
కావలి నుంచి షర్మిల సమైక్య శంఖారావం
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం మంగళవారం ఉదయం కావలి నుంచి ప్రారంభం అయ్యింది.
కావలి : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం మంగళవారం ఉదయం కావలి నుంచి ప్రారంభం అయ్యింది. నేడు ఆమె కనిగిరి, మార్కాపురంలో షర్మిల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కనిగిరి బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.
అనంతరం మార్కాపురం బయలుదేరి వెళతారు. అక్కడ సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలోనూ షర్మిల ప్రసంగిస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జరుగుతున్న ప్రజా ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా షర్మిల సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభించారు. షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి గ్రామాలకు గ్రామాలు కదిలి వస్తున్నాయి. షర్మిల ప్రసంగాలు వినేందుకు సమైక్యవాదులు భారీగా తరలి వస్తున్నారు. కాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కోడూరు సుధాకర్‌రెడ్డి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు షర్మిల సంతాపం తెలిపారు.