2017లో సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనం
కనిగిరి రూరల్: అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ.. తెలుగు పత్రికా రంగంలో సంచలనంగా ఆవిర్భవించి.. అడుగులు ముందుకు వేసిన ‘సాక్షి’ 15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ ఏట అడుగు పెట్టింది. నిఖార్సైన జర్నలిజానికి నిలువుటద్దంగా నిలిచింది. తెలుగు ప్రజల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర వేసుకుంది. ఈ 15ఏళ్లలో ఎన్నోకథనాలను ప్రచురించింది. అందులో కొన్ని..
ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై 2017 జనవరిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లిలో దీక్ష చేపట్టారు. ఆ వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కనిగిరిలో డయాలసిస్ సెంటర్ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది.
చదవండి: పూర్తి చేసేది మేమే
వైఎస్ జగన్ సీఎం కాగానే ఏకంగా 17 డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, ఒంగోలు రిమ్స్‌లో డయాలసిస్ మిషన్ల సంఖ్యను భారీగా పెంచారు. సమస్య మూలాలపై దృష్టి సారించి కృష్ణా జలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో ఏఐఐబీ స్కీం కింద కనిగిరి పట్టణానికి సమగ్ర మంచి నీటి పథకం మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.400 కోట్లతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 442 గ్రామాలకు సురక్షిత జలాలను అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని మంజూరు చేశారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment