ప్రీమియం చెల్లించేందుకు కలెక్టర్‌కు అంగీకార పత్రం అందజేస్తున్న రాంభూపాల్‌రెడ్డి
ఒంగోలు అర్బన్(ప్రకాశం జిల్లా): రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్‌ఎం మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి తన పెన్షన్ సొమ్ముతో వెయ్యి మంది కార్మికులకు బీమా ప్రీమియం చెల్లించేందుకు ముందుకు వచ్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ మేరకు సోమవారం స్పందన భవనంలో అంగీకార పత్రాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్‌కు అందజేశారు. యడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కార్మికులకు బీమా చెల్లిస్తానని అంగీకారం తెలిపారు.
గతంలో రిటైర్‌మెంట్ బెన్ఫిట్స్ మొత్తం రూ.26 లక్షలు స్థానిక పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో సుకన్య సమృద్ధి యోజన ఖాతాల ద్వారా సుమారు 100 మందికి పైగా పేద బాలికలకు జమ చేస్తున్ననాని తెలిపారు. దీనిపై దేశ ప్రధాని కూడా అభినందించిన విషయం గుర్తుచేశారు. సేవా భావంతో రిటైర్డ్ ఉద్యోగి పనిచేయడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. (క్లిక్: 100 మందికి సుకన్య సమృద్ధి యోజన)
Comments
Please login to add a commentAdd a comment