సాక్షి, ప్రకాశం జిల్లా: కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీగా జనం వస్తారని ఆశ పడ్డ టీడీపీకి నిరాశే ఎదురైంది. ఊహించిన రీతిలో సభ సక్సెస్ కాకపోవడంతో టీడీపీ నేతలు షాక్ తిన్నారు.
చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తుండగానే జనం కుర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు ఎదురుగా దర్శనమిస్తున్నప్పటికీ తన ప్రసంగాన్ని చంద్రబాబు కొనసాగించారు. తన పాత స్టైల్‌లోనే వెలిగొండ ప్రాజెక్టుకు తానే శిలా ఫలకం వేశానని, తానే ప్రారంభిస్తానంటూ ఊదరగొట్టారు.
పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలంటే చంద్రబాబుకు ముందు నుంచి చిన్నచూపు. తాగునీటికి, సాగునీటికి రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పశ్చిమ ప్రకాశం వైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణానికి రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, పొదిలి పెద్దచెరువుకు సాగర్ నీటి సరఫరా, వైద్యశాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అడిగినా వారిపై కన్నెర్రచేశారు.
ఆయన పాలనలో ఈ ప్రాంతమంతా దుర్భిక్షంగా మారింది. 2019లో అధికారంలోనికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో పాటు, మార్కాపురానికి రూ.475 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం, రూ.720 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు నీటిని అన్నీ గ్రామాలకు అందించే ఇన్‌టెక్‌వెల్ ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, జిల్లా వైద్యశాలలో అభివృద్ధితో పాటు, ఏడుగురు ఉన్న డాక్టర్ పోస్టులను 34 మందికి పెంచారు. 100 బెడ్లను 330 బెడ్ల స్థాయికి పెంచడంతో ఇప్పుడిప్పుడే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది.
ఇదీ చదవండి: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment