
సాక్షి, కనిగిరి/ఒంగోలు : కనిగిరిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా ఆగస్టు 15 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన పాదయాత్రపై అక్కసు వెళ్లగక్కారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసి.. వాటి స్థానంలో టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను కట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు వెల్లడించారు. పోలీసుల ముందే ఈ ఘటన జరగడం గమనార్హం.
దౌర్జన్యంపై ప్రశ్నించిన తమపై టీడీపీ నేతలు దాడికి దిగారని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి చేస్తున్న పాదయాత్రను తట్టుకోలేకే టీడీపీ ఇలాంటి చర్యలకు దిగుతోందని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment