో 90 మందితో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మెండుగా ఉపాధి అవకాశాలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి యువతకు శిక్షణ ఇస్తున్నాం. స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలను అమలు చేస్తున్నాం. ప్రతి నెలా 15 నుంచి 25 కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం. 8 నియోజకవర్గాల్లో 10 స్కిల్ హబ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇండ్రస్టియల్ ఎల్రక్టీ షియన్, ఫిట్టర్, ఫ్యాబ్రికేషన్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుంది. త్వరలో ఒంగోలులో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. – లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా నా పేరు శేషుకుమారి. మాది రామసముద్రం. పీజీ చదివాను, జాబ్‌మేళాలో పాల్గొని ఉద్యోగానికి ఎంపికయ్యాను. ప్రస్తుతం చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నా. నెలకు రూ.14 వేల జీతం. హ్యాపీగా ఉన్నాను. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించిన జాబ్‌మేళాలో ఈ అవకాశం దక్కింది. – జే శేషుకుమారి ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నా నా పేరు జీ రమేష్. మాది పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామం. గుంటూరులో బీటెక్ చేశా. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు హాజరై బైజూస్ సంస్థలో ఎడ్యుకేషన్ కౌన్సిలర్‌గా ఎంపికయ్యా. ఏడాదికి రూ.7.5 లక్షల ప్యాకేజీ. – జీ రమేష్ -
కరువు నేలలో జలధారలు
నీటి జాడలు లేక భూములు బీడు బారాయి. గుక్కెడు నీరు దొరక్క గ్రామాలకు గ్రామాలే వలసపోయాయి. దశాబ్దాలుగా కరువు కోరల్లో విలవిల్లాడిన నేలపై కృష్ణమ్మ పరుగులు పెట్టనుంది. నెర్రెలు బారిన భూములు సస్యశ్యామలం కానున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టుల్లో జలసిరులు నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన ప్రయత్నాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్ట్ టెయిల్ఎండ్ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందు కోసం రూ.84.25 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రత్యేక జీఓ విడుదల జేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కరువు నేలపై జల పరవళ్లు చూడాలని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంతో శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌లు సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాకు ప్రధాన జలవనరుగా మారనున్న వెలిగొండ ప్రాజెక్ట్‌కు నిధుల వరద పారించారు. వెలిగొండతో పాటు రామతీర్థం, గుండ్లకమ్మ, కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం.. ఇలా కరువు సీమలో కృష్ణమ్మను పరుగులు తీయించారు. ఇప్పడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు చివరి భూములుగా ఉన్న తీగలేరు కాలువ టీ–5 పరిధిని పెంచి పుల్లలచెరువు మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు నడుంబిగించారు. పుల్లలచెరువు మండలంలోని 9 గ్రామాలను ఆయకట్టు పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ నంబర్ 1824ను 2022 ఆగస్టు 17న విడుదల చేసింది. జలవనరుల శాఖ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం రూ. 84.25 కోట్లు మంజూరు చేసింది. తీగలేరు కాలువ అభివృద్ధి కోసం టెండర్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. తీగలేరును అభివృద్ధి చేయడం ద్వారా పుల్లలచెరువు మండలంలో తాగు, సాగు నీరు అవసరాలు పూర్తిగా తీరనున్నాయి. చిన కండలేరు ప్రాజెక్టుకు అనుసంధానం: తీగలేరు బ్రాంచ్ కాలువను అభివృద్ధి చేయటం ద్వారా ఆ కాలువ ద్వారా ప్రవహింపజేసే నీటితో పుల్లలచెరువు మండలంలోని చినకండలేరు జలాశయాన్ని అనుసంధానం చేయనున్నారు. దశాబ్దాల తరబడి తాగు, సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్న పుల్లలచెరువు మండల ప్రజల కష్టాలను యర్రగొండపాలెం ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుక్కెడు నీటి కోసం వలసలు వెళ్లే గ్రామాల ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం చూపించాలని సీఎంను కోరారు. దశాబ్దాలుగా కరువుతో బీడు భూములుగా మారుతున్న గ్రామాల రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఆయా గ్రామాల ప్రజల తాగునీటి, సాగు నీటి అవసరాలు తీరాలంటే ఒక్క వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిధిని పెంచితేనే సాధ్యమని సీఎంకు వివరించారు. దీంతో ప్రత్యేక జీఓ ద్వారా నిధులు విడుదల చేశారు. 11,500 ఎకరాలు సస్యశ్యామలం: పుల్లలచెరువు మండలానికి కృష్ణా జలాలను తీసుకురావడంతో 9 గ్రామాల్లోని దాదాపు 11,500 ఎకరాలకు పైగా బీడువారిన భూములు వివిధ రకాల పంటలతో కళకళలాడనున్నాయి. ఇప్పటి వరకు వెలిగొండ ప్రాజెక్టు టెయిల్ఎండ్ భూములుగా ఉన్న తీగలేరు కాలువ పనులను ఆయకట్టు పరిధిలోకి తీసుకురావడంతో మండల ప్రజల ఆశలు చిగురించాయి. కరువు నేలలో బీడు భూములను పంట పొలాలుగా మార్చటంతో పాటు తాగునీటి సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల జీవితాల్లో వెలుగులు మా ప్రాంతంలో తాగు, సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. టి–5 కాలువ పనులు పూర్తిచేసి చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే మా ప్రాంతాల్లోని రైతుల జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారు. ఏళ్ల తరబడి నీరులేక ఇబ్బందులు పడుతున్నాం. సాగునీరు లేక, పంటలు పండక కరువుతో అల్లాడుతున్నాం. ప్రభుత్వం తీగలేరు కాలువ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయటంతో ఇక్కడి ప్రజలకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మా ప్రాంతం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. – శివారెడ్డి, రైతు, మల్లాపాలెం కోనసీమను తలపిస్తాయి.. తీగలేరు కాలువ పనులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండల ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది. స్థానిక ప్రజల కష్టాలను గుర్తించి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురే‹Ùకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. టి–5 కాలువ ద్వారా చిన్నకండలేరు ప్రాజెక్టుకు నీరు వస్తే ఈ ప్రాంత పొలాలు కోనసీమను తలపిస్తాయి. నీరు వృథా కాకుండా పంటలను సాగు చేసుకుంటాం. – నాసరయ్య, రైతు, పుల్లలచెరువు -
సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన (ఫొటోలు)
-
చీమకుర్తి సభలో సరదా సన్నివేశం
సాక్షి, ప్రకాశం: సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీమకుర్తి విగ్రహావిష్కరణ సభలో సరదా సన్నివేశం జరిగింది. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగ సమయంలో.. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం.. ఆమె మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఉద్దేశిస్తూ.. పాట పాడడంతో అభిమానుల కోలాహాలం నెలకొంది. అయితే సభా సమయం మించి పోతుండడంతో ఆమెను వచ్చి కూర్చోవాలంటూ సైగ చేశారు సీఎం జగన్. అయినా ఆమె వినిపించుకోకపోవడంతో.. స్వయంగా ఆయనే వెళ్లి అమ్మా అని పిలుచుకునే వెంకాయమ్మను వెంటపెట్టి తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. -
రిటైర్డ్ హెచ్ఎం రాంభూపాల్‌రెడ్డి ఔదార్యం
ఒంగోలు అర్బన్(ప్రకాశం జిల్లా): రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి తన పెన్షన్ సొమ్ముతో వెయ్యి మంది కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వచ్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం స్పందన భవనంలో అంగీకార పత్రాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్‌కు అందజేశారు. యడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మికులకు బీమా చెల్లిస్తానని అంగీకారం తెలిపారు. గతంలో రిటైర్మెంట్ బెన్ఫిట్స్ మొత్తం రూ.26 లక్షలు స్థానిక పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ద్వారా సుమారు 100 మందికి పైగా పేద బాలికలకు జమ చేస్తున్ననాని తెలిపారు. దీనిపై దేశ ప్రధాని కూడా అభినందించిన విషయం గుర్తుచేశారు. సేవా భావంతో రిటైర్డ్ ఉద్యోగి పనిచేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. (క్లిక్: 100 మందికి సుకన్య సమృద్ధి యోజన) -
‘చీకోటి’ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: కేసినో వ్యవహారానికి తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసినో ప్రవీణ్ ఎవరో తనకి అసలు తెలియదని, తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. ఒంగోలు నగరాన్ని ఈ రెండేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చేస్తానని బాలినేని అన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధికి రూ.20 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్న ఆయన, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి తిరిగి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని బాలినేని అన్నారు. చదవండి: చంద్రబాబు పాలనలో జరిగింది డీపీటీ: సీఎం జగన్ -
Ongole: నా వెనకుంది దామచర్ల.. నన్నేమీ చేయలేరు..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు సాగించిన భూదందా నేటికీ కొనసాగుతోంది. అమాయక పేద ప్రజలకు స్థలాల ఆశ చూపి గతంలో డబ్బు గుంజిన టీడీపీ నాయకులు నేడు అదే పంథాను అనుసరిస్తున్నారు. ఒంగోలు నగరంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై కోర్టులో కేసులు వేసి రాక్షసానందం పొందుతున్న టీడీపీ నేతలు.. అదే ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో భూదందా సాగిస్తుండటం సంచలనంగా మారింది. చదవండి: విభేదాలతో సై’కిల్’.. టీడీపీలో కుంపట్ల కుమ్ములాట పెళ్లూరు. చెరువుకొమ్ముపాలెం మధ్య ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా ఆక్రమించి బిట్లు బిట్లుగా విక్రయించిన మహిళా నాయకురాలు.. తాజాగా మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్మేసే యత్నం చేస్తోంది. దీనిపై అభ్యంతరం తెలిపిన స్థానికులను చంపేస్తామంటూ రౌడీలతో బెదిరిస్తుండటంతో వారు ప్రాణ భయంతో బుధవారం ఎస్పీ మలికాగర్గ్ వద్దకు వెళ్లి రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని చెరువుకొమ్ముపాలెం–పెళ్లూరు పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూమి గత టీడీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైంది. ఈ అక్రమాల దందాకు ప్రధాన సూత్రధారురాలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచర వర్గానికి చెందిన పాలేటి అమృత. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఆమె.. దానికి ఏకంగా అమృత నగర్‌గా పేరుపెట్టింది. అందులో గుడిసెలు వేసి పట్టాలిప్పిస్తానని చెప్పడంతో సుమారు 55 మంది వరకు ఆశపడ్డారు. ఒక్కొక్కరికి 10 గదుల చొప్పున స్థలం కేటాయించిన అమృత రూ.లక్ష చొప్పున అప్పనంగా దండుకుంది. రౌడీ మూకలతో బెదిరింపులు.. చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో 55 మంది గుడిసెలు వేసుకోగా ప్రస్తుతం అక్కడ 30 కుటుంబాలే కాపురముంటున్నాయి. సుమారు 25 మంది అమృత బెదిరింపులకు భయపడి గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మామిడిపాలేనికి చెందిన కొందరు రౌడీïÙటర్లను పంపి తరచూ బెదిరిస్తుండటంతో చేసేదేమీ లేక వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. అలా ఖాళీ చేసి వెళ్లిన వారి గుడిసెలను కూడా అమృత రూ.లక్ష చొప్పున మళ్లీ బేరానికి పెట్టి అమ్మేసింది. అమృత నగర్ వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల కాలంలో ప్రభుదాస్ అనే వ్యక్తితో కలిసి ప్లాట్లు వేసి 15 మందికి విక్రయించడంతో స్థానికులు తమకు ఇబ్బందులొస్తాయని ఎదురుచెప్పడం అమృతకు కంటగింపుగా మారింది. బుధవారం రాత్రి పది గంటల సమయంలో అమృతతోపాటు 10 మంది వ్యక్తులు గుడిసెల వద్దకు వచ్చి బెదిరించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అమ్మో ఆ వేధింపులు తాళలేం... సుబానీ బ్యాచ్, ప్రభుదాస్ బ్యాచ్ పేరుతో కొందరు రౌడీలు అర్ధరాత్రి పూట వచ్చి ఇళ్ల వద్ద నానాయాగీ చేస్తున్నారని కాలనీ వాసులు వాపోయారు. ఇళ్ల మధ్యలో మద్యం తాగి సీసాలు పగలగొట్టడంతో పాటు రాళ్లు వేస్తున్నారని, తలుపులు కొట్టి బెదిరిస్తుండటంతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా అడ్డుకోవడానికి వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతోపాటు సచివాలయ సిబ్బందిని కూడా అమృత బెదిరించిందని స్థానికులు ఆరోపించారు. ‘‘మీరు ఎక్కడికెళ్లినా నాకేమీ కాదు. నాకు దామచర్ల జనార్దన్ సపోర్ట్ ఉంది’’ అంటూ పాలేటి అమృత బహిరంగంగా బెదిరిస్తోందని చెప్పారు. ‘కుక్క జోలికెళ్లి చక్కదనం పోగొట్టుకోవడం ఎందుకని వదిలేశాం’ అంటూ గుడిసెలు ఖాళీ చేసి వెళ్లిన బాధితులు అమృత వ్యవహార శైలిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. ఎస్పీగారూ మీరే కాపాడాలి.. చెరువుకొమ్ముపాలెం కాలనీ వాసుల మొర ‘ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ అమృత అనే మహిళ తమ వద్ద నుంచి లక్ష రూపాయల చొప్పున తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని చూపింది. గతంలో ఆమె మీద కేసు కూడా నమోదైంది. మళ్లీ రూ.50 వేలు డబ్బు ఇవ్వాలంటూ రౌడీలను పంపించి బెదిరిస్తోంది. రెండు రోజుల నుంచి రాత్రిపూట ఇళ్ల వద్దకు రౌడీలు వచ్చి రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రశి్నస్తే దాడి చేస్తున్నారు. మంగళవారం తాలూకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. అమృత బారి నుంచి మాకు రక్షణ కలి్పంచండి’ అని కాలనీ వాసులు బుధవారం ఎస్పీని వేడుకున్నారు. -
100 మందికి సుకన్య సమృద్ధి యోజన
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగ విరమణతో వచ్చిన సంపాదనతో 100 మందికి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం వాసి రాంభూ పాల్‌రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అంశాన్ని ఆదివారం మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. ‘‘సమాజానికి సేవ చేయాలనే మంత్రం మన విలువలు, సంస్కారంలో ఒక భాగం. దేశంలో లెక్కలే నంత మంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో ఉంటున్న మిత్రుడు రాంభూ పాల్ రెడ్డి గురించి తెలుసుకున్నా. తన రిటైర్మెం ట్ తర్వాత వచ్చిన సంపాదనంతా చదువుకొనే కుమార్తెలకు విరాళంగా ఇచ్చారని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సుకన్య సమృద్ధి యోజన కింద 100 ఖాతాలు తెరవడంతో పాటు వారికి రూ.25 లక్షలు డిపాజిట్ చేశారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి 35 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించి గతేడాది పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన రూ.25,71,676 యడవల్లి పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. (క్లిక్: ఇందుకూరు పేట.. కూరగాయల తోట) -
పక్కింటి యువకుడితో భార్య చనువుగా ఉంటుందని..
ప్రకాశం (దర్శి టౌన్) : భార్యతో చనువుగా ఉంటున్న పక్కింటి యువకుడిని భర్త పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో దారుణంగా హత్య చేశారని దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పేర్కొన్నారు. దర్శి మండలం వెంకటాచలంపల్లి పంచాయితీ పరధిలోని నడిమిపల్లెలో ఈనెల 7న జరిగిన యువకుని హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. బుధవారం దర్శి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వెల్లడించారు. వివరాలు.. నడిమిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల సత్యనారాయణ అదే గ్రామానికి చెందిన బోనం బాలచెన్నయ్య భార్య శివకుమారితో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం బాలచెన్నయ్యకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలంటూ సత్యనారాయణను పలుమార్లు హెచ్చరించాడు. ఈ నెల 6వ తేదీ రాత్రి శివకుమారి, సత్యనారాయణ చనువుగా ఉండటాన్ని గమనించిన బాలచెన్నయ్య కోపోద్రిక్తుడయ్యాడు. సత్యనారాయణకు అడ్డుతొలగిస్తే తప్ప తన సంసారం బాగుపడదని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని తన బంధువుల దృష్టికి తీసుకెళ్లి ఆవేదన చెందాడు. ఈనెల 7వ తేదీన సత్యనారాయణ తన కనకాంబరాల తోటకు వెళ్లి వస్తుండగా బాల చెన్నయ్య, అతని బంధువులు కలిసి కత్తి, గడ్డపార, బండరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. రోడ్డుపై పడిపోయిన సత్యనారాయణను బంధువులు గమనించి వైద్యశాలకు తీసుకెళ్లేలోగా మృతి చెందాడు. హతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రÔóఖర్ కేసు నమోదు చేసి సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు బోనం బాలచెన్నయ్యతోపాటు అతనికి సహకరించిన బోనం చిన వీరయ్య, బోనం శివకుమారి, బోనం వెంకట లక్ష్మి, బోనం అంకమ్మ, పుప్పాల అంకమ్మ, పుప్పాల వెంకటేశ్వర్లు, పార్శపు హనుమంతును బుధవారం దర్శి సీఐ అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
విషాదం: తన ఇద్దరి బిడ్డలను బైకుపై తీసుకువచ్చి.. పానీపూరి తినిపించి..
బల్లికురవ(ప్రకాశం జిల్లా): శివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకని చెప్పి వెళ్లిన ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బల్లికురవ మండలం గుంటుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రి మృతదేహం లభించగా, అతని వెంట వెళ్లిన చిన్నారుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బల్లికురవ మండలంలోని గుంటుపల్లి గ్రామానికి చెందిన గుర్రం చిరంజీవి (36)కి 11 ఏళ్ల క్రితం మార్టూరు మండలం వలపర్ల గ్రామానికి చెందిన కల్యాణితో వివాహమైంది. వీరికి కుమారుడు శాయి చైతన్య కృష్ణ (10), శాయి సౌమ్య (8) ఉన్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చైతన్య కృష్ణ నాల్గవ తరగతి, సౌమ్య 3వ తరగతి చదువుతున్నారు. మంగళవారం మహా శివరాత్రి సందర్భంగా పానీపూరి కావాలని పిల్లలు తండ్రి చిరంజీవిని కోరారు. చదవండి: అనూస్ పేరుతో బ్యూటీ పార్లర్.. స్థానికులతో పరిచయం పెంచుకుని.. చివరికి బల్లికురవ తీసుకెళ్లి పానీపూరి తినిపించి అక్కడ నుంచి కోటప్పకొండ తిరునాళ్లకు తీసుకెళ్తానని భార్యకు చెప్పాడు. బైకుపై తీసుకువచ్చి పానీపూరి తినిపించి అక్కడ నుంచి అద్దంకి బయలుదేరాడు. దారిలో సాగర్ అద్దంకి బ్రాంచ్ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద బైకును నిలిపాడు. చిరంజీవి ఇద్దరు బిడ్డలతో సాగర్ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయానికి తిరునాళ్లకని వెళ్లిన భర్త, పిల్లలు తిరిగి రాకపోవడంతో కోటప్పకొండలోని బంధువుల ఇళ్ల వద్ద కల్యాణి విచారించింది. ఆచూకీ లభించలేదు. సాగర్ కాలువ వల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి బైకు, చెప్పులు, కుమారుడు చైతన్య కృష్ణ చెప్పులు ఉన్నాయన్న సమాచారం అందడంతో బల్లికురవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై వి.వేమన మిస్సింగ్ కేసు నమోదుతో దర్యాప్తు చేపట్టారు. గజ ఈతగాళ్లతో సాగర్ కాలువలో గాలింపు చేపట్టారు. బొల్లాపల్లి లాకుల వద్ద చిరంజీవి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు సీహెచ్‌సీకి తరలించారు. చిన్నారుల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. చిరంజీవికి రూ.20 లక్షలకుపైగా అప్పులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అతను మదనపడుతుండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
వివాహేతర సంబంధం.. ప్రశ్నిస్తోందనే హత్య!
సాక్షి, కందుకూరు: లింగసముద్రంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన విద్యార్థిని ప్రశాంతి(15) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, ఆర్థిక లావాదేవీలను ప్రశ్నిస్తుందనే కారణంతో తల్లితో సహజీవనం చేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. ఈ మేరకు శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండే శ్రీనివాసులు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. వేటపాలేనికి చెందిన ఈసునూరి మాధవి 15 ఏళ్లుగా లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంలో ఏఎన్ఎంగా పనిస్తోంది. విభేదాల కారణంగా భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా కూతురు ప్రశాంతితో కలిసి లింగసముద్రతో నివాసం ఉంటోంది. తన ఇంటి కింద పోర్షన్లో నివాసం ఉంటున్న జంగారెడ్డిపాలేనికి చెందిన వివాహితుడైన సుంకర శ్రీకాంత్‌తో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తున్నారు. చదవండి: కూతురు కర్కశం.. కన్నతల్లి అని కనికరం లేకుండా.. దీనికి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో కలిసే జీవిస్తున్నారు. మాధవికి వచ్చే జీతాన్ని సైతం శ్రీకాంత్ కాజేయడం, ఆమె అకౌంట్లోని డబ్బులు డ్రా చేసుకొని తన అవసరాలు తీర్చుకోవడం శ్రీకాంత్‌కు పరిపాటిగా మారింది. ఈ విషయంలో ప్రశాంతి ఇటీవల తల్లిని ప్రశ్నించడం ప్రారంభించింది. 10వ తరగతి పూర్తి చేసిన ప్రశాంతి మంచి మార్కులతో నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. అక్కడ రూ.60 వేలు కట్టాల్సి వచ్చింది. మాధవి ఆ డబ్బును శ్రీకాంత్‌ను అడిగింది. ప్రశాంతి ఉంటే మాధవితో తన సంబంధం కొనసాగదని, ఆర్థిక విషయాల్లో తన బాగోతం బయటపడుతుందని భావించిన శ్రీకాంత్ ప్రశాంతిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 23వ తేదీన ఉదయం 7గంటల సమయంలో ఇంట్లో నిద్రపోతున్న ప్రశాంతిని గొంతునులుమి చంపేశాడు. చదవండి: ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ ద్వారా భారీగా గంజాయి రవాణా శవాన్ని ఏం చేయాలో తెలియక ఆ రోజంతా ఇంట్లోనే ఉంచుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుడైన గురుబ్రహ్నం, మాధవి, శ్రీకాంత్ కలిసి అటవీ ప్రాంతానికి శవాన్ని తరలించి పెట్రోల్, డీజిల్ పోసి తలగబెట్టారు. మరుసటి రోజు వెళ్లి శవం పూర్తిగా కాలకపోవడంతో మట్టివేసి కప్పి వచ్చారు. తల్లి సహకారంతోనే... ప్రశాంతి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మాధవి, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ తల్లి ధనమ్మ ప్రోత్సాహం కూడా ఉంది. మాధవితో వివాహేతర సంబంధం కొనసాగింపు, ప్రశాంతిని హత్యచేసి తగలబెట్టడం వరకు శ్రీకాంత్‌కు ఆయన తల్లి ధనమ్మ సహకరించినట్లు పోలీసులు తేల్చారు. -
‘అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలు’
సాక్షి, ప్రకాశం జిల్లా: అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలాడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాదయాత్రను వైఎస్సార్సీపీ నేతలు ఆపలేదన్నారు. టీడీపీ వాళ్లు దుష్ఫ్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. పాదయాత్రకు ప్రజామద్దతు లేదని.. కేవలం టీడీపీ కార్యకర్తలు మాత్రమే రోడ్లపై నడుస్తున్నారన్నారు. పాదయాత్ర పేరుతో అశాంతి రేపాలని చూస్తే తిప్పి కొడతామని సుధాకర్‌బాబు హెచ్చరించారు. -
‘ఆర్కే మృతిపై మావోయస్టుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు’
సాక్షి, ప్రకాశం: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతి చెందిన విషయం పార్టీ ప్రకటించిన తర్వాతే నిజమని భావిస్తామని ఆయన భార్య శిరీష తెలిపారు. ఆర్కే మృతిపై ఆయన భార్య శిరీష శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కే మృతి చెందినట్టుగా మీడియాలో వచ్చే వార్తలే చూస్తున్నామని అన్నారు. ఆయన మృతి చెందారని ఛత్తీస్‌గఢ్ డీజీపీ ప్రకటించారని, కానీ ఆయనకు ఎవరు సమాచారం ఇచ్చారో చెప్పలేదని తెలిపారు. ఆర్కే 40 ఏళ్లు జీవితాన్ని ప్రజలకోసం ధారపోశారని తెలిపారు. ప్రజా ఉద్యమంలో ఆర్కే ఒక యోధుడు, నిస్వార్థ విప్లవకారుడు అని తెలిపారు. ఉద్యమంలో బిడ్డను కూడా పోగొట్టుకున్నారని, ఒకవేళ ఆర్కే మృతి నిజమైతే పార్ధీవదేహం తాము తెచ్చుకునేలా అక్కడి ప్రభుత్వం, గ్రామ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్కే భార్య శిరీష ప్రస్తుతం అలకూరపాడులో నివాసం ఉంటున్నారు. -
దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారు
సాక్షి, ప్రకాశం జిల్లా: దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారని డ్వాక్రా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో విడత ’వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: రెండో విడత ‘వైఎస్సార్ ఆసరా’ ప్రారంభించిన సీఎం) మాట నిలబెట్టుకున్నారు... డ్వాక్రా మహిళ స్వాతి మాట్లాడుతూ, సీఎం జగనన్న ఇచ్చిన మాటనిలబెట్టుకున్నారని.. అర్హత ఉన్న ప్రతి మహిళకు సంక్షేమ పథకాన్ని అందించారన్నారు. దేవుడు వర్షాలు కురిపిస్తుంటే.. జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తన పుట్టినిల్లుగా మారి ప్రతి కష్టాన్ని తీర్చిందన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. తండ్రికి తగ్గ తనయుడు.. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలానికి చెందిన మహిళ అశ్విని మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో చాలా కష్టాలు పడ్డామన్నారు. రుణమాఫి చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారన్నారు. సీఎం జగన్ చెప్పినవి, చెప్పవని కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా సీఎం జగన్ నిరూపించుకుంటున్నారన్నారు. రెండో విడత ’వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ... బాబు హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి శూన్యం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి శూన్యమన్నారు. సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకుని సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేసిందన్నారు. సీఎం జగన్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అన్నారు. సీఎం వైఎస్ జగన్ మహిళా పక్షపాతి అని మంత్రి సురేష్ అన్నారు. ఆ ఘనత సీఎం జగన్‌దే.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దేనని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం బకాయిలను సీఎం జగన్ ప్రభుత్వం చెల్లిందన్నారు. బాబు హయాంలో డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. నాడు బాబు వస్తే జాబొస్తుందన్నారని.. కానీ ఉన్న ఉద్యోగాలు తీసేశారని మంత్రి గుర్తు చేశారు. -
Ongole Cattle: పౌరుషాల గిత్తకు ఊపిరి!
నడకలో రాజసం.. పోటీల్లో పౌరుషం.. రూపంలో భారీ కాయం.. ఇదే ఒంగోలు గిత్త తేజసం. ప్రకాశం జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఒంగోలు జాతి పశువుల అభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటు చేసిన చదలవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రం లక్ష్యం దిశగా అడుగులేస్తోంది. మూడేళ్ల ముందు వరకు నిర్వీర్యమైన ఈ క్షేత్రం క్రమేపీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. మేలైన పశువుల ఉత్పత్తిని పెంచి, సంరక్షించే దిశగా అడుగులేస్తోంది. ఇందు కోసం సెమన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. నేరుగా పిండాలను (యాంబ్రియో) ఉత్పత్తి చేసేలా సాంకేతికతను వినియోగిస్తున్నారు. పశు ఉత్పత్తి క్షేత్రంలో అన్ని మౌలిక వసతులు సమకూరుతున్నాయి. నాగులుప్పలపాడు: చదలవాడలో 198 ఎకరాల్లో మూడు దశాబ్దాల క్రితం ఒంగోలు జాతి పశుఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చీమకుర్తికి గ్రానైట్ పరిశ్రమ వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి క్షేత్రం ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయ భూములను కొనుగోలు చేసి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి పేరుకు క్షేత్రం నడిచినా.., పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం నుంచి సహకారం లభించడం, అధికారులు అంకితభావంతో పనిచేస్తుండడంతో ఆ ఫలాలు కనిపిస్తున్నాయి. రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు: క్షేత్రంలో గడచిన రెండు మూడేళ్లలో సుమారు రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. పశువుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రూ.2 కోట్లతో 4 నూతన షెడ్లు ఏర్పాటు చేశారు. పాలన అవసరాల కోసం రూ.70 లక్షలతో నూతన పరిపాలన భవనం నిర్మించారు. వీటితో పాటు మరో రూ.40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల ఏర్పాటుతో పాటు క్షేత్రం మొత్తం రూ.10 లక్షలతో సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇంతే కాకుండా గోచార్ పథకంలో క్షేత్రంలో భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.52 లక్షలు కేటాయించారని, వీటిని త్వరలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన పశువుల ఉత్పత్తి: క్షేత్రంలో 292 పశువులుండగా, వీటిలో పాలిచ్చే ఆవులు 72, చూడివి 54, ఒట్టి ఆవులు 24, మిగిలినవి మూడేళ్లలోపు లేగదూడలున్నాయి. గతంలో ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో జాతి ఆవులే అయినా..నాణ్యత తక్కువగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా వస్తున్న లేగదూడలు ఒకింత ఆరోగ్యంగా పెరుగుతుండడంతో క్రమేపీ ఆవుల్లో నాణ్యత పెరుగుతోంది. నాణ్యత తక్కువ ఉన్న పశువులు వేలం ద్వారా విక్రయిస్తుండడంతో మరింత నాణ్యమైన పశువులను క్షేత్రంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు జాతి ఆవుల నుంచి వచ్చే కోడెదూడలను ఆరు నెలల వరకు పెంచి రైతుల కోసం వేలం వేసి ఇస్తారు. గ్రాసం కొరతను అధిగమించి... మూడేళ్ల క్రితం క్షేత్రానికి గ్రాసం కొరత తీవ్రంగా ఉండేది. దాదాపు 200 ఎకరాల నాణ్యమైన భూమి ఉన్నప్పటికీ సరిగా వినియోగించుకోలేకపోయేవారు. ప్రస్తుతం ఆ కొరతను క్షేత్రం అధిగమించింది. బహువార్షిక గ్రాసాలు ఏడాది పొడవునా క్షేత్రంలో సాగు చేస్తున్నారు. దీనికి తోడు మాగుడు గడ్డి నిల్వకు ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి ముందుగానే నిల్వ ఉంచుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 1600 టన్నుల సైలేజ్ గడ్డిని అందించింది. దీంతో క్షేత్రం గ్రాసం కొరతను అధిగమించింది. సమకూరిన వసతులు: నిన్నమొన్నటి వరకు మౌలిక వసతులు లేక కునారిల్లిన క్షేత్రంలో ఇప్పుడు భవనాల సమస్య తీరింది. పాలన భవనం కొత్త హంగులతో ఆహ్లాదంగా సిద్ధమైంది. అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా గతంలో ఉన్న డ్రైవర్ క్వార్టర్లను అభివృద్ధి చేసి సిబ్బందికి అందుబాటులో ఉంచారు. క్షేత్రంలో అంతర్గత రహదారులు, ప్రహరీ నిర్మాణం పూర్తయ్యింది. ఇక మేలైన ఆవుల నుంచి అండాల సేకరణ కోసం గుజరాత్ నుంచి ప్రత్యేకంగా మిషన్‌ను కూడా తీసుకొచ్చారు. సేకరించిన అండాలను నిల్వ చేసేందుకు ల్యాబ్‌ను అభివృద్ధి చేశారు. పశువుల బరువును కూడా ప్రతి వారం తీసుకొని రికార్డులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ లాం ఫాం నుంచి తీసుకొచ్చిన సెమన్‌ను రైతుల కోసం అందుబాటులో ఉంచగా, భవిష్యత్‌లో నేరుగా పిండాలను (యాబ్రియో) కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవుపాలు పాలు, గోమూత్రంను నామమాత్రపు రుసుంతో రైతుల అవసరాల కోసం అందిస్తున్నారు. ఇంకా మిగిలిన సమస్యలివే... ఆవుల నాణ్యతను పెంచినప్పటికీ, కనీసం ఒక జత ఒంగోలు గిత్తలను ప్రదర్శన కోసమైన పెంచాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఎద్దు ఒక్కటి కూడా లేదు. భవిష్యత్‌లో దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. క్షేత్రంలో భూగర్భ జలంలో ఫ్లోరైడ్ అధికంగా ఉంటోంది. దీన్ని అధిగమించేందుకు క్షేత్రంలోనే రెండు చెరువుల ద్వారా పశువులకు తాగునీరు అందిస్తున్నారు. అయితే ఆవులు బయటకు వెళ్లకపోతే ఫ్లోరైడ్ నీటితోనే వాటి దాహం తీర్చాల్సి వస్తోంది. దీంతో పశువుల నాణ్యతపై ప్రభావం పడుతోంది. త్వరలో ఉన్నతమైన ఫాంను చూస్తాం ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే పశుక్షేత్రంలో చాలా మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికి తోడు సిబ్బంది పనితీరుతో పశువుల నాణ్యత కూడా పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పశువుల నాణ్యత పరిశీలన కోసం ఇప్పటికే ప్రతి పశువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటికి సంబంధిత రికార్డులు తయారు చేస్తున్నాం. ఇలాగే త్వరలో మన ఖ్యాతిని పెంచే ఒంగోలు జాతి సంపదతో కూడిన అత్యున్నతమైన ఫాంను తయారు చేయడానికి కృషి చేస్తున్నాం. – బి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్, పశుక్షేత్రం -
ఉసురు తీసిన మద్యం మత్తు
సాక్షి, ప్రకాశం: వారిద్దరు సొంత బంధువులు.. వరుసకు బాబాయి, కొడుకు అవుతారు.. మద్యం తాగేందుకు వచ్చిన ఇద్దరూ ఎప్పుడో జరిగిన భూ వివాదం మనసులో పెట్టుకొని గొడవపడ్డారు. ఆవేశంతో కొడుకు వరుసైన యువకుడు బాబాయ్‌ని బీరు సీసా పగలకొట్టి గొంతుపై పొడవటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పెదారికట్ల వైన్ షాపు వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. పెదారికట్లకు దగ్గర్లోని కనిగిరి మండలం యడవల్లికి చెందిన కొత్త వెంకటేశ్వరరావు(48), కొత్త పుల్లారావు బంధువులు. ఇద్దరూ మద్యం తాగేందుకు పెదారికట్లలోని వైన్ షాపు వద్దకు వచ్చారు. పూటుగా మద్యం తాగిన అనంతరం ఒకరికొకరు గొడవ పడ్డారు. కోపంతో రగిలిపోయిన పుల్లారావు తన బాబాయ్ వెంకటేశ్వరరావుపై బీరు సీసాతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావు కొద్దిసేపటికి మృతి చెందాడు. మృతుడికి భార్య ఈశ్వరమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బంధువులు సంఘటన స్థలానికి చేరుకొనే వరకు పుల్లారావు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడి నుంచి వెళ్లాడు. పొదిలి సీఐ సుధాకరరావు, ఎస్ఐ శివ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బంధువులతో మాట్లాడారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ తెలిపారు. చదవండి: మిస్టరీ వీడింది.. మద్యం మత్తులో సొంత మేనల్లుడే.. -
వేటపాలెం సొసైటీపై విచారణ చేపట్టాలి: కన్నబాబు
సాక్షి, విజయవాడ: ప్రకాశం జిల్లా చీరాల మండలం వేటపాలెం కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. ఈ సొసైటీలో అవకతవకలు జరిగాయంటూ పలు పత్రికల్లో వచ్చిన కథనాలపై వాస్తవాలతో నివేదిక అందజేయాలన్నారు. డిపాజిట్‌దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సహకార శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో కలిసి పని చేస్తున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. వేటపాలెం సొసైటీ కార్యదర్శి, సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సచివాలయం ఉద్యోగి అనుమానాస్పద మృతి
సాక్షి, కందుకూరు: గ్రామ సచివాలయం ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణ శివారు లుంబినీవనం వద్ద శనివారం వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండికందుకూరుకు చెందిన పిర్ల మాలకొండయ్య రెండో కుమారుడు రాఘవ (32) ప్రస్తుతం మండలంలోని కోవూరు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం సచివాలయ కార్యదర్శికి ఫోన్ చేసిన రాఘవ తాను విధులకు రావడం లేదని, సెలవు కావాలని కోరాడు. సెలవు చీటీ పంపాలని కార్యదర్శి సూచించారు. ఆ తర్వాత రాఘవ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తనకు వాంతులు అవుతున్నాయని, ఆస్పత్రికి వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన రాఘవ కందుకూరు పట్టణానికి వచ్చాడు. ఆ తర్వాత తిరిగి రాత్రికి ఇంటికి చేరుకోలేదు. రాత్రి అంతా ఎదురు చూసిన కుటుంబ సభ్యులు శనివారం ఉదయానికి కూడా ఇంటికి రాకపోవడం, పోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ కందుకూరు వైపు బయల్దేరారు. తండ్రి మాలకొండయ్య పట్టణ శివారు ప్రాంతం లుంబినీవనం కాలనీకి వచ్చే సరికి రాఘవ ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పడి ఉండటం గమనించాడు. ద్విచక్ర వాహనం ఆధారంగా వెతుకుతూ వెళ్లిన మాలకొండయ్యకు కొద్ది దూరంలో జామాయల్ తోటలో రాఘవ నిర్జీవంగా పడి ఉండటం గమనించాడు. చనిపోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాఘవది ఆత్మహత్యా లేక మరేదైనా ఇతర కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారం కోణంలోనూ అనుమానాలున్నాయి. అదే గ్రామానికే చెందిన ఓ వివాహితతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ విషయంలో పలుమార్లు రెండు కుటుంబాల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు కుటుంబ సభ్యులు, పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధానంగా ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పడి ఉన్న తీరు, మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడం వంటి కారణాల ఆధారంగా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు సేకరిస్తున్నామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సచివాలయ ఉద్యోగి మృతి వార్త తెలుసుకున్న డీఎస్పీ కండే శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను అడిగి సమాచారం తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా హాస్పటల్‌కు తరలించారు. సచివాలయ ఉద్యోగి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. -
ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు చెన్నకేశవ కాలనీలో దారుణం జరిగింది. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో ఒక కుటుంబంపై కొంతమంది వ్యక్తులు పెట్రోల్ ఫైర్ బీర్ బాటిల్స్‌తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి. చెన్నకేశవ కాలనీకి చెందిన కుంచాల మహేష్‌కు ఒంగోలు మంగలపాలనికి చెందిన హైపర్ అలీ,అక్రమ్ అలీ,గుంటూరు మహేష్,సుమంత్, గణేష్‌లకు మధ్యఆర్థిక విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఈ గొడవ జరిగినట్లు మహేష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో ఇరువురి మధ్య జరిగిన గొడవలు నేపథ్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కేసులను ఉపసంహరించుకోవాలని మహేష్ కుటుంబంపై మిగిలిన వాళ్లు ఒత్తిడి తెచ్చారు. అయితే మహేష్ కుటుంబ సభ్యులు కేసును ఉపసంహరించుకున్నప్పటికి... పాత కక్షలను మనసులో పెట్టుకొని ఈ దాడులకు తెగ పడినట్లు మహేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారు?: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కష్టకాలంలో దాక్కుని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని.. వాటిని పక్కదారి పట్టించడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినప్పుడే ప్రతిపక్షం పోయిందన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడం మంచిదని మంత్రి బాలినేని ఎద్దేవా చేశారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, ప్రకాశం: అద్దంకి పట్టణంలోని గరటయ్య కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కూలీలు ఆటోలో గరటయ్య కాలనీ నుండి పంగులూరు మండలం చందలూరు మిర్చి కోతకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.మృతులను కాకానిపాలెనికి చెందిన అనసూయ (55), మౌలా నగర్‌కు చెందిన షేక్ కరీమున్ (44) గా గుర్తించారు. చదవండి: తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి మహమ్మారిని జయించిన ఆనందం.. అంతలోనే విషాదం -
తమిళనాడు సీఎం పూర్వీకులు ఎక్కడి వారో తెలుసా..?
ఒంగోలు(ప్రకాశం జిల్లా): తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మూలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఆయన పూర్వీకులు ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరులోని వెంకటగిరి రాజుల ఆస్థాన పరిధిలోని దేవాలయాలకు ఆస్థాన విద్యాంసులుగా పని చేస్తుండేవారు. ఈ క్రమంలోనే వారికి అక్కడికి అతి సమీపంలోని ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో 150 ఎకరాల భూమిని, పెళ్లూరు చెరువు కింద 20 ఎకరాల మాగాణి భూమిని, చెరువుకొమ్ముపాలెంలో నివాసం ఉండేందుకు భూమిని ఇచ్చినట్లుగా ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. వెంకటగిరి రాజుల వారసులు ఇప్పటికీ ఈ గ్రామంలో ఉన్నారు. వారు మాత్రం డీఎంకే అధినేత, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి తాతల కాలంలోనే పంటలు పండక కరువు కాటకా వల్ల చెన్నపట్నంకు వలస వెళ్ళినట్లు తమ పూర్వీకులు చెబుతుండేవారని పేర్కొంటుంటారు. అయితే అలా వెళ్ళిన కరుణానిధి చివరకు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలగడం తమ గ్రామానికి గొప్పతనంగా వారు చెబుతుంటారు. భూములు ఇప్పటికీ ఉన్నా వారు ఎప్పుడు కూడా వచ్చిన దాఖలాలు లేవని చెబుతూ కరుణానిధి కుమారుడు మరలా స్టాలిన్ సీఎం కావడం తమకు గర్వంగా ఉందని పేర్కొంటున్నారు. కరుణానిధి ఏలూరులో జరిగిన ఒక సాహిత్య సభలో ఈ అంశాన్ని ప్రస్తావించాడని, ఒంగోలులో జరిగే సాహిత్య సభకు కూడా త్వరలోనే వస్తానని చెప్పారని, స్టాలిన్‌ను కూడా ఒకసారి జిల్లాకు రావాలని కోరడం జరిగిందని, అయితే ఆయన రాలేకపోయారంటూ నాయీ బ్రాహ్మణులు పేర్కొంటున్నారు. ఏదేమైనా తెలుగువాడు, అందులోను మన ఒంగోలు వాసి తమిళనాట మరో సీఎం కావడం జిల్లావాసులకు కూడా గర్వ కారణంగానే చెప్పవచ్చు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: తమిళనాడు సీఎంగా స్టాలిన్ రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి -
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): మండలంలోని గలిజేరుగుళ్లలో భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన గురువారం రాత్రి జరగగా శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు.. కొనకనమిట్ల మండలం గార్లదిన్నెకు చెందిన దూదేకుల బాజీతో బేస్తవారిపేట మండలం అక్కపల్లెకు చెందిన ఖాజీబీ(26)కి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. నిత్యం అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో పెద్దలు సర్ది చెప్పి మూడేళ్ల క్రితం ఆమెను అత్తగారింటికి పంపారు. మామతో పాటు బాజీ బేల్దారి పనులు చేసుకుంటూన్నాడు. మళ్లీ గొడవలు జరగడంతో రెండేళ్లుగా దంపతులు గలిజేరుగుళ్లలో కాపురం ఉంటున్నారు. గురువారం రాత్రి ఏడేళ్ల కొడుకును బయట పడుకోబెట్టి దంపతులు ఇంట్లో గొడవపడ్డారు. కత్తిపీట, బ్లేడ్‌తో భార్య గొంతు కోసి ఆమె చనిపోయిన తర్వాత బయట తలుపునకు తాళం వేసుకుని పీవీపురం చేరాడు. భవన నిర్మాణం చేస్తున్న యజమాని ఆవుల కృష్ణారెడ్డి వద్దకు వెళ్లి గలిజేరుగుళ్లలో పెద్ద గొడవ జరిగిందని, గ్రామస్తులు తనను కొట్టి తరుముకున్నారని, తమ బంధువులు ఉన్న బసినేపల్లెలో మోటార్ సైకిల్‌పై తనను వదిలి పెట్టాలని కోరాడు. అక్కడ వదిలి పెట్టిన తర్వాత అనుమానంతో అక్కపల్లె వెళ్లి ఖాజాబీ తండ్రి పులిమద్ది సుబ్బయ్యకు సమాచారం అందించాడు. కుమార్తెకు, అల్లుడికి ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో సుబ్బయ్య తన బంధువులతో కలిసి గలిజేరుగుళ్ల వెళ్లాడు. గృహానికి తాళం వేసి ఉండటంతో పగులకొట్టి లోపలికి వెళ్లారు. గొంతుతెగి రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తె మృతదేహం కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గిద్దలూరు ఎస్ఐ సుధాకరరావు, ఎస్ఐ బాలకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. చదవండి: పాపం రెండేళ్ల చిన్నారి.. ఎండలో ఒంటరిగా ఏడుస్తూ... అక్రమ సంబంధమే ప్రాణం తీసింది.. -
అద్దంకిలో టీడీపీ బరితెగింపు..
అద్దంకి: అద్దంకిలో టీడీపీ బరితెగించింది. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిని తన కారులో ఎక్కించుకువచ్చి నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. టీడీపీ ఎమ్మెల్యే దిగజారుడుతనాన్ని వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి కృష్ణచైతన్య విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 8వ వార్డులో వైఎస్సార్సీపీ తరఫున ఇద్దరు, టీడీపీ తరపున ఇద్దరు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కాగా టీడీపీ తరపున 8వ వార్డుకు నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు అదే రోజున స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ తరఫున 8వ వార్డుకు పోటీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ తరపున బీఫారం తీసుకుని నామినేషన్ వేసిన అభ్యర్థి పరశురాంను ఉపసంహరణ సమయానికి ఒక నిమిషం మాత్రమే సమయం ఉండగా తన సొంత కారులో తీసుకుని వచ్చి నామినేషన్‌ను ఉపసంహరణ చేయించారు. ఆధారాలున్నాయి, సీరియస్‌గా తీసుకుంటాం.. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన చెంచు గరటయ్య ఖండించారు. 8వ వార్డుకు మా పార్టీ తరఫున బీ ఫారం ఇచ్చిన ఎస్టీ అభ్యర్థిని ప్రలోభపెట్టి తన కారులో ఎక్కించుకుని వచ్చి నామినేషన్ ఉపసంహరణ చేయించడం దారుణమని మండిపడ్డారు. రెండేళ్లుగా ఇంట్లో కూర్చోని ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకొని ఎమ్మెల్యే రవికుమార్..ఇప్పుడు చంద్రబాబు వద్ద షో చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 8వ వార్డుకు నామినేషన్లు వేసిన మీ అభ్యర్థులు వారే వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకోవడం నీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, ఈ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ మా దగ్గరున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని పేర్కొన్నారు. మిగిలిన 19 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి చంద్రబాబు మాట.. అబద్ధాల మూట కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది.. -
ఇలాంటి వింత చేపను ఎప్పుడూ చూడలేదు..!
చీరాలటౌన్: చీరాల వాడరేవు సముద్ర తీర ప్రాంతానికి గురువారం వింత చేప కొట్టుకువచ్చింది. తెల్లని రంగులో మూడు కళ్లుతో కేజీన్నర బరువు ఉన్న ఈ చేప రబ్బరులా సాగుతోంది. వాడరేవు సముద్ర తీరం ఒడ్డున వింత ఆకారంలో ఉన్న చేప కనిపించడంతో మత్స్యకారులు భయ్చాందోళన చెందారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆకారంతో వింతగా ఉన్న చేపలను తాము చూడలేదని తెలిపారు. కిలోన్నర బరువుతో వింతగా మూడు కళ్లుతో ఉన్న చేపను తిలకించేందుకు మత్స్యకారులతో పాటుగా చాలామంది తీరానికి చేరుకున్నారు. ఇలాంటి వింత చేపను తామెన్నడూ చూడలేదని చీరాల మత్య్సశాఖ అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య -
అదే ఆనవాయితీ.. వారే సర్పంచ్‌లు..
మార్కాపురం: ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సర్పంచిగా ఎన్నికయ్యేది మాత్రం ఆ ఒక్క కుటుంబ సభ్యులే. 1965 నుంచీ రిజర్వేషన్లు మారినప్పుడు మినహా జనరల్‌కు కేటాయించిన ప్రతిసారీ వారే విజయం సాధించారు. మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం గొల్లపల్లి పంచాయతీకి చెందిన యక్కంటి వారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. 1965లో యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా ఎన్నికయ్యారు. 1967లో ఆయన మరణంతో వచ్చిన బై ఎలక్షన్స్‌లో ఆయన కుమారుడు యక్కంటి వెంకటరెడ్డి సర్పంచిగా ఎన్నికై 1987 వరకు 20 ఏళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత 1995 నుంచి 2000 సంవత్సరం వరకు వెంకటరెడ్డి కుమారుడు యక్కంటి రామిరెడ్డి సర్పంచిగా పని చేశారు. ఆ పదవీ కాలం ముగిసిన వెంటనే 2001 నుంచి 2005 వరకు ఆయనే ఎంపీటీటీగా పనిచేశారు. 2005 నుంచి 2010 వరకు రామిరెడ్డి భార్య వెంకట లక్ష్మమ్మ ఎంపీటీసీగా పని చేశారు. మధ్యలో ఒక దఫా రిజర్వేషన్లు మరడంతో విరామం రాగా మళ్లీ 2014లో జనరల్ మహిళగా రిజర్వ్ అయిన పంచాయతీ ఎన్నికల్లో యక్కంటి వెంకట లక్ష్మమ్మ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పదవీ కాలం ముగుస్తున్న దశలో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తాజా పంచాయతీ ఎన్నికల్లోనూ పంచాయతీ గొల్లపల్లి జనరల్ మహిళకు రిజర్వ్ కావడతో రామిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమార్తె శ్రావణిని సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీలో నిలిపారు. బీటెక్ చదివిన శ్రావణి 21 ఏళ్ల వయసులోనే గొల్లపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికై ఆ కుటుంబ ఆనవాయితీని కాపాడింది. చదవండి: 54 ఏళ్ల చరిత్రలో.. ఒకే ఒక్కడు ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి -
ఫేక్ ఐడీస్: నమ్మారో.. మోసపోయినట్లే..!
బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): ఆధునిక యుగంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఫేస్బుక్లో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు యువత ఇంటర్నెట్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఫేస్బుక్ ఖాతాను విరివిరిగా వినియోగిస్తున్నారు. ఎటువంటి సమాచారమైనా క్షణాల్లో పోస్టింగ్ చేయడం.. షేర్ చేయడం అలవాటుగా మారింది. దీంతో ఉపయోగం ఎంత ఉందోకానీ కొందరికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఫేస్బుక్ అకౌంట్లో ప్రొఫైల్ ఫొటోను కొందరు డౌన్లోడ్ చేసుకుని ఫేక్ అకౌంట్‌ను అదే పేరుమీద ఓపెన్ చేస్తున్నారు. ఫేస్బుక్ మెసెంజర్లో ఓన్ హెల్ప్ మీ..అంటూ చాటింగ్ చేస్తారు. చదవండి: ఫోన్ చేసి విసిగిస్తావా అంటూ.. ఫేస్బుక్ స్నేహితులు స్పందించినప్పుడు అర్జెంట్‌గా అమౌంట్ కావాలని, గూగూల్ పే, ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ నంబర్.. ఇలా ఏదీ కావాలంటే అది ఇస్తారు. ఆపదలో ఉన్నారు.. అత్యవసరంగా డబ్బు అవసరమై ఉంటుందని భావించిన స్నేహితులు రూ.20 వేలు, రూ.10 వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మొదట్లో పెద్ద మొత్తంలో మనీ అవసరమంటూ చాటింగ్ చేస్తూ చివరకు ఎంతో కొంత అత్యవసరంగా కావాలంటూ అడుగుతున్నారు. చదవండి: వీడని మిస్టరీ: ఆ బాలుడు ఏమయ్యాడో..? గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ ఎస్ఐ, కంభంలోని హీరో షోరూమ్ వ్యక్తి, బేస్తవారిపేటలోని ఓ కళాశాల కరస్పాండెంట్ల పేరుతో దొంగ ఫేస్బుక్ అకౌంట్లు సృష్టించి పలువురి నుంచి భారీగానే అమౌంట్ దోచేశారు. వారం క్రితం ఓ పురుగుమందుల సంస్థలో పనిచేసే సేల్స్ మేనేజర్ అకౌంట్‌ను ఇలాగే చేశారు. స్పందించిన ఐదుగురు స్నేహితుల నుంచి రూ.60 వేలు కొట్టేశారు. ఇచ్చిన బ్యాంక్ అంకౌంట్ నంబర్లు, ఫోన్ నెంబర్లు ఛత్తీఘడ్లోని రాయచూర్ ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు. గూగూల్, ఫోన్ పేలలో ఒకే పేరు గూగూల్ పే, ఫోన్ పేలలో ఫోన్ నంబర్ నమోదు చేయగానే పేరు చూపిస్తుంది. దొంగతనంగా తయారు చేసిన డూప్లికేట్ వ్యక్తుల ఫోన్ నంబర్ ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తులకు సంబంధించినా ఓరిజినల్ వ్యక్తికి సంబంధించిన పేరు వస్తుంది. దీంతో నగదు బదిలీ చేసేటప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా స్నేహితులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఉన్నత విద్యావంతులు కూడా మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రాన్సక్షన్స్ ముగిసిన తర్వాత మరుసటి రోజుకు అతని ఫోన్ నంబర్ ఫోన్ పేలో నమోదు చేస్తే వేరే పేరు రావడం గమనార్హం. -
ఆ అడవిలో ఎన్ని పులులు ఉన్నాయో?
సాక్షి, పెద్దదోర్నాల: నడకలో రాజసం.. వేటలో గాంభీర్యం వెరసి అడవిలో రారాజుగా వెలుగొందుతోంది పెద్దపులి. దట్టమైన అడువులతో పాటు విస్తారమైన వర్షాలు కురిసే చోటే పెద్దపులి ఆవాసం. ప్రస్తుతం ప్రభుత్వాల కఠిన చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వెరసి పులులు కాస్త ఊపిరి తీసుకుంటున్నాయి. కొద్ది కొద్దిగా తమ సంఖ్యను పెంచుకుంటూ మనుగడ కోసం పోరాడుతున్నాయి. అటువంటి పెద్దపులుల లెక్క తేల్చే పని ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైంది. జాతీయ జంతువు పెద్దపులులు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు అటవీశాఖ గణన మొదలు పెట్టింది. అధునాతన కెమెరాలు ఉపయోగించి పులుల సర్వే చేస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పక్రియ పూర్తి కావస్తోంది. నల్లమలకు రాజసం పెద్దపులి అడవికి రారాజు పెద్దపులి, అడవిలో ఎన్ని పులులు ఉన్నా వాటి పరిధి వాటివే. దేని రాజసం దానితే. దేని రాజ్యం దానిదే. మగ పులి 150 నుంచి 200 చదరపు కిలో మీటర్ల పరిధిని తన ఏలికలో ఉండాలని గట్టిగా కోరుకుంటుంది. అదే ఆడపులి 70 నుంచి 80 కిలో మీటర్లను తన సామ్రాజ్యంగా భావిస్తుంది. ఓ మోస్తరు అడవి లేకుంటే అస్సలు సహించవు. రాజులు రాజ్యాలు ఏలినట్లుగా పులులు కూడా తమ తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుని వాటిని తమ ఆదీనంలో ఉంచుకుంటాయి. ఇది పలానా పులి ఏరియా..అంటూ తన శరీరం నుంచి ప్రత్యేక రసాయనాన్ని విడుదల చేస్తుంది. లేదంటే అక్కడి చెట్లపై గోళ్లలో గీకుతుంది. పులుల సంభోగ సమయంలో ఈ పక్రియ ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం నల్లమలలో 60 వరకు పులులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు పులుల గణన ఎందుకంటే..? అభయారణ్యాల్లో పులుల గణనను ఏటా చేపడతారు. గణన ముఖ్య ఉద్దేశం అభయారణ్యాల్లో పెద్ద పులులు ఎన్ని ఉన్నాయో ఏటా గుర్తిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కొత్త పులులు అభయారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయా? గతేడాది గుర్తించిన పులులు మళ్లీ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయా.. లేదా? సంచరిస్తుంటే వాటి కదలికలు ఎలా ఉన్నాయి? దీంలో పాటు వాటి అభివృద్ధి ఎలా ఉంది? సంతానోత్పత్తి జరుగుతుందా? ఆవి ఆరోగ్యంగా ఉన్నాయా? అనే విషయాలు గుర్తించేందుకు పులుల గణనను చేపడతారు. గతంలో కెమెరాల్లో చిత్రీకరించిన పులులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కొత్త పులులు వస్తే వాటిని అవలీలగా గుర్తించవచ్చు. లేదా మిస్ అయిన పులులను సైతం గుర్తించేందుకు వీలుగా గణనను పకడ్బందీగా నిర్వహిస్తారు. పులుల గణన కోసం శాస్త్రీయ పద్ధతులు పులుల గణనలో శాస్త్రీయ పద్ధతులు అనుసరిస్తున్నారు. ఫేస్ పోర్ మానిటరింగ్‌లో భాగంగా ఏటా పులుల గణన చేపడతారు. దీని కోసం ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. పులుల లెక్కింపు గతంలో వాటి పాదముద్రలు ఆధారంగా జరిగేది. దాని వల్ల కచ్చితమైన లెక్క తేలేది కాదు. ఏ రెండు పులుల పాదముద్రలు ఒకేలా ఉండవు. పులికి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచే చారికలు కూడా ఒకేలా ఉండవు. మనుషుల వేలిముద్రలు మాదిరిగానే పులి చారికలు కూడా వేటికవే ప్రత్యేకం. ఇదే పులుల లెక్కింపులో కీలకం. అన్ని పులుల చిత్రాలు కెమెరాలో నిక్షిప్తం అయ్యాక కెమెరాలకు చిక్కిన పులుల లెక్కను సరి చూసుకుంటారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్న పులులు, ఇతర జీవులు ఎన్ని ఉంటాయో లెక్క చూసుకుంటారు. ఇలా సేకరించిన పులుల డేటాను బయోలాజికల్ రీసెర్చి సెంటర్‌కు పంపుతారు. అక్కడి నుంచి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు తరలించి ఎన్ని పులులు ఉన్నాయో గుర్తించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. -
కుటుంబాలు 140.. ఉద్యోగులు 114
భవిత ఉన్నతికి విద్యార్థి దశే కీలకం. ఈ విషయాన్ని హనుమంతునిపాడు మండలంలోని కూటాగుండ్ల గ్రామం బాగా తెలుసుకుంది. అందుకే నాడు కూలీలతో నిండిపోయిన గ్రామం నేడు వందలమంది ఉద్యోగులతో కళకళలాడుతోంది. వీరు ఈ ఘనత సాధించడానికి తల్లిదండ్రుల సహకారం, గురువుల స్ఫూర్తి, విద్యార్థుల పట్టుదలే కారణాలుగా నిలిచాయి. సాక్షి, హనుమంతునిపాడు: పిల్లలు తమలా కష్టపడకూడదనే ఒక్క ఆలోచనతో మండలంలోని కూటాగుండ్ల గ్రామస్తులు ఒక్కటయ్యారు. కూలీ పనులు చేశారు.. కష్టపడి పంటలు పండించుకున్నారు. ఎలాగో సంపాదించి తమ పిల్లల చదువుల కోసం ఖర్చు చేశారు. ఇలా వారి సంకల్పం ఎదిగి ఇప్పుడు పిల్లలంతా ఉద్యోగాల్లో స్థిర పడటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా నేటి చరిత్ర. గతంలో ఈ గ్రామంలో చదువుకున్న వారు ఐదారుగురు మాత్రమే ఉండగా ఇప్పుడు దాదాపు అంతా అక్షరాస్యులుగా మారారు. చదవండి: ఒక పోస్టుకు 32 మందే పోటీ.. గ్రామంలో నిర్మించిన ప్రాథమిక పాఠశాలో వీరందరికీ విద్యా బీజాలు వేసి వారి ఉన్నతికి ప్రథాన కారణంగా నుంచుంది. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గ్రామంలోనే విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఆ తర్వాత పై చదువులకు దూర ప్రాంతాలకు వెళ్లి తమ తల్లిదండ్రుల కలలు సాకారం చేయడంలో సఫలం చెందారు. గురువుల స్ఫూర్తితో.. ‘మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూస్తున్నారు. మీరు అలా కాకూడదు. బాగా చదువుకుంటేనే ఉన్నత స్థానం వస్తుంది’ అంటూ విద్యార్థుల్లో వారి గురువులు ఉత్సాహాన్ని నింపడంతో చిన్నతనం నుంచే విద్యపై మక్కువ పెంచుకున్నారు. వారి సలహాలతో విద్యార్థులు పోటీపడి చదివేవారు. ఇలా ఎక్కువ మంది విద్యార్థులు చేరడంతో స్కూల్‌ను 7వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేశారు. ఆ తర్వాత గ్రామానికి 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న సీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. అప్పటి వరకు నేర్చుకున్న క్రమశిక్షణే వారి ఉద్యోగ సాధనకు పనికి వచ్చింది. తమ ఇష్టం వచ్చిన కోర్సులను ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో చదువు కోవడం మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే కేవలం విద్యార్థులే కాకుండా.. విద్యారి్థనులు కూడా వారితో పోటీ పడటం నేర్చుకున్నారు. ప్రస్తుతం దాదాపు 20 మంది మహిళలు బీటెక్, ఎంటెక్, ఎంబీలు పూర్తి చేయగలిగారు. ఉద్యోగాల ఖిల్లా విద్యార్థుల శ్రమకు తోడు.. తల్లిదండ్రులు, గురువుల సహకారంతో నేడు ఈ గ్రామం ఉద్యోగాల ఖిల్లాగా మారింది. ఇప్పుడు గ్రామంలో ప్రతి ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉన్నత చదువులు చదివి వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 80 కుటుంబాలు, ఎస్సీ కాలనీలో 60 కుటుంబాలుండగా 500 మంది జనాభా ఉన్నారు. అయితే వీరిలో ఏకంగా 114 మంది ఉద్యోగులుండటం గమనార్హం. వీరిలో ఉధ్యాయులు, ఇంజినీయర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, రెవెన్యూ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. 10, ఇంటర్ చదివిన వారు మాత్రం పోలీస్, ఆర్మీ ఉద్యోగాలు సా«ధించారు. ఎస్సీ కాలనీలో ఎక్కువ మంది బిలాయి, చెన్నై, చతీష్ఘడ్ ,మధ్య ప్రదేశ్, కూర్బా, ముంబయి వంటి ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులుగా స్థిర పడ్డారు. వీరంతా పండగలు, శుభకార్యాలకు గ్రామం వచ్చినప్పుడు సందడి వాతావరణం నెలకొంటుంది. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ పాత సంగతులు గుర్తు చేసుకుంటుంటారు. ఆరాధ్య దైవం అయిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి తిరునాళ్లకు వచ్చి మొక్కలు తీర్చుకొని వెళ్తుంటారు. హోం టు డెస్క్ గ్రామంలో అత్యధికంగా 35 మందికి పైగా బెంగళూరు, హైదరాబాదు, ముంబై ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. గ్రామంలో ఉన్న 80 కుటుంబాలకు గాను రెండు మూడు కుటుంబాలు మినహా ప్రతి ఇంట్లో ఉద్యోగులున్నారు. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో గత ఏడు నెలల నుంచి గ్రామానికి చెందిన ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే సేవలు అందిస్తున్నారు. ఉన్నత చదువుల వల్లే ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గ్రామానికి చెందిన ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదివారు. అందుకే మంచి ఉద్యోగాలు సాధించారు. ప్రతి ఇంటిలో ఇద్దరు, ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లున్నారు. దేవిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, ఉపాధ్యాయుడు అమ్మా, నాన్న ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి మా అమ్మ నాన్న, గురువు వెంకటేశ్వరెడ్డి ప్రోత్సాహంతో కష్టపడి బీటెక్ చదివాను. వ్యవసాయం చేసి నన్ను, తమ్ముడిని బీటెక్ చదివించారు. వారి కష్టానికి ఫలితంగా బెంగళూరులో టెక్ మహేంద్ర ప్రైవేటు లిమిటెడ్‌లో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నా. పావులూరి ప్రసాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంతోషంగా ఉంది అందరి సహకారంతో కష్టపడి బీటెక్ వరకు చదివాను. ప్రస్తుతం బెంగళూరులో టీసీఎం ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. కరోనా కావడంతో ప్రస్తుతం ఇంటి నుంచే సేవలు అందిస్తున్నా. -పి.తరుణ్ ఉన్నత విద్య సాకారం నన్ను, అన్నను, చెల్లిని అమ్మానాన్నలు బీటెక్ వరకు చదివించారు. అమ్మనానతో పాటు మాటీచర్ వెంకటేశ్వరెడ్డి స్ఫూర్తిగా నిలవడంతో అన్న రవితేజ మద్రాసులో ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. చెల్లి ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తోంది. నేను బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నా. -దేవిరెడ్డి విద్యాసాగర్ డెల్ కంపెనీలో మా స్నేహితులతో కలిసి డెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. అమ్మ నాన్న కూలీ పనులు చేసి నన్ను చదివించారు. ఇప్పుడు జీవితం హాయిగా ఉంది. -కొత్తపల్లి సుదీర్ -
నా చూపు పల్లెవైపే: గాయత్రి
పాతికేళ్ల తర్వాత అమ్మమ్మ ఊరు వెళ్లిన గాయత్రికి అక్కడ కబేళాకు తరలిస్తున్న రెండు ముసలి ఆవులు కనిపించి, మనసు కరిగిపోయింది. రైతులను బతిమిలాడి ఆ ఆవులను తీసుకొచ్చి వాటికి ఒక చోటు, నెలకు సరిపడా గ్రాసం ఏర్పాటు చేసింది. అది మొదలు ‘ఇక పోషించలేం అనుకున్న రైతుల దగ్గర నుంచి రెండేళ్లుగా ఒక్కొక్క ఆవును ఒక దగ్గరకు చేరుస్తూ వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని తాటిచర్లలో అలా ఇప్పటివరకు 84 ఆవులతో గో క్షేత్రాన్ని ఏర్పాటు చేసింది గాయత్రి గుండపంతుల. బ్యాంకు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులకు వెళ్లినా నలుగురు మనుషులను గో సంరక్షణ కోసం ఏర్పాటు చేసి, వాటి బాగోగులను చూసుకుంటున్న గాయత్రిని కదిలించినప్పుడు ఎన్నో విశేషాలను ఇలా పంచుకున్నారు ఆమె. ‘‘మా అమ్మమ్మ గారి ప్రకాశం జిల్లా ఊరైన తాటిచర్లకు పాతికేళ్ల్ల తర్వాత వెళ్లాను. నా చిన్నప్పుడు చూసిన పల్లెకు ఈ పల్లెకు ఏ మాత్రం పోలిక లేదనిపించింది. ఎక్కడా జీవకళ అనేదే కనిపించలేదు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా అక్కడ వర్షాలు లేకపోవడంతో పచ్చటి పంట పొలాలు లేవు. యువతరం పల్లెను వదిలి పట్టణాలకు వెళ్లిపోయారు. వృద్ధులు మాత్రం మిగిలారు అక్కడ. వారితో పాటు వృద్ధ గోమాతలు. వాటిని పోషించలేక రైతులు అమ్మేసుకుంటున్నారు. అది చూసి మనసు కలత పడింది. చిక్కిశల్యంగా ఉన్న రెండు గోవులను కబేళాకు తరలిస్తుంటే అక్కడివారికి నచ్చజెప్పి, వాటిని కాపాడగలిగాను. తెలిసిన వారి గోశాల ఉంటే అందులో వాటిని ఉంచి, పోషణ బాధ్యతలను అప్పజెప్పి తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. నేను బ్యాంకు ఉద్యోగిని. డిగ్రీ చదువుకునే కొడుకు, ఫార్మాసిస్ట్ అయిన భర్త.. ఇదీ నా కుటుంబం. ఊళ్లో జరిగిన విషయాలను ఇంట్లో చెప్పాను. గోవులను సంరక్షించే బాధ్యతలో తామూ పాలుపంచుకుంటామని ఇద్దరూ చెప్పారు. దీంతో ప్రతి 15 రోజులకు ఒకసారి తాటిచర్లకు వెళ్లే ప్లాన్ చేసుకున్నాను. వెళ్లినప్పుడల్లా దీనంగా కనిపించిన గోవులను గోశాలకు చేర్చడం, వాటి సంరక్షణకు మనుషులను నియమించడం, గ్రాసం ఏర్పాట్లు చూడటం.. ఇదే పనిగా పెట్టుకున్నాను. ఇప్పుడా గోవులు జీవకళతో కనిపించడం నాకు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది. ఇప్పుడు అక్కడ వర్షాలు పడుతున్నాయి..! రెండేళ్లుగా ఇప్పుడక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. రైతులు వరి పంట వేసుకుంటున్నారు. గోవులున్నాయి కాబట్టి వర్షాలు పడుతున్నాయనే ఆలోచన అక్కడి వారిలో వచ్చింది. పంట చేతికి వచ్చినప్పుడు గడ్డి తీసుకొచ్చి ‘మా వంతుగా ఈ గ్రాసం’ అని గోశాలకు ఓ మోపు గడ్డి ఇచ్చి వెళుతుంటారు. ఇది మంచి పరిణామంగా అనిపిస్తుంటుంది నాకు. కొందరు అవసరం కోసం తప్పక ఆవును అమ్మాలని చూస్తారు. కానీ, ఆవుతో వారికి అనుబంధం ఉంటుంది. చూస్తూ చూస్తూ వాటిని రోడ్డున వదిలేయలేరు. కబేళాకు అమ్మనూ లేరు. దీంతో తమ దగ్గర సాకలేని ఆవులను తీసుకొచ్చి, మా గోశాలలో వదులుతుంటారు. చుట్టుపక్కల హైవేలో ఎవరి పోషణా లేకుండా తిరిగే ఆవులు ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతుంటాయి. అలాంటివాటిని మా గోశాలకు తీసుకొచ్చి వదులుతుంటారు అలా ఇప్పటి వరకు గోశాలలో 84 ఆవులు చేరాయి. అందులో నాలుగు ఆవులకు దూడలు పుట్టాయి. ఆ లేగదూడలతో కాసేపు గడిపితే చాలు– మనసుకు ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. సకాలంలో వైద్య సదుపాయాలు రెండేళ్లలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. బెంగళూరు వెళ్లినా నా చూపు పల్లెవైపే ఉంటుంది. మా వారు రవిశంకర్ ఫార్మసిస్ట్ కావడంతో గోవులకు ఏ చిన్న మెడికల్ అవసరం వచ్చినా తగిన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. అలా వైద్య సిబ్బంది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి గోవులకు మెడికల్ చెకప్ చేసి వెళతారు. మా వారు, మా అబ్బాయి కూడా ప్రతి నెలా గోశాలకు వెళ్లి ఆవులను చూసి, ఏ చిన్న అసౌకర్యం లేకుండా చూసుకొని తిరిగి వస్తారు. అలా మా కుటుంబం గోశాల సంరక్షణ బాధ్యత తీసుకుంది. ఈ క్రమంలో మా బంధువు, విజయవాడ వాసి అయిన నాగేంద్ర మామయ్య ఆస్ట్రేలియాలో పదిహేనేళ్లు ఉండి సొంతూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గోశాలకు వచ్చి, ఆవు దూడలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. తాను ఇక గోశాలలోనే ఉండిపోతానన్నారు. మేం ముగ్గురం కలిసి గోశాలకు ‘శ్రీ దత్త బృందావన గో క్షేత్రం’ అని నామకరణం చేసి ట్రస్ట్‌గా ఏర్పడ్డాం. గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరకు వెళ్లిన సమయంలో గోశాల గురించి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారు. ‘ఆ ఆవులు ఉన్నన్ని రోజులు వాటిని సాకుతూ ఉండండి’ అన్నారు. ఓ మంచి ప్రయత్నం మొదలుపెడితే అన్ని అనుకూలతలు అవే ఏర్పడతాయని అర్థమైంది. ముందు తరాలకూ అందించాలి.. గో సంరక్షణ గురించి ఈ తరానికి తెలియాలి. అది మనమే నేర్పించాలి. గోవులనే కాదు ఏ ధార్మిక కార్యక్రమమైనా పిల్లలు అలవర్చుకునేలా చేస్తే ముందు తరాలకు మన సంస్కృతిని అందించిన వాళ్లం అవుతాం’ అని వివరించారు గాయత్రి. మంచి పని ఎప్పుడూ మరికొందరికి మార్గం చూపుతూనే ఉంటుంది. ఉద్యోగాలు చేసుకుంటూ, పట్టణ జీవనంలో తీరికే లభించదు అనుకునేవారికి గాయంత్రిలాంటి వారు చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు ఓ కొత్త ఆలోచనా పథం వైపు నడిచేలా చేస్తాయి. కర్తవ్యాన్ని బోధిస్తాయి. – నిర్మలారెడ్డి -
రోడ్డు ప్రమాదం: వైఎస్సార్సీపీ నేత మృతి
సాక్షి, ప్రకాశం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని టంగుటూరుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రావురి అయ్యవారయ్య, గాయపడిన వ్యక్తి కూడా వైఎస్సార్సీపీకి చెందిన మండల ఇంచార్జ్ శ్రీహరిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఆ మాటలు ప్రజలు మరిచిపోలేదు’
సాక్షి, ప్రకాశం జిల్లా: పేదలకు మేలు జరుగుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేనితనంతో అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ‘‘ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు’’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో దళితులు, బీసీలకు చేసిన నిర్వాకాలను ప్రజలు మరిచిపోలేదన్నారు. (చదవండి: నాడు-నేడు పనుల వేగం పెంచండి) ‘‘దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు మాటలు ప్రజలు మరిచిపోలేదు. నాయి బ్రాహ్మణులు మీ వద్దకు వచ్చి మాట్లాడుతుంటే మీకు ఎంత ధైర్యం.. మీ తోకలు కత్తిరిస్తా అన్న మాటలు గుర్తుకులేదా..? మీ హయాంలో మంత్రి వర్గ సహచరులు కూడా దళితులపై ఏ విధంగా నోరు పారేసుకున్నారో ప్రజలకు తెలీదా? మీరా దళితులు, బీసీలు గురించి మాట్లాడేది. ఇప్పుడు భూ అక్రమాలు అని మా పార్టీ నాయకులపై లేనిపోనీ అభాండాలు వేస్తున్నారు. భూములను ఆక్రమించి రికార్డుల్లోకి చేర్చి , అక్రమాలకు పాల్పడింది మీ హయాంలో కదా? మా హయాంలో అన్యాయంగా ఒక్క ఎకరా కూడా ఆన్లైన్ చేసిన దాఖలా లేదని సవాల్ చేస్తున్నా. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. దాన్ని చూసి తట్టుకోలేకే చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని’’ మంత్రి ఆదిమూలపు సురేష్ దుయ్యబట్టారు. (చదవండి: ఇలాంటివి రాసే బాబుకు 23 ఇచ్చారు: సోము) -
భవితతో చెలగాటం.. ‘డీఈడీ’ బాగోతం
గత ప్రభుత్వం విద్యను అక్రమాల పుట్టగా మార్చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీనే కాదు, ఉపాధ్యాయ విద్య (డీఈడీ)ని సైతం గందరగోళం చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీని వివాదాలమయం చేసింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ విద్యను కూడా వ్యాపారమయం చేసింది. జిల్లాలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కళాశాలలు డీసెట్–2018 మార్గదర్శకాలకు సంబంధం లేకుండానే ప్రవేశాలు కల్పించి ఇప్పుడు ఏకంగా 1800 మంది విద్యార్థుల భవితవ్యాన్ని ఆందోళనలోకి నెట్టారు. మొత్తం మీద ఈ సెప్టెంబర్ 28 నుంచి డీఈడీ అభ్యర్థులకు నిర్వహించనున్న పరీక్షలకు అవకాశం లేకుండా చేశారు. సాక్షి, ఒంగోలు మెట్రో: ఉపాధ్యాయ నియామకాలు డీఎస్సీ ద్వారా జరుగుతుండటంతో డీఈడీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ప్రకాశంలో 139 ప్రవేటు డైట్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో కొన్ని కాలేజీల యాజమాన్యాలు లిక్కర్ కాంట్రాక్టర్లు కావటం గమనార్హం. డీఈడీ రెండేళ్ల టీచర్ ట్రెయినింగ్ కోర్సులో చేరాలంటే ముందుగా డీసెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఉత్తీర్ణత ద్వారా డీఈడీ కాలేజీలో ప్రవేశం కల్పిస్తారు. కానీ, గత ప్రభుత్వం డీసెట్ రాయకుండానే ప్రవేశాలు కల్పించుకోవచ్చనే అడ్డగోలు అనుమతులు ఇచ్చింది. దీంతో జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు డీసెట్ రాయకుండానే డీఈడీ ప్రవేశాలను వ్యాపారమయం చేసేశాయి. ఒక్కో సీటుకు 50 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తూ సీట్లను విక్రయించారు. ఇలా డీసెట్ నిబంధనలు తుంగలో తొక్కి ప్రవేశాలు కల్పించిన విషయాన్ని గుర్తించిన విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు జిల్లాలోని డైట్ కళాశాలల అక్రమ ప్రవేశాల మీద నివేదిక ఇవ్వాల్సిందిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. డీసెట్‌తో పని లేకుండానే సీట్ల భర్తీ.. జిల్లాలో మొత్తం 140 ప్రవేటు డీఈడీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మైనంపాడు డైట్ కళాశాల ఒక్కటే ప్రభుత్వ కళాశాల. మిగిలిన 139 కళాశాలలు ప్రవేటువే కాగా, ఉపాధ్యాయ విద్య పెద్ద ఎత్తున బిజినెస్‌గా మార్చటంలో జిల్లాలోని పలు యాజమాన్యాలు కాకలు తీరాయి. 2015లో విడుదల చేసిన జీవో నంబర్ 30 ప్రకారం డీసెట్ పరీక్ష ద్వారానే ఆయా కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. డీసెట్ కన్వీనర్ కోటా ద్వారా 80 శాతం 20 శాతం మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, డీసెట్‌తో సంబంధం లేకుండానే ఏకంగా అన్ని సీట్లూ మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసుకుని సొమ్ము చేసుకోవటం, ఆనక విద్యార్థులతో కేసులు వేయించి అనుమతులు తెచ్చుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఈ విధంగా 2017 విద్యా సంవత్సరంలో జరిగింది కనుక 2018 విద్యా సంవత్సరంలతో కూడా డీసెట్ అర్హత లేకుండానే యాజమాన్యాలు ఇదేవిధంగా ప్రవేశాలు కల్పించారు. ఇలా ఒంగోలు, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లోని డీఈడీ కాలేజీల్లో 200 మంది చొప్పున విద్యార్థులు ఉన్నారు. మిగిలిన కళాశాలల్లో 50 మంది వరకు ఉన్నారు. ఇలా అన్ని కాలేజీల నుంచి డీసెట్‌తో సంబంధం లేకుండా మొత్తం 1800 మంది వరకు విద్యార్థులు డీసెట్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించారు. వీరి ద్వారా యాజమాన్యాలు కోర్టులో కేసు వేయించాయి. దీంతో విద్యాశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది. వారంలోపు నివేదిక పంపిస్తాం.. నిబంధనలు పాటించకుండా ప్రవేశాలు కల్పించిన కాలేజీల వివరాలు సేకరిస్తున్నాం. ఏయే కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు భర్తీ చేశారో తెలుసుకుని సంపూర్ణ నివేదికను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తాం. – వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, మైనంపాడు డైట్ కళాశాల -
ట్రిపుల్ ఐటీకి మహర్దశ
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే ఆంధ్రకేసరి ప్రకాశం విశ్వవిద్యాలయానికి డీపీఆర్ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ట్రిపుల్ ఐటీల విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు ఒంగోలులోని ట్రిపుల్ ఐటీలో బోధన, భోదనేతర సిబ్బంది నియామకానికి సెప్టెంబర్ 31న ఉన్నత విద్యాశాఖ జీవో నంబర్ 30ని విడుదల చేసింది. దీనికి అనుగుణంగా త్వరలో నోటిఫికేషన్‌ను కూడా వెలువరించనున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిప్యుటేషన్ మీద కొందరు, కాంట్రాక్టు ప్రాతిపదికన కొందరు విధులు నిర్వహిస్తున్నారు. టీచింగ్‌లో ప్రొఫెసర్, అసోషియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. విద్యారంగ పటిష్టతకు చర్యలు.. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ కేసీ రెడ్డి బాధ్యతలు చేపట్టాక, రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటీల ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక దివంగత ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో, పేదల ఉన్నత సాంకేతిక విద్యకు అవకాశాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల మీద గత ప్రభుత్వం శీతకన్ను వేసింది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం పేద వర్గాల ఉన్నత విద్య పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ కోట్లాది రూపాయలు కేటాయిస్తూ విద్యారంగాన్ని పటిష్టం చేస్తోంది. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో మొత్తం ఆరువేల మంది విద్యార్థులు ఉండాల్సివుంది. అయితే గత కొన్నేళ్లుగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ తరగతులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నుంచి ఒంగోలులో తరగతులు ప్రారంభించగా, మొదటి సంవత్సర విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. రెండో సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు విద్యార్థులకు ఇడుపులపాయలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 30ని అనుసరించి పోస్టులకు నోటిఫికేషన్ వేసి భర్తీ చేసే క్రమంలో పూర్తి స్థాయిలో ఒంగోలులో తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు అధికారులకు సూచనలు చేశారు. అడ్మిషన్లపై కసరత్తు.. ఈ ఏడాది 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత ఆధారంగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పిస్తారు. జీపీఏ మెరిట్ ఆధారంగా గతంలో ప్రవేశాలు నిర్వహించేవారు. ఈ ఏడాది కోవిడ్–19 నేపథ్యంలో అందరికీ ఉత్తీర్ణ ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. మార్కులు ఇవ్వనందున ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించే పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒంగోలు ట్రిపుల్ ఐటీ పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సొంత భవనాల నిర్మాణం.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, విద్యాశాఖమంత్రి డాక్టర్ సురేష్‌లు ట్రిపుల్ ఐటీల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రకాశం ట్రిపుల్ ఐటీకి స్థలం కూడా మంజూరు చేశారు. త్వరలో నిర్మాణాలు కూడా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్ వెలువరించనున్నారు. ఓ రకంగా ట్రిపుల్ ఐటీ ఈ ప్రాంత విద్యార్థులకు ఒక వరం. మన ప్రాంత విద్యావంతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేందుకు ట్రిపుల్ ఐటీ తోడ్పాటుగా ఉంటుంది. మన ప్రాంత విద్యార్థులు ట్రిపుల్ ఐటీ విద్యను సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్ డైరెక్టర్, ఒంగోలు ట్రిపుల్ ఐటీ -
ఎస్పీపై హెడ్ కానిస్టేబుల్ ఫైర్
సాక్షి, ఒంగోలు: ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ప్రకాశం పోలీసు శాఖలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో రైటర్‌గా పనిచేస్తూ తాజాగా కొమరోలు పోలీసుస్టేషన్‌కు బదిలీ అయిన సుబ్బారావు స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. సుబ్బారావు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు, పబ్లిక్‌తో దురుసుగా వ్యవహరించారంటూ ఏకంగా 38 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారించి చర్యలు తీసుకుంటే సంతోషిస్తాంగానీ ఆరోపణలపై ఎటువంటి విచారణ జరపకుండానే ఏకంగా తమను దొంగలుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ఎస్పీని హెడ్ కానిస్టేబుల్ సూటిగా ప్రశ్నించారు. తాము విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. కనీసం హెచ్చరిక కూడా చేయకుండానే ఏకంగా బదిలీ వేటు వేయడం అంటే పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా ఉందన్నారు. ఇటీవలే తన భార్య చనిపోయిందని, తాను రెండో వివాహం చేసుకున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో బదిలీ చేయడం సమంజనం కాదన్నారు. మానసికంగా బాధపడే ఒక అధికారి ఎస్పీకి ఇచ్చే సలహాలతో నేడు జిల్లాలోని పోలీసు సిబ్బంది మొత్తం బాధపడుతున్నారని హెడ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో తన గురించి కథనాలు రావాలన్న ఎస్పీ కోరికకు సిబ్బంది బలవుతున్నారన్నారు. ఇలాగే కొనసాగి రామాంజనేయులులా తామూ ఆత్మహత్య చేసుకోవాలా..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీడియాతో మాట్లాడడం తప్పో.. ఒప్పో తనకు తెలియదని, ఒక వేళ ఏదైనా చర్య తీసుకున్నా అది తన వరకే పరిమితమై మిగిలిన వారు సంతోషంగా ఉంటే అదే చాలన్నారు. ఒంగోలు టూటౌన్ సీఐ విజ్ఞప్తి హెడ్ కానిస్టేబుల్ ఒకరు మీడియాతో మాట్లాడుతున్నారని తెలియగానే టూటౌన్ సీఐ ఎం.రాజేష్ హుటాహుటిన కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. సుబ్బారావుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌కు రావాలని కోరారు. అరెస్టు చేస్తానంటే చెప్పండి వస్తా..అంటూ ఆయన సీఐని కోరారు. ఇదే సమయంలో ట్రాఫిక్ డీఎస్పీ నుంచి కూడా పిలుపు రావడంతో సుబ్బారావు డీఎస్పీ వద్దకు వెళ్లి తనకు ఎస్పీ అంటే గౌరవం ఉందని, అయితే అవినీతిపరులంటూ ముద్రవేసి బదిలీ చేయడం మాత్రమే తమను ఆవేదనకు గురిచేసిందంటూ వివరించారు. సుబ్బారావును సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఒంగోలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో రైటర్‌గా పనిచేస్తూ ప్రజలతో అనుచిత ప్రవర్తనతో పాటు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్ వి.సుబ్బారావు సర్వీస్ రిజిస్టర్‌ను పరిశీలించామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రెండు క్రిమినల్ కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడని, అతని అనుచిత ప్రవర్తన, విధుల పట్ల నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా ఇప్పటికే మూడు సార్లు సస్పెండ్ అయ్యారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం సుబ్బారావును సస్పెండ్ చేసి ఆయనపై ఎంక్వయిరీ వేశామని, విచారణలో వచ్చే నివేదిక ఆధారంగా శాఖాపరమైస చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజారక్షణ కోసం ప్రకాశం పోలీస్ నిరంతరం పనిచేస్తోందని, ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా విధులు నిర్వహిస్తోందంటూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. -
పెట్రోల్ బంకుల్లో నిలువు దోపిడీ
ఒంగోలు–కర్నూలు రోడ్డులోని ఓ పెట్రోల్ బంకులో ఇటీవల ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లాడు. రూ.100 పెట్రోలు కొట్టమని చెప్పి పర్సు నుంచి డబ్బు తీయబోయాడు. ఆ లోపే పెట్రోల్ పోసే వ్యక్తి ఇంధనం నింపేశాడు. ఇంతలోనే కొట్టడం అయ్యిందా.. అని వాహనదారుడు ప్రశ్నించగా అంత అనుమానం ఉంటే మీరే రీడింగ్ చూసుకోవాలంటూ అతగాడు సలహా ఇచ్చాడు. దీంతో వాహనదారుడు ఏం మాట్లాడకుండా వెళ్లి పోయాడు. ఉదయం మళ్లీ కార్యాలయానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఇంధనం అయిపోయి వాహనం ఆగిపోయింది. వెంటనే సమీప పెట్రోల్ బంకుకు వెళ్లి ఆ వ్యక్తిని నిలదీశాడు. దీనికి ఆయన ‘మేం సక్రమంగానే పోశాం.. మీరు ఎక్కడెక్కడ తిరిగారో ఎవరికి తెలుసు’ అని ఎదురు ప్రశ్నించడంతో ముక్కున వేలుసుకోవాల్సి రావడం వినియోగదారుడి వంతైంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో నిత్యం కోకొల్లలుగా జరుగుతున్నాయి. వినియోగదారుణ్ని మాటల్లో పెట్టి పెట్రోల్ బంకుల నిర్వాహకులు నిలువునా దోచేస్తున్నారు. కొలతల్లో మాయజాలం చేస్తూ నష్టపరుస్తున్నారు. బంకుల్లో పని చేసే ఫిల్లింగ్ మెన్ల చేతివాటానికి వాహనదారులు మోసపోతున్నారు. పొదిలి రూరల్: జిల్లాలో ప్రతి రోజు కొత్తగా రోడ్డెక్కే వాహనాలు పెరిగిపోయాయి. ఫలితంగా ఇంధన వినియోగం పెరిగింది. దీంతో కొందరు పెట్రోల్ బంకుల నిర్వాహకులు అక్రమార్జనకు తెర లేపారు. పలు చోట్ల కల్తీ జరుగుతుండగా, వినియోగదారులను బురిడీ కొట్టించి తక్కువ ఇంధనం పోస్తున్నారు. పెట్రోల్ కొలత పూర్తి కాకుండా పంపు ఆపివేయడం, వేగంగా ట్యాంకు నింపడం, అదే సమయంలో కొలతను సూచించే ఎలక్ట్రానిక్ యంత్రంపై చేయి అడ్డుపెట్టడం, వంటి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు గాలికొదిలేశారని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ధరల పట్టిక కనిపించదు. ఉచిత గాలి యంత్రం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఇలాంటివి చాలా చోట్ల కనిపించవు. అసలే చమురు ధరల భారంతో జనం నలిగిపోతుంటే మరోవైపు బంకుల్లో దోపిడీ వారిని మరింత కుంగదీస్తోంది. డీజిల్, పెట్రోల్ విక్రయాల్లో ఛీటింగ్ జరుగుతున్నా తనీఖీలు నిర్వహించి నిగ్గు తేల్సాల్సిన తూనికలు, కొలతలు శాఖ అధికారులు వినియోగదారుల మొరాలకించడంలేదు. అంతెందుకు ఎన్ని బంకులున్నాయి.. తనిఖీలు ఎప్పడైనా చేశారా.. ఎంత జరిమానా వేశారు.. అనే సమాచారం కూడా సంబంధిత అధికారుల వద్ద లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కల్తీతో వాహనాల రిపేర్లు.. నింబంధనల ప్రకారం లీటరుకు 5 ఎంఎల్ ఇంధనం తక్కువగా రావొచ్చు. అంతకంటే ఎక్కువగా వస్తే అనుమానించాల్సిందే. కొన్ని బంకుల్లో 50 ఎంఎల్ నుంచి 100 ఎంఎల్ వరకు తేడా వస్తున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. మరి కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్‌లో రేషన్ కిరోసిన్‌ను కలిపి విక్రయిస్తున్నారని, దీంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గోదాములు నుంచి బంకుకు సరఫరా చేసే క్రమంలోనే కల్తీ జరుగుతున్నట్లు సాక్షాత్తు అధికారులే అంగీకరిస్తుండటం గమనార్హం. ఎవరేం చేయాలి.. రికార్డుల్లో చూపినట్లుగా నిల్వలు న్నాయా లేదా, నిర్వహణ తీరు తదితర అంశాలు ను పరిశీలించాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖది. పెట్రోల్, డీజీల్‌ను సరిగ్గా కొడుతున్నారా.. వాహనాల్లో నింపే క్రమంలో అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా.. ఇంధనం పోసే యంత్రాలను తూనికలు, కొలతలు శాఖధికారులు ఎప్పటికప్పుడు తనీఖీ చేయాలి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. నిలువు దోపిడీ పొదిలిలోని పొదిలి–ఒంగోలు రహదారిలో గల ఓ పెట్రోల్ బంకులో 100 రూపాయలుకు పెట్రోల్ పోయించుకున్నా. ఒంగోలు వరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో చూసేసరికి బైకులో పెట్రోలు లేదు. అక్కడ మళ్లీ మరో వంద రూపాయలకు పెట్రోల్ పోయించుకుని బయలుదేరా. పొదిలి వచ్చి ఆ పెట్రోల్ బంకులో అడిగితే మేం కరెక్టుగా కొట్టామని, అంత అనుమానం ఉంటే మీరే రీడింగ్ చూసుకోవాలన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. – గురువారెడ్డి, వాహనదారుడు, పొదిలి నిబంధనలు పాటించకపోతే చర్యలు.. పెట్రోల్ బంకుల నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. ఆయిల్ నింపే ముందు మీటరు వేసి వాహనాలకు పెట్రోల్, డీజిల్ నింపాలి. ఎక్కడైనా కల్తీలు జరిగినా, ఆయిల్ నింపడంలో తేడాలు గుర్తించినా అటువంటి బంకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఫిర్యాదు చేసినా ఆయా పెట్రోల్ బంకులను రెండు, మూడు రోజుల్లో తనిఖీ చేసి తప్పు జరిగితే చర్యలు తీసుకుంటాం. – మూర్తి, జిల్లా తూనికలు, కొలతలు అధికారి -
కరోనా మిగిల్చిన విషాదం..!
సాక్షి, ప్రకాశం: కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కుటుంబంలోని నలుగురు ఒకరి తరువాత ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కాటు నుంచి తప్పించుకునేందుకు మెరుగైన చికిత్స తీసుకునేందుకు చేసిన ప్రయత్నం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. కరోనా నుంచి కోలుకుని నేడో రేపో ఇంటికి చేరుకుంటామని ఆశించినంతలోనే ఊహించని రీతిలో ఇద్దరిని అగ్నిప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఇదీ విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జయలక్ష్మి, పవన్‌కుమార్ కుటుంబంలోని విషాదగాథ. (ప్రమాదానికి కారణమిదేనా?) కందుకూరు పట్టణంలోని గణేష్‌నగర్‌లో నివాసం ఉండే దుడ్డు ప్రసాద్ ఎన్టీఆర్ బొమ్మ సెంటర్లో కిరాణా షాపు నిర్వహిస్తుంటాడు. అలాగే ఆంజనేయ స్వామి మాల ధరించే భక్తులకు గురుస్వామిగా ప్రసిద్ధి. కందుకూరు పరిసర ప్రాంతాల్లో ఆంజనేయస్వామి మాల ధరించే భక్తులందరూ ప్రసాద్ గురుస్వామి వద్దనే మాల తీసుకుంటారు. ఆ విధంగా ప్రసాద్ చాలా సుపరిచితుడు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డాడు. మెరుగైన వైద్యం తీసుకోవాలని విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చికిత్స అనంతరం ఆయన కోలుకుని రెండు రోజుల క్రితమే ఇంటికి చేరాడు. అయితే ప్రసాద్ నుంచి వైరస్ ఆయన భార్య వెంకట జయలక్ష్మి (48), ఆయన పెద్దకుమారుడు పవన్‌కుమార్ (30), రెండో కుమారుడు మనోజ్‌కు సోకింది. కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌గా తేలింది. (మృత్యు కీలలు) అధికంగా లక్షణాలు ఉన్న వెంకట జయలక్ష్మి, పవన్‌కుమార్‌లు కూడా రమేష్ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యారు. ఐదు రోజులుగా వారిని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న రెండో కుమారుడు మనోజ్‌కు మాత్రం లక్షణాలు స్వల్పంగా ఉండడంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తున్నాడు. రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జయలక్ష్మి, పవన్ కుమార్‌లు కూడా ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామని అక్కడి వైద్యులు చెప్పారు. ఇంతలోనే ఊహించని విధంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వారు ఇరువురూ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తల్లి, కుమారుడు ఇద్దరూ మృతిచెందారు. ఈ వార్త తెలిసిన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా నుంచి కోలుకున్నా అగ్ని ప్రమాదం వాళ్ల పాలిట యమపాశంగా మారిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కుమార్ భార్య ఏడు నెలల గర్భిణి: అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పవన్‌కుమార్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల ఇంటికి వచ్చి వర్క్ ఫ్రం హోం విధానంలో ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. పవన్‌కుమార్‌కు ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన మౌనికతో వివాహమైంది. మౌనిక 7వ నెల గర్భిణి. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పవన్‌కుమార్ మృతితో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా కరోనా ఈ రెండు కుటుంబాల్లో అంతులేని ఆవేదనను మిగిల్చింది. ఇక రెండో కుమారుడు మనోజ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నాడు. కరోనా వైరస్ సోకడంతో ప్రస్తుతం కందుకూరు పట్టణంలోనే ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అగ్ని ప్రమాదంలో తల్లి, అన్న ఇద్దరూ మృతి చెందినా బయటకు రాలేని పరిస్థితిలో మనోజ్ తల్లడిల్లుతున్నాడు. -
నువ్వక్కడుంటే.. నేనిక్కడుంటా!
ఒంగోలు మెట్రో: ‘‘నువ్వక్కడుంటే నేనిక్కడుంటా.. ప్రాణం విలవిలా..’’ ఓ సినీ గేయంలో పల్లవి కావొచ్చు కానీ కరోనా మాత్రం ఇదే సందేశం ఇస్తోంది.! లాక్డౌన్ కాలంలో నువ్వు ఇంట్లోనే ఉంటే, నేను వ్యాప్తికి దూరంగా ఉంటానంటోంది.! కరోనా వైరస్ వ్యాప్తి సమాజాన్ని రోజురోజుకూ భయపెడుతోంది. అంతేకాదు, బంధుమిత్రులకు దూరం చేస్తోంది. కేవలం ఫోన్ సంభాషణలే తృప్తికి సంకేతాలుగా మలుస్తోంది. ఇంకోవైపు శుభకార్యాలకీ, అశుభకార్యాలకీ దూరం పెడుతోంది. సన్నిహితులు, బంధుమిత్రులు మరణించినా సరే.. వెళ్లే అవకాశం లేకుండా చేస్తోంది. చివరికి కుటుంబ సభ్యులు మరణించినా ఫోన్ లైవ్‌లో అంత్యక్రియలు చూడాల్సిన దుస్ధితిని కరోనా మహమ్మారి తెచ్చిపెట్టింది. కరోనా సామాజిక జీవితాన్ని మార్చివేసింది. వైరస్ వ్యాప్తికి భయపడి కష్టసుఖాలకు కూడా వెళ్లలేని పరిస్ధితిని చవిచూపిస్తోంది. గతంలో బంధువుల్లో ఎవరికైనా కష్టం వస్తే వెళ్లి పరామర్శించి రావడం ఒక అనివార్య అలవాటు. ఇప్పుడా అలవాటుని కరోనా మార్చేసింది. అదేవిధంగా ఏదైనా శుభకార్యం జరిగితే బంధుమిత్రుల సమూహమంతా పండగ సందడితో నిండి ఉండేది. కుటుంబాలకు కుటుంబాలు రోజుల తరబడి కలిసి మెలసి ఉంటూ ఆహ్లాదకర వాతావరణంలో కబుర్లతో ఉత్సాహంగా గడిపేవారు. ఇప్పుడవేవీ లేవు. నిజానికి విభేదాలు ఉన్నవారు సైతం దుఃఖ సమయాల్లో పరామర్శించుకుంటారు. ఇప్పుడు సొంతవాళ్లు కూడా వెళ్లకుండా కరోనా కట్టడి చేస్తోంది. చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కనుక, అతడు/ఆమె అంత్యక్రియల్లో పాల్గొని నివాళులరి్పంచి రావడం నాగరిక సమాజంలో సర్వసాధారణం. ఇప్పుడా పరిస్థితి లేదు. శుభకార్యాలకూ దూరం తరతరాల బంధుమిత్రుల సమూహం మధ్య శుభకార్యాలు నిర్వహించుకోవడం మన సంప్రదాయం. అటు ఏడు తరాలు, ఇటు ఏడుతరాలను ఆహా్వనించి శుభకార్యాలు నిర్వహించుకోవడం ఒక గౌరవంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో ప్రతి సందర్భమూ ఒక పండగే. పంచల పండగ నుంచి రజస్వలలు, వివాహాలు, బారసాలలు తదితర ప్రతీ సందర్భాన్నీ ఉత్సవంలా నిర్వహిస్తారు. ముస్లింలు, క్రైస్తవులు కూడా వివిధ సందర్భాలను సందడిగా నిర్వహిస్తారు. బంధుమిత్రులు ఒకచోట చేరి విందు భోజనాలు చేసి సంతోషంగా గడపుతారు. ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ కష్టసుఖాలు పంచుకోవడం అనేది సామాజిక జీవితంలో అత్యవసరం. అటువంటిది కరోనా అన్ని పండగలను, శుభకార్యాలను దూరం చేసింది. సమూహంగా చేరడాన్ని కట్టడి చేసింది. నువ్వక్కడుంటే నేనిక్కడుంటా అంటూ హెచ్చరిస్తోంది. మౌనం గలగలా అంటూ పరిహాసం చేస్తోంది. లేదంటే రానున్న కాలంలో అన్నింటికీ దూరం అవుతారని ప్రమాద ఘంటిక మోగిస్తోంది. ఈ హెచ్చరికలను బుద్ధిపూర్వకంగా స్వీకరించి ఆచరించడం ద్వారా మాత్రమే మంచి రోజులు వస్తాయని వాస్తవాన్ని గుర్తు చేస్తోంది. అన్నీ ఫోన్లోనే.. ప్రస్తుతం అన్నింటికీ ఫోన్ మాత్రమే పెద్ద దిక్కు అయింది. అనారోగ్యంతో ఉన్నవారినైనా, చనిపోయిన వారి కుటుంబ సభ్యులనైనా ఫోన్లోనే పరామర్శించాల్సి వస్తోంది. ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతానికి వెళ్తే కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉంటుందనే భయంతో పరామర్శలకు కూడా జనం వెళ్లడం లేదు. బాధా సందర్భాలైనా సరే, ఫోన్లోనే పరామర్శిస్తున్నారు.కరోనా వైరస్ వ్యాప్తి దరిమిలా ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. -
రూ.2 వేల కోసం బావమరిదిని హత్య
సాక్షి, పెద్దారవీడు: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వక పోవడంతో సొంత బామరిదిని బావ బాణంతో పొడిచి చంపాడు. ఈ సంఘటన మండల కేంద్రం పెద్దారవీడు పంచాయతీ పరిధిలో చెంచుగూడెంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుడుముల చిన్నయ్య వద్ద ఆయన బావమరిది మండ్ల రాజయ్య గతంలో రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు కచ్చితంగా తిరిగి ఇవ్వాలని బావ అడిగాడు. బావమరిది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సాయంత్రం ఇద్దరూ మద్యం పూటుగా తాగి ఇంటికి వచ్చి ఘర్షణ పడ్డారు. మాటామాట పెరిగి ఇద్దరూ గొడ్డలితో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. కుడుముల చిన్నయ్య చేతిలోని గొడ్డలి కింద పడిపోయింది. రాజయ్య గొడ్డలితో చంపుతాడని భయపడి చిన్నయ్య ఇంట్లోకి వెళ్లాడు. వెంటనే బాణం (అంబు) తెచ్చి రాజయ్య (35)ను పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరి గృహాలు ఎదురెదురుగా ఉన్నాయి. రాజయ్య అక్క గుర్రమ్మకు చిన్నయ్యతో వివాహమైంది. మృతుడి భార్య హనుమక్క గర్భిణి కావడంతో కాన్పు కోసం మార్కాపురం మండలం జమ్మనపల్లె పుట్టింటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న మృతుడి భార్య కన్నీరు మున్నీరైంది. మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు కారణాలు బంధువులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఆయన వెంట ట్రైనీ డీఎస్పీ స్రవంతిరాయ్, సీఐ రాఘవేంద్ర ఉన్నారు. వీఆర్వో బద్వీటి మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.రామకృష్ణ తెలిపారు. -
కరోనా: కోయంబేడు కలకలం
సాక్షి, ఒంగోలు: జిల్లాలో ఉన్న 63 కోవిడ్–19 పాజిటివ్ కేసులన్నీ కోలుకుని నెగిటివ్ రావడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న దశలో మరో మూడు పాజిటివ్ కేసులు శనివారం నమోదయ్యాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లి వచ్చిన జిల్లా వాసులకు కోవిడ్–19 పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ మార్కెట్ కేంద్రంగానే కరోనా కేసులు విస్తృతంగా వ్యాపించాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కొంత మంది వలస కూలీలు పనుల కోసం గతంలో చెన్నై వెళ్లారు. వారంతా లాక్డౌన్ నేపథ్యంలో నడక, ఇతర మార్గాల ద్వారా జిల్లాకు, ఇతర జిల్లాల వారు మన జిల్లా మీదుగా వెళ్లిపోయారు. అలా వెళ్లి వచ్చిన వారిలో ప్రస్తుతం ఒంగోలు కమ్మపాలెం నుంచి ఒకరికి, కొత్తపట్నం నుంచి ఇద్దరికి ట్రూనాట్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో, పూర్తి స్థాయి నిర్ధారణ పరీక్ష అయిన వీఆర్‌డీఎల్‌ను నిర్వహించగా పాజిటివ్‌లుగా నిర్ధారించారు. ప్రస్తుతం నిర్ధారణ అయిన మూడు కేసులు కోయంబేడు మార్కెట్‌తో ముడిపడినవిగా అధికారులు తేల్చారు. ఒంగోలు కమ్మపాలేనికి చెందిన 30 సంవత్సరాల వ్యక్తికి, కొత్తపట్నంకు చెందిన 44 సంవత్సరాల వ్యక్తికి, రాజుపాలెంకు చెందిన 31 సంవత్సరాల వ్యక్తులకు పాజిటివ్‌లుగా నిర్ధారించారు. వీరంతా కూరగాయల వ్యాపారస్తులు, డ్రైవర్లు. కూరగాయలను కోయంబేడుకు తరలించిన వారు. మొత్తం 170 మంది.. కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లి వచ్చిన వారిలో జిల్లాలో దాదాపు 170 మంది వరకూ ఉన్నారు. వీరిని గుర్తించి క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 130 మంది శాంపిల్స్‌ను వైద్యులు పరీక్షించారు. మరో 40 శాంపిల్స్‌ను పరీక్షించాల్సి ఉంది. అదే విధంగా పాజిటివ్ వచ్చిన వారితో దగ్గరగా ఉన్న 14 మంది స్వాబ్‌లను కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలకు పంపించారు. మరో నలుగురి స్వాబ్‌లను తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఇరువురు ఇప్పటికే ట్రిపుల్ ఐటీలో క్వారంటైన్లో ఉండగా, మిగిలిన వ్యక్తి జీజీహెచ్‌లో ఉన్నాడు. వీరందరినీ శనివారం రాత్రి కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ జనరల్ వైద్యశాల, జిల్లా కోవిడ్ వైద్యశాలకు వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. జిల్లా కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ ఎల్ జాన్ రిచర్డ్స్ ఆధ్వర్యంలోని వైద్య బృందం పాజిటివ్ వ్యక్తులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. మొత్తం మీద వారం రోజులుగా జిల్లాలో ఒక్క కోవిడ్ 19 కేసు నమోదు కాకపోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. మూడవ దశ లాక్డౌన్ కూడా ముగుస్తుండటంతో, 4వ దశలో కొన్ని వెసులుబాటులు ఉండవచ్చని భావించారు. అయితే కొత్త కేసులు, కొత్త ప్రాంతాల్లో నమోదవుతుండటంతో ఆ ప్రాంతాలపై కూడా లాక్డౌన్ పడనుంది. -
మా రాష్ట్రాలకు చేర్చండయ్యా...
సాక్షి, చినగంజాం: రైల్వే పనుల నిమిత్తం పొరుగు రాష్ట్రాల నుంచి చినగంజాం వచ్చి చేరిన పలువురు వలస కార్మికులు తమను స్వస్థలాలకు చేర్చాలంటూ ఆదివారం అధికారులను ఆశ్రయించారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా అంతర్ రాష్ట్ర వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంతో స్థానికంగా కూలి పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల కూలీలు తమను స్వస్థలాలకు చేర్చాలంటూ అధికారులను కలిసి వేడుకున్నారు. దక్షిణ మధ్యరైల్వే మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 49 మంది పలు కుటుంబాల వారు చినగంజాంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో కొంత కాలంగా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని నివాసముంటున్నారు. వీరిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన పలు కుటుంబాలు వారు చంటి పిల్లలతో సహా ఉంటున్నారు. గత మార్చిలో కరోనా లాక్డౌన్ దృష్ట్యా రైల్వే పనులు పూర్తిగా నిలిచిపోవడంతో కూలీలను ఇక్కడకు తీసుకొని వచ్చిన కాంట్రాక్టర్ వారిని ఇక్కడే వదలి వెళ్లిపోయాడు. గడచిన 40 రోజులుగా తహసీల్దార్ కేవీఆర్వీ ప్రసాదరావు వారిని గుర్తించి సాయమందిస్తూ ఆదుకుంటుండగా, స్థానికులు, దాతలు వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అందజేస్తూ వచ్చారు. తహసీల్దార్, ఎస్ఐ పి.అంకమ్మరావు సుమారు 49 మంది కూలీలు స్థానికంగా స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
లాక్డౌన్: చిత్తూరు నుంచి ఉత్తర ప్రదేశ్‌కు..
