ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, కనిగిరి: కనిగిరిలో మంగళవారం రాత్రి 11.09 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. స్థానిక శివనగర్ కాలనీ, సాయిబాబా దేవస్థానం ప్రాంతాలతో పాటు మండలంలోని పేరంగుడిపల్లి గ్రామంలోనూ రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు వెల్లడించారు.
నేత్ర దానానికి అందరూ ప్రతినబూనాలి
ఒంగోలు సెంట్రల్: మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ భూనాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రతిజ్ఞ పత్రాలను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్నియా దెబ్బతినడం వలన దేశంలో 26 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం 40 వేలు నుంచి 50 వేల మంది కొత్తగా అంధులవుతున్నారని, దేశ వ్యాప్తంగా కేవలం 30 వేల కార్నియాలను మాత్రమే సేకరించి, అంధులకు అమర్చుతున్నట్టు ఆయన చెప్పారు.
ఏ వయస్సు వారైనా, బీపీ, సుగర్ ఉన్న వారైనా నేత్రాలను దానం చేయవచ్చని, మరణం సంభవించిన 6 గంటలలోపు నేత్రదానం చేయాల్సి ఉంటుందని వివరించారు. మరణించిన వ్యక్తి నేత్రదానం చేయకపోయినా కుటుంబసభ్యుల ద్వారా చేయవచ్చన్నారు. నేత్రదానం అనేది కేవలం 15 నిమిషాలలో పూర్తి అయ్యే అతి సామాన్య ప్రక్రియ అన్నారు. గత రెండు సంవత్సరాలలో 279 కార్నియాలను జిల్లా వ్యాప్తంగా సేకరించి, నూతనంగా 162 మందికి కార్నియాలను అమర్చిన్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ముందుగా ఆయన ప్రతిజ్ఞ పత్రంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంఘం మేనేజర్ డాక్టర్ శ్రీదేవి ప్రియ, అప్తాల్మిక్ ఆఫీసర్ ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment