
సాక్షి, చీరాల : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 110వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆయన ఈపురుపాలెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించారు. పాదయాత్ర బేతపూడి, వెదుళ్లపల్లి, వడ్డేపాలెం, మహాత్మాజీపురం మీదగా బాపట్ల వరకూ కొనసాగనుంది. మహాత్మజీపురంలో ప్రజలతో వైఎస్ జగన్ మమేకం అవుతారు. బాపట్లలో బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1,472.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment