KANIGIRI
-
కష్టజీవులపై కర్కశం
కనిగిరి రూరల్: వేకువజామున 4 గంటల సమయం.. కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులపైకి జేసీబీలు, ట్రాక్టర్లు దూసుకొచ్చాయి. వాటి వెనుకే మునిసిపల్, రెవెన్యూ అధికారులు, సచివాయల సిబ్బంది మందీమార్బలంతో చేరుకున్నారు. ఏకంగా 80 మంది పోలీసులను వెంటబెట్టుకొచ్చారు. రహదారుల వెంబడి ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలు, బడ్డీలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో కనిగిరి మునిసిపల్ కమిషనర్ టీవీ రంగారావు కనీస నిబంధనలు పాటించకుండా.. కష్టజీవులపై కర్కశంగా వ్యవహరించారు. తొలుత చెప్పుల బజార్, పామూరు బస్టాండ్ వైపు బడ్డీలను పెకిలించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన చిరు వ్యాపారులను పోలీస్‌లు, మునిసిపల్ సిబ్బందితో అడ్డుకున్నారు. కనీసం తమ బడ్డీల్లో ఉన్న సామగ్రి తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరినా అంగీకరించకుండా జేసీబీలతో నుజ్జునుజ్జు చేశారు. పిండి వంటలు, చెప్పుల దుకాణాలు, సెల్ పాయింట్లు, వాచీ షాపులు, గాజుల షాపులు ఇలా అనేక దుకాణాల్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక వీధి వ్యాపారులు లబోదిబోమన్నారు. మొత్తం మీద చిరు వ్యాపారులకు రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.పోలీస్ పహారాతో దమనకాండ వాస్తవానికి చెప్పుల బజార్‌లోని కొన్ని దుకాణాలు, చర్చి సెంటర్లోని బడ్డీలు తొలగించనున్నట్టు కొంతకాలంగా చర్చ నడుస్తోంది. కానీ.. బుధవారం ఒక్కసారిగా పట్టణంలోని పామూరు రోడ్డు, కందుకూరు రోడ్డు, ఒంగోలు బస్టాండ్ రోడ్డులోని దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు. 50 మంది స్పెషల్ పోలీసులు, 20 మంది పోలీస్ సిబ్బంది, నలుగురు ఎస్సైలు, సీఐలు ఈ దమనకాండలో పాల్గొన్నారు. కమిషనర్ టీవీ రంగారావు, ఆర్డీఓ పి.జాన్ ఇర్విన్, సీఐలు, ఎస్సైలు బడ్డీల తొలగింపును దగ్గరుండి పర్యవేక్షించారు. వ్యాపారుల శాపనార్థాలుబడ్డీల తొలగింపు సందర్భంగా కమిషనర్ రంగారావు వ్యవహరించిన తీరుపై చిరు వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. నోటికాడి కూడును నేలపాలు చేసి, తమ జీవితాలను రోడ్డున పడేసిన వారంతా దుమ్ము కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసమే అధికారులు దమనకాండకు పాల్పడ్డారని ప్రజా సంఘాల నాయకులు నిప్పులు చెరిగారు. చిరు వ్యాపారుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ భరోసా ఇచ్చారు. -
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
-
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
-
వెళ్తూ వెళ్తూ...!
-
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
-
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
-
చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒక్క నెల ఓపిక పట్టండి.. మీ బిడ్డ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా.. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్.. జగన్‌కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపు పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలకు ముగింపేనన్నారు.‘‘రూ.వెయ్యి పెన్షన్‌ను రూ.3వేలు చేసింది మీ బిడ్డ జగన్. 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్ ఇచ్చాడు.. మీ బిడ్డ జగన్.. 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడు. లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్ అడ్డుకున్నాడు. బాబు హయాంలో పెన్షన్ల కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సివచ్చేది. చంద్రబాబు చేసిన పనివల్లే అవ్వాతాతలు ఎండలో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు.. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పెన్షన్లు ఇచ్చాం. అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ పంపించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘‘పెన్షన్ల విషయంలో అవ్వాతాతలకు అన్యాయం జరిగింది. ఆ నెపాన్ని కూడా దుర్మార్గ చంద్రబాబు మనపై నెడుతున్నాడు. పెన్షన్ల విషయంలో రాజకీయం జరుగుతోంది. మీ జగన్ అధికారంలో ఉంటేనే.. పెంచిన అమ్మ ఒడి. మీ జగన్ అధికారంలో ఉంటేనే.. కాపునేస్తం, ఈబీసీ నేస్తం. మీ జగన్ అధికారంలో ఉంటేనే.. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ. మీ జగన్ అధికారంలో ఉంటేనే.. రైతు భరోసా, సున్నావడ్డీ. చంద్రబాబు చేసేవన్నీ మాయలు, కుట్రలు. అప్పుడే సూపర్ సిక్స్‌లో పెన్షన్ హామీని ఎత్తేశాడు. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమే.. లకలకా లకలకా అంటూ పసుపుపతి రక్తం తాగుతాడు’’ అంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనేకనిగిరి సిద్ధమా.. ఎండాకాలమైనా, తీక్షణమైన ఎండలున్నా ఇవేవీ కూడా ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఆత్మీయతలు చూపిస్తూ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, నా ప్రతి అవ్వకూ, తాతకూ, నా ప్రతిసోదరుడికీ, స్నేహితుడికీ.. మీ అందరి ప్రేమానారాగాలకి మీ బిడ్డ చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు.ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుమరో 10 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటే వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి. అదే చంద్రబాబుకు పొ రపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమే. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. మనం వేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని, భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివినేను ప్రతిఒక్కరినీ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. పొరపాటున చంద్రబాబునాయుడు గారికి ఓటు వేస్తే... సాధ్యం కాని హామీలను ఆయన ఇస్తూ.. ఓ వల మాదిరిగా ప్రజల మీద వేస్తాడు. అదే జరిగితే, మళ్లీ చంద్రముఖిని మనమే నిద్రలేపుతాం అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్లీ వదల బొమ్మాలీ వదల అంటూ పశుపతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. వచ్చి రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి రక్తం తాగుతాడని గుర్తుపెట్టుకోవాలి.అవ్వా, తాతల మీద బాణం గురిపెట్టిన బాబుఈ రోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద, నా అవ్వా తాతల మీద, వారి పెన్షన్ల మీద గురిపెట్టాడు. ఆ చంద్రబాబు వారి బృందాన్ని నేరుగా అడుగుతున్నాను... ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, పెన్షన్ల విషయంలో చేస్తున్న అన్యాయాన్ని మీరు చూస్తున్నారు. ఇదే చంద్రబాబు బృందాన్ని నేరుగా అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు... 2019 ఎన్నికల వరకూ, ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత? అని ఈ సభలో నేరుగా అడుగుతున్నాను. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ బాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.వెయ్యి రూపాయిలు కాదా? ఆ పెన్షన్ ఇప్పుడు రూ.3వేలు చేసింది చేసింది ఎవరు? ఆ అవ్వాతాతల పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు అని అడుగుతున్నాను?చంద్రబాబు హయాంలో పెన్షన్లు కేవలం 39 లక్షలు మాత్రమేఓ అవ్వా, ఓ తాత, ఓ అన్నా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా?..ఎన్నికలకు ఆరునెలల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ, వారు వివక్షకు లోనవుతూ కేవలం అరకొరగా 39 లక్షల మందికి మాత్రమే ఇస్తే...మీ బిడ్డ హయాంలో, మీ జగన్ హయాంలో ఈ 58 నెలలుగా ఎంత మందికి పెన్షన్లు ఇస్తున్నాడో తెలుసా?..అక్షరాలా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు.ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా, ఎవ్వరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆ పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అందిస్తున్నాడు. ఈ 57 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. రూ. 3వేల పెన్షన్ అవ్వాతాతలకు మీ బిడ్డే నేరుగా ఇంటికే పంపుతున్నాడు. చంద్రబాబు నాయుడుగారి పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ అందేది. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడ్డాయో అప్పటి నుంచీ అవ్వాతాతలకు అప్పటిదాకా ఇంటివద్దకే అందుతున్న పింఛన్, సూర్యోదయానికి ముందే, ఒకటో తారికు వచ్చే సరికే, అవ్వాతాతల ఇంటికే, మనవలూ మనవరాళ్ల రూపంలో వాలంటీర్లు వచ్చి, చిక్కటి చిరునవ్వులతో గుడ్‌మార్నింగ్ చెబుతూ వారికి మంచి చేసే కాలం... ఈ చంద్రబాబు పాపిష్టి కళ్లు పడేంత వరకూ బాగా కొనసాగింది.ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో, అప్పుడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత, వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదట అని కేంద్ర ఎన్నికల కమీషన్‌కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదు అని... వాళ్లతో ఉత్తర్వులు ఇప్పించాడు.ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగిపోలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఈ పెద్దమనిషి ఏం చేసాడో తెలుసా..అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా, వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. ఎన్నికల కమిషన్ అక్కడ నుండి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఇంతటి ఎండలో క్యూలో నిలబడి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే..ఈ పెద్దమనిషి చంద్రబాబు ...ఆయన దౌర్భాగ్యపు పని చేసి, ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తున్నాడు. చంద్రబాబు, ఆయన దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథలు చూస్తే, ఆంధ్రజ్యోతి, టీవీ5లలో చూస్తే..వీళ్లంతా మనుషులేనా అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు.14 ఏళ్లలో అవ్వాతాతల మీద ప్రేమ చూపించని బాబునేను ఇవాళ మీ అందరికి ఒకటే అడుగుతున్నాను....ఒకటే చెబుతున్నాను. చంద్రబాబు పరిపాలన 14 ఏళ్లు మీరు చూసారు. మీ బిడ్డ 58 నెలల పాలన కూడా చూసారు. ఈ 58 నెలల కాలంలో పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వస్తున్న పరిస్థితులు చూసారు. మీ అందరి సమక్షంలో పెద్దమనిషి చంద్రబాబును నిలదీసి అడుగుతున్నాను. 14 ఏళ్లు పరిపాలన చేసాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసానని తానే చెప్పుకుంటాడు. ఈ 14 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజైనా కూడా ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు అవ్వాతాతల మీద ప్రేమ చూపించడం కానీ, వారి కష్టాలు చూడటం కానీ, వారికి తోడుగా నిలబడాలని కానీ ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతున్నాను.ఏ ఒక్కరోజు కూడా ఆ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికి పంపించిన పరిస్థితులు లేవు. చేసింది మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 57 నెలలుగా చంద్రబాబు కళ్లు పడేంత వరకూ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే అందుతూ ఉంది.మళ్లీ ప్రమాణం చేసిన వెంటనే అవ్వాతాతల కోసమే సంతకంనేను ఇవాళ ప్రతి అవ్వకూ తాతకూ చెబుతున్నాను. అవ్వాతాతా..ఒక్కనెల ఓపికపట్టండి. జూన్ 4వ తారీకు దాకా ఓపికపట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్ట మొదటి రోజే నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతాను అని అవ్వాతాతలకు చెబుతున్నాను. మళ్లీ జూన్ 4వ తారీకునే వాళ్ల మనవలు, మనవరాళ్లుగా వాలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి అవ్వాతాతలకు చిక్కటి చిరునవ్వుతో పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు మీబిడ్డ తెస్తాడు.ఇది నామాట..జగన్ మాట.. మీ బిడ్డ మాటమీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతి పేద కుటుంబం కూడా మళ్లీ వాళ్ల ఇంటికి పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్‌లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ పెంచిన ఆ అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ నా అక్కచెల్లెమ్మలకు ఒక చేయూత, ఒక సున్నా వడ్డీ, నా అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించుకునే కార్యక్రమం, మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ కాపునేస్తం, ఈబీసీ నేస్తం వస్తుంది.మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఓ వాహన మిత్ర, మళ్లీ ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లానేస్తం. మీ జగన్ అధికారంలో ఉంటేనే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, మళ్లీ పిల్లల చేతుల్లో ట్యాబులు, మళ్లీ గవర్నమెంట్ బడుల్లో బైజూస్ కంటెంట్, డిజిటల్ బోర్డులతో, క్లాస్ రూములలో ఐఎఫ్ పీ బోర్డులు, డిజిటల్ బోధన. మళ్లీ జగన్ అధికారంలో ఉంటేనే అక్కచెల్లెమ్మలకు అండగా పూర్తి ఫీజులతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్కచెల్లెమ్మలకు అండగా కళ్యాణమస్తు, షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటే రైతన్నలకు ఓ భరోసా, పెట్టుబడికి సాయంగా పెంచిన రైతుభరోసా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే రైతన్నలకు సున్నావడ్డీ, 9 గంటలపాటు పగటి పూటనే ఉచిత విద్యుత్, ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ. మీ జగన్ అధికారంలో ఉంటే ఓ ఆర్బీకే వ్యవస్థ, ఆ వ్యవస్థలో మెరుగైన సేవలు. ఆలోచన చేయండి...మీ జగన్ అధికారంలో ఉంటేనే నాడునేడుతో బాగుపడే హాస్పటళ్లు, 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఇంటికే జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, గ్రామంలోనే విలేజ్ క్లినిక్...ఇవన్నీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ వాలంటీర్ వ్యవస్థ. మళ్లీ ఇంటికే పౌరసేవలు, మళ్లీ ఇంటికే పథకాలు, ఇంటికే పెన్షన్లు. మళ్లీ బటన్లు నొక్కడం కూడా మీ జగనన్న అధికారంలో ఉంటేనే..నా అక్కచెల్లెమ్మలకు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు, ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వారి చేతుల్లోకి ఆ డబ్బులు వెళ్లిపోవడం జరుగుతుంది.చంద్రబాబు పేరుచెబితే పేదవాడు గుర్తుచేసుకునే ఒక్క స్కీమ్ అయినా ఉందా?మరో విషయాన్ని కూడా గమనించండి. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడుగారు సీఎంగా చేసారు. 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఆ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్కటైనా మంచి ఉందా? అని అడుగుతున్నాను. చంద్రబాబు పేరుచెబితే పేదవాడు గుర్తుచేసుకునే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతున్నాను.బాబు రాకముందే అవ్వాతాతలకు అవస్ధలు14 ఏళ్లు ఏ పేదవాడికీ ఏమీ చేయని చంద్రబాబు...ఇప్పుడు ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూసారా?. సూపర్ సిక్స్‌లో అవ్వాతాతల పెన్షన్ అప్పుడే ఎత్తేసారు. సూపర్ సిక్స్‌లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా?. చంద్రబాబు రాకమునుపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎండనకా, వాననకా తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటున నిజంగా వస్తే, చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.చంద్రబాబు విఫల హామీలుచంద్రబాబు మోసాలు, మాయలు, మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో...ఒక్కసారి మీ అందిరికీ చూపిస్తాను. ఇది మీ అందరికీ గుర్తుందా (టీడీపీ 2014 మేనిఫెస్టో చూపిస్తూ) చంద్రబాబు సంతకం పెట్టి, ముగ్గురు ఫొటోలతో, ముఖ్యమైన హామీలు అంటూ మీ ఇంటికి పంపిన ఈ పాంప్లెట్ గుర్తుందా?. 2014లో ఈ పాంప్లెట్ మీ ఇంటికి పంపించి, ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకుని, గెలిచి 2014 నుంచి 2019లో ఆయన పరిపాలన చేసి, పరిపాలన చేసిన తర్వాత, నేను ఇవాళ అడుగుతున్నాను. ఈ పాంప్లెట్లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని మీరే సమాధానం చెప్పండి. ఈయన చెప్పిన మొదటి హామీ, ముఖ్యమైన హామీ రైతన్నల రుణాలు...మొదటి సంతకంతోటే మాఫీ అన్నాడు. రూ.87,612 కోట్ల రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు.. జరిగిందా? ముఖ్యమైన హామీ...ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన హామీ..పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తా అని చెప్పాడు. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా అని అడుగుతున్నాను..మాఫీ ఎవ్వరికైనా జరిగిందా?. ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు చేసిన మరో ముఖ్యమైన మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహలక్ష్మి పథకం కింద రూ. 25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానన్నాడు. మీకు లేదా మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఆడపిల్లలు పుట్టారు కదా...మీ వాళ్లలో ఎవరికైనా కూడా చంద్రబాబు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసాడా అని అడుగుతున్నాను.మరో ముఖ్యమైన హామీ ఇంటింటికీ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు నిరుద్యోగభృతి ప్రతి నెలా అన్నాడు. ఐదు సంవత్సరాలు అంటే 60 నెలలు, నెలకు రూ.2 వేలు అంటే ప్రతి ఇంటికీ రూ.1,20,000. కనీసం ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నాను. అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా..మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్లూమ్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా..? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు జరిగిందా? సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు జరిగిందా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నాడు జరిగిందా...మన కనిగిరిలో కనిపిస్తోందా?అందరూ ఆలోచన చేయండి.. చంద్రబాబు పంపిన పాంప్లెట్ లో ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?ప్రత్యేక హోదా అమ్మేసిన వ్యక్తి – బాబుపోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదికూడా అమ్మేసాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతామా?. వాళ్లంతా కలిసి ఇప్పుడు ఏమంటున్నారు. ఇదే ముగ్గురు మళ్లీ కలిసి వస్తున్నారు. సూపర్ సిక్స్ అంట నమ్ముతారా? సూపర్ సెవెన్ అంట నమ్ముతారా? ఇంటింటికీ బెంజ్ కార్ అంట నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట...నమ్ముతారా?అబద్దాలకు రెక్కలు కడుతున్న చంద్రబాబుఆలోచన చేయండి...కొత్తకొత్త మోసాలతో, కొత్త కొత్త మేనిఫెస్టోతో అబద్ధాలకు రెక్కలు కట్టి, ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నారో చూస్తున్నారు. ఇలాంటి వాళ్లను, ఇలాంటి మోసాలను, ఇలాంటి అబద్ధాలను, ఇలాంటి రాజకీయాలను విలువలు విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నాను.వివక్ష లేని పాలనకు ఫ్యాను గుర్తుకే ఓటేయండివాలంటీర్లు మీ ఇంటికి రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన బడులు, వారి చదువులు, మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన హాస్పిటళ్లు, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా... ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు.. రెండు బటన్లు అన్నా.. రెండు బటన్లు తమ్ముడు, రెండు బటన్లు చెల్లీ ఫ్యాన్ మీద నొక్కాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.మన గుర్తు.. అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా, మన గుర్తు మరిచిపోయినా.. మన గుర్తు ఫ్యాను. అక్కడ మేడ మీద ఉన్న అక్కలు, అవ్వలు, పెద్దమ్మలు, చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాను. అక్కా మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్నా మన గుర్తు ఫ్యాను, తమ్ముడూ మన గుర్తు ఫ్యాను, అన్నా మన గుర్తు ఫ్యాను, తాత మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ.. మన పార్టీ అభ్యర్ధులపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచాల్సిందిగా మీ బిడ్డ సవినయంగా రెండు చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు అని తెలియజేస్తూ సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్ధి డి నారాయణ, ఒంగోలు లోక్ సభ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు పాల్గొన్నారు. -
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
-
కనిగిరిలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
-
జీవితాంతం సీఎం జగన్‌తోనే ఉంటాను: కనిగిరి ఎమ్మెల్యే
సాక్షి, తాడేపల్లి: పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాదని తాను ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు. నేను జీవితాంతం జగన్‌తోనే ఉంటానని తెలిపారు. సామాన్య కుటుంబ నుంచి వచ్చిన తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని తెలిపారు. కనిగిరిలో కొత్త ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్‌కు పూర్తిగా సహకరిస్తానని మధుసూదన్‌యాదవ్ పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పిన వారి గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు. అందరం కలిసి వైఎస్సార్సీపీ విజయం కోసం పనిచేస్తామని చెప్పారు. కనిగిరి కొండమీద వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సీటిస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలా ఉండనని అన్నారు. సీఎం జగన్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు. ‘టీటీడీలో సభ్యులుగా సీఎం అవకాశం కల్పించారు. నాకు ఇద్దరు దేవుళ్లు, ఒకరు సీఎం జగన్, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి. నా రాజకీయ దేవుడు వైఎస్ జగన్ ఏం చెబితే అది చేస్తా. నామీద ప్రేమతో కొందరు రాజీనామాలు అంటూ హడావుడి చేశారు. కానీ అదేంలేదు. అందరం కలిసి పనిచేస్తాం’ అని తెలిపారు. చదవండి: చంద్రబాబుకు భవిష్యద్దర్శనం -
చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదలి రావాలి?: పేర్ని నాని
-
జగనన్న చెప్పినట్లే.. వచ్చాడండోయ్!
‘‘చంద్రబాబు మోసాల పాలనను చూశాం. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మళ్లీ మీ దగ్గరకు వస్తాడు. కేజీ బంగారం, బెంజ్‌కారు కూడా ఇస్తామని హామీ ఇస్తారు. అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ ప్రజలకు చెబుతూ వస్తున్నారు. ఆ మాట ఇవాళ నిజమైంది. జగనన్న చెప్పినట్లే మోసాల బాబు.. గతంలో కంటే మోసపూరిత హామీల లిస్ట్‌తో మళ్లీ వచ్చాడు. వచ్చాడు.. వచ్చాడు.. వచ్చాడు.. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ప్రకాశం జిల్లా కనిగిరి సభలో చంద్రబాబు ఎన్నికల శంఖారావం పేరిట బహిరంగ సభ పెట్టాడు. ఏదో జరిగిపోయినట్లు.. తెలుగుజాతికి పూర్వ వైభవం తెస్తానంటూ రా కదలి రా పేరుతో బహిరంగ నిర్వహించాడు. ఊహించని రీతిలో అది ఘోరంగా ప్లాప్ అయ్యింది. బాబు ప్రసంగిస్తున్న సమయంలో జనాలు వెళ్లిపోతుంటే.. మరో పక్క ఖాళీ కుర్చీలకే ప్రసంగం వినిపిస్తూ టీడీపీ అధినేత కనిపించారు. అది చూసి ‘‘వార్నీ.. జనసేనతో కలిసి చేసినా సభ ఇలాగేనా జరిగేది’’ అని చెవులు కొరుక్కుంటూ అసంతృప్తిగా కనిపించారు అక్కడి టీడీపీ నేతలు. సరే.. ఇదంతా వేరే విషయం అనుకోండి. ►చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడూ ఇంత బాధపడలేదంట. ఈ క్రమంలో తన సతీమణిని తిట్టారంటూ ఎమోషనల్ డ్రామా ప్లే చేసేందుకు ప్రయత్నించాడాయన. అంతేకాదు.. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని శపథం చేశానని గుర్తు చేసుకున్నాడు. వీటికి తోడు.. గతంలో కంటే ఘోరమైన హామీలను ప్రకటించారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆడబిడ్డలకు రూ.15వేలు.. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు అంట.. అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టుంది చంద్రబాబు వ్యవహారం. పేదలు మహిళల కోసం ఒక్క పథకం పెట్టిన చరిత్ర కూడా చంద్రబాబుకు లేదు కదా. ‘‘అనగనగా ఓ పులి ఉండేది. ఆ పులి మనిషి మాంసం ఒక పద్థతి ప్రకారం రెగ్యులర్‌గా తినేది. సంవత్సరాలుగా నరమాంసం తినేందుకు అలవాటుపడ్డ పులి.. ఏళ్లు గడిచాక ముసలిదైపోయింది. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక పోయింది. ఉన్నచోటే కూర్చుని.. నాలుగు నక్కలను తోడేసుకుంది. మనుషుల్ని ఎలా తినాలనే ప్లాన్ వేసుకుంది. దారిలో ఓ ముడగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగల్ని ఆశ చూపెట్టేది.. ‘‘తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి’’ అంటూ ఊరించేది. ‘‘ఈ పులిని నమ్మాం అంటే.. తినేస్తుంది కదా’’ అని అందరూ నమ్మకుండా పోయారు. కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్ మోస్ట్ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదు. పైగా వయసు పెరిగింది. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదతో ఇరుక్కుంటే.. పులి చంపేసి తినేసేది. ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు ఆడేవారిని, వంచకుల్ని, మాయమాటలు చెప్పేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ కథ వింటే గుర్తొచ్చేది.. అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు.. వేటాడే శక్తి కోల్పోయిన పులి, గుంట నక్కల్నివెంటేసుకుని తిరిగినట్లు ఉంది చంద్రబాబు తీరు. బంగారు కడియం ఇస్తానంటాడు. జాబు రావాలంటే బాబు రావాలంట.. బాబుకు ఎప్పటికీ బుద్ధిరాదని అనిపిస్తోంది. నేను సీనియర్ని, ఇప్పుడు మంచోడ్ని అయ్యాను అంటూ నమ్మించే యత్నం చేస్తాడు. కానీ, చంద్రబాబు లాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదు. పంచతంత్రం కథల్లోని ముసలి పులి లాంటి వాడు మన సీనియర్ మోస్ట్ పోలిటీషియన్. మనిషి మాంసం రుచి మరిగిన పులి మారిందంటే ఎలా నమ్ముతారు?. బంగారు కడియం ఆశచూపి మనుషుల్ని మింగేసే ఆ పులి బాపతే ఈ వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు’’ ►ఇక కనిగిరి సభలో చంద్రబాబు ఎన్నిలక హామీలు ప్రకటిస్తూ.. రైతులకు ఏటా 25 వేలు ఇస్తాడట. మరి.. గత నాలుగున్నరేళ్ల కాలంలో రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన సాయాన్ని చంద్రబాబు అధికారంలో ఉండగా ఎందుకు చేయలేకపోయాడంటారు?. ►నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తాట. ఏడాదికి ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాడట. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, ఉద్యోగం కల్పించేంత వరకు ప్రతి నిరుద్యోగికీ నెలనెలా రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది మరిచిపోయాడా? ►ఇక షరా మాములుగా తనదైన శైలిలో విజన్ 2029 ప్రస్తావన.. అనుభవంతో రాష్ట్రాన్ని బాగు చేస్తానని అనగానే.. బాబోయ్.. ఈ బిల్డప్ బాబు ఇంక మారరా!.. అంటూ అక్కడి నుంచి జనం ఇంటి బాట పట్టారు. అదీ అసలు విషయం.. కిందటి ఏడాది అనంత బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగంలోనిదే ముసలి పులి కథ ప్రస్తావన.. -
కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్
సాక్షి, ప్రకాశం జిల్లా: కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీగా జనం వస్తారని ఆశ పడ్డ టీడీపీకి నిరాశే ఎదురైంది. ఊహించిన రీతిలో సభ సక్సెస్ కాకపోవడంతో టీడీపీ నేతలు షాక్ తిన్నారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తుండగానే జనం కుర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు ఎదురుగా దర్శనమిస్తున్నప్పటికీ తన ప్రసంగాన్ని చంద్రబాబు కొనసాగించారు. తన పాత స్టైల్లోనే వెలిగొండ ప్రాజెక్టుకు తానే శిలా ఫలకం వేశానని, తానే ప్రారంభిస్తానంటూ ఊదరగొట్టారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలంటే చంద్రబాబుకు ముందు నుంచి చిన్నచూపు. తాగునీటికి, సాగునీటికి రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పశ్చిమ ప్రకాశం వైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణానికి రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, పొదిలి పెద్దచెరువుకు సాగర్ నీటి సరఫరా, వైద్యశాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అడిగినా వారిపై కన్నెర్రచేశారు. ఆయన పాలనలో ఈ ప్రాంతమంతా దుర్భిక్షంగా మారింది. 2019లో అధికారంలోనికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో పాటు, మార్కాపురానికి రూ.475 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం, రూ.720 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు నీటిని అన్నీ గ్రామాలకు అందించే ఇన్‌టెక్‌వెల్ ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, జిల్లా వైద్యశాలలో అభివృద్ధితో పాటు, ఏడుగురు ఉన్న డాక్టర్ పోస్టులను 34 మందికి పెంచారు. 100 బెడ్లను 330 బెడ్ల స్థాయికి పెంచడంతో ఇప్పుడిప్పుడే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇదీ చదవండి: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు -
సామాజిక సాధికార బస్సు యాత్రకు అపూర్వ స్పందన కనిపిస్తోంది
-
కనిగిరిలో ఎమ్మెల్యే మధుసూదనరావు ఆధ్వర్యంలో యాత్ర
-
జన హృదయాల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర
కనిగిరి రూరల్: అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ.. తెలుగు పత్రికా రంగంలో సంచలనంగా ఆవిర్భవించి.. అడుగులు ముందుకు వేసిన ‘సాక్షి’ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ ఏట అడుగు పెట్టింది. నిఖార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలిచింది. తెలుగు ప్రజల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర వేసుకుంది. ఈ 15ఏళ్లలో ఎన్నోకథనాలను ప్రచురించింది. అందులో కొన్ని.. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై 2017 జనవరిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో దీక్ష చేపట్టారు. ఆ వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కనిగిరిలో డయాలసిస్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. చదవండి: పూర్తి చేసేది మేమే వైఎస్ జగన్ సీఎం కాగానే ఏకంగా 17 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, ఒంగోలు రిమ్స్‌లో డయాలసిస్ మిషన్ల సంఖ్యను భారీగా పెంచారు. సమస్య మూలాలపై దృష్టి సారించి కృష్ణా జలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో ఏఐఐబీ స్కీం కింద కనిగిరి పట్టణానికి సమగ్ర మంచి నీటి పథకం మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.400 కోట్లతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 442 గ్రామాలకు సురక్షిత జలాలను అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని మంజూరు చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తున్నారు. -
మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు
కనిగిరి పట్టణ అభివృద్ధికి మరో అడుగు ముందుకు పడింది. రెవెన్యూ డివిజన్ కేంద్రం హోదాతో వివిధ ప్రభుత్వ శాఖల సేవలు మరింత చేరువ కాగా.. మూడేళ్లుగా నగర పంచాయతీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరగడంతో తాజాగా నగర పంచాయతీ నుంచి గ్రేడ్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ఫలితంగా మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో అభివృద్ధి నిధుల లభ్యత పెరగనుంది. కనిగిరి రూరల్(ప్రకాశం జిల్లా) : కనకగిరి.. పేరు సార్ధకం చేసుకునేలా కనిగిరి అభివృద్ధికి మార్గం సుగమం అవుతోంది. నియోజకవర్గ కేంద్రమైన కనిగిరి అభివృద్ధిపై ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూదన్ యాదవ్ తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో నిన్న రెవెన్యూ డివిజన్ సాధించగా.. తాజాగా కనిగిరిని నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రెవెన్యూ డివిజన్‌తో అభివృద్ధికి ఊపు: కనిగిరి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారడంతో అనేక ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు ప్రజల చెంతకు చేరాయి.. చేరుతున్నాయి. సుమారు 4 నుంచి 5 కి.మీల దూరం వరకు విస్తరించి ఉన్న కనిగిరిలో కనుచూపు మేరలో భూముల ధరలు పెరిగాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలోని మిగతా మండలాల ప్రజల రాకపోకలు సాగుతుండటంతో వ్యాపారాలు, పెరిగి ఆయా వర్గాల వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పనులకు కందుకూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా కనిగిరిలోనే పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో వ్యయ ప్రయాసలు తగ్గాయి. రెవెన్యూ, వైద్య, విద్య, పోలీస్, మండల పరిషత్ తదితర అంశాల సమస్యలను ఇక్కడే త్వరితగతిన పరిష్కారం అవుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నగర పంచాయతీ–నేడు గ్రేడ్ 2 మున్సిపాలిటీ కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వ శాఖ నుంచి జీఓ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పట్టుబట్టి మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ సహకారంతో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించారు. రాష్ట్రంలో కనిగిరి నగర పంచాయతీ ఒక్కటి మాత్రమే గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కనిగిరి పట్టణం అభివృద్ధిలో మరింత ముందడుగు వేయనుంది. ఈమేరకు మున్సిపాలిటీలో వివిధ శాఖల పోస్టులు పెరగడంతో పాటు, ప్రత్యేక నిధులు వచ్చే అవకాశాలున్నాయి. మారనున్న కనిగిరి రూపు రేఖలు: గ్రేడ్ 2 మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో కనిగిరి రూపు రేఖలు పూర్తి స్థాయిలో మారనున్నాయి. చాలా కాలం పంచాయతీగా ఉన్న కనిగిరి.. ఆ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయింది. అనంతరం కనిగిరి, శంఖవరం, కాశీపురం, మాచవరం పంచాయతీలను కలిపి కనిగిరి నగర పంచాయతీగా చేశారు. నగర పంచాయతీగా హోదా ఏర్పడిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. ఈసారి గ్రేడ్ 2 మున్సిపాలిటీ స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. మూడేళ్లుగా మున్సిపాలిటీ రెవెన్యూ ఆదాయం ఏటా రూ.4 కోట్లు పెరిగినట్లు నగర పంచాయతీ కౌన్సిల్ మున్సిపల్ శాఖకు వెల్లడించడంతో గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. పెరిగిన కౌన్సిల్ హోదా... ఇప్పటి వరకు నగర పంచాయతీ చైర్మన్..మున్సిపల్ చైర్మన్‌గా, నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా హోదా పొందుతారు. ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న పోస్టులు పెరుగుతాయి. అమృత్ సరోవర్ వంటి భారీ నిధుల ప్రాజెక్టులు, ఆర్థిక సంఘ నిధులు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 25 వార్డులుగా మార్చుకొనే అవకాశాలు ఉన్నాయి. (క్లిక్: నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్) సీఎం సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి చేస్తా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సహకారంతో కనిగిరిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా. బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో, సీఎం వద్దకు వెళ్లి కనిగిరిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసుకున్నా. మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, సీడీఎంఏ, సీఎస్ల సహకారంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి కనిగిరిని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా హోదా సాధించుకున్నా. పేదలకు మంచి ఆరోగ్యం, విద్య, సాగు, తాగునీరు అందించడమే నాధ్యేయం. – బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు కనిగిరి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా మారడంలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ చేసిన కృషి ప్రశంసనీయం. ఎమ్మెల్యే ఆదేశానుసారం కనిగిరి పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు పనిచేస్తా. చైర్మన్‌గా తాను, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులంతా ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – అబ్దుల్ గఫార్, చైర్మన్, కనిగిరి మున్సిపాలిటీ -
కన్నీరు పెట్టిన సంగం కాలనీ.. మీడియా అత్యుత్సాహం
సంగం దళితకాలనీ కన్నీరుమున్నీరైంది. ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు చిన్నారులు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో పడి మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు కళ్లముందే ఉన్న ఆ చిన్నారులు అంతలోనే విగతజీవులు కావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. తమ బిడ్డలను ఉన్నంతలో ఉన్నతంగా చదివించాలని తపన పడుతున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చారు. సాక్షి, నెల్లూరు: ఇద్దరు చిన్నారులను కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ మింగేసింది. అప్పటి వరకు తమ కళ్లముందు తిరుగాడిన శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) చిన్నారులు విగతజీవులు కావడంతో దళితవాడ గొల్లుమంది. సంగం గ్రామం దళితవాడకు చెందిన దారా వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెల తర్వాత శ్రీరామ్ (8) జన్మించాడు. వెంకటేశ్వర్లు తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శ్రీరామ్‌ను ఉన్నతంగా చదివించాలని బెంగళూరులో కాపురం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. పని ఉండడంతో మంగళవారం వెంకటేశ్వర్లు, తన కుమారుడు శ్రీరామ్‌తో కలిసి స్వగ్రామం సంగం వచ్చారు. సంగం దళితవాడకు చెందిన గడ్డం ఆదినారాయణమ్మ ఒకగానొక్క కుమారుడు ఈశ్వర్. అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో శ్రీరామ్, ఈశ్వర్, మరో చిన్నారి యక్షిత బహిర్భూమికని సమీపంలోని కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకొని కాలువలోకి దిగిన శ్రీరామ్, ఈశ్వర్ నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలు బయటకు తీయడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. అప్పుడే అన్నంపెట్టి వచ్చా నా కుమారుడు ఈశ్వర్ బడికెళ్లి ఉంటే 11 గంటల సమయంలో వెళ్లి భోజనం పెట్టి వచ్చానని గంట వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. ఒక్కగానొక్క మగబిడ్డను దేవుడు దూరం చేశాడంటూ కన్నీరుమున్నీరు అయింది. – ఆదినారాయణమ్మ, ఈశ్వర్ తల్లి తల్లికి ఏమని చెప్పను బెంగళూరు నుంచి నేను, నా కొడుకు మంగళవారం వచ్చాం. నా భార్య, కూతుర్లు బెంగళూరులోనే ఉన్నారు. ఈ వార్తను నా భార్యకు ఎలా చెప్పాలంటూ కన్నీరు పెట్టుకోవడంతో అందరిని కలిచివేసింది. – దారా వెంకటేశ్వర్లు, శ్రీరామ్ తండ్రి మీడియా అత్యుత్సాహం.. ఇదిలా ఉండగా కనిగిరి రిజర్వాయర్ చిన్నారుల మృతి ఘటనపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. మృతి చెందిన ఈశ్వర్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లగా.. కొన ఊపిరితో ఉన్న శ్రీరాంను 108 లో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ శ్రీరాం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీరాం మృతదేహాన్ని తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌ను మాట్లాడగా.. ఆలస్యం కావటంతో బాలుడి తండ్రి కొడుకు మృతదేహాన్ని బైక్‌పైనే ఇంటికి తీసుకెళ్లాడు. అయితే మరో రుయా ఘటన అంటూ కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో తప్పుగా ప్రచురించాయి. దీనిపై స్పందించిన పోలీసులు మరో రుయా అంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. -
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
కనిగిరి రూరల్: వైఎస్సార్ టీఎఫ్ నాయకుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి కుమారుడి వివాహ వేడుకలు శనివారం కనిగిరిలో వైభవంగా జరిగాయి. స్థానిక పవిత్ర కళ్యాణ మండపంలో జరిగిన వివాహ రిసప్షన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు బుర్రా మధుసూదన్ యాదవ్ హాజరై నూతన వధువరులు విష్ణువర్ధన్‌రెడ్డి, హారితలను ఆశీర్వదించచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్‌గఫార్, వైస్ చైర్మన్ పులి శాంతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులరెడ్డి, జెడ్పీటీసీలు కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, ఒకే రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జి.బొర్రారెడ్డి, ఎస్కే రహీం, ముల్లంగి శ్రీహరిరెడ్డి, పల్లా మాల కొండ్రాయుడు, మండాది కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
నిజమైన రైతులను అవమానిస్తున్నారు
-
కల్లుగీత కార్మికురాలిపై ఎస్ఈబీ సీఐ దాష్టీకం
సాక్షి, పీసీపల్లి: కల్లు అమ్ముకుంటున్న మహిళపై ఎస్ఈబీ సీఐ జులుం ప్రదర్శించారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పీసీపల్లి మండల పరిధిలోని పెదయిర్లపాడులో శనివారం జరిగింది. కనిగిరి ఎస్ఈబీ సీఐ జలీల్ ఖాన్ తన సిబ్బందితో కలిసి గ్రామంలోకి వెళ్లారు. అక్కడ కల్లు విక్రయిస్తున్న పద్మజ, బండ్ల రమేష్, శ్రీనులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రభుత్వ అనుమతితోనే కల్లు విక్రయిస్తున్నామని చెప్పినా వినలేదని, కల్లులో మాదక ద్రవ్యాలు కలిపారంటూ నానా దుర్బాషలాడుతూ రోడ్డు వెంట ఈడ్చుకెళ్లారని పద్మజ అనే కల్లు గీత కార్మికురాలు వాపోయింది. సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన పద్మజను 108లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం శ్రీనును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ వ్యవహారంపై కల్లుగీత కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళ.. అని కూడా చూడకుండా దాడి చేసిన సీఐ జలీల్ఖాన్ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి గ్రామంలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కల్లు విక్రయిస్తున్న వారిని విచారించేందుకు వెళ్లాం. కల్లు విక్రయిస్తున్న వారు బాధ్యతాయుతమైన సమాధానం ఇవ్వకుండా దుర్బాషలాడారు. దీంతో చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మా విచారణలో వారి వద్ద ఎటువంటి మాదక ద్రవ్యాలూ లభించలేదు. – జలీల్ ఖాన్, సెబ్ సీఐ సీఐపై చర్యలు తీసుకోవాలి మహిళ..అని కూడా చూడకుండా విచక్షణా రహితం దాడి చేసిన సీఐ జలీల్‌ఖాన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలి. విధుల నుంచి సస్పెండ్ కూడా చేయాలి. ఫిర్యాదులు వస్తే విచారణ చేయాలేగానీ స్వలాభం కోసం విచక్షణా రహితంగా దాడి చేయడం హేయం. – బ్రహ్మంగౌడ్, కల్లు గీత సంఘ అధ్యక్షుడు, కనిగిరి గాయాలు చూపుతున్న పద్మజ -
కొత్త కారుకు పూజ కోసం వెళుతూ..
