జగనన్న చెప్పినట్లే.. వచ్చాడండోయ్‌! | CM Jagan Always Reminds Chandrbabu False Promises | Sakshi
Sakshi News home page

జగనన్న చెప్పినట్లే.. వచ్చాడండోయ్‌!

Published Fri, Jan 5 2024 8:11 PM | Last Updated on Tue, Jan 30 2024 5:27 PM

CM Jagan Always Reminds Chandrbabu False Promises - Sakshi

‘‘చంద్ర‌బాబు మోసాల పాల‌న‌ను చూశాం. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మళ్లీ మీ దగ్గరకు వస్తాడు. కేజీ బంగారం, బెంజ్‌కారు కూడా ఇస్తామ‌ని హామీ ఇస్తారు. అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ బహిరంగ సభల్లో  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ ప్రజలకు చెబుతూ వస్తున్నారు. ఆ మాట ఇవాళ నిజమైంది. జగనన్న చెప్పినట్లే మోసాల బాబు.. గతంలో కంటే మోసపూరిత హామీల లిస్ట్‌తో మళ్లీ వచ్చాడు.

వచ్చాడు.. వచ్చాడు.. వచ్చాడు.. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని ప్రకాశం జిల్లా కనిగిరి సభలో చంద్రబాబు ఎన్నికల శంఖారావం పేరిట బహిరంగ సభ పెట్టాడు. ఏదో జరిగిపోయినట్లు.. తెలుగుజాతికి పూర్వ వైభవం తెస్తానంటూ రా కదలి రా పేరుతో బహిరంగ నిర్వహించాడు. ఊహించని రీతిలో అది ఘోరంగా ప్లాప్‌ అయ్యింది. బాబు ప్రసంగిస్తున్న సమయంలో జనాలు వెళ్లిపోతుంటే.. మరో పక్క ఖాళీ కుర్చీలకే ప్రసంగం వినిపిస్తూ టీడీపీ అధినేత కనిపించారు. అది చూసి ‘‘వార్నీ.. జనసేనతో కలిసి చేసినా సభ ఇలాగేనా జరిగేది’’ అని చెవులు కొరుక్కుంటూ అసంతృప్తిగా కనిపించారు అక్కడి టీడీపీ నేతలు. సరే.. ఇదంతా వేరే విషయం అనుకోండి.

  

చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడూ ఇంత బాధపడలేదంట. ఈ క్రమంలో తన సతీమణిని తిట్టారంటూ ఎమోషనల్‌ డ్రామా ప్లే చేసేందుకు ప్రయత్నించాడాయన. అంతేకాదు.. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని శపథం చేశానని గుర్తు చేసుకున్నాడు. వీటికి తోడు.. గతంలో కంటే ఘోరమైన హామీలను ప్రకటించారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆడబిడ్డలకు రూ.15వేలు.. ఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు అంట.. అమ్మ‌కు అన్నం పెట్ట‌లేనోడు.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాన‌న్న‌ట్టుంది చంద్ర‌బాబు వ్య‌వ‌హారం. పేద‌లు మ‌హిళ‌ల కోసం ఒక్క ప‌థ‌కం పెట్టిన చ‌రిత్ర కూడా చంద