
ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లా కనిగిరి ఘటనలో నిందితులైన ముగ్గురు యువకులపై రౌడీషీట్ తెరిచినట్టు జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఓ యువతిపై అత్యాచార యత్నం చేయడంతోపాటు ఆ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఘటన వెలుగు చూడడం తెలిసిందే.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పేరం సాయిరాం(19), పాశాల కోటేశ్వరరావు అలియాస్ కార్తీక్ (20), శ్రీరామ్ పవన్‌కుమార్(22)లపై రౌడీ షీట్ తెరిచినట్టు ఎస్పీ తాజా ప్రకటనలో వెల్లడించారు.