కనిగిరి రూరల్: కొత్తగా కొన్న కారు వారి పాలిట యమపాశం అయ్యింది. కారుకు పూజ చేయించేందుకు వెళ్తుండగా మార్గం మధ్యలో మలుపు వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు, కుమార్తె దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. కనిగిరికి చెందిన కుందురు రామిరెడ్డికి కుమార్తె కల్యాణి, కుమారుడు కృష్ణ చైతన్య ఉన్నారు. కనిగిరికే చెందిన పి.వరుణ్‌తో కల్యాణికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 8 నెలల బాబు నాగ ఆద్యంత్‌రెడ్డి ఉన్నాడు. వీరిద్దరూ ఉద్యోగం చేసుకుంటూ లండన్‌లో ఉంటున్నారు. మూడు నెలల క్రితం కనిగిరికి వచ్చారు. ఈ క్రమంలో 12 రోజుల క్రితం రామిరెడ్డి కొత్త కారు కొన్నారు. కారుకు పూజలు చేయించేందుకు రామిరెడ్డి, అతని భార్య మహేశ్వరి, కుమారుడు కృష్ణ చైతన్య, కుమార్తె కల్యాణి, మనవడు నాగ ఆద్యంత్‌రెడ్డిలతో కలిసి కడప జిల్లా పోరుమామిళ్లలోని గుడికి బయల్దేరారు. బయల్దేరిన కొద్దిసేపటికే మార్గం మధ్యలో కనిగిరి మండలం నారపరెడ్డిపల్లి మలుపు వద్ద అతివేగం వల్ల కారు అదుపు తప్పి ప్రమాద సూచిక స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో కల్యాణి (34) అక్కడికక్కడే మృతిచెందగా, కారు నడుపుతున్న కృష్ణచైతన్య (30) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో మృతిచెందాడు. రామిరెడ్డి (60)కి తీవ్ర గాయాలవడంతో ఒంగోలుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. చిన్నారి నాగ ఆద్యంత్‌రెడ్డి, మహేశ్వరి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదు రోజుల క్రితమే అల్లుడు పి.వరుణ్ లండన్‌కు వెళ్లాడు. ప్రమాద విషయం తెలియగానే తిరుగు ప్రయాణమయ్యాడని బంధువులు తెలిపారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతిచెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
పక్కింటి అమ్మాయిని చూశాడని..
సాక్షి, కనిగిరి: జరిగిన అవమానం తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక మంగలిమాన్యంలో గురువారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. కనిగిరి పట్టణం పాతూరు మంగలిమాన్యంలో నివాసం ఉంటున్న రామకృష్ణ (22) తన ఇంటి మిద్దెపై ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఇంటి పక్కనే ఉన్న అమ్మాయిని చూశాడంటూ ఆ అమ్మాయి తల్లి ఇంటిపైకి వచ్చి దుర్బాషలాడింది. అంతేకాకుండా ఆమె అన్న..రామకృష్ణను జూనియర్ కాలేజీ వద్దకు తీసుకెళ్లి తన స్నేహితులతో కొట్టించాడు. అంతేకాకుండా చంపుతామని బెదిరించడంతో రామకృష్ణ అవమానంతో పాటు భయపడి గత నెల 12న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కందుకూరు, ఒంగోలు, గుంటూరు ఆస్పత్రిలకు తరలించారు. అయినా పరిస్థితి విషమించి డిసెంబర్ 29న రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. రామకృష్ణను అవమానించి అతడి మరణానికి కారకులైన వారిని అరెస్టు చేయాలంటూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులకు ప్రజా సంఘాల ఐక్య వేదిక మద్దతు తెలిపింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రామిరెడ్డిలు వచ్చి ఆందోళనకారులకు సర్ది చెప్పారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మృతుడి కుటుంబ సభ్యులు చిన్న, కృష్ణ, ఓబయ్య, నారాయణ, నాగార్జున, అచ్చమ్మ, వరలక్ష్మి, ఐక్యవేదిక నాయకులు పీసీ కేశవరావు, వరలక్ష్మి, వెంకలక్ష్మి, మైమూన్, గురవయ్య, అశోక్ పాల్గొన్నారు. (చదవండి: భారీ కుంభకోణం: రూ.4,837 కోట్లు ఎగవేత) -
కనిగిరిలో స్వల్ప భూకంపం
సాక్షి, కనిగిరి: కనిగిరిలో మంగళవారం రాత్రి 11.09 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. స్థానిక శివనగర్ కాలనీ, సాయిబాబా దేవస్థానం ప్రాంతాలతో పాటు మండలంలోని పేరంగుడిపల్లి గ్రామంలోనూ రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు వెల్లడించారు. నేత్ర దానానికి అందరూ ప్రతినబూనాలి ఒంగోలు సెంట్రల్: మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ భూనాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రతిజ్ఞ పత్రాలను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్నియా దెబ్బతినడం వలన దేశంలో 26 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం 40 వేలు నుంచి 50 వేల మంది కొత్తగా అంధులవుతున్నారని, దేశ వ్యాప్తంగా కేవలం 30 వేల కార్నియాలను మాత్రమే సేకరించి, అంధులకు అమర్చుతున్నట్టు ఆయన చెప్పారు. ఏ వయస్సు వారైనా, బీపీ, సుగర్ ఉన్న వారైనా నేత్రాలను దానం చేయవచ్చని, మరణం సంభవించిన 6 గంటలలోపు నేత్రదానం చేయాల్సి ఉంటుందని వివరించారు. మరణించిన వ్యక్తి నేత్రదానం చేయకపోయినా కుటుంబసభ్యుల ద్వారా చేయవచ్చన్నారు. నేత్రదానం అనేది కేవలం 15 నిమిషాలలో పూర్తి అయ్యే అతి సామాన్య ప్రక్రియ అన్నారు. గత రెండు సంవత్సరాలలో 279 కార్నియాలను జిల్లా వ్యాప్తంగా సేకరించి, నూతనంగా 162 మందికి కార్నియాలను అమర్చిన్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ముందుగా ఆయన ప్రతిజ్ఞ పత్రంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంఘం మేనేజర్ డాక్టర్ శ్రీదేవి ప్రియ, అప్తాల్మిక్ ఆఫీసర్ ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నిద్రమత్తులో డ్రైవర్.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు!
సాక్షి, కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారి 565పై రోడ్డుప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ కారును నడిపించడంతో.. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రైలింగ్‌ను దాటి.. పల్టీలు కొడుతూ.. పంటపొల్లాలోకి దూసుకెళ్లింది. అయితే, ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారు పూణే నుంచి కనిగిరి మండలం మాచవరంలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. -
చెన్నకేశవ ఆలయ ఈవో దుర్మరణం
సాక్షి, కనిగిరి: మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో అందె వెంకట నారాయణరెడ్డి (50) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో ఆయన కారు డ్రైవర్, అంటెండర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కనిగిరి మండలం చల్లగిరిగిల్ల సమీపంలోని ఎస్సీ కాలనీ వద్ద గురువారం ఉదయం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. నారాయణరెడ్డి మార్కాపురం చెన్నకేశవస్వామి ఆలయ రెగ్యులర్ ఈవోగా, వెలుగొండ దేవాలయాల గ్రూపు, భైరవకొన, కనిగిరి గ్రూపు దేవాలయాలకు ఇన్చార్జి ఈవోగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణరెడ్డి కారులో కనిగిరి నుంచి మార్కాపురానికి బయల్దేరారు. కనిగిరి మండలం చల్లగిరిగిల్ల సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎస్సీ కాలనీ వద్ద చప్టాను ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఈవో ఏవీ నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ ముప్పూరి సాయి తేజకు కాలు విరిగింది. అటెండర్ మల్లికార్జున్ తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగ్రాతులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఈ మేరకు ఎస్ఐ జి.శివన్నారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేరుగా వెళ్లి ఉంటే మృత్యువు తప్పేదేమో? ఉద్యోగరీత్యా కనిగిరి ఏరియాలోని దేవాలయలకు ఇన్చార్జి ఈవోగా పనిచేస్తున్న నారాయణరెడ్డి నాలుగు రోజులుగా కనిగిరిలోనే ఉంటున్నారు. బుధవారం ఉదయం దేవదాయ శాఖ కమిషనర్ పద్మతో కలిసి భైరవకొన ప్రాంత అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్లారు. రాత్రి బాగా పొద్దు పోవడంతో కనిగిరిలోనే బస చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే కారులో మర్కాపురం బయల్దేరారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత గదిలో ఏటీఎం కార్డు మరిచిపోయినట్లు గుర్తుకొచ్చి వెంటనే కారును ఆపి వెనక్కి తిరిగి కనిగిరి వచ్చారు. నారాయణరెడ్డి తన గదిలో ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని తిరిగి మార్కాపురం బయల్దేరారు. మార్గమధ్యంలో చల్లగిరిగిల్ల వద్ద మృత్యు ఒడికి చేరారు. తిరిగి వెళ్లకుండా కనిగిరిలోనే ఆగి ఉన్నా.. లేకా తిరిగి వెనిక్కి రాకుండా మార్కాపురం వెళ్లి ఉన్నా మృత్యు ఘడియలు తప్పేవేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిన్నటి వరకు కనిగిరిలో ఈవోగా పనిచేస్తూ ఇటీవల బదిలీల్లో మార్కాపురం వెళ్లిన ఏవీ నారాయణరెడ్డి అందరికి సుపరిచుతుడే. స్నేహశీలిగా పేరొందారు. నారాయణరెడ్డి మృతదేహాన్ని పలువురు నాయకులు, అధికారులు సందర్శించి ఘన నివాళులర్పించారు. సంఘటన స్థలాన్ని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నారాయణరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నారాయణరెడ్డి మృతదేహానికి త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. -
ఆర్టీసీ బస్సు..ఆటో ఢీ
సాక్షి, ప్రకాశం(కనిగిరి) : ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. పొదిలి డిపోకు చెందిన హైదరాబాద్ సర్వీసు బస్సు కనిగిరి వెళుతోంది. చింతలపాలెంకు చెందిన ఆటో కనిగిరి వైపు వెళుతుండగా రెండు వాహనాలు డిపో సమీపంలో ఢీ కొన్నాయి. దీంతో ఆటో నడుపుతున్న చెంచలరాజ్‌కు, ఆటోలో ప్రయాణిస్తున్న తలారి రాజుకు, ఎస్కే నాసర్‌బీ, ఎస్కే మాబులాకు గాయాలయ్యాయి. వీరిలో ఆటో డ్రైవర్‌కు, నాసర్‌బీ, మాబులాకు తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఈమేరకు ఎస్సై ఎస్. శివన్నారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
మూడు రోజులకే అనాథగా మారిన పసిపాప
తల్లి పొత్తిళ్లలో.. వెచ్చని కౌగిలితో.. ముర్రు పాలు తాగుతూ.. అప్పుడే తెరిచిన కళ్లతో తన అమ్మ లోగిళ్లలోని లోకాన్ని వీక్షిస్తూ.. తల్లి జో కొడుతుంటే హాయిగా నిద్రించాల్సి ఆడ శిశువు భూమి పైకి వచ్చి మూడు రోజులకే అనాథగా మారింది. తన ఆకలి తీర్చే దిక్కు లేక.. అమ్మ కౌగిలికి దూరమై.. క్యారు మంటోంది. నిబంధనల ఆటంకంతో వైద్యానికి దూరమై.. ఎవరి అక్కున చేరక.. ఆస్పత్రి గదిలోని కాంతుల వెలుగులో తల్లడిల్లుతున్న ఓ చిన్నారి దీనగాథ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సాక్షి, కనిగిరి: కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్లులో గల ఓ ప్రవేటు ఆస్పత్రిలో ఓ అవివాహిత మూడు రోజుల కిందట ఓ శిశువుకు జన్మనిచ్చింది. తెలిసి చేసిన ‘పాప’మా.. లేక తెలియక చేసిన ‘పాప’మా.. లేక ఆడపిల్ల కావడంతో వదలించుకునేందుకు చేసిన మహా పాపమా తెలియదు కాని.. ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ తల్లికి దూరమైంది. ఆస్పత్రిలోని ఓ ఆయా ఆ బిడ్డను స్థానిక ఓ ప్రవేటు చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించింది. తల్లి దండ్రులు ఎవరు లేరని వదిలేసి వెళ్లారని వైద్యం చేయాలని వైద్యునికి తెలిపింది. ఇంతలో విషయం తెలుసుకున్న సంతానం లేని బాషా దంపతులు ఆ పసి పాపను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. చిన్న పిల్లల వైద్యుడు శిశువును పరీక్షించి.. పాపలో ప్రాణం ఉంది కాని పూర్తి అవయవాలు రూపుదిద్దుకోలేదని, ఒంగోలులోని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆస్పత్రి సిబ్బంది సహకారంతో దత్తత తీసుకోవాలనుకున్న దంపతులు ఆ శిశువును ఒంగోలుకు తీసుకెళ్లారు. అయితే అక్కడ ప్రవేటు ఆస్పత్రుల్లో శిశువును చూపించారు. శిశువును పరీక్షించిన వైద్యులు రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారన్నారు. ఆరోగ్య శ్రీ లో చికిత్స చేయాలంటే తల్లి దండ్రుల పేర్లు నమోదుతో పాటు, పలు నిబంధనలు వర్తిస్తాయని చెప్పినట్లు బాషా దంపతులు తెలిపారు. దీంతో మధ్య తరగతి కుటుంబానికి చెందిన బాషా దంపతులు అంత ఖర్చు పెట్టలేమని ఆదివారం రాత్రి తిరిగి ఒంగోలు నుంచి కనిగిరికి తీసుకోచ్చారు. వారికి శిశువును అప్పగించిన చిన్నపిల్లల ప్రవేటు వైద్యశాలలోనే చేర్పించారు. బరువు కూడా తక్కువగా ఉన్న ఆ శిశువు ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రాణంతో ఉందని డాక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. నిజంగా పురుడు పోశారా.. అబార్షన్ చేశారా? అసలు శిశువు జనం అక్రమమా.. సక్రమమా అనేది అటుంచితే.. పట్టణంలోని గార్లపేట రోడ్డులో గల ఓ ప్రవేటు వైద్యశాలలో నుంచి బయటకు వచ్చింది. అయితే అక్కడ ఆ శిశువు తల్లికి ఆబార్షన్ చేసి బిడ్డను బయటకు తీశారా.. లేకా పూర్తి నెలలు నిండిన తర్వాత పురుడు పోశారు. అనేది ప్రశ్నార్ధకం. నిజంగా బేబి పరిపూర్ణంగా లేక పోవడానికి కారణం ఏమిటి అనేది కూడా చర్చ జరుగుతోంది. తల్లి అవివాహితై.. రహస్య కాన్పు అయినా పరిపూర్ణంగా అవయవాలు లేక పోవడంతో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తల్లిది సీతరామపురం.. అందిన సమాచారం మేరకు ఆ శిశువుకు జన్మనిచ్చిన తల్లి హెచ్ఎం పాడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన అవివాహితగా తెలుస్తోంది. దీనిపై ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీ ప్రసన్నను సాక్షి వివరణ కోరగా విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. చిన్న పిల్లల ఆస్పత్రిలో పాపను తాము చూశామన్నారు. అశిశువుకు పురుడు పోసిన ఆస్పత్రికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. నిబంధనల ప్రకారం ఆ శిశువును స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. ఐసీడీఎస్ అధికారుల ఆధీనంలోకి శిశువు ఆస్పత్రిలో వదిలి వేసిన నవజాత శిశువు(ఆడ)ను ఐసీడీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీఓ సీడీపీఓ లక్ష్మీప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనాథ శిశువుకు అయ్యే వైద్య ఖర్చును వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ప్రధాన కార్యదర్శి ఎస్కే అబ్దుల్ గఫార్ భరాయిస్తానని తెలిపినట్లు సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ప్రస్తుతం పాప పరిస్థితి బాగా లేదని.. వెంటిలేషన్‌పై ఉందన్నారు. కనిగిరి ఆస్పత్రిలోనే ప్రాథమిక చికిత్సలు చేయించి.. వైద్యుల పర్యవేక్షణలో పెద్పాస్పత్రులకు తీసుకెళ్తామని సీడీపీఓ తెలిపారు. -
ప్రైవేట్ చదువులు!
సాక్షి,కనిగిరి: ప్రైవేట్ పాఠశాలల చదువులపై మోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరవడంతో తమ పిల్లల చదువులు బడ్జెట్ చూసుకొని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ ఫీజు, యూనిఫాం, బూట్లు, బ్యాగులు, నోట్ పుస్తకాలు పాఠశాల సరంజామా ధరలు ఆకాశాన్నంటాయి. నెల సంపాదనంతా వెచ్చించినా ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాంకు సరిపోని పరిస్థితి. తాము పస్తులున్నా చదువుకుని తమ పిల్ల భవిష్యత్‌ను బాగు చేయాలనకుంటున్నారు. పిల్లల విద్యోన్నతికి కలలు కనే తల్లిదండ్రులు, తమకు ఉన్నా లేకున్నా చదువులు బడ్జెట్ భారమైనా అప్పోసొప్పో చేసి మోస్తున్నారు. పాఠశాలలు తెరచి పది రోజులు దాటింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులున్నా.. గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో వాటిపై అనాశక్తితో చూపుతూ కొందరు ప్రైవేటు పాఠశాల వైపు మోజు మొగ్గు చూపుతన్నారు. ఫలితంగా పెరిగిన ధరలతో చదువుల కొనుగోళ్లు భారంగా మారి తల్లడిల్లుతున్నారు. అంతేగాక పిల్లలు ఎక్కడ చేర్చారంటే గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారని గొప్పగా చెప్పు కోవడం తల్లిదండ్రులకు గర్వంగా మారింది. మధ్య తరగతి, సామాన్య ప్రజలు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో పిల్లలను చేర్చాలంటే భారీగా బడ్జెట్ సిద్ధం చేసుకోవాల్సిందే. ఈ ఏడాది ఒక్కో నోటు పుస్తకంపై రూ.5 నుంచి రూ.10 వరకు పెంచారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని రకాల పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో బయట మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సుమారుగా 110 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉండగా అందులో 26 వేల మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు అంచనా. కొనసాగుతున్న ప్రైవేట్ దోపిడీ ఏటా పెరుగుతున్న ఈ ఏడాది చదువులు బడ్జెట్ భారీగా పెరిగింది. నర్సరీ, ఎల్‌కేజీల నుంచి ఫీజులు మోత ప్రారంభమవుతుంది. ఇద్దరు..ముగ్గురు పిల్లలు చదువులకు వస్తే మరింత భారంగా మారుతుంది. పాఠశాలలు తెరవడంతో పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రాత పుస్తకాల ధరలు ఆకాశాన్ని అంటాయి. యూనిఫాం ధరలు భారీగా పెరిగాయి. ఇక స్కూల్ ఫీజులు తడిసి మోపెడవుతున్నాయి. ఫీజులు ఒక్కో పాఠశాల స్థాయిని బట్టి ఉంటున్నాయి. బ్రాండెడ్ పేరు ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో భారీగా ఉండగా మిగిలిన వాటిలో కొంత తక్కువగా ఉన్నాయి. గతేడాది కంటే ఫీజులు క్లాసుకు వెయ్యి నుంచి రూ.500 వరకూ పెంచారు. పాఠశాలల స్థాయిని బట్టి ఎల్కేజీ ఫీజు రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకూ ఉన్నాయి. ఇకపై ప్రతి క్లాసుకు రూ.500 చొప్పున పెరుగుతూ వస్తూ పదో తరగతిలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో రూ.18,500 వరకు ఫీజు ఉంది. మిగిలిన పాఠశాలల్లో రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు ఫీజులు ఉన్నాయి. క్లాసును బట్టి అడ్మిషన్ ఫీజు రూ. వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక యూనిఫాం నుంచి మోసినన్ని పుస్తకాలు, బూట్లు, వ్యాన్ ఫీజులు చెల్లించాలి. ప్రతి విద్యార్థికి ఫీజులు మినహా రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చు అవుతోంది. ఏడాదికి పుస్తకాల ధరలు 10 శాతం పెరుగుతున్నాయి. స్కూల్ బ్యాగులు, కంపార్ట్బాక్స్ల ధరలు భారీగా పెరిగాయి. ప్రైవేటు స్కూల్స్‌లో చదువులు చదివించాలనుకొనే తల్లిదండ్రులు డీలా పడుతున్నారు. నెలసరి బడ్జెట్ సరిపోకా పిల్లల కొనుగోళ్లకు అప్పులు చేస్తున్నారు. అయినా పేరు గొప్ప కోసం ప్రైవేటు దోపిడీ గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు. -
కనిగిరిలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, కనిగిరి (ప్రకాశం): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఓటమి భయంతో అనేక చోట్ల గొడవలకు దిగారు. వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్లు, నాయకులపై పలుచోట్ల గోడవ పడ్డారు. పామూరు మండలం వీరభద్రాపురంలో వైఎస్సార్ సీపీ ఏజెంట్ల ఫారాలను టీడీపీ నేతలు లాక్కున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు తిరుగబాటు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో గొడవ రాజుకుంది. ఫారాలు తిరిగి ఇవ్వడంతో పొలింగ్ సాగింది. నర్రమారెళ్లలో టీడీపీ నాయకులు రీసైక్లింగ్‌కు చేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. నిరసన తెలుపుతూ బయటకు వచ్చేశారు. కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అధికారులు రంగప్రవేశం చేయడంతో సమస్య సద్దుమణిగింది. కొడిగుంపలలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులపై దాడికి ప్రయత్నించారు. టీడీపీ అభ్యర్థి ఉగ్ర దౌర్జన్యం వైఎస్సార్ సీపీ నాయకులు, ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, అతని తమ్ముడితో టీడీపీ అభ్యర్థి ఉగ్ర గొడవ పడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులు కూడా తిరుగుబాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువురి మధ్య తోపులాటలు జరిగాయి. పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. దొడ్డిచింతలలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులతో గోడవకు దిగారు. సీఎస్‌పురం మండలం జంగావారిపల్లిలో ఎన్నికల నిర్వాహణలో ఉన్న పోలీసు అధికారి వైఎస్సార్ సీపీ నాయకులే టార్గెట్‌గా వ్యహరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఇలా అనేక చోట్ల అధికార టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు యత్నం చేశారు. ఓటమి భయంతోనే.. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ పట్ల ఓటర్లకు విపరీతమైన అభిమానం ఉండటం.. దానితో పాటు ఏ గ్రామం చూసినా, ఏ బూతు చూసినా వైఎస్సార్ సీపీకే ఓట్లు అధికంగా పడుతున్నట్లు నివేదికలు వస్తుండటంతో టీడీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫ్యాను గాలి జోరుగా వీస్తుండటంతో ఓటమి భయంతో..నిరుత్సాహంతో అనేక చోట్ల గోడవలకు పాల్పడే యత్నం చేశారు. దానిని అన్ని చోట్ల వైఎస్సార్ సీపీ నాయకులు దీటుగా, తెలివిగా ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతల దాడి కనిగిరి: వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి మండలంలోని దిరిశవంచలో జరిగింది. వివరాలు.. దిరిశవంచలో కొంపల రవి ఇటీవల టీడీపీ నుంచి వైస్సార్ సీపీలోకి తన అనుచరగణంతో చేరారు. ఈక్రమంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దిరిశవంచలో వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. రవిపై కోపం పెంచుకున్న టీడీపీ నాయకులు, బంధువులైన వెంకటరావు, రమణయ్య, రమేష్, చిన వీరయ్య మరి కొందరు కలిసి రవి ఇంటిపైకి వెళ్లి దాడి చేశారు. కొంపల రవి ఇంట్లో లేని సమయంలో ఘర్షణ జరిగింది. ఈ మేరకు టీడీపీ నాయకులంతా కలిసి కర్రలు, కతులతో దాడి చేసి రవి తమ్ముడు కొంపల రంగనాయకులను తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో రంగనాయకులు కుడి చెయ్యి మనికట్టు వరకు తెగింది. తీవ్ర రక్తశ్రావం కావడంతో ప్రాథమిక చికిత్స కొసం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు వెంకట్రావ్, రమణయ్య, రమేష్, చిన వీరయ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తక్కళ్ల పాడులో కూడా టీడీపీ నేతలు ఓటమి భయంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై రాళ్లతో దాడి చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులపై దాడికి యత్నం పామూరు: పట్టణంలోని విరువూరు రోడ్డు 269వ బూత్ (ఉర్దూ స్కూల్)లో ఓటు వేసేందుకు వెళ్లిన తనపై టీడీపీ నాయకులు దూషణలకు దిగి దాడికి యత్నించారని, అదేవిధంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఓటర్లు ఓటు వేసుకునేందుకు రాగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుసేన్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎస్కే ఖాదర్‌బాషా, ఫత్తుమస్తాన్ పేర్కొన్నారు. స్థానిక కందుకూరు రోడ్డులోని కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దూషణలకు దిగి, దాడికి యత్నించిన టీడీపీ నాయకులు అబ్దుల్, హాజీ, గౌస్‌బాషా, ఖాదర్‌మొహిద్దీన్, రజాక్, రహిమాన్, ఖాజావలి, ఆర్ఆర్ రఫీ, ఎస్.రఫీలతో పాటు పలువురిపై స్థానిక పోలీసుస్టేషన్లో పిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నాయకుల చర్యలతో ఓటువేసే అవకాశం లేకుండా పోయినట్లు వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగసాని హుసేన్‌రెడ్డి తెలిపారు. నాయకుల మధ్య తోపులాట హనుమంతునిపాడు: తిమ్మారెడ్డిపల్లి పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. అదే తరహాలో దొడ్డిచింతలలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. బండ బూతులు తిట్టుకున్నారు. తిమ్మారెడ్డిపల్లి పోలింగ్ బూత్‌లో తండ్రి ఓటునుకుమారుడు వేస్తానని రావడంతో వైఎస్సార్ సీపీ ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం జరిగింది. -
దీర్ఘకాలిక సమస్యలకు చెక్!
సాక్షి, కనిగిరి (ప్రకాశం): గత సార్వత్రిక ఎన్నికల నుంచి కనిగిరి నియోజకవర్గంలో తిరుగుతున్నా. ఆరు మండలాల్లోని ప్రతి గ్రామంలో పర్యటించా. పార్టీ కార్యక్రమాలతో పాటు సేవాహిత కార్యక్రమాలూ చేశా. ఎందరో పేదలను ఆదుకున్నా. అనాథ పిల్లలను దత్తత తీసుకున్నా. నేను నియోజకవర్గంలో పర్యటించినప్పుడు తాగు, వాడుక నీటి సమస్య అధికంగా ఉందని గుర్తించా. ప్రధానంగా ఫ్లోరైడ్ నీటి సమస్య ఉంది. నేను పీసీపల్లి మండంలో పర్యటించినప్పుడు ఎక్కువ గ్రామాల్లో ఫ్లోరైడ్, కిడ్నీ, క్యాన్సర్ బాధితులు కన్పించారు. ఆయా గ్రామాలపై పూర్తిగా అధ్యాయనం చేశా. ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేక, డయాలసిస్ కేంద్రాలు లేక అనేక మంది యువకులు కిడ్నీ, ఫ్లోరైడ్ వ్యాధితో మరణిస్తున్నట్లు గుర్తించా. సమస్యను మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్ది దృష్టికి తీసుకెళ్లి.. సమస్య తీవ్రతను వివరించా. ఈ మేరకు సమస్యపై ఆయన కూడా తీవ్రంగా స్పందించారు. విషయాన్ని మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్గొండ తర్వాత ఫ్లోరైడ్ సమస్య అత్యధికంగా కనిగిరిలోనే ఉందని, అనేక మంది కిడ్నీ బాధితులు డయాలసిస్ లేక చిన్న వయసులోనే చనిపోతున్నారని, సురక్షిత నీటి జలాలు లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు జగన్మోహన్రెడ్డికి వివరించడంతో ఆయన వెంటనే స్పందించారు. 2017 జనవరి 20న పీసీపల్లి మండలంలో భారీ ధర్నా చేశారు. జగన్మోహన్రెడ్డి చేపట్టిన ధర్నాతో అధికార పార్టీ వెన్నుల్లో వణుకు పుట్టింది. వెంటనే కనిగిరితో పాటు మరో మూడు నియోజకవర్గాలకు డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేశారు. కనిగిరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమే. వైద్యుల కొరతపై దృష్టి కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో సుమారు 9 ఏళ్ల నుంచి మత్తు డాక్టర్ లేడు. గత పాలకులు కనీసం పట్టించుకోలేదు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఆస్పత్రిలో ఆపరేషన్లు జరగడం లేదు. మత్తు డాక్టర్ లేక చిన్న ఆపరేషన్లకు కూడా ఒంగోలు రిఫర్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు డెలివరీ ఆపరేషన్(సీజిరియన్) జరగడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లులు కట్టలేక పేదలు బంగారు అభరణాలు, పుస్తెలు తాకట్టు పెడుతున్నారు. ఇది చాలా బాధాకరం. మత్తు డాక్టర్‌తో పాటు ఇతర డాక్టర్లను నియమించాలని నిరసనలు, ధర్నాలు చేశాం. నేతలు మాటలు వల్లించి తప్పించుకున్నారు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆస్పత్రిలో మత్తు డాక్డర్ నియామకానికి చర్యలు తీసుకుంటా. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తా. పన్నుల భారం నేను పట్టణంలో, నియోజకవర్గంలో ఏ పనిచేసినా ప్రజామోదం, ప్రజాభిష్టం మేరకే పనిచేస్తా. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే పనిచేయను. టీడీపీ ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచింది. ఇంటి, కుళాయి పన్నులను ఒక్క సారిగా రూపాయికి 100 రెట్లు పెంచింది. ప్రజలు నడ్డి విరిచింది. ఇంటి పన్నుల తగ్గించాలని నేను కూడా ప్రజలతో కలిసి పోరాటం చేశా. నేను ఎమ్మెల్యే అయితే ఇంటి పన్నులను క్రమ బద్ధీకరణ చేస్తా. సమస్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిపరిష్కరిస్తా. వ్యాపారం చేసుకునే కొద్దిపాటి స్థలం వరకే ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకుంటా. పెంచిన ఇంటి పన్నులు తగ్గిస్తా. ఉచితంగా సాగర్ నల్లా.. గ్రామాలతో పాటు, పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం అనేకసార్లు ప్రజలు రోడ్డెక్కారు. ప్రత్యేక్షంగా నేను కూడా ప్రజా పోరాటాల్లో పాల్గొని ప్రజల కోసం పోరాటం చేశా. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తెలుసుకున్నా. అందుకే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా సాగర్ నల్లా అందించే కార్యక్రమం చేపడతా. కనిగిరిలోని నాగుల చెరువు, పెద చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మారుస్తా. ప్రతి ఒక్కరికి సురక్షిత నీరు అందిస్తా. నిమ్జ్ కోసం ప్రయత్నం కనిగిరి ప్రాంతానికి నిమ్జ్ ఎంతో అవసరం. నిమ్జ్తోనే పరిశ్రమల స్థాపన జరిగి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. గత పాలకులు నిమ్జ్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కనీసం ముందడగు వేయలేదు. మేము అధికారంలోకి వస్తే నిమ్జ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటా. నిమ్జ్‌కు నిధులు సాధిస్తా. కనిగిరి మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతా. ప్రధానంగా నీటి సమస్య, డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించి తొలి ప్రాధాన్యతగా చర్యలు తీసుకుంటా. శివారు కాలనీల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లస్థలాలిచ్చి, పక్కా ఇళ్లను కట్టిస్తా. అర్హుడైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటా. అవినీతి లేని పాలన అందిస్తా కనిగిరి నియోజకవర్గంలో అవినీతి లేని పాలన అందిస్తా. తాగు, సాగు నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తా. ఏ గ్రామాంలోనూ గొలుసు దుకాణాలు లేకుండా పూర్తిగా నివారిస్తా. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో పీసీపల్లి మండలాన్ని చేర్చడం, మోపాడు రిజార్వయర్‌ను వెలిగొండ జలాలతో నింపేందుకు చర్యలు తీసుకుంటా. నాగార్జున సాగర్ కుడి కాలువను పొడగించి, కనిగిరికి శాశ్వతంగా తాగు, సాగు నీటిని అందిస్తా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తా. - ఎంఎల్ నారాయణ, సీపీఐ అభ్యర్థి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తా. వెలిగొండ, పాలేటిపల్లి, నిమ్జ్ కింద భూముల కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తా. అర్హులైన పేద లందరికి నూర శాతం సంక్షేమ పథకాలు అందచేస్తా. వెనుకబడిన కనిగిరి ప్రాంతం అభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపన కృషి చేస్తా. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చర్యలుతీసుకుంటా. - పాశం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి -
పా‘లేట్’పల్లి రిజర్వాయర్!
సాక్షి, కనిగిరి (ప్రకాశం): బ్రిటీష్ కాలం నుంచి హామీలకే పరిమితమైన పాలేటి రిజర్వాయర్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనిగిరిలో భూమి పూజ చేసి మోక్షం కలిగించారు. నిధుల కేటాయింపు జరిగినా అప్పటి అధికారులు స్థానిక పాలకుల లోపంతో పనులు క్షేత్రస్థాయిలో ముందడగు వేయలేదు. ఆ తర్వాత 2013 ఏప్రిల్ 1న పాలేటిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి అప్పటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య భూమి పూజ చేశారు. అప్పటి ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు విడుదల చేసి మొదటి విడత పనులు ప్రారంభించినా టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండో విడత నిధుల కేటాయింపు జరగలేదు. సుమారు మూడేళ్లుగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రాజెక్టు వ్యయం పెరిగింది. 15 ఏళ్ల క్రితం రూ.5 కోట్లుకాగా రెండోసారి 2012లో రూ.17.8 కోట్లకు పెరిగింది. 2017లో తిరిగి ప్రతిపాదన పంపించగా ప్రస్తుతం రూ.22.67 కోట్లకు వ్యయం చేరింది. గతంలో శాంక్షన్ జరిగిన నిధులే తప్పా చంద్రబాబు హయాంలో కొత్తగా ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. రిజర్వాయర్ గురించి.. ♦ కనిగిరి ప్రాంత ప్రజల చిరకాల వాంఛ పాలేటిపల్లి రిజర్వాయర్ ♦ సుమారు 1,500 ఎకరాల ఆయకట్టుతో ప్రాజెక్టు డిజైన్ రూపొందించారు ♦ పాలేరు వాగు నుంచి పందువగండి, ఎన్.గొల్లపల్లి మీదుగా పాలేటిపల్లిలోకి నీరు చేరుతాయి ♦ ఈ రిజర్వాయర్ నిర్మాణంతో పీసీపల్లి మండలంలో బట్టుపల్లి, పాలేటిపల్లి, తలకొండపాడు, కనిగిరి మండలం రాచగుండ్లపాడు, లింగోజిపురం పంచాయతీల్లో (220 ఎకరాల్లో) పారుదల. సాగు, తాగు నీటికి ఉపయోగం. ♦ ప్రాజెక్టు చెరువు మునకతో కలిపి విస్తీర్ణం 350 ఎకరాలు. కుడికాలువ 10 కిమి, ఎడమకాలువ 4.25 కిమిల పోడవుతో డిజైన్ ♦ ఎడమ కాలువ కింద 510 ఎకరాలు, కుడికాలువ కింద 990 ఎకరాలు ఆయకట్టు జరగని భూ సేకరణ ♦ రిజర్వాయర్‌కు తొట్టి, అలుగు, తూములు, మునక భూములకు 350 ఎకరాల భూసేకరణ జరిగింది. ♦ కుడి, ఎడమ కాలువ నిర్మాణాలను సుమారు 87.38 ఎకరాలు భూసేకరణ జరగాలి ♦ 87 ఎకరాల భూసేకరణలో 57 ఎకరాలు పట్టా భూమికాగా మిగతాది అసైన్డ్ భూమి ♦ 11.7 కిలో మీటర్లు పొడవు, సుమారు 2 మీటర్ల వెడల్పులో కాలువ నిర్మాణం చేపట్టాలి ♦ మూడేళ్ల నుంచి సర్వేలకే పరిమితం కలగని మోక్షం టీడీపీ ప్రభుత్వం హయాంలో పాలేటిపల్లి రిజర్వార్‌కు పనులు పడకేశాయి. 2014కు ముందు శాంక్షనై నిధుల్లేక ఆగిన హెడ్ వర్క్ నిర్మాణ పనులు అరకొరకగా 2016లో పూర్తి చేశారు. ఆ తర్వాత 2017లో రీ ఎస్టీమేషన్ నిధుల శాంక్షన్ చేశారేగానీ కారణాలు ఏమైనా అధికారులు ఎంతమంది మారినా పనులు ముందడగు పడలేదు. సుమారు రూ.7.29 కోట్ల కెనాల్స్ పనులకు నేటికీ టెండర్లు పిలవ లేదు. ఫలితంగా మూడేళ్ల నుంచి ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఆగిన పనులు ♦ రిజర్వాయర్‌కు మంజూరైన రూ.22.67 కోట్లను మూడు దశలుగా ఖర్చు చేయాలి. ♦ ప్రాజెక్టు అలుగులు, కట్ట, తూములు తొట్టి నిర్మాణానికి కొంత, కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి కొంత, మునక భూములకు నష్టపరిహారం చెల్లింపులకు కొన్ని నిధులు కేటాయించారు. ♦ తొట్టిమునక భూములకు నష్టరిహారం చెల్లింపులు రూ.1.88 కోట్లు చెల్లించారు. ♦ తొట్టి, తూము, కట్టలు, అలుగుకు రూ.8 కోట్ల పనులు జరిగాయి. ♦ మిగతా రూ.12 (పెరిగిన వ్యయం) కోట్లతో కుడి, ఎడమ కాలువలు పనులు జరగాలి. -
కనిగిరి బహిరంగ సభలో వైఎస్ విజయమ్మ
-
అందుకే జనంలోకి రావాల్సి వచ్చింది : విజయమ్మ
సాక్షి, కనిగిరి (ప్రకాశం జిల్లా) : ‘20 ఏళ్ల కిత్రం వైఎస్ రాజారెడ్డిని హత్య చేశారు. 9 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పోగొట్టుకున్నాం. ఎవరినీ నిందించనుగానీ వైఎస్సార్ మృతిపై అనుమానాలున్నాయి. 4 నెలల క్రితం నా బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంపాలనుకున్నారు. మొన్న నా మరిది వైఎస్ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపారు. మా కుటుంబం ప్రజల కోసం నిలిచింది. అయినా మా కుటుంబం పట్ల ఎందుకంత పగబట్టారో ఆ దేవుడికే తెలియాలి. ఇలా పరిస్థితుల్లో జనం మధ్యకు నేను రావడానికి కారణం మీపై అభిమానమే’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వమని, రాజన్న రాజ్యం తీసుకొస్తాడని, నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాడని కోరారు. ఇంకా ఆమె ఎమన్నారంటే.. ఒక్కసారి ఆలోచించండి.. ‘మరో 13 రోజుల్లో ఓటేయబోతున్నాం.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోవాలని అందరినీ కోరుతున్నా. నేడు ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్దం జరుగుతోంది. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నాను. వైఎస్సార్ ఆశయాల స్పూర్తితోనే వైఎస్సార్సీపీ పుట్టిందని మీ అందరికీ తెలుసు. వైఎస్సార్ కుటుంబానికి, ప్రజలకు మధ్యన 40 ఏళ్ల అనుబంధం ఉంది. వైఎస్సార్‌లా జగన్ కూడా నిత్యం ప్రజలతోనే ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ సారి అలాంటి పొరపాటుకు తావు లేకుండా చూసుకోవాలి. వైఎస్సార్ లేకపోవడం వల్ల మా కుటుంబానికి వచ్చిన నష్టం కంటే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఎక్కువ అనిపిస్తోంది. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం వైఎస్సార్, జగన్ మంచివాళ్లు. కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు రాగానే.. అన్ని రకాల కేసులు, వేధింపులు మొదలయ్యాయి. మా కుటుంబాన్ని చాలా బాధ పెట్టారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి ఓదార్చాలనుకున్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకున్నారు. వైఎస్సార్ బతికున్నంత కాలం ఏనాడు నేను బయటకు రాలేదు. ఆయన మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల నేను జనంలోకి రావాల్సి వచ్చింది. నా బిడ్డ జగన్‌ను జైల్లో పెట్టారు. నాటి ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజల్లోకి వచ్చాను. వైఎస్సార్ బతికున్నంత కాలం ప్రజలే ముఖ్యమనుకున్నారు. జగన్ కూడా ప్రజలే ముఖ్యమని జనంలో ఉన్నారు. 9 ఏళ్ల కాలంలో కుటుంబంతో గడిపింది చాలా తక్కువ. నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను.. జగన్ ఏదైనా చెబితే అది చేస్తాడు.. ఏదైనా అనుకుంటే అది సాధిస్తాడు. నీచమైన ఆరోపణలు.. నా మరిది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. మా కుటుంబం ఇంట్లో వాళ్లనే కాదు బయట వాళ్లకు ప్రాణమిచ్చే కుంటుంబం. ఐదేళ్లలో ఏం చేశానో చెప్పుకోలేక చంద్రబాబు మాపై ఆరోపణలు చేస్తున్నారు. మా మరిది హత్యకేసులో మేం కోరుతున్న థర్డ్ పార్టీ ఎంక్వైరీ. కానీ సీఎం చంద్రబాబు వినిపించుకోవడం లేదు. ఓటు అడిగే నాయకుడు తాను ఫలానాది చేశాను. ఫలానాది చేయబోతానని చెప్పుకునేలా ఉంటాలి. చెప్పింది చేశాను.. చెప్పనది కూడా చేశానని 2009 ఎన్నికల్లో వైఎస్సార్ ప్రజల మధ్యకు వెళ్లారు. నా పాలన చూసి ఓటు వేయండని ప్రజలను సవినయంగా కోరారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. కొత్త హామీలు ఇవ్వకుండానే 2009లో వైఎస్సార్ ప్రజలను ఓట్లు అడిగారు. ఇవాళ చంద్రబాబు ఎంత సేపు జగన్ జగన్.. అంటూ జపం చేస్తున్నారు. పరిటాల హత్యకేసులో నా కొడుకుపై ఆరోపణలు చేస్తే కొడుకని కూడా చూడకుండా వైఎస్సార్ సీబీఐ దర్యాప్తు చేయించారు. మరి మీరేందుకు మా మరిది హత్యపై సీబీఐ దర్యాప్తు వేయడం లేదు. చంద్రబాబుపై బాంబు దాడి జరిగేతే వైఎస్సార్ అక్కడికెళ్లి ఆయనను ఓదార్చారు. దాడిని ఖండిస్తూ ధర్నా నిర్వహించారు. ఈరోజు మా మరిది హత్యకు గురైతే చంద్రబాబు పుత్రరత్నం పరవశించిపోతున్నారట.. ఎందుకు పరవశించపోతున్నారని అడుగుతున్నా. వెలిగొండ ప్రాజెక్టు వైఎస్సార్ హయాంలో 70 శాతం పూర్తయింది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 98 శాతం పూర్తయింది. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో మిగిలిన పనులు కూడా చేయలేకపోయారు. నవరత్నాలను ప్రతి ఇంటికి అందించాలని జగన్ తపన పడుతున్నారు. 9 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో చూస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. కనిగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగంటి శ్రీనివాసులను ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి.’ అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. -
అందుకే జనంలోకి రావాల్సి వచ్చింది : విజయమ్మ
-
వదల బొమ్మాళీ.. వదల..!
సాక్షి, కనిగిరి (ప్రకాశం): కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు కనిగిరి సీటు విషయంలో సీఎం చంద్రబాబునాయుడు చేదు అనుభవం మిగిల్చారు. దీంతో కనిగిరిలో కదిరితో పాటు ఆయన వర్గీయులు కొద్ది రోజులుగా నిరసన జ్వాలలతో రగిలిపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డిపై పరోక్షంగా అనేక వేదికలపై కదిరి బాబూరావు విమర్శలు గుప్పించిన సంగతి విధితమే. ఒకానొక దశలో తనను కాదని వేరేవారికి టికెట్ ఇవ్వాలంటే పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్న రెడ్డి, కమ్మ, యాదవ, బీసీ కులాల వారు ఉన్నారని, వారిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే తాను గెలిపించుకుని వస్తానని కూడా అధిష్టానానికి ఆయన అల్టిమేటం జారీ చేశారు. కానీ, కదిరి మాటను అధిష్టానం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టడంతో పాటు సర్వేల పేరుతో కదిరికి టికెట్ ఇవ్వకుండా తిరస్కరించింది. ఆయన ఎవరినైతే ఘాటుగా విమర్శించి పార్టీలో చేర్చుకోవడానికి వీలులేదంటూ అడ్డుపడ్డారో అతనికే కనిగిరి టీడీపీ టికెట్ ఇవ్వడంపై కదిరి బాబూరావు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకదశలో తన స్నేహితుడైన నందమూరి బాలకృష్ణతో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించిన కదిరిని చివరకు దర్శికి కేటాయించారు. పార్టీ కోసం ఐదేళ్లుగా ఎంతో కష్టపడిన తనకు అన్యాయం చేశారంటూ అధిష్టానంపై ఆయన ఆవేదన వెళ్లగక్కుతున్నారు. చంద్రబాబుకు వయసు మీదపడటంతో మతిభ్రమించి తనకు కనిగిరి సీటు లేకుండా చేశారంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. కదిరి బాబూరావు పాతగాయాలు మానలేదని మండిపాటు... కనిగిరి టీడీపీ టికెట్‌ను ఉగ్ర నరసింహారెడ్డికి ఇవ్వడంతో ఇప్పటి వరకు కదిరి బాబూరావుపైనే అశలు పెట్టుకున్న ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు సైతం ఉగ్ర వద్దకు తాము వెళ్లలేమంటూ ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో తేల్చి చెప్పారు. రోడ్డెక్కి నిరసనలు కూడా తెలిపారు. మరికొందరు టీడీపీ నాయకులైతే.. ఇక కనిగిరిలో టీడీపీ ఔట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. గతంలో ఉగ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు టీడీపీ క్యాడర్‌ను ఇబ్బంది పెట్టినట్టు వారు వాఖ్యానిస్తున్నారు. ఆ పాత గాయాలు తమకు ఇంకా మానలేదంటూ పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా వాఖ్యానిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఉగ్రను తీవ్రంగా వ్యతిరేకిస్తోందనేది బహిరంగ రహస్యం. ఏది ఏమైనా కనిగిరిని వదిలి కదిరి వెళ్తారా.. లేకుంటే కనిగిరిలోనే పోటీలో ఉంటారా అనేది నామినేషన్ల చివరి రోజు వరకూ ఉత్కంఠకు దారితీయనుంది. కనిగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే యోచనలో కదిరి..? కదిరి బాబూరావు స్వగ్రామమైన శీలంవారిపల్లిలో మంగళవారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో కదిరి ఘాటైన విమర్శలు చేశారు. ‘ఉగ్ర నా సీటును లాక్కున్నాడు. ఇంకా ఏం చేస్తాడోనని టీడీపీ కార్యకర్తలంతా భయపడుతున్నారు. అవేంటో నాకు తెలుసు’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. తాను కార్యకర్తలను వదిలిపోనని.. దర్శిలో తనకు సీటు ఇవ్వడంతో అక్కడ నామినేషన్ వేయడంతో పాటు కనిగిరిలోనూ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తానని ప్రకటించారు. చివరి రోజు వరకూ కనిగిరి స్థానం కోసం పోరాడతానంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఒక దశలో తాను దర్శిలో నిలబడినా ఓడిపోతానని, అదే కనిగిరిలో ఇండిపెండెంట్‌గా వేసినా కనీసం 30 వేల ఓట్లయినా వస్తాయని, అలా చేస్తే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉగ్ర దగ్గరికి వెళ్లడానికి కార్యకర్తలు భయపడుతున్నారని, ఆ విషయం తనకు తెలుసని, ఏం చేద్దాం.. పార్టీ మనకు అన్యాయం చేసిందని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. కదిరి చేసిన ప్రసంగం, అంతర్గత చర్చలు టీడీపీని, ఆ పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేశాయి. -
డబ్బులిచ్చిన వారికే టికెట్లు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు నాయుడు వద్ద పార్టీ ఆఫీసులో ఓ కోటరీ ఉంది. ఆ కోటరీని మేనేజ్ చేసిన వారికే తెలుగుదేశం పార్టీ టికెట్లు. ఇవన్నీ డబ్బులతోనే జరుగుతాయి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. సీటు కావాలంటే ఆ కోటరీని మేనేజ్ చేస్తే చాలని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు ధ్వజమెత్తారు. కనిగిరి టికెట్ ఆశించి భంగపడిన కదిరి మంగళవారం సీఎస్‌పురం మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీపై ప్రెజర్ తెచ్చేందుకే మీటింగ్ పెట్టానన్నారు. మనమీటింగ్ ఇంటలిజన్స్ దాకా వెళ్లిందన్నారు. ఇప్పుడే చంద్రబాబు అనుచరుల నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇస్తామన్నారు, చంద్రబాబు ఎంతమందికి ఎమ్మెల్సీ, మంత్రి పదవులిస్తారని కదిరి ఎద్దేవా చేశారు. ఐవీఆర్ఎస్ కూడా మేనేజ్ చేస్తున్నారని ఉగ్రనరసింహారెడ్డి పై కదిరి పరోక్ష విమర్శలు చేశారు. ఐవీఆర్ఎస్ వలన చంద్రబాబు నాయుడు భ్రమలో ఉంటున్నాడన్నారు. ఉగ్రనరసింహారెడ్డిని 90 శాతం కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని కదిరి చెప్పారు. మొన్నటి దాకా జనార్దన్ హీరో.. ఆయన పిల్లోడయినా దేవుడిని కూడా లెక్కలేకుండా మాట్లాడాడు. ఆ తరువాత ఆమంచి కృష్ణమోహన్, మాగుంటలకు మంచిసీన్ ఇచ్చారని కదిరి చెప్పారు. వారు వెళ్లిన తరువాత ఇప్పుడు బలరామే హీరో. జిల్లాకి హెడ్ అయ్యాడన్నారు. వయస్సు పైబడడంవల్ల చంద్రబాబు భ్రమల్లో పడి మోసపోతున్నాడన్నారు. బాబు ఎప్పుడూ కంప్యూటర్లు అంటాడు. మనుషులు కన్నా కంప్యూటర్లు ఎక్కువా..చంద్రబాబు నాయుడు పెట్టిన టెక్నాలజీని కొందరు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని కదిరి విమర్శించారు. అది ఆయనకు అర్థం కావడంలేదన్నారు. అదేమంటే నా కంప్యూటర్ చూడు, నా డాష్‌బోర్డు చూడు అంటున్నాడు. ఆ కంప్యూటర్లో ఏముంటుందో ఆ దేవుడికి తప్ప అది ఎవరికి తెలియదని కదిరి చంద్రబాబును ఎద్దేవా చేశారు. బాలకృష్ణ ఉన్నాడు ఇబ్బంది ఉండదనే చేశాను. కానీ చంద్రబాబు నాయుడు దేనికి లొంగాడో తెలియదు. నాకు సీటు ఇవ్వలేదని కదిరి వాపోయారు. నన్ను వద్దంటే రెడ్డి అయినా, కమ్మ అయినా పార్టీలో ఉన్నవారికి ఇవ్వాలని చెప్పానన్నారు. 10 రోజుల క్రితం వచ్చిన వారికి టికెట్టు ఎలా ఇస్తాడన్నారు. 95 శాతం సీట్ల మార్పులు ఉండవన్నారు. 24 దాకా ప్రయత్నం చేస్తా ఇక్కడ కూడా నామినేషన్ వేద్దాం ఇండిపెండెంట్‌గా అయినా సరే అన్నారు. రెండుచోట్ల నామినేషన్లు వేస్తానన్నారు. తాను ఇప్పుడు సీటు వద్దంటే దర్శి వేరేవారికి ఇస్తారని కదిరి చెప్పారు. గతంలో ఓఎస్డీగా పనిచేసిన వెంకయ్య చౌదరి నాకు ఫోన్ చేసి ఉగ్రని గెలిపించాలని చెప్పాడన్నారు. ఒక వేళ టికెట్ ఇచ్చిన చోట అంటే ఓడతామనే దర్శికి వెళ్లాలి... గెలిస్తే కార్యకర్తలకు న్యాయం చేయగలను. గెలవకున్నా పార్టీ లో ఉంటే ఇక్కడ ఉగ్ర నుంచి మీకు ఇబ్బంది ఉండదని అన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడం కూడా కరెక్టు కాదన్నారు. వేస్తే 30 వేల ఓట్లు కూడా రాకుండా ఓడిపోతే అసహ్యంగా ఉంటుందన్నారు. భయంతో ఉగ్రనరశింహారెడ్డి ఉదయం 8 గంటలకు వెళ్లి కనిగిరి బీఫాం కూడా తీసుకుని వెళ్లిపోయాడన్నారు. శిద్దా సహకరిస్తానంటే దర్శి వెళ్తానని చెప్పారు. -
ఆరు నెలల్లో వెలుగొండ పూర్తి చేస్తాం: వైవీ
కనిగిరి: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి తాగు, సాగు నీరు అందిస్తామని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో బూత్‌లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రతి కుటుంబానికి రూ. లక్ష నుంచి 5 లక్షల లబ్ది చేకూరుతుందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని, మోసపూరిత హామీలతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు 35 కుటుంబాల వారితో మన నవరత్నాల గురించి వివరించాలని, చంద్రబాబు నాయుడు చేసిన గత హామీలను కూడా వారి వద్ద ప్రస్తావించాలని కోరారు. బీసీ డిక్లరేషన్‌తో ప్రతీ బీసీ కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని, ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ నేత
సాక్షి, పులివెందుల: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది అబ్దుల్ గఫూర్ శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పులివెందులలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో గఫూర్, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి.. పార్టీలోకి వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ కనిగిరి నియోజకవర్గం ఇన్చార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో అబ్దుల్ గఫూర్‌తోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు దాదాపు 500మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే పార్టీ: అమ్మాయిలతో పచ్చనేతల చిందులు!
-
ఎమ్మెల్యే పార్టీ: అమ్మాయిలతో పచ్చనేతల చిందులు!
సాక్షి, కనిగిరి: అసలే కొత్త సంవత్సరం.. కళ్ల ముందు అందమైన అమ్మాయిలు.. ఇంకేముంది అదో అధికారిక కార్యక్రమం అన్న విషయం కూడా మర్చిపోయారు తెలుగు తమ్ముళ్లు. స్టేజిపైన అమ్మాయిలతో చిందులేస్తూ తమను తాము మైమరిచిపోయారు పచ్చ నేతలు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గెస్ట్‌హౌజ్‌లో పార్టీని ఏర్పాటు చేశారు. స్పెషట్ అట్రాక్షన్ కోసం ఓ రికార్డింగ్ డాన్స్ ట్రూప్‌ను కూడా రప్పించారు. ఇంకేముంది తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ఎదురుగానే.. అమ్మాయిలతో కలిసి చిందులేయడం ప్రారంభించారు. టీడీపీ నేతలు భేరి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్న మస్తాన్ కూడా అమ్మాయిలతో చిందులేసిన వారిలో ఉన్నారు. బాధ్యతగల నేతలై ఉండి.. కనీస పద్ధతి పాటించకుండా వ్యవహరించిన టీడీపీ నేతల వైఖరిపై అక్కడికి వచ్చినవారంతా ముక్కున వేలేసుకున్నారు. -
పోలీసుల ఎదుటే టీడీపీ నేతల దౌర్జన్యం..!
సాక్షి, కనిగిరి/ఒంగోలు : కనిగిరిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఆగస్టు 15 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రపై అక్కసు వెళ్లగక్కారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి.. వాటి స్థానంలో టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టుకున్నారని వైఎస్సార్సీపీ నాయకులు వెల్లడించారు. పోలీసుల ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. దౌర్జన్యంపై ప్రశ్నించిన తమపై టీడీపీ నేతలు దాడికి దిగారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి చేస్తున్న పాదయాత్రను తట్టుకోలేకే టీడీపీ ఇలాంటి చర్యలకు దిగుతోందని మండిపడుతున్నారు. -
గంటాపై చంద్రబాబుకు కందుకూరు ఎమ్మెల్యే ఫిర్యాదు
-
ఊసరవెల్లికి కూడా చంద్రబాబు అంటే భయం..
సాక్షి, కనిగిరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తే ఊసరవెల్లి కూడా భయపడుతోందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా జరగని అవినీతి బాబు హయాంలో జరుగుతోందని, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతి ఊరిలో మంచి నీరు దొరకుతుందో లేదో తెలీదు కానీ, మద్యం మాత్రం దొరకుతుందని, ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి డెలివరీ చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. నాలుగేళ్లుగా పెట్రోలు, డీజిల్ మీద బాదుడు కనిపిస్తోందని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రూ.7 ఎక్కువగా ఉందన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కనిగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ‘అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చంద్రబాబు మూడుసార్లు కరెంట్ చార్జీలు పెంచారు. విద్యుత్ బిల్లులకు భయపడి ఇంట్లో టీవీ కూడా ఆన్ చేయలేని పరిస్థితి వచ్చింది. బాబు అధికారంలోకి రాకముందు రూ100 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.500 నుంచి రూ.2వేల వరకూ వస్తోంది. అంతే కాదు రూ.10వేల పెనాల్టీ అంటూ ప్రజలను హింసిస్తున్నారు. పక్కనున్న ఊర్లో బంధువుల ఇంటికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. పండుగ వస్తే టికెట్లు కొత్త సినిమాకు బ్లాక్‌లో అమ్మినట్లు అమ్మతున్నారు. నాన్నగారి హయాంలో రేషన్ దుకాణానికి వెళ్తే అన్ని సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం బియ్యం ఒక్కటే ఇస్తున్నారు. వాటిలో కూడా వేళ్లు పడట్లేదంటూ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు. పండించిన పంటకు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. పొగాకు, కందులు, శనగకు కనీసం గిట్టుబాటు ధర లభించడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జామాయిల్ రైతులకు క్వింటా రూ.4200 ఉంటే ఇప్పుడు రూ. 1800 కూడా రావడం లేదు. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు పూర్తిగా రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్కరికి పూర్తిగా రుణమాఫీ జరిగని పరిస్థితి. తాకట్లు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామంటూ బ్యాంకులు నోటీస్ పంపిస్తున్నాయి. ఇంట్లో ఆడబిడ్డ కన్నీరు పెడితే అది అరిష్టం అంటారు. కానీ చంద్రబాబు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు ప్రతిరోజు కన్నీరు పెడుతున్నారు. ఆయన చేసిన రుణమాఫీ వడ్డీకిందకు కూడా సరిపోలేదు. ఇక అధికారంలోకి రావడానికి యువతను సైతం మోసం చేశాడు. జాబు రావాలంటే బాబు రావాంటూ మభ్యపెట్టాడు. ఇప్పటి వరకూ ఏ ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి చెల్లించలేదు. ప్రతి నిరుద్యోగికి రూ 90 వేలు బాకీ ఉన్నారు. ఎన్నికల సమయంలో పూర్తి రుణమాఫీ చేస్తానన్నారు, నాలుగేళ్లులో ఏ ఒక్కరికి సంపూర్ణ రుణమాఫీ అవలేదు. ప్రకాశం జిల్లాలో 787 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలు ఉన్నాయి. డయాలసిస్ సెంటర్లలో డాక్టర్లు లేని పరిస్థితి ఉంది. ప్రైవేటుగా చేయించుకోవాలంటే వేలాది రూపాయలను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగించడానికి రామతీర్ధం నుంచి కనిగిరికి నీళ్లు తెచ్చిన ఘనత వైఎస్ఆర్దే. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ప్రజా సంక్షేమం కోసం నవరత్నాలు ప్రవేశ పెట్టాం. పేద విద్యార్థులు చదువుకోవడం కోసం ఎన్ని లక్షలైనా భరిస్తాం. హాస్టల్ చార్జీల కింద రూ.20 వేలు ఇస్తాం. చిన్నారులను బడులకు పంపే తల్లి దండ్రలకు రూ.15వేలు ఇస్తాం. అంతేకాకుండా అవ్వా,తాతలకు పింఛన్లును రూ.2వేలకు పెంచుతాం. వయోపరిమితి 60 ఏళ్లకే తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నానని భరోసా ఇస్తున్నా.’ అని అన్నారు. -
95వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
94వ రోజు పాదయాత్ర డైరీ
-
95వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, ఒంగోలు : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. గురువారం ఉదయం ఆయన పెద్దఅలవలపాడు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రామాపురం, గుడేవారిపాలెం క్రాస్, హజీస్ పురం మీదగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర షెడ్యూల్‌ను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. పెద్దఅలవలపాడు వద్ద ముగిసిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెద్దఅలవలపాడు వద్ద వైఎస్ జగన్ తన 94వ రోజు పాదయాత్రను ముగించారు. ఇవాళ ఆయన 13.5 కిలోమీటర్లు మేర నడిచారు. చెరువుకొమ్ముపాలెం, కె.అగ్రహారం, పర్చురివారిపాలెం, వెంగళాపురం క్రాస్ మీదగా పెద్ద అలవలపాడు వరకూ ప్రజాసంకల్పయాత్ర సాగింది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1275.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. -
మరవనేనిని మరిచిపోరు!
వృత్తి పట్ల నిబద్ధత.. కేసులు ఛేదించడంలో ముందంజ.. చురుకుదనంతో నెరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించడంలో తనకు తానే సాటి.. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మేటి.. కనిగిరి సీఐ మరవనేని సుబ్బారావు. క్లిష్టమైన కేసులను సైతం సవాల్‌కు స్వీకరించి నిందితులను కటకటాల వెనక్కి నెడుతూ డీజీపీ వంటి ఉన్నత స్థాయి పోలీసు అధికారి నుంచి ఆయన శెభాష్ అనిపించుకుంటున్నారు. కనిగిరి: సీఐ మరవనేని సుబ్బారావు విధి నిర్వహణలో అటు ఉన్నతాధికారుల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. 2004లో గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు మంచి పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. పదోన్నతి తర్వాత 2013లో సీఐడీ సీఐగా నెల్లూరులో పనిచేశారు. సీఐగా పిడుగురాళ్లలో రెండేళ్లు పనిచేశారు. గురుజాలలో ఎస్ఐగా పనిచేసినప్పుడు ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం మోపి మంచి పేరు గడించారు. ప్రసుత్తం 12 నెలల నుంచి కనిగిరి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. చిరిగిన టికెట్ ముక్కే ఆధారం 2017 ఫిబ్రవరిలో హెచ్‌ఎంపాడు మండలం వేములపాడు ఘాట్ వద్ద కారు దహనమైంది. పక్కనే ఓ మహిళ మృతదేహం ఉండటం అప్పట్లో సంచలనం రేపింది. కారు దహనం సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు సాయంత్రానికి అక్కడికి 100 మీటర్ల దూరంలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు గుర్తించారు. మహిళను పెట్రోల్ పోసి దారుణంగా శరీరం మొత్తం కాల్చేశారు. కేవలం పాదాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదట్లో ఆ రెండు ఘటనలు ఒకే నేరానికి సంబంధించినవిగా భావించారు. కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన సీఐ సుబ్బారావు.. సంఘటన స్థలంలో దూరంగా పడి ఉన్న చిరిగిన బస్సు టికెట్ ముక్కను గుర్తించారు. దాని ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించి రెండు వేర్వేరు ఘటనలుగా నిర్ధారించారు. వారం రోజుల్లో రెండు కేసులనూ చేధించారు. వివాహేతర సంబంధ నేపథ్యంలో గుంటూరుకు చెందిన మహిళను నిందితుడు వేములపాడు ఘాట్ వద్దకు తీసుకొచ్చి పెట్రోలు పోసి కాల్చి దారుణంగా హత్య చేసినట్లు తేల్చారు. నిందితుడికి సైతం సంకెళ్లు వేశారు. దహనమై ఉన్న కారు దొంగతనం చేసి తీసుకొచ్చిందిగా గుర్తించారు. ఆ కేసులో నిందితులను పట్టుకుని ఉప్పగుండూరు, గన్నవరం, విజయవాడ ప్రాంతాల నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన మూడు కార్లను రికవరీ చేశారు. ఈ కేసులో రాష్ట్ర స్థాయిలో పోలీసు శాఖ ఇచ్చే ఏబీసీడీ అవార్డుల్లో ఆయన నాలుగో స్థానంలో గుర్తింపు పొందారు. కేసును ఛాలెంజ్‌గా తీసుకోవడం ఆయన ప్రత్యేకం సంక్లిష్టమైన కేసును ఆయన ఛాలెంజ్‌గా తీసుకుంటారు. పీసీపల్లి మండలం ఇర్లపాడులో చిన్నారి సియోని (5) లైంగికదాడి, హత్య కేసును సీఐ సుబ్బారావు అత్యంత ఛాలెంజ్‌గా తీసుకుని ఛేదించారు. నిందితుడికి కనీసం అధార్‌కార్డు, రేషన్ కార్డులేదు. ఫోన్ సైతం ఉపయోగించడు. నిందితుడు పేరయ్య చిన్నారిని కిడ్నాప్ చేసిన రోజు (జూన్ 20)న తొలుత చిన్నారి సియోని తండ్రితో జరిపిన సంభాషణ విషయాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సుమారు 40 రోజులు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జల్లెడపట్టి కేసును ఒక కొలిక్కి తెచ్చారు. ఆగస్టు 29న గుంటూరు జిల్లా పొన్నూరులో నిందితుడిని సీఐ బృందం పట్టుకుంది. ఈ కేసులో ఎస్పీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. పోలీస్ శాఖ అందించే స్మార్ట్ కాప్ అవార్డును సైతం ఎస్పీ చేతుల మీదుగా తీసుకున్నారు. పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2017 ఏబీసీడీ అవార్డుకు (జూన్, జూలై, అగస్టు)కు సీఐ సుబ్బారావును ఎంపిక చేశారు. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 13న విజయవాడలో అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు చేతులమీదుగా ఏబీసీడీ (అవార్డ్ ఆఫ్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డును సీఐ అందుకున్నారు. అంతేనా.. రాష్ట్రంలోనే సంచలనం రేపిన రాజమండ్రిలో మసీద్ మౌజన్ హత్య కేసును సీఐ రెండు రోజుల్లో ఛేదించారు. కనిగిరి సీఐతో కూడిన బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడు సంఘటన స్థలంలో వదిలిన రాజఖైనీపై గల వేలిముద్రల ఆధారంగా.. సాంకేతికతను వినియోగించుకున్నారు. డిసెంబర్ 30న దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో సాంకేతికతతో పాటు ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన చోరీ ఘటనలు.. కీలకంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించి రెండు రోజుల్లో అనంతపురం జిల్లా ఉరవకొండలో నిందితుడు మణిరత్నం అలియాస్ మణిని పట్టుకున్నారు. దీంతో సీఐ సుబ్బారావుకు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందాయి. ఇటీవల కనిగిరి వచ్చిన ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా సీఐ మరవనేనిని అభినందించారు. -
కనిగిరిలో మరో దారుణం
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో మరో దారుణం వెలుగుచూసింది. విద్యార్థిని ఫై సహ విద్యార్థి అత్యాచార యత్నం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఘటనను మరవక ముందే మరో అమానుషం జరిగింది. పట్టణంలోని కాశిరెడ్డి నగర్లో ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలికి వరుసకు అన్నయ్య అయ్యే నర్సయ్య అనే యువకుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కనిగిరి ఘటన దురదృష్టకరం: నన్నపనేని
సాక్షి, అమరావతి : కనిగిరిలో అత్యాచారయత్నానికి గురైన యువతితో పాటు ఆమె తల్లిదండ్రుల్ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, సీఎం చంద్రబాబు నాయుడి వద్దకు తీసుకువచ్చారు. సీఎంతో ఈ విషయంపై చర్చించిన అనంతరం విలేకరులతో రాజకుమారి మాట్లాడుతూ.. ఇటీవల కనిగిరిలో జరిగిన ఘటన ఈ దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. ముగ్గురు అబ్బాయిలు ఈ అత్యాచార చర్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ సంఘటన మూలాల సేకరణకై సీఎం ఆదేశించారని తెలిపారు. పథకం ప్రకారమే ఆ అమ్మాయిపై అత్యాచార యత్నం చేశారని వెల్లడించారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఘటనకు కారణమైన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. బాధితురాలు చదువుకునేలా పూర్తి ఏర్పాట్లు చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. రూ.10 లక్షలు బ్యాంక్ డిపాజిట్, ఒక ఇల్లు, బాధితురాలు సహా ఆమె తమ్ముడి చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా చట్టాలు కఠినతరం చెయ్యాలన్నారు. -
ఆ మృగాళ్లపై రౌడీషీట్
ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లా కనిగిరి ఘటనలో నిందితులైన ముగ్గురు యువకులపై రౌడీషీట్ తెరిచినట్టు జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఓ యువతిపై అత్యాచార యత్నం చేయడంతోపాటు ఆ దృశ్యాల్ని సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఘటన వెలుగు చూడడం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పేరం సాయిరాం(19), పాశాల కోటేశ్వరరావు అలియాస్ కార్తీక్ (20), శ్రీరామ్ పవన్‌కుమార్(22)లపై రౌడీ షీట్ తెరిచినట్టు ఎస్పీ తాజా ప్రకటనలో వెల్లడించారు. -
అత్యాచారయత్నం ఘటనపై సర్కారు సీరియస్!
-
అత్యాచారయత్నం ఘటనపై సర్కారు సీరియస్!
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తక్షణమే ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఇటీవల మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల భద్రత, సర్కార్ తీసుకుంటున్న చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలకు ఏపీ సర్కారు ఉపక్రమించింది. మరోవైపు అత్యాచారయత్నం ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, అత్యాచారయత్నానికి గురైన బాధితురాలిని, ఆమె కుటుంబసభ్యులను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు నేతలు బుర్రా మధుసూదన్ పరామర్శించారు. అండగా వుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేశారు. కనిగిరిలో స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. యువతి ప్రతిఘటిస్తున్నా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. -
పైశాచికం: కనిగిరిలో కిరాతక ఘటన
-
చెలరేగిన మృగాళ్లు
సాక్షి, కనిగిరి: స్నేహం ముసుగులో ఓ విద్యార్థినిపై యువకులు అత్యాచార యత్నం చేశారు. ప్రతిఘటిస్తున్నా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. కనిగిరిలో ఓ విద్యార్థిని బీఎస్సీ చదువుతోంది. ఆ యువతికి స్థానిక అగ్రహారానికి చెందిన కార్తీక్‌తో పరిచయం ఉంది. కార్తీక్ ఆమెతో మాట్లాడాలని పట్టణ శివారుల్లోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. తనతోపాటు తన మిత్రులు సాయి, పవన్‌ను కూడా రమ్మన్నాడు. వీరితోపాటు యువతి స్నేహితురాలు కూడా వచ్చింది. స్నేహితులే కదా అని వచ్చిన యువతిపై కార్తీక్, సాయి మృగాళ్లలా రెచ్చిపోయారు. ఆమెపై సాయి అత్యాచార ప్రయత్నానికి ఒడిగట్టాడు. ఆ యువతి ప్రాధేయపడుతున్నా వినిపించుకోకుండా, ఏడుస్తున్నా కనికరించకుండా అమానుషంగా ప్రవర్తించాడు. దుస్తులు తీయమంటూ అనాగరికంగా వ్యవహరించాడు. తప్పించుకోవడానికి యువతి ప్రయత్నించినా ‘ఎక్కడికి పోతావు.. తన్నుతా.. చంపుతా.. ఇక్కడే చస్తావు’ అంటూ కార్తీక్ ఆమెను తీవ్రంగా హెచ్చరించాడు. పైగా సభ్య సమాజం తలదించుకునే రీతిలో దీన్నంతా కార్తీక్ వీడియో తీశాడు. యువతి స్నేహితురాలు కూడా వద్దని వారిస్తున్నా ఏ మాత్రం వినిపించుకోకుండా దారుణాతిదారుణంగా వ్యవహరించారు. వెలుగులోకి ఇలా.. వాస్తవానికి ఈ ఘటన గత నెలలో జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి కూడా పరువుతో కూడిన వ్యవహారం కావడంతో మౌనం దాల్చారు. ఇటీవల ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పట్టణంలో కలకలం రేగింది. ఈ మేరకు బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినిపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో సాయి, కార్తీక్, పవన్‌లను అరెస్ట్ చేసినట్లు సీఐ మరవనేని సుబ్బారావు మంగళవారం వెల్లడించారు. సాయి ఏ1, కార్తీక్‌ను ఏ2, పవన్‌ను ఏ3 ముద్దాయిలుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై సెక్షన్ 366, 354, 354బీ, 60, 60ఏ, 34, 376, 307 సెక్షన్ల కింద అత్యాచారయత్నం, అసభ్యకర ప్రయత్నం, బట్టలు ఊడదీయడం, చంపేందుకు ప్రయత్నించడంతోపాటు ఐటీ యాక్ట్ తదితర కేసులు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. ఎస్పీ సీరియస్.. విద్యార్థినిపై చిత్రీకరించిన వీడియో దృశ్యాలు మంగళవారం మీడియాలో రావడాన్ని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటన తీరుపై కనిగిరి సీఐతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముగ్గురు విద్యార్థుల నేర చరిత్ర.. కేసు నమోదు తదితర విషయాలపై అధికారులతో చర్చించినట్లు సమాచారం. -
పెళ్లి ఇంట విషాదం
= అదుపుతప్పి కారు బోల్తా = చిన్నారి దుర్మరణం = నలుగురికి తీవ్ర గాయాలు = వారిలో ఒకరి పరిస్థితి విషమం కనిగిరి: అదుపుతప్పి కారు బోల్తా కొట్టడంతో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన శనివారం కనిగిరిలో జరిగింది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన ఎస్.దుర్గారెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి, బ్రహ్మారెడ్డి, విజయలక్ష్మి, రమాదేవి, చిన్నారులు బ్రహ్మణి, చరణ్‌లు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నాయుడుపల్లి వివాహానికి కారులో వస్తున్నారు. పెళ్లి కుమారుడు సందీప్‌రెడ్డి.. దుర్గారెడ్డికి వరుసకు బావమరిది (మేనమామ కొడుకు). ఈ మేరకు పెళ్లి కుమారుడి తరఫున ఇస్నాపూర్ నుంచి కారులో పెళ్లికుమారుడు బావ దుర్గారెడ్డి, బాబాయ్ శ్రీనివాసులురెడ్డితో పాటు మొత్తం ఏడుగురు కారులో పెళ్లి కమార్తెకు పథానం తీసుకుని వస్తున్నారు. మార్గమధ్యంలో కనిగిరి నగర పంచాయతీ కాశిరెడ్డి నగర్ వద్ద చప్టా గుంతను కారు గుద్దుకుని మూడు పల్టీలు కొట్టింది. కారు వేగంగా ఉండటంతో రోడ్డు పక్కనే ఉన్న గ్రామ సూచిక బోర్డు దిమ్మెను పగులగొట్టుకుని వెళ్లి మరో దిమ్మెను ఢీకొని ఆగింది. కారును దుర్గారెడ్డి నడుపుతుండగా కాకర్ల శ్రీనివాసులురెడ్డి, బ్రహ్మణి ముందు కూర్చొన్నారు. ప్రమాదంలో బ్రహ్మణి కారుకింద పడి అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాసులురెడ్డితో పాటు వెనుక కూర్చున్న బ్రహ్మారెడ్డి, విజయలక్ష్మి, బాలుడు చరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. రమాదేవి, దుర్గారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న శ్రీనివాసులురెడ్డిని ఒంగోలు తరలించారు. ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుర్గారెడ్డి కుమార్తె బ్రహ్మణి మృత్యు ఒడికి చేరడంతో తండ్రి రోదనలు చూపరుల హృదయాలను కలచి వేశాయి. అప్పటి వరకూ తన పక్కనే కూర్చుని ఉన్న కుమార్తె క్షణాల వ్యవధిలో కన్నుమూయడంతో ఆ తండ్రి తల్లిడిల్లిపోయాడు. దుర్గారెడ్డి, అశ్విని దంపతులకు బ్రహ్మణి పెద్ద కుమార్తె. వీరందరిదీ దుత్తలూరుకాగా 20 ఏళ్ల కిత్రం బేల్దారి పనులకు హైదరాబాద్ వలస వెళ్లారు. వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులురెడ్డి, మండల అధ్యక్షుడు సంగు సుబ్బారెడ్డిలు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రును హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. -
కనిగిరిలో ఆర్టీసీ బస్సు బీభత్సం
కనిగిరి: ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలోలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని కనిగిరి బస్టాండ్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మతుడు ప్రసాద్(45)గా గుర్తించారు. -
ఇరిగినేని కన్నుమూత
కనిగిరి: పోరాటాల పురిటి గడ్డ పై మరో తార రాలింది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి.. కమ్యునిస్టు భావాలతో విద్యార్థి దశలోనే రాజకీయ అరంగేట్రం చేసి సర్పంచ్‌గా, సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా అనేక పదవులు అలంకరించిన నేత ఇరిగినేని తిరుపతి నాయుడు అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులోని స్వగృహంలో కన్నుమూశారు. పామూరు మండలం మోపాడు ఇరిగినేని స్వగ్రామం. నర్సలనాయుడు, లక్షమ్మ దంపతులకు 1–07–1937లో ఇరిగినేని తిరుపతినాయుడు జన్మించారు. నాటి కమ్యునిస్టు ఉద్యమనేత గుజ్జుల యల్లమందారెడ్డికి ఇరిగినేని శిష్యుడు. ఇరిగినేని సతీమణి లక్ష్మమ్మ 1959లో మోపాడు సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత కమ్యునిస్టు అభిమానిగానే 1964లో సర్పంచ్‌గా ఎన్నికై, 16 ఏళ్లకు పైగా సర్పంచ్‌గా పనిచేశారు. 1981లో సమితి ఎన్నికల్లో ఇరిగినేని మిత్రపక్షాల అభ్యర్థిగా నిలబడి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోళ్ల తిరుపతినాయుడుపై అత్యధిక మెజార్టీతో సమితి అధ్యక్షునిగా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావంతో 1982లో ఇరిగినేని టీడీపీలో చేరి, జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 1983 అసెంబ్లీ ఎన్నికలకు ముక్కు కాశిరెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇరిగినేని ప్రతిపాదించి తన మద్దతునిచ్చారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బి.రామసుబ్బారెడ్డిపై కాశిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1985లో ఉప ఎన్నికలు వచ్చాయి. అప్పడు ఇరిగినేని కూడా టీడీపీ ఎమ్మెల్యే టికెట్టును ఆశించారు. కానీ టీడీపీ అధిష్టానం కాశిరెడ్డికే టికెట్ ఇచ్చింది. దీంతో ఇరిగినేని టీడీపీకి రాజీనామా చేసి ఏనుగు గుర్తుపై స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 1,540 ఓట్లతో ఇరిగినేని పై కాశిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఇరిగినేని 1987లో కాంగ్రెస్‌పార్టీలో చేరి, ఆపార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాశిరెడ్డిపై ఇరిగినేని గెలిచారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఇరిగినేనిపై కాశిరెడ్డి విజయం సాధించారు. తరువాత 1999, 2004 ఎన్నికల్లో రెండు దఫాలు వరుసగా ఇరిగినేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉండి 2009లో ఉగ్ర నరసింహారెడ్డి గెలుపునకు కృషిచేశారు. మారిన రాజకీయ పరిణామాలతో 2014 ఎన్నికల్లో కదిరిబాబురావుకు తన మద్దతు పలికి గెలుపులో కీలక పాత్ర పోషించారు. నిరాడంబర జీవితమే ఇరిగినేని మార్క్ రాజకీయం : దాదాపు 40 ఏళ్లకుపైగా రాజకీయ జీవితం గడిపి సర్పంచ్‌గా, సమితి అధ్యక్షునిగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా పదవులను అలంకరించినా.. నిరాడంబర జీవితంతో ఇరిగినేనిప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. ఇరిగినేని అనగానే పాతపడిన అద్దె భవనం.. గదిలో నవారు మంచం.. దానిపై పాత దుప్పటి.. మూలన ఓ చిన్నపాటి కూలర్ ఇక్కడి ప్రజలకు గుర్తొస్తుంది. ఎమ్మెల్యే దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా..ప్రత్యర్థి పార్టీ వాడై.. తనకు ఓటు వేయక పోయినా తన వద్దకు వచ్చి సమస్య తెలిపితే కాదనకుండా సాయం చేసే నైజం ఇరిగినేనిది. అందుకే ఆయనను ప్రతిపక్ష పార్టీల వారు సైతం కనిగిరి పెద్దాయనగా పిలుస్తారు. మాట ఇచ్చిన వారి కోసం ఎందాకైనా.. రాజకీయ, ఉద్యోగ మరే ఇతర విషయాల్లో నైనా సరే.. ఒక్కసారి ఇరిగినేనితో అభయం పొందితే వారి కోసం ఎంతవరకైనా పోరాడి సాధించే నైజం ఆయనది. అందుకే నేటికీ ఇరిగినేనికి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఓ వర్గం ఉంది. పలువురు ప్రముఖుల నివాళి ఇరిగినేని తిరుపతినాయుడు భౌతిక కాయాన్ని పలు వురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ బుర్రా మధుసూదన్ యాదవ్, కనిగిరి, కొండపి ఎమ్మెల్యేలు కదిరిబాబురావు, బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ బీద రవీచంద్రయాదవ్, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దివి శివరాం, ఏఎంసీ చైర్మన్లు దారపనేని చంద్రశేఖర్, టి.వెంకటేశ్వర్లు, రామయ్య చౌదరి, జెడ్పీటీసీ సభ్యుడు దంతులూరి ప్రకాశం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వైఎం ప్రసాద్‌రెడ్డి, కేటీఆర్ విద్యా సంస్థల అధినేత కుందురు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు ఎస్కే గఫార్, కర్నాటి వెంకటరెడ్డి, కనిగిరి, పామూరు, సీఎస్‌పురం ఎంపీపీలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఇరిగినేని స్వగ్రామం మోపాడులో సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజానాయకుడు ఇరిగినేని ఒంగోలు అర్బన్: ప్రజా మన్ననలు పొందిన నాయకుడు ఇరిగినేని తిరుపతి నాయుడని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇరిగినేని మృతి పట్ల ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ శాసనసభ్యుడు ఇరిగినేని తిరుపతినాయుడు మృతి కనిగిరి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరిగినేనితో తమ కుటుంబానికి పాతిక సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. వైఎస్సార్ తో ఇరిగినేని అనుబంధం.. ఇరిగినేని తిరుపతినాయుడు ఆరంభం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మనిషిగా గుర్తింపు పొందారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగినేని విన్నపం మేరకు 2008 ఆగస్టులో వైఎస్సార్ కనిగిరికి వచ్చి ప్రజలను ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించేందుకు రూ.175 కోట్ల కనిగిరి రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. మొదటి విడత నిధులు రూ.91 కోట్లు మంజూరు చేశారు. తిరుపతినాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డితో కలిసి కనిగిరి మంచినీటి సమస్య పరిష్కారానికి, పేదలకు పక్కాగృహాల నిర్మాణానికి కృషి చేశారు. -
ఈ తెలుగు తమ్ముళ్ల డ్యాన్స్ చూస్తే అవాక్కే!