సాక్షి, ఒంగోలు: బతుకు దెరువు కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన పది మంది యువకులు చిత్తూరుకు వచ్చారు. ఇక్కడ ఐస్ బండ్లు నడుపుకుంటూ రెండేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అందరి వయస్సు 20 ఏళ్లలోపే. వీరి బతుకుల్లో కరోన అలజడి రేపింది. లాక్‌డౌన్‌తో ఇప్పట్లో వ్యాపారాలకు అనుమతులు ఇచ్చే అవకాశం లేదని యజమానులు చెప్పడంతో ఎలాగైనా సొంతూళ్లకు చేరాలనుకున్నారు. వాహన సదుపాయాలు అందుబాటులో లేక కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చిత్తూరు నుంచి ఉత్తరప్రదేశ్ చేరుకోవాలంటే మొత్తం 1900 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆదివారం సాయంత్రం చిత్తూరు నుంచి బయల్దేరారు. మార్గమధ్యలో కనీసం భోజనం చేసే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఎవరైనా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తుంటే వాటిని తీసుకుంటూ మొత్తంగా మూడు రోజుల్లో 331 కిలోమీటర్లు అంటే సరాసరిన రోజుకు 110 కిలోమీటర్లు ప్రయాణించారు. ఒంగోలు మండలం త్రోవగుంట సమీపంలో హైవే మీదుగా వస్తుండగా బుధవారం హైవేపై నిఘా పెట్టిన తాలూకా సీఐ యం.లక్ష్మణ్ వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఆహారం లేక నీరసించి ఉండటంతో భోజనం పెట్టారు. అనంతరం వారికి పరిస్థితులు వివరించి అందరినీ పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. -
కరోనా కట్టడికి డిజీ పే
కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందన్న విషయం ఇంకా నిరూపితం కాలేదు. కానీ ప్రజల్లో నగదు లావాదేవీలపై కొంత భయం నెలకొంది. కరోనా సోకిన వ్యక్తులు నోట్లను చలామణీ చేసుంటే వైరస్ తమకు కూడా వ్యాపిస్తుందేమోనని ప్రజలు ఒకింత ఆందోళన చెందుతున్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా సోకినట్లు నిర్ధారణ కాలేదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ విషయం కాస్త పక్కనపెడితే.. కరోనా నియంత్రణకు ప్రభుత్వం సూచించిన విధంగా భౌతిక దూరం పాటించకపోవడం ఆందోళన కలిగించే అంశం. బ్యాంకుల వద్ద, కరెంట్ బిల్లులు చెల్లించే ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించకపోవడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వైద్య నిపుణులు, అధికారులు కూడా డిజిటల్ పేమెంట్లే మేలనిసూచిస్తున్నారు. నిత్యావసర సరుకులు, మెడిసిన్‌ను ఆన్లైన్లో కొనేందుకు ప్రాధాన్యత ఇచ్చి లాక్‌డౌన్‌కు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పామూరు: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా చాపకింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ చైన్ లింక్‌ను తెంపే ఒకే ఒక్క మార్గం భౌతిక దూరం పాటించడం. ఎవరి వారు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలో ఉండటం ఎంతో మంచిది. ఇలాంటి సమయాల్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు, వాటి చెల్లింపుల్లోనూ కాస్తంత జాగ్రత్తలు పాటించడం మంచిది. వీలైనంత వరకూ నగదును నోట్ల రూపంలో కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను వినియోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాలు, పేపర్ నుంచి పచారీ కొట్లలో కొనుగోలు చేసే ప్రతి ఒక్క వస్తువుకూ నోట్లకు బదులుగా ఫోన్ పే, గూగుల్ పే లాంటివి వినియోగిస్తే కొంతనై వైరస్ కట్టడికి ప్రయత్నించవచ్చు. పామూరులో విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం క్యూలో నిల్చున్న ప్రజలు భయభయంగా బ్యాంకులకు నగదు కోసం బ్యాంకులకు వెళ్తే మన చుట్టూ ఉండే ఖాతాదారులు, అధికారులంతా కరోనా వైరస్ రూపంలో దర్శనమిస్తున్నారు. ఎటు నుంచి వచ్చి వైరస్ మనకు సంక్రమిస్తుందోనని భయంభయంతో ఉంటున్నారు. కొంత మంది క్యూ పద్ధతిలో భౌతిక దూరం పాటించకుండా ఇష్టారీతిన ఉంటున్నారు. ఏటీఎంలూ అంతే ప్రమాదం. వీటన్నింటికంటే డిజిటల్ చెల్లింపులే ఎంతో మేలు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులకు అవకాశం ఇచ్చింది. విద్యుత్ బిల్లులు, గ్యాస్ సిలెండర్, మొబైల్ బిల్స్ ఇలాంటి 20కి పైగా వాటికి డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. -
లైంగిక దాడిపై కేసు నమోదు
జరుగుమల్లి (సింగరాయకొండ): మండల కేంద్రంలోని తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటనలో అదే కాలనీకి చెందిన బాలుడిపై గురువారం అర్ధరాత్రి జరుగుమల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు ఎస్సీ కాలనీకి చెందిన మైనర్ బాలిక ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అదే కాలనీకి చెందిన బాలుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న తల్లిదండ్రులు అబార్షన్ చేయించడానికి ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి ఈనెల 6వ తేదీ వెళ్లారు. అయితే ఆస్పత్రి వైద్యులు బాలికను పరీక్షించి ఏడు నెలల గర్భం అని ఈ సమయంలో అబార్షన్ చేస్తే ప్రమాదం అని చెప్పడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఈనెల 8వ తేదీ తరలించారు. బాలిక 9వ తేదీ చనిపోయిన శిశువుకు జన్మించింది. తరువాత వారిని ఆస్పత్రి నుంచి 13వ తేదీ డిశ్చార్జ్ చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం 16వ తేదీ రాత్రి నిందితుడైన బాలుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ యు. శ్రీనివాసరావు వివరించారు. బాలికపై లైంగిక దాడి దర్శి: మండల పరిధిలో పదకొండు సంవత్సరాల వయస్సున్న బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేసిన ఘటన కొర్లమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసు తెలిపిన వివరాల మేరకు.. బాలిక తల్లిదండ్రులు పొలం వెళ్లారు. గురువారం మధ్యాహ్నం తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. దుస్తులకు రక్తం కావడంతో బాలిక ఏడ్చింది. దీంతో ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక గురువారం సాయంత్రం వరకు ఇంట్లో చెప్పలేదు. బాలిక తరచూ బాత్రూంకు వెళ్లి బయటకు వచ్చి ఏడుస్తుండటంతో గమనించిన తల్లి అడగటంతో ఆమెకు జరిగిన విషయం చెప్పింది. రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పి..పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై ఆంజనేయులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెడ్ జోన్‌గా ప్రకాశం
సాక్షి, ఒంగోలు: కోవిడ్–19 వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన కేంద్రం తగు చర్యలను సూచించింది. జిల్లాలో ఇప్పటి వరకూ 24 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో 23 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనతో సంబంధం ఉన్నవే ఉన్నాయి. నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని జిల్లా అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో కోవిడ్–19 అత్యధికంగా ప్రబలే అవకాశం ఉండటంతో కఠిన చర్యలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. అయితే జిల్లాను రెడ్ జోన్‌గా కేంద్రం ప్రకటించినందున లాక్డౌన్ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. కొనకనమిట్ల మండలంలో కోవిడ్–19 పాజిటివ్ కేసు జిల్లాకు చెందిన శాంపిల్స్‌లో మరో కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారిస్తూ ల్యాబ్ అధికారులు జిల్లా అధికారులకు నివేదికలు పంపించారు. దీంతో జిల్లాలో కోవిడ్–19 పాజిటివ్ కేసులు 24కు చేరుకున్నాయి. సోమవారం ల్యాబ్ అధికారుల నుంచి అందిన 76 నివేదికల్లో ఒకటి పాజిటివ్‌గా నిర్ధారించారు. కొనకనమిట్ల మండలం వెలిగండ్ల గ్రామానికి చెందిన యువకుడు ఢిల్లీలో మానవాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉండటంతో ఈ నెల ఒకటో తేదీన ఒంగోలు జీజీహెచ్‌లో చేర్చారు. పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులను కూడా జీజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు జిల్లా నుంచి ల్యాబ్‌కు పంపిన 206 కోవిడ్–19 శాంపిల్స్ నివేదికలు రావాల్సి ఉందని ఒంగోలు జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి.శ్రీరాములు తెలిపారు. ఇప్పటి వరకు 339 శాంపిల్స్ నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో కోవిడ్–19 పాజిటివ్ వ్యక్తులందరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కొన్ని కేసులను కిమ్స్ వైద్యశాలకు తరలించామన్నారు. ఒకరికి ఇతర అనారోగ్య కారణాలు ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం కూడా నికలడగా ఉందని అక్కడి వైద్యులు చెప్పారన్నారు. క్వారన్టైన్, ఐసోలేషన్‌కు 826 గదులు జిల్లాలో కోవిడ్–19 వైరస్ అనుమానితులను ఉంచేందుకు, పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేసేందుకు 826 గదులను సిద్ధంగా ఉంచారు. ఈ గదులన్నిటికీ ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి. ప్రత్యేక వైద్యులు, నర్సులు కోవిడ్–19 వైరస్ పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు అనుభవం ఉన్న వైద్యులు 30 మంది, నైపుణ్యం కలిగిన 56 మంది నర్సులను నియమించారు. ఇప్పటి వరకు 311 మందిని ఐసీయూలో అడ్మిట్ చేశారు. పూర్తి స్థాయిలో చికిత్స కిట్లు జిల్లాలో కోవిడ్–19 వైరస్ బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వాడే పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్లు(పీపీఈ) 3,560 అందుబాటులో ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది వాడే ఎన్ 95 మాసు్కలు 5,477, గ్లవ్స్ 1,60,611, సర్జికల్ మాసు్కలు 1,21,140, శానిటైజర్లు 15003, వెంటిలేటర్లు 37 ఉన్నాయి. చీమకుర్తిలో శానిటైజర్ టన్నెల్ చీమకుర్తి: చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలోని కరోనా క్వారంటైన్ సెంటర్లో ఆటో శానిటైజర్ టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ను సోమవారం సాయంత్రం చీమకుర్తి తహసీల్దార్ విజయకుమారి ప్రారంభించారు. క్వారంటైన్ సెంటర్లో కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తులకు ఆహారం, మంచినీరు, వైద్యం, ఇతర అవసరాలు తీర్చేందుకు రాకపోకలు సాగించే వ్యక్తుల రక్షణ కోసం ఈ ఆటో శానిటైజర్ టన్నెల్ ఏర్పాటు చేశారు. ఈ పరికరాన్ని చీమకుర్తికి చెందిన ఇంజినీరింగ్ వర్క్స్‌లో నిపుణులైన షేక్ షఫీ, హెచ్ సుబ్బారెడ్డి స్వచ్ఛందంగా రూపొందించారు. శానిటైజర్ టన్నెల్లో తహసీల్దార్‌పై ఆటోమేటిక్‌గా సోడియం హైపో క్లోరైట్ స్ప్రే -
వెలిగొండ వేగం పెరగాలి
ఐదేళ్ల టీడీపీ సర్కార్ హయాంలో 600 మీటర్ల మేర టన్నెల్–1 పనులు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్నమాట. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి/ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని జల వనరుల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అవసరమైతే పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న పాత కాంట్రాక్టు సంస్థలను తొలగించి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ‘ప్రాధాన్యత క్రమం’లో శరవేగంగా పూర్తి చేయడానికి రూపొందించిన ప్రణాళిక అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనులకు అడ్డంకిగా మారిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి అధికారులకు మార్గనిర్దేశం చేసే క్రమంలో గురువారం ఆయన వెలిగొండ ప్రాజెక్టు నుంచి ‘ప్రాజెక్టుల బాట’కు శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.55 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు (సొరంగం)–2 వద్ద పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం ట్రాలీలో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–1లోకి ప్రవేశించి, టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్) ద్వారా సొరంగం తవ్వకం పనులను పరిశీలించారు. ఆ తర్వాత మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ప్రజాప్రతినిధులతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ నమూనా చూపుతున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ఐదేళ్లలో 600 మీటర్లు.. ఎనిమిది నెలల్లో 1.4 కి.మీల సొరంగం తవ్వకం ‘ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో 4.47 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడానికి, 15.25 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా జరిగాయి. ఆ తర్వాత పనులు పడకేశాయి. ఈ పరిస్థితిలో ఈ ప్రాజెక్టు తొలి దశను జూలై నాటికి పూర్తి చేసి, ఆగస్టులో ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించాం. గడువులోగా పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలి’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గత ఐదేళ్లుగా పనులు ఎందుకు ముందు సాగలేదని అధికారులను ప్రశ్నించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో టన్నెల్–1 పనులు 15.2 కిలోమీటర్ల నుంచి 15.8 కిలోమీటర్ల వరకు అంటే 600 మీటర్ల మేర మాత్రమే చేయగలిగామని అధికారులు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో టన్నెల్–1 పనులను 15.8 కిలోమీటర్ల నుంచి 17.2 కిలోమీటర్ల వరకు అంటే 1.4 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశామని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. టన్నెల్–1ను ఎట్టిపరిస్థితుల్లో జూలై నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి స్పందిస్తూ.. నెలకు 200 మీటర్ల చొప్పున టన్నెల్‌ను తవ్వుతున్నామని, జూన్–జూలై నాటికి పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలింగొండ సొరంగ మార్గంలో లోకో ట్రైన్లో ప్రయాణిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో టన్నెల్–2 పనులు 410 మీటర్లే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కొల్లంవాగు మీదుగా వెలిగొండ టన్నెల్ ద్వారా నీటిని విడుదల చేయడానికి సాగుతున్న హెడ్ రెగ్యులేటర్ నిర్మాణ పనుల గురించి సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. హెడ్ రెగ్యులేటర్ పనులను పాత కాంట్రాక్టర్ సక్రమంగా చేయక పోవడంతో వాటిని మరొక కాంట్రాక్టర్‌కు అప్పగించామని అధికారులు వివరించారు. శ్రీశైలం జలాశయంలోనీటి మట్టం 850 అడుగులకు తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి జూలై నాటికి పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్–2 పనులపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 10.75 కిలోమీటర్ల నుంచి 11.16 కిలోమీటర్ల (410 మీటర్లు) వరకు మాత్రమే చేశారని అధికారులు వివరించారు. టన్నెల్–2ను రెండు వైపుల నుంచి తవ్వడం ద్వారా శరవేగంగా పూర్తి చేయాలని సీఎం చేసిన సూచనలకు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు అంగీకరించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధుల కొరత రానివ్వం.. పనులు వేగంగా చేయండి వెలిగొండ ప్రాజెక్టు పనులకు అవసరమైన 2,884.13 ఎకరాల భూమిని మార్చి 31లోగా సేకరించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌లో 11 గ్రామాలు ముంపునకు గురవుతాయని.. ఆ గ్రామాల పరిధిలోని 4,617 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించాల్సి ఉందని అధికారులు వివరించారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం సహాయ, పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందించాలని నిర్వాసితులు కోరుతున్నారని నివేదించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. అందుకు అవసరమైన రూ.1,860 కోట్ల నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాత కాంట్రాక్టు సంస్థలు పనులు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు.. అవసరమైతే ఆ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి వేరే కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగించాలని సూచించారు. పుల్లలచెరువు మండలంలో టీ–5 బ్లాక్ వద్ద అదనంగా కాలువ తవ్వకం ద్వారా 11,500 ఎకరాలకు సాగు, తాగు నీరు అందించే పనులు చేపట్టడానికి అదనంగా రూ.70 కోట్లు అవుతాయని, వాటిని మంజూరు చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన విజ్ఞప్తిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. వెలిగొండ ప్రాజెక్టు ఈస్ట్రన్ కెనాల్ ద్వారా రాళ్లపాడు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలన్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ప్రతిపాదనపై కూడా సానుకూలంగా స్పందించారు. ఆ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, వేణుగోపాల్, నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లాలో బాలికపై లైంగిక దాడి
మర్లపాలెం (కురిచేడు): సభ్య సమాజం తలదించుకునేలా.. మానవతా విలువలు మంటగలిసేలా ఓ కామాంధుడు కుమార్తె వరసైన తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మర్లపాలెంలో శుక్రవారం జరిగింది. ఒక వైపు చట్టాలు కఠినతరం చేస్తూ శిక్షలు బహిరంగంగా వేస్తున్నా ఇలాంటి మానవ మృగాలతో సమాజంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. బాధితురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మునగాల సుబ్బారెడ్డి వికలాంగుడు. మధ్యాహ్నం వేళ ఓ చిన్నారి తన ఇంటి వద్ద ఒంటరిగా ఆడుకుంటున్న తరుణంలో సుబ్బారెడ్డి ఆమెకు చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపాడు. బాలిక అతడి మాటలు నమ్మి సుబ్బారెడ్డి ఇంట్లోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన అతడు మానవత్వం కోల్పోయి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చారు. బాలిక తీవ్ర రక్తస్రావంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పి కన్నీటిపర్యంతమైంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దర్శి డీఎస్సీ కె.ప్రకాశ్‌రావు, సీఐ మొహ్మద్ మోయిన్‌లు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. నిందితుడు ఇంట్లోనే చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతడి భార్య పొలం పనులకు వెళ్లింది. నిందితుడు నిత్యం తన బంకు వద్దకు తినుబండారాలు కొనేందుకు వచ్చే చిన్నారులను లైంగికంగా వేధిస్తుంటాడని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కొందరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేలా మానవ మృగాలకు వణుకు పుట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆయన నిర్వాకంతోనే రాష్ట్రం దివాలా..
సాక్షి, కొత్తపట్నం: చదువుకు పేదరికం అడ్డు కాకూడదని.. పేదల బిడ్డలు ఉన్నత విద్య చదవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంగ్లీష్ బోధనను దురుద్దేశం తోనే ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయన్నారు. గురువారం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల జిల్లా పరిషత్ హైస్కూల్లో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన మంత్రి బాలినేని..విద్యార్థుల తల్లులకు అమ్మఒడి చెక్కులను అందజేశారు. మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి చిన్నారుల తల్లులు పాలాభిషేకం చేశారు. బాలినేని మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకంతోనే రాష్ట్రం దివాలా తీసిందని.. అయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. కొత్తపట్నం మండలంలో త్వరలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని కందుకూరులో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ‘జగనన్న అమ్మఒడి పథకాన్ని’ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్ కంటి వెలుగు పథకం’ ద్వారా విద్యార్థులకు కంటి అద్దాలను ఆయన పంపిణీ చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి మద్దతుగా గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చీరాల ఓరియంటల్ యూపీ పాఠశాలలో ‘అమ్మఒడి’ పథకాన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎం. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మద్దిపాడు మండలం గుండ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మఒడి పథకాన్ని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చుండూరు రవి, మండవ అప్పారావు, ఏఎంసీ చైర్మన్ ఎనగంటి పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అమ్మఒడి..పేదింట చదువుకు భరోసా) (చదవండి: ‘వచ్చారు జగన్.. మెచ్చారు జనం’) -
హౌసింగ్‌లోనూ రివర్స్ టెండరింగ్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వం నిర్వహించే ప్రతి అభివృద్ధి పనిని ఎక్కువ ధరలకు అప్పజెప్పి కమీషనర్లు తీసుకోవడం... కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడం... నాణ్యత లేకుండా పనులు నిర్వహించినా పట్టించుకోకపోవడం... ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ తమ అనుయాయుల జేబులు నింపడం... ఇదీ.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు చేసిన నిర్వాకం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ద్వారా నిర్వహించే ప్రతి అభివృద్ధి పనికి పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా గతంలో పెండింగ్‌లో ఉన్న పనులకు సైతం టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలేలా చేయడంలో సక్సెస్ అవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో ఏకంగా రూ.104 కోట్లకు పైగా ప్రభుత్వానికి మిగిల్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు దక్కించుకుని ఇళ్ల నిర్మాణ పనులు బేస్మెంట్ లెవల్లో ఉన్నవాటిని గుర్తించి రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న 3,984 ఇళ్లకు సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు గతనెల 28వ తేదీ నుంచి ఈనెల 15వ తేదీ వరకు ఏపీ టిడ్కో రివర్స్‌టెండరింగ్‌కు అవకాశం కల్పించింది. ఈనెల 15వ తేదీ రివర్స్‌టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదా అయిందనే విషయం తేటతెల్లం కానుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లాలో నగరం, పట్టణ ప్రాంతాల్లో పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు లబ్ధిదారుల వాటాతో కలిపి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఓ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. ఇళ్ల నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఏపీ టిడ్కో)కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఒంగోలు నగరంతో పాటు కందుకూరు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, గిద్దలూరు పట్టణాల్లో 300 ఎస్ఎఫ్టీ, 365 ఎస్ఎఫ్టీ, 430 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంతో 13,024 ఇళ్లను నిర్మించేందుకు పనులు కట్టబెట్టారు. అయితే వీటిలో కేవలం 6,628 ఇళ్లు మాత్రమే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 3,984 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో ఉండగా 2,412 ఇళ్లు అసలు మొదలే పెట్టని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లిఫ్ట్‌లు ఏర్పాటు చేయక పోవడం, నిర్మించిన ఇళ్లకు సైతం నీటి సౌకర్యం లేకపోవడం, ఇళ్లలో ఇంటీరియర్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో వీటిని తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరచని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు మిగతా పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు వారి వాటా డబ్బులు చెల్లించడం కానీ, బ్యాంకు రుణాలు పొందడం కానీ చేయకుండా వదిలేశారు. ఇళ్ల నిర్మాణానికి రివర్స్ టెండరింగ్: జిల్లాలో ఒంగోలు నగరంతో పాటు వివిధ పట్టణాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల పనుల్లో రివర్స్‌టెండరింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. దీనికి సంబంధించి ఏపీ టిడ్కో ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. జిల్లాలో మొత్తం 13,024 ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం టెండర్లు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే మూడేళ్లు దాటినా కాంట్రాక్టు సంస్థ కేవలం 6,628 ఇళ్లను మాత్రమే వివిధ దశల్లో నిర్మిస్తుండడంతో ప్రస్తుతం బేస్మెంట్ లెవల్లో ఉన్న 3,984 ఇళ్లకు సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు రివర్స్‌టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రివర్స్‌టెండరింగ్ ప్రక్రియను ఏపీ టిడ్కో ప్రారంభించింది. గత నెల 28వ తేదీ నుంచి ప్రారంభమైన రివర్స్‌టెండరింగ్ ఈనెల 15వ తేదీ వరకు జరగనుంది. 15వ తేదీ ఈ పనులకు సంబంధించి ప్రభుత్వానికి ఎంత ఆదా అయిందనే విషయం స్పష్టం కానుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రెండు రోజుల క్రితం ముగిసిన రివర్స్‌టెండరింగ్‌లో 15 శాతం తక్కువకు టెండర్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. జిల్లాలో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదా అవుతుందనే దానిపై అంతా చర్చించుకుంటున్నారు. రివర్స్‌టెండరింగ్‌కు ఈనెల 15 వరకు గడువు: టిడ్కో ఈఈ వెంకటేశ్వర్లు జిల్లాలో బేస్మెంట్ లెవల్లో ఉన్న 3,984 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.210.87 కోట్ల పనులకు గత నెల 28వ తేదీ నుంచి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించాం. ఈనెల 15వ తేదీ వరకు టెండర్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. మొదటి విడత నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో 15 శాతం వరకు తక్కువ ధరకు టెండర్లు వేయడంతో ప్రభుత్వానికి భారీగా ఆదా అయిన విషయం తెలిసిందే. జిల్లాలో జరిగే రివర్స్ టెండరింగ్‌కు సైతం ఇదే స్థాయిలో ఆదా అవుతుందని ఆశిస్తున్నాం. -
ఘోర రోడ్డు ప్రమాదాలు, ఆరుగురు దుర్మరణం
సాక్షి, నల్లగొండ : రెండు తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నెత్తురోడాయి. ఏపీ, తెలంగాణలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్ర శివారులోని సమ్మక్క సారక్క హోటల్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఓ యువతి చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గరిడేపల్లి మండల కేంద్రంలో ఓ ఇంట్లో వీరన్న దేవుడి పండగ నిమిత్తం తెల్లవారుజామున గ్రామంలో ఊరేగింపుగా పుట్టమట్టి కోసం వెళ్లారు. పుట్ట మన్ను తీసుకొని తిరిగి ఊరేగింపుగా వస్తుండగా వారిపైకి లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మర్రి ఎంకమ్మ, ధనమ్మ చిలుకూరు మండలం బేతవోలు కు చెందిన మట్టమ్మ అనే ముగ్గురు మహిళలు, ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుల్లో మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని హుటాహుటిన హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరగడంతో లారీ డ్రైవర్ నిద్రమత్తులో జనాల పై దూసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఘటనలో ఓ మహిళ మృతదేహం చిందరవందర అయింది . దీంతో పండుగ జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. బైక్‌ను ఢీకొన్న బొలెరో, ఇద్దరు మృతి ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లోడ్‌తో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దుర్గాప్రసాద్ (24). చిన్న దుర్గ (23) మృతి చెందగా, ప్రశాంత్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం అతడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. -
జెండా ఆవిష్కరణలో విషాదం
సాక్షి, ప్రకాశం : ఒంగోలులో పంద్రాగస్టు జెండా ఆవిష్కరణ ఏర్పాట్లులో విషాదం చోటుచేసుకుంది. ఎన్సీసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేస్తుండగా కరెంట్ షాక్‌తో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. జెండా ఎత్తుతుండగా ట్రాన్స్ఫార్మర్కు ఇనుప రాడ్డు తగలడంతో విద్యుదాఘాతానికి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతులు బసంత్ రాణా, అప్పలనాయుడిగా గుర్తించారు. ఇదిలా వుండగా మరో ఘటనలో ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. -
ఏపీని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారు
ప్రకాశం : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరగణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుని సింగపూర్‌లో దాచుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ మంత్రులు దిగజారి మాట్లాడుతున్నారు..వాళ్లు ఆడవారో మొగవారో తెలియటం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు పెట్టిన ఏడేళ్ల తర్వాత ఆయన సతీమణి వైఎస్ భారతిపై కేసు పెట్టడం ఒక కుట్ర అని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌లతో టీడీపీ కుమ్మక్కై విర్రవీగుతున్నారని మండిపడ్డారు. మీ ఇంట్లో వాళ్లను కూడా కోర్టుకు లాగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జగన్‌పై పెట్టిన కేసులు వీగిపోతున్నాయని..అది తట్టుకోలేకే భారతిపై రాద్ధాంతం చేస్తున్నారని తెలియజేశారు. బీజేపీతో కొట్లాడుతున్నట్లు నటిస్తూ టీడీపీ లోలోపల కుమ్మక్కు అయింది.. వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాసం పెడితే తీసుకోలేదు..టీడీపీ పెడితే తీసుకున్నారు..ఇదే కుమ్మక్కుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌ను ఓడించండి అన్న చంద్రబాబు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కౌగిలించుకుంటున్నారు..పదవుల కోసం గాడిద కాళ్లు కూడా పట్టుకునే రకం చంద్రబాబు అని తీవ్రంగా ఎద్దేవా చేశారు. పచ్చపత్రికల అండతో టీడీపీ రెచ్చిపోతుందని, భారతిపై కావాలని బురద జల్లుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇంట్లో వాళ్లను కూడా బయటకు లాగే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. బాబుకు కౌంట్‌డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికినా అరెస్ట్ చేయలేదు..టీడీపీ నేత సుజానా చౌదరీ బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన దొంగ..అలాంటి వారు కూడా భారతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రజల తరపున పోరాటం చేస్తుంటే ఓర్వలేకనే చంద్రబాబు కుట్ర రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యానించారు. -
ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి
ప్రకాశం జిల్లా: ముండ్లమూరు మండలం చిలకలేరు వాగులో ఈతకెళ్లి ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులు ముండ్లమూరు మండలకేంద్రానికి చెందిన శ్రీరామ్(12), అరుణ్(12)లుగా గుర్తించారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లైంగిక దాడి కేసులో జవాన్ అరెస్టు
గిద్దలూరు: మైనర్‌పై లైంగిక దాడి చేసిన కేసులో ఆర్మీ జవాన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సర్కిల్ పోలీసుస్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ వి.శ్రీరామ్ నిందితుల వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పట్టణంలోని కొంగళవీడు రోడ్డులో ఉంటున్న ఆర్మీ జవాన్ గుండాల అభిలాష్ ఈ ఏడాది జనవరిలో సెలవుపై వచ్చి అదే ప్రాంతంలో ఉన్న ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి మాయ మాటలు చెప్పి లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మార్చి 11వ తేదీన ఫోక్సో కేసు నమోదు చేశారు. అప్పటికే నిందితుడు ఆర్మీలో విధుల్లో చేరాడు. అతను పనిచేస్తున్న ఆర్మీ యూనిట్ నుంచి పిలిపించి అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు. సీఐతో పాటు ఎస్ఐ కె.మల్లిఖార్జున ఉల్గొన్నారు. -
ప్రారంభమైన 110వ రోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, చీరాల : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 110వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆయన ఈపురుపాలెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించారు. పాదయాత్ర బేతపూడి, వెదుళ్లపల్లి, వడ్డేపాలెం, మహాత్మాజీపురం మీదగా బాపట్ల వరకూ కొనసాగనుంది. మహాత్మజీపురంలో ప్రజలతో వైఎస్ జగన్ మమేకం అవుతారు. బాపట్లలో బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1,472.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. -
రైతులపై కర్రపెత్తనం..!
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో సుబాబుల్, జామాయిల్ కర్ర కొనుగోలు ఒప్పందానికి పేపరు మిల్లుల యజమానులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఎన్ని ఒప్పందాలు జరిగినా.. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులు చేసిన అగ్రిమెంట్లే అడ్రస్ లేకుండా పోతున్నాయి. చివరకు దళారే కింగ్ అవుతూ చక్రం తిప్పుతున్నాడు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో సామాజిక వనాలు సాగవుతున్నాయి. మరో 10 వేల ఎకరాల్లో సరుగుడు తోటలు సాగవుతున్నాయి. జామాయిల్, సుబాబుల్, సరుగుడు వంటి తోటలను ప్రత్యామ్నాయంగా రైతులు జిల్లాలో సాగుచేస్తున్నారు. ఏటా 40 వేల ఎకరాల్లో సుబాబుల్, జామాయిల్ కర్ర కోతకు వస్తోంది. ఆ సమయానికి పేపరు మిల్లుల యజమానులు గద్ధలా వాలి దోపిడీ రచన చేస్తున్నారు. మార్కెట్లో దళారీలను పెంచిపోషించి రైతులపైకి ఎగదోలడం పరిపాటిగా మారింది. కర్ర కొనుగోలుకు సంబంధించి 1999 నుంచి రైతులకు, పేపరు మిల్లులకు మధ్య ప్రభుత్వం ఆధ్వర్యంలో ధరల ఒప్పందం జరుగుతోంది. పాలకుల సమక్షంలో చేసిన ఒప్పంద ధరను వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సక్రమంగా అమలుచేస్తూ వచ్చారు. అయితే, గత నాలుగు సంవత్సరాలుగా పాత విధానం గతి తప్పింది. కలెక్టర్, రైతులు, ప్రజాప్రతినిధులు, మంత్రుల సమక్షంలో జరిగిన ఒప్పంద ధరలు అమలుకు నోచుకోవడంలేదు. ఏటా రైతులకు కోట్లలో నష్టం... 10–10–2016న ఒంగోలులో కలెక్టర్ సమక్షంలో టన్ను సుబాబుల్ రూ.4,000, జామాయిల్ టన్ను రూ.4,200కు కొనుగోలు చేసే విధంగా ఒప్పందం జరిగింది. ఒప్పందమైతే జరిగిందిగానీ, నేటికీ అమలుకు నోచుకోలేదు. టన్ను జామాయిల్ రూ.2,700, సుబాబుల్ రూ.3,400కు కొనుగోలు చేస్తూ రైతుల పొట్టగొడుతున్నారు. కర్ర తాట తీసి రైతులు తీసుకెళ్తున్నా తక్కువ ధరకే కొనుగోలు చేయడం నిత్య కృత్యమైంది. దీని వలన రైతులకు టన్ను జామాయిల్ కర్రకు రూ.1500, సుబాబుల్ కర్రకు రూ.600 నష్టపోవాల్సి వస్తోంది. ఎకరాకు సరాసరిన జామాయిల్ పంటలో రూ.35,000, సుబాబుల్ కర్రకు రూ.12,000 వరకు దోపిడీ జరుగుతోంది. ఫలితంగా ఏటా సామాజిక వనాల రైతులు కోట్లలో నష్టపోతున్నారు. మీ కోసంలో జేసీకి రైతు సంఘం ఫిర్యాదు రైతులకు జరుగుతున్న అన్యాయంపై జోక్యం చేసుకుని సుబాబుల్, జామాయిల్ ఒప్పంద ధరలపై సమీక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మికి రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్, మండవ శ్రీనివాసరావు, రైతులు కలిసి సోమవారం మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. పేపరుమిల్లుల ప్రతినిధులు, రైతు ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి కొత్త ఒప్పందం చేయాలని కోరారు. లేకపోతే రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోతారని తెలిపారు. -
హుండీలో చేయి ఇరుక్కుపోయి..
సంతమాగులూరు: ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు ఓ దొంగ. ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడో దొంగ. హుండీలో చేయి పెట్టి సొమ్ము నొక్కేసేందుకు యత్నించాడు. హుండీలో చేయి ఇరుక్కుపోవడంతో బుక్కైపోయాడు. బాధతో కేకలు వేస్తూ విలవిల్లాడు. గట్టు రట్టవడంతో అక్కడున్న వారు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
వలస పాలెం
కొనకనమిట్ల, న్యూస్‌లైన్: కొనకనమిట్ల మండలం కాట్రగుంట పంచాయతీలోని వడ్డెపాలెంలో 50 కుటుంబాలు నివశిస్తున్నాయి. గ్రామ జనాభా 250 మంది ఉంటారు. ఊళ్లో చేసేందుకు పనులు లేక యువకులంతా బేల్దారి పనుల కోసం వలస వెళ్తుంటారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే ఊళ్లో ఉండి..మిగిలిన తొమ్మిది నెలలు వలస బాట పడతారు. అయిన వారిని, పొలాలను, ఇళ్లను వదిలిపెట్టి బతుకుదెరువు కోసం హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. వారితో పాటే భార్యా, పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. దీంతో ఊరంతా ఖాళీ అయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కేవలం మూడు కుటుంబాల్లో ఐదుగురు వృద్ధులు మాత్రమే అక్కడుంటున్నారు. ఇళ్లన్నీ తాళాలు వేసి, వీధుల్లో చెట్లుపెరిగి ఉన్నాయి. కొన్ని ఇళ్ల సమీపంలోనూ చెట్లు పెరిగి శిథిలావస్థకు చేరాయి. బేల్దారి పనులకు వెళ్లిన వారు ఏటా ఆగస్టు నెలలో కులదేవత పెద్దమ్మతల్లి జాతర కోసం స్వగ్రామాలకు చేరుకుంటారు. జాతర అనంతరం ఊళ్లో మూడు నెలలపాటు ఉండి..తిరిగి పనుల కోసం వలసెళ్తుంటారు. గ్రామంలోని కోటమ్మ అనే వృద్ధురాలిని ‘న్యూస్‌లైన్’ పలకరించగా..తన గోడు వెళ్లబోసుకుంది. ‘అయ్యా ఊళ్లో పనుల్లేవు. మా ముగ్గురు పిల్లలు బేల్దారి పనులకు వేరే ఊళ్లకు ఎళ్లారు. మా ఆయనకు వచ్చే పింఛను, జీవాలు అమ్ముకోని వచ్చిన దాంతో బతుకుతున్నాం’ అని చెప్పింది. గేదెలు మేపుకుంటూ పాడి ద్వారా జీవనం సాగిస్తున్నామని వేముల పిచ్చమ్మ అనే వృద్ధులు తెలిపింది. మరో వృద్ధురాలు బత్తుల పిచ్చమ్మ ఆరోగ్యం బాగోలేక మంచంపట్టింది. దూరప్రాంతాలకు వలసెళ్లి పనులు చేయలేక ఇక్కడే ఇళ్లు కనిపెట్టుకుని ఉంటున్నట్లు చెప్పింది. అరకొర ఆదాయాలతో కుటుంబాలు గడవటమే కష్టంగా ఉందని..ఇల్లు కట్టుకునే స్థోమత లేక రేకుల షెడ్లు వేసుకుని ఉంటున్నామని కోటమ్మ అనే వృద్ధురాలు తెలిపింది.