-
కూలిన పెంకుటిల్లు..ఒకరి మృతి
-
కూలిన పెంకుటిల్లు..ఒకరి మృతి
కనిగిరి(ప్రకాశం జిల్లా): కనిగిరి మండలకేంద్రంలోని ఎనిమిదవ వార్డులో ఓ పెంకుటిల్లు బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఖైరూన్ బీ(60) అనే వృద్ధురాలు మృతిచెందగా.. ఆమె మనవరాలు హసీనాకు తీవ్రగాయాలయ్యాయి. హసీనాను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి బాగా నాని కూలి ఉంటుందని భావిస్తున్నారు. -
భార్య, పిల్లలను కడతేర్చిన కర్కోటకుడు
కనిగిరి: కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యను గొంతు బిగించి కిరాతకంగా చంపిన ఓ కర్కోటకుడు తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రి పాలయ్యాడు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని చింతలపాలెం గ్రామంలో మంగళవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు... చింతలపాలేనికి చెందిన తమ్మినేని శ్రీనివాసులరెడ్డి మొదటి భార్య సుబ్బులు 15 ఏళ్ల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి ఇద్దరు సంతానం నాగార్జున, ప్రవల్లిక ఉన్నారు. పదేళ్ల క్రితం బాపట్ల మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన అప్పిరెడ్డి రెండో కుమార్తె ఆదిలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు గణేష్(7), కుమార్తె భవాని(5) ఉన్నారు. భర్త, అత్త తరచూ గొడవ పడుతుండటంతో ఇద్దరు పిల్లలతో కలసి ఆదిలక్ష్మి మర్రిపుడిలోనే కూలి చేసుకుంటూ జీవించేది. చెడు వ్యసనాలకు, తాగుడుకు బానిసైన శ్రీనివాసులరెడ్డి అప్పుడప్పుడు మర్రిపూడి వచ్చి వెళ్లేవాడు. ఈక్రమంలో తర చూ భార్య, భర్తలు కీచులాడుకొనేవారు. పది రోజుల క్రితం భార్య పిల్లలను తాను జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మబలికి చింతలపాలేనికి తీసుకొచ్చాడు. మంగళవారం వేకువజామున మిద్దెపై నిద్రిస్తున్న భార్య, పిల్లలను నైలాన్ తాడుతో గొంతు బిగించి చంపాడు. ఆ తర్వాత తాను కూడా నిద్ర మాత్రలు మింగాడు. తెల్లవారినా ఎవరూ కిందికి రాకపోవడంతో మొదటి భార్య కుమార్తె ప్రవల్లిక పైకి వెళ్లి చూసింది. అక్కడి పరిస్థితి చూసి భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులురెడ్డిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. తాను పలువురికి బాకీ ఉన్నానని, వాటిని తీర్చాల్సిందిగా కోరుతూ ఘటనకు ముందు శ్రీనివాసరెడ్డి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తల్లిదండ్రులను బాకీ తీర్చాల్సిందిగాను, మొదటి భార్య పిల్లలిద్దర్నీ బాగా చదువుకోవాల్సిందిగా రాశాడు. -
భార్యాబిడ్డలను కడతేర్చిన కసాయి
తాగుడుకు బానిసైన వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవ పడుతూ వేధించేవాడు. బాధలు పడలేక భార్య పుట్టింటికి వెళ్లి బిడ్డల్ని పోషించుకుంటోంది. భార్య దగ్గరకువెళ్లి తాను మారిపోయూనని, ఇకపై బాగా చూసుకుంటానని నమ్మబలికాడు. అత్తమామలు తొలుత సంశయించినా కూతురికి సర్దిచెప్పి అల్లుడి వెంట సాగనంపారు. పదిరోజులు గడవలేదు. నిద్రిస్తున్న భార్యా బిడ్డల్ని తాడుతో గొంతు బిగించి కర్కశంగా చంపేశాడు. ఆపై తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చింతలపాలెం గ్రామంలో మంగళవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. * తాడుతో గొంతు బిగించి ఒకరి తర్వాత మరొకరి హత్య * తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం * ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నిందితుడు * కనిగిరి నగర పంచాయతీ చింతలపాలెంలో ఘటన కనిగిరి (ప్రకాశం జిల్లా) : కనిగిరి నగర పంచాయతీ చింతలపాలేనికి చెందిన తమ్మినేని శ్రీనివాసులరెడ్డి(అయోధ్య)కి సుబ్బులుతో మొదటి వివాహమైంది. ఇద్దరు పిల్లలు నాగార్జున, ప్రవళిక పుట్టిన తర్వాత 15 ఏళ్ల క్రితం సుబ్బులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత పదేళ్ల క్రితం బాపట్ల మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన అప్పిరెడ్డి ద్వితీయ కుమార్తె ఆదిలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి గణేష్(7), భవాని(5) పుట్టారు. భర్త వేధింపులు తాళలేక ఆదిలక్ష్మి పుట్టింటికి వెళ్లి ఉంటుంది. శ్రీనివాసులరెడ్డి 20 రోజుల క్రితం మర్రిపూడి వెళ్లాడు. భార్యా పిల్లలను ఇకపై జాగ్రత్తగా చూసుకుంటానని అత్త, మామలను నమ్మించాడు. కూతురు సంసారం కోసం ఈనెల 20న అల్లుడితో చింతలపాలేనికి సాగనంపారు. బ్యాంకులో దాచి ఉంచిన బంగారు ఆభరణాలు, నగదును కూడా ఆదిలక్ష్మి వెంట తీసుకె ళ్లింది. కర్కశంగా కడతేర్చాడు.. సోమవారం రాత్రి సుమారు 10 గంటల తర్వాత శ్రీనివాసులరెడ్డి ఇంటికి వచ్చాడు. భార్య ఆదిలక్ష్మి ఇంటి మిద్దెపై పడుకొంది. ఇద్దరు పిల్లలు నాయనమ్మ పిచ్చమ్మ దగ్గర కింద పడుకున్నారు. పెద్ద కుమార్తె ప్రవళిక(వికలాంగురాలు) కూడా ఇంట్లో కిందనే పడుకుంది. పథకం ప్రకారం తెల్లవారు జామున మిద్దెపైకి వె ళ్లి నిద్రిస్తున్న భార్య గొంతుకు తాడు బిగించి చంపాడు. ఆ తర్వాత కుమార్తె భవాని, కుమారుడు గణేష్‌ను ఒక్కొక్కరిని మిద్దెపైకి తీసు కెళ్లి గొంతు బిగించి కడతేర్చాడు. ఆ తర్వాత బీపీ, మత్తుమాత్రలు కలిపి మింగేశాడు. రోజు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసే పిన్నమ్మ, ఆడుకునే పిల్లలు కిందకు రాక పోవడంతో మిద్దె పైకి వెళ్లి చూసింది. అక్కడి దృశ్యాలు చూసి భయపడి కేకలు పెట్టుకుంటూ కిందికి వచ్చింది. ఇరుగు పొరుగు వారు వె ళ్లి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసులరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు తీసుకెళ్లారు. ఆదిలక్ష్మి బంధువుల ఆందోళన.. ఘటన విషయం తెలుసుకున్న ఆదిలక్ష్మి బంధువులు హుటాహుటిన చింతలపాలెం చేరుకున్నారు. ఈ హత్యల్లో శ్రీనివాసులరెడ్డితో పాటు అతని బంధువుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించకుండా అడ్డుకున్నారు. చివరకు సీఐ యు.సుధాకర్‌రావు నచ్చజెప్పి మృతదేహాలను కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెడువ్యసనాలకు బానిసైన శ్రీనివాసులరెడ్డి భార్యాపిల్లలను హతమార్చినట్లు తెలుస్తోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు. సూసైడ్ నోట్ లభ్యం.. ఆస్పత్రి పాలైన శ్రీనివాసులరెడ్డి వద్ద ఓ సూసైడ్ నోట్ దొరికింది. అందులో కొందరికి తాను బకాయి ఉన్నట్లు రాసి, వాటిని తీర్చమంటూ తల్లిదండ్రులకు సూచించాడు. భార్యాబిడ్డలను చంపి, తానూ చనిపోతున్నట్టు పేర్కొన్నాడు. మొదటి భార్య పిల్లలను బాగా చదువుకోమని, తమ చావుకు ఎవరూ కారకులు కాదని పేర్కొన్నాడు. లేఖలో ఉదహరించిన అప్పులు మొత్తం కలిపినా లక్షన్నర రూపాయలు కూడా లేవు. ఇల్లు, పొలం ఉన్న శ్రీనివాసులరెడ్డి ఈ మాత్రం బాకీకే చనిపోవాల్సిన అవసరం లేదని, ఈ ఘటనకు బలమైన కారణం ఏదో ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
సహస్ర బాబాయే సూత్రధారి...
కనిగిరి/విజయవాడ: ప్రకాశం జిల్లాలో గురువారం కిడ్నాప్ అయిన చిన్నారి సహస్ర కేసును పోలీసులు ఛేదించారు. కనిగిరిలో నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న సహస్రను సొంత బాబాయే కిడ్నాప్ చేశాడు. దీంతో సహస్ర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా వారు 24 గంటలు గడవకముందే కిడ్నాప్ డ్రామాకు తెరదించి చిన్నారిని రక్షించారు. కృష్ణాజిల్లా విజయవాడలో కిడ్నాపర్లను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు కావడంతో చిన్నారి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉందని, అక్కడ ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశారు. ఇంటి ముందు ఆడుకుంటుండగా బ్లాక్ పల్సర్ బైక్‌పై హెల్మెట్లు పెట్టుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేశారు. అనంతరం కిడ్నాపర్లు చిన్నారి తల్లిదండ్రులకు పలుమార్లు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారని, అయితే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పవద్దని బెదిరించారు. దీంతో సహస్ర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకుని, చిన్నారిని క్షేమంగా విడిపించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో తమ చిన్నారి క్షేమంగా బయటపడిందని సహస్ర తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆర్థిక లావాదేవీల కారణంగానే సహస్రను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. -
ఏడేళ్ల బాలిక కిడ్నాప్
కనిగిరి (ప్రకాశం) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్‌కు గురైన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం రేపింది. స్థానిక కొత్తపేటకు చెందిన సహస్ర(7) అనే చిన్నారి గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. బ్లాక్ పల్సర్ బైక్‌పై హెల్మెట్లు పెట్టుకొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు అపహరించుకెళ్లారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు కావడంతో చిన్నారి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుండగా.. ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. -
ట్రాక్టర్, లారీ ఢీ : నలుగురి మృతి
కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చినఈర్లపాడు గ్రామం వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, సుమారు 10 మందికి గాయాలు అయ్యాయి. పెళ్లి బృందంతో వెంగళాపురం గ్రామానికి వెళుతున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో గుంటూరు జిల్లా ఫిరంగిపురంకు చెందిన నర్సింహులతోపాటు ఆరో తరగతి విద్యార్థి నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రాగమ్మ అనే మహిళ ఒంగోలు ఆస్పత్రిలో మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రవీణ్ అనే వ్యక్తి మృతి చెందాడు. -
ఉద్యోగం రాలేదని వరుడు పరారీ: ఆగిన పెళ్లి
హైదరాబాద్: డీఎస్సీలో ఉద్యోగం రాలేదని ఓ పెళ్లి కొడుకు ముహూర్తం సమయంలో అదృశ్యమయ్యాడు. దీంతో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తెలుగు తమ్ముళ్లతో స్టెప్పేసిన మహిళా ఎంపీడీవో
ఒంగోలు : ఓ ప్రభుత్వ అధికారిణి ... టీడీపీ నేతలతో కలిసి నృత్యం చేసిన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. వేదిక పక్కనే ఏర్పాటు చేసిన పాట కచ్చేరి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు చిందులేశారు. సీఎస్ పురం ఎంపీడీవో మహాలక్ష్మీ ఉత్సాహంగా ...తెలుగు తమ్ముళ్లతో పోటీ మరీ డాన్స్ చేశారు. అధికారులు రాజకీయ నాయకులతో కలిసి స్టెప్పులేయడాన్ని చూసి స్థానికులు అశ్చర్యపోయారు. -
టీడీపీ నాయకుల స్టెప్పులు కేక..!
-
కనిగిరిలో హైడ్రామా
కనిగిరి : కనిగిరిలో శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ- కాంగ్రెస్ నేతల వ్యవహరించిన తీరుతో ప్రజలు నవ్వుకున్నారు. వివరాలు.. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్లు విసురుకున్నారు. గురువారం ముహూర్తం కూడా పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి కార్యకర్తలతో ర్యాలీగా బయల్దేరి వస్తుండగా అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు పోలీసులు వారిని అడ్డగించి అరెస్టు చేశారు. దీంతో బహిరంగ చర్చకు తెర పడింది. బహిరంగ చర్చకు వచ్చే నాయకుడు ఐదుగురు లేదా పది మంది కార్యకర్తలతో వస్తారని, ఇలా అధిక సంఖ్యలో కార్యకర్తలతో రావడం కేవలం ప్రచారం కోసమేనన్న విమర్శలూ మాజీ ఎమ్మెల్యేపై వెల్లువెత్తాయి. ఈ మొత్తం ఘటనతో ఇరుపార్టీల నేతల తీరు ప్రజలకు వినోదాన్ని పంచింది. నగర పంచాయతీ కార్యాలయం వద్దకు ర్యాలీగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే ఉగ్రతో పాటు మరి కొందరు కార్యకర్తలను స్థానిక సుగుణావతమ్మ సెంటర్లో పోలీసులు అరెస్తు చేశారు. తమ నాయకులను విడిచి పెట్టాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుస్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదర గొట్టారు. మళ్లీ కొద్ది సేపటికి కాంగ్రెస్ కార్యకర్తలు బస్సులు ఆపే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని గుంపులను చెదర గొట్టారు. ముందస్తు చర్యగా మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో పాటు మరో 29 మందిని అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై వదిలినట్లు సీఐ సుధాకర్‌రావు తెలిపారు. అనంతరం ఉగ్ర నరసింహారెడ్డి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. శాంతియుతంగా వెళ్తున్న తమను పోలీసులు ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని ఉగ్ర ఆరోపించారు. నగర పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చైర్మన్ మస్తాన్ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేపై తాము చేసిన అవినీతి ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. -
చార్మినార్ చూసేందుకు రూ.65వేలతో రైలెక్కాడు..
-
చార్మినార్ చూసేందుకు రూ.65వేలతో రైలెక్కాడు..
హైదరాబాద్ : చార్మినార్ చూడాలనే కోరిక నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడిని హైదరాబాద్ తీసుకొచ్చింది. తన కోరికను నెరవేర్చుకోవడం కోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా 65వేల డబ్బుతో నగరానికి చేరుకున్నాడు. బాలుడు నాంపల్లి రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా.. రైల్వే పోలీసులు అనుమానం వచ్చి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. డబ్బును, బాలుడ్ని అదుపులో తీసుకోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా కనిగిరి స్థానిక శివనగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కొత్తపల్లి వెంకట కార్తికేయ ...చార్మినార్ చూడాలని కోరిక కలిగింది. దాంతో ఇంట్లో ఉన్న రూ.65వేల నగదుతో హైదరాబాద్ రైలు ఎక్కేశాడు. నగదుతో పాటు కుమారుడు అదృశ్యం కావటంతో అతని తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు నాంపల్లి రైల్వేస్టేషన్లో ఉన్న కార్తికేయ...రైల్వే ఎస్ఐ ఇబ్రహీం కంటపడ్డాడు. అసలు విషయం ఆరా తీస్తే...చార్మినార్ చూసేందుకు హైదరాబాద్ వచ్చానని, తన దగ్గర నగదు ఉన్నట్లు చెప్పటంతో ఎస్ఐ...ఈ విషయాన్ని కనిగిరి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో హైదరాబాద్ చేరుకున్న కార్తికేయ తల్లిదండ్రులకు కుమారుడితో పాటు, నగదును అప్పగించారు. -
కొడుకు-ఖతం
అమ్మ ఆగ్రహ ఫలితం - ఆ బాధలు భరించలేకనే పనీ లేదు, ఆదాయం లేదు. నిత్యం తాగుడే. దీనికితోడు తాగుడుకు డబ్బులు కావాలని దాడులు. కన్న తల్లి అని చూడకుండా కొట్టేవాడు. చిత్రహింసలకు గురిచేసేవాడు. భార్య, పిల్లలకు నరకం చూపించేవాడు. చంపడమే సరైన మార్గంగా అనిపించింది. భార్యలోనూ ఆనందం - వితంతువునైనా సంతోషమే చాలా సంతోషంగా ఉంది. రోజూ హింసించేవాడు. అలాంటి భర్త ఉండే కన్నా చావడమే మేలు. డబ్బులు ఇవ్వాలంటూ కాలనీలో తిప్పితిప్పి కొట్టేవాడు. ఆ బాధకంటే విధవగా ఉండడమే మేలు. మా అత్త చేసిన పని మంచిదే. కనిగిరి : కొడుకు వేధింపులకు విసిగి వేసారిన తల్లి సహనం కోల్పోయి కన్న బిడ్డను గొడ్డలితో నరికి చంపింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని బహిరంగంగా ఈడ్చూకుంటూ తీసుకెళ్లి కొండల్లో పూడ్చి వేసింది. ఈ సంఘటన పట్టణ పరిధిలోని కాశిరెడ్డి నగర్లో బుధవారం జరిగింది. వివరాలు.. కాశిరెడ్డి కాలనీలో నివసించే నర్సమ్మకు భర్త, చిన్న కొడుకు ఇదివరకే చనిపోయారు. పెద్ద కుమారుడు శివశంకర్(29)కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. శివశంకర్‌కు కందుకూరుకు చెందిన గోపాల కుమారితో పదేళ్ల క్రితం వివాహమైంది. తోటలకు కాపలా ఉండటంతో పాటు చేపల వేటకు వెళ్లే శివశంకర్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం రోజూ తల్లీభార్యను వేధించేవాడు. కూలీ నాలి చేసుకుని తెచ్చుకున్న డబ్బు లాక్కునే వాడు. భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. పది రోజుల క్రితం భార్య, తల్లిని చితకబాదాడు. ఆమె అలిగి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లింది. మంగళవారం రాత్రి మద్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని తల్లిని కొట్టాడు. తల్లి నర్సమ్మ వద్ద ఉన్న రూ.200లు లాక్కెళ్లాడు. విరక్తి చెందిన నర్సమ్మ.. కుమారుని హత్యకు పథకం పన్నింది. నిద్రమాత్రలు నీళ్లలో కలిపింది. కుమారుడు మద్యంతో ఇంటికి రాగా ఆ నీరు ఇచ్చింది. మద్యంలో కలుపుకుని తాగడంతో శివశంకర్ మైకంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కట్టెలు కొట్టే గొడ్డలితో నర్సమ్మ కసితీరా నరికి చంపింది. రాత్రంతా శవం వద్దే.. కుమారుని శవానికి తల్లి నర్సమ్మ రాత్రంతా ఇంట్లోనే కాపలాగా ఉంది. తెల్లవారిన తర్వాత కాలనీలో నుంచి శవాన్ని బహిరంగంగా ఈడ్చుకుంటూ కాలనీ శివారు ప్రాంతమైన కొండ వద్దకు తీసుకెళ్లింది. అక్కడ గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చింది. తాపీగా ఇంటి కొచ్చి నీళ్లతో చేతులు శుభ్రం చేసుకుంది. శివశంకర్‌ను చంపానని, ఇంటికి వచ్చి ప్రశాంతంగా జీవించాలని కొడలు కుమారికి ఫోన్లో తెలిపింది. వీఆర్వో ఫిర్యాదు మేరకు సీఐ సుధాకరరావు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. శవాన్ని పూడ్చిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన తో పాటు ఎస్సై థెరిస్సా ఫిరోజ్ ఉన్నారు. -
కొడుకును చంపి.. పూడ్చిపెట్టేసింది
కనిగిరి మండలం కాశిరెడ్డి నగర్లో దారుణం చోటుచేసుకుంది. కొడుకు వేధింపులు భరించలేక కన్నతల్లే అతడిని గొడ్డలితో నరికి చంపేసింది. శివశంకర్ అనే యువకుడు గత పదేళ్లుగా రోజూ తాగి వచ్చి, ఇంట్లో భార్యా బిడ్డలతో పాటు తల్లిని కూడా తీవ్రంగా వేధించేవాడు. ఎవరు ఎంతగా చెప్పినా అతడు తన పద్ధతిని మార్చుకోలేదు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగింది. దాంతో సహనం కోల్పోయిన తల్లి నరసమ్మ అతడిని గొడ్డలితో నరికి చంపేసింది. అనంతరం ఇంటి సమీపంలోనే మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టింది. కాలనీ వాళ్లకు కూడా ఈ విషయం తెలిసినా, శివశంకర్ ఆగడాల గురించి తెలియడంతో ఎవరూ ఈ విషయం బయటపెట్టలేదు. కానీ ఆనోటా ఈనోటా చివరకు పోలీసుల వద్దకు విషయం తెలిసింది. దాంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసే పరిస్థితి లేదు. పోలీసులు వచ్చిన తర్వాత తల్లి నరసమ్మ తన నేరాన్ని అంగీకరించడంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
రాష్ట్రంలో రాక్షస పాలన
కనిగిరి: టీడీపీ హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీపై రోజుకో మాటతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను మోసగిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎందరో వృద్ధులకు పింఛన్లు ఇచ్చి ఆసరా కల్పిస్తే చంద్రబాబు కుంటి సాకులు చూపించి వారి కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ హయాంలో జిల్లాలో 3 లక్షల 25 వేల పింఛన్లు ఉంటే ప్రస్తుతం టీడీపీ పాలనలో 2 లక్షల 50 వేలకు చేరాయన్నారు. దాదాపు 75 వేల మంది పింఛన్లు తొలగించారని చెప్పారు. అర్హులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం: పింఛన్ల తొలగింపులో అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు న్యాయం చేసేంత వరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీకి ఓటే శారనే కక్షతో కావాలని పింఛన్లు తొలగిస్తే ఊరుకునేది లేదని..అర్హులైన పింఛన్‌దారులకు న్యాయం కోసం కోర్టుకు వెళ్తామన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన అంధురాలు ఈశ్వరమ్మ, వృద్ధురాలు కొండమ్మలు తమకు పింఛన్ నగదే జీవనాధారమని నెల రోజులు దాటినా ఇంకా పింఛను ఇవ్వలేదని ఎంపీ దృష్టికి తెచ్చారు. అధికారులను అడిగితే జన్మభూమి జరిగినప్పుడు ఇస్తాంలే తొందరెందుకని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎంపీ పింఛన్‌దారులకు నగదు పంపిణీ చేయకుండా జన్మభూమి సభల కోసం ఆపడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి వారికా పింఛన్ నగదు ఇవ్వకుండా ఆలస్యం చేసేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. జన్మభూమి సభలతో సంబంధం లేకుండా అర్హులైన వారికి వెంటనే పింఛన్లు ఇవ్వాలన్నారు. చంద్రబాబు మోసాలపై ఆందోళనలు: ఇచ్చిన హామీలు అమలు చేసేలా చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 5న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించనున్నట్లు వైవీ చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అమలులో చంద్రబాబు తీవ్ర మోసం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి అనేక మంది రైతులు పంటల బీమా కోల్పోయారన్నారు. మోపాడుకు వెలిగొండ నీటి సరఫరాకు కృషి: తాగు, సాగు నీటి సమస్య పరిష్కారం కోసం మోపాడు రిజర్వాయర్‌కు వెలిగొండ ప్రాజెక్టు నీరు వచ్చేలా కృషి చేస్తానని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వెలిగొండ నీరు మోపాడు రిజర్వాయర్‌కు మరలిస్తే కనిగిరి నియోజకవర్గంలోని 30 గ్రామాలకు సాగు నీటితో పాటు, భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. నియోజకవర్గంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని..దానిపై తనకు వందల సంఖ్యలో అర్జీలు వచ్చినట్లు ఎంపీ వైవీ తెలిపారు. కనిగిరి నియోజకవర్గ నీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకె ళ్లనున్నట్లు వెల్లడించారు. సమస్య తీవ్ర ంగా ఉన్నచోట తన నిధుల నుంచి బోర్లు వేయిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కనిగిరి మున్సిపాలిటీకి తన నిధుల నుంచి రూ.6.5 లక్షలతో నీటి ట్యాంకర్ మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం: నూకసాని ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటాలు సాగిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. పింఛన్ల ఏరివేత పేరిట ఎంతో మంది అర్హులకు అన్యాయం చేశారన్నారు. అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీని మున్సిపల్ కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. ఎంపీ వైవీ వెంట మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, పార్టీ నియోజక వర్గ నాయకుడు బుర్రా మధుసూదన్ యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఆవుల చంద్రశేఖరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు దంతులూరి ప్రకాశం, పల్లాల నారపరెడ్డి, రామన తిరుపతిరెడ్డి, ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, నాయకుడు వై వెంకటేశ్వరరావు, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కనిగిరిలో రియల్ ఎస్టేట్ సందడి
కనిగిరి: ఇప్పటిదాకా నిస్తేజంగా.. నిస్సారంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. దళారుల్లో ఒక్కసారిగా హుషారొచ్చింది. ఇప్పుడు వారంతా కనిగిరి వీధుల్లో సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే నల్లగొండ జిల్లా నకరికల్ నుంచి చిత్తూరు జిల్లా ఏర్పేడు వరకు నిర్మించనున్న జాతీయ రహదారి.. కనిగిరి నియోజకవర్గం నుంచి కూడా వెళ్లనుంది. జిల్లా పరిధిలో నిర్మించనున్న డబుల్ లేన్ రోడ్డు కోసం రూ. 253 కోట్లకు గాను టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ హైవే కనిగిరిని ఆనుకొని కొత్తూరు మీదుగా వెళ్లనుండటంతో స్థానిక భూ వ్యాపారుల్లో కదలిక వచ్చింది. రెండు రోజుల నుంచి అధికారులు మార్కింగ్ వేసేపనిలో నిమగ్నమయ్యారు. కనిగిరిలో రోడ్డు స్వరూపం ఇలా.. కనిగిరి డివిజన్లో(డీకేడీ రోడ్డు) 67.4 కిలోమీటర్ల మేర నూతన రోడ్డు పడనుంది. ఇది కనిగిరి పట్టణానికి సమీపంలో స్థానిక పొదిలి రోడ్డులోని ముస్లిం బరియల గ్రౌండ్ ఎత్తు రోడ్డు నుంచి చెరువు అలుగు ఆనుకుంటూ కంభం రోడ్డు మీదుగా గంగనగర్ వెంచర్ మధ్యలో నుంచి సుదర్శన్ థియేటర్ వెనుక పొలాల మీదుగా.. కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద తారు రోడ్డును ఎక్కే విధంగా మార్కింగ్ చేశారు. చెరువు అలుగు, సాధనడాబా వెనుక, గంగానగర్ వెంచర్ మధ్యలో బౌండరీ మార్కింగ్ వేశారు. అక్కడ నుంచి పామూరు మండలంలోని వగ్గంపల్లితో హైవే వెళ్లే జిల్లా సరిహద్దు పూర్తవుతుంది. ప్లాట్లు కొన్నవాళ్ల టెన్షన్... ఒకప్పుడు రియల్ బూమ్ ఆకాశానికి ఎగబాకడంతో కనిగిరిలో బోలెడు వెంచర్లు వెలిశాయి. ఎంతోమంది ప్లాట్లు సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా రోడ్డు నిర్మాణం ప్రతిపాదనతో ఆయా ప్రదేశాల్లో స్థలాలు కొన్నవారిలో ఆందోళన మొదలైంది. అంకణానికి (6 గదులు) రూ. 60వేల నుంచి లక్ష వరకు చెల్లించిన వెంచర్ల మధ్య రోడ్డు మార్కింగ్ పడటంతో ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. అయితే భూమి రిజిస్ట్రేషన్ విలువకు మూడు రెట్లు చెల్లించి భూములు కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులంటున్నారు. రెండు లేన్ల రోడ్డు కోసం 7 నుంచి 10 మీటర్ల భూమి అవసరమైతే.. పాతూరు వెనుక వైపు, కొత్తూరు వాగు వెనుకగల కొన్ని వెంచర్లు పూర్తిగా కనుమరుగు అవ్వాల్సిందే. అలాగే ఆయా ప్రదేశాల్లో జొన్ని, వరి, కంది పండించే పొలాలు కూడా రోడ్డు పరిధిలోకి వెళ్లిపోతాయి. -
సోక్రటీస్‌తో సమానుడు అంబేద్కర్
కనిగిరి : సోక్రటీస్, అరిస్టాటిల్ తో సమానుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. అని దళిత ఉద్యమ నిర్మాత డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. రాజధానిలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుస్తకంతో దేశాన్ని జయంచిన అపర మేధావి అంబేద్కర్ అని పద్మారావు కొనియాడారు. రాజధాని కేంద్రంలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో దళిత, బహుజనులు, ప్రజాస్వామికవాదులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. దళిత నాయకులు ఆత్మకూరి చెన్నయ్య, కటికల రత్నం, జి.రవికుమార్ మాదిగ, ప్రొఫెసర్ కేవీఎన్ రాజు మాట్లాడారు. తొలుత అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ వ్యక్తిత్వ దర్శనం, బహుజన దర్శనం పుస్తకాలను పద్మారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు రామ్మోహన్, పెరుగు శ్రీధర్, దద్దాల శ్రీనివాసులుయాదవ్, టీఐ ప్రతాప్, కేవీ రత్నం, చింతల పూడి వెంకటేశ్వర్లు, బాల గురవయ్య, దేపూరి వెంకటేశ్వర్లు, శివకాశయ్య పాల్గొన్నారు. -
విత్తనాల కోసం పాట్లు
కనిగిరి: అధికారుల అనాలోచిత నిర్ణయాలు, సర్కారు అలసత్వం రైతుల పాలిట శాపాలుగా మారాయి. రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో కనిగిరిలోని మనగ్రోమోర్ కేంద్రం వద్ద శుక్రవారం తొక్కిసలాట జరిగింది. వివరాల్లోకి వెళ్తే...ప్రభుత్వం సబ్సిడీపై అందించే మినుము విత్తనాలు రెండు రోజులుగా పూర్తిస్థాయిలో రైతులకు అందడం లేదు. ఒకటో తేదీ నుంచి విత్తనాల పంపిణీ ప్రారంభించిన అధికారులు తగిన ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టలేదు. దీంతో విత్తనాల కొరత ఏర్పడింది. మనగ్రోమోర్ కేంద్రం వద్దకు శుక్రవారం ఒక్కసారిగా కనిగిరి, హెచ్‌ఎంపాడు, వెలిగండ్ల, పీసీపల్లి మండలాల రైతులు వందల సంఖ్యలో వచ్చారు. కేవలం 17 టన్నుల విత్తనాలే ఉండటంతో కేంద్రం అధికారులు దాన్ని మూసేశారు. అయితే ఏపీ సీడ్స్ నుంచి వచ్చిన మినుము విత్తనాల ప్యాకెట్లలో బస్తాకు 20 బ్యాగులు (నాలుగు కేజీల ప్యాకెట్లు) ఉండాల్సి ఉండగా..17,18 మాత్రమే వచ్చాయని, దీని వల్ల రైతులతో గొడవలొస్తాయని పంపిణీ ఆపినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రైతుల ఆందోళన: రెండు రోజుల నుంచి విత్తనాల కోసం పనులు మానుకొని గ్రోమోర్ కేంద్రం చుట్టూ తిరుగుతున్నా విత్తనాలివ్వడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మన గ్రోమోర్ నిర్వాహకులు ఏడీఏ ఆదేశాల మేరకు విత్తనాల పంపిణీని ప్రారంభించారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. దీంతో ఎస్సై థెరిస్సా ఫిరోజ్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. పోలీస్ పహారాలో సబ్సిడీ మినుము విత్తనాలు పంపిణీ చేశారు. సుమారు 800 పర్మిట్లకు విత్తనాలివ్వగా, మరో వెయ్యి మంది రైతులు విత్తనాలందక ఎండలో క్యూలో నిలబడి ఉసూరుమంటూ వెనుతిరిగారు. అధికారుల వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలా ఉండగా..ఇప్పటికే పర్మిట్లు పొందిన రైతులు విత్తనాలందక ఇబ్బంది పడుతుంటే..కనీస ఆలోచన కూడా లేకుండా శుక్రవారం కూడా వివిధ గ్రామాల రైతులకు విత్తనాల పర్మిట్లు పంపిణీ చేయడం గమనార్హం. ఏడీఏ ఏమంటున్నారంటే.. దీనిపై ఏడీఏ చల్లా సుబ్బారాయుడును ఁసాక్షి* వివరణ అడగ్గా తమ తప్పు ఏమీలేదని మనగ్రోమోర్ నిర్వాహకుల ఆలస్యం వల్లే సమస్య వచ్చిందన్నారు. మరో లోడ్ విత్తనాలు వస్తున్నాయన్నారు. సమస్యలేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తూకంలో తరుగు...బ్యాగుల్లో మోసం రైతులకు పంపిణీ చేసిన విత్తనాల బస్తాల్లోని బాగుల్లో తేడాలు రాగా..కొన్ని బ్యాగుల తూకంలో తరుగు వచ్చాయి. విత్తనాల్లో అరకేజీ, పావుకేజీ వరకు తక్కువగా రావడంతో రైతులు మనగ్రోమోర్ నిర్వాహకులపై వాదనకు దిగారు. విత్తనాల తరుగుతో..ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినా రైతులకు ఉపయోగం లేకుండా పోతోందన్నారు. సంచుల్లో విత్తనాలు నాలుగు కేజీల బరువు లేవంటూ హనుమంతునిపాడు, కనిగిరి, వెలిగండ్ల మండలాలకు చెందిన రైతులు గొడవకు దిగారు. దీంతో ఎస్సై సమక్షంలో నిర్వాహకులు బస్తాలో బ్యాగులను లెక్క వేశారు. బ్యాగులు తక్కువగా ఉండటంతో ఆ బస్తాను తొలగించి వేరే బస్తాను రైతుకు ఇచ్చారు. అంతేగాక బ్యాగుల్లో నాలుగు కేజీల మినుము విత్తనాల్లేవు. ప్రతి సంచిలో అరకిలో వరకు విత్తనాలు తగ్గడంపై రైతులు గొడవ చేశారు. తాము ఏమీ చేయలేవని బ్యాగులకు రంధ్రాలు పడి పోయాయని.. కావలంటే ఏపీ సీడ్స్ అధికారులకు, వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని స్పష్టం చేశారు. -
రైతులను మోసగిస్తున్నారు
కనిగిరి: సీమాంధ్ర పీఠంపై ఎక్కిన చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు ప్రకటనలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు క నిగిరిలోని చర్చి సెంటర్లో రాస్తోరోకో నిర్వహించారు. రుణమాఫీ కోసం ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అయితే ఆందోళ చేస్తున్న వారిలో 20 మంది కార్యకర్తలు, రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వైఎం ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రంగనాయకులరెడ్డి, తమ్మినేని శ్రీను, యూత్ విభాగం మండల కన్వీనర్ ఎస్కే రహీం పాల్గొన్నారు. -
కనిగిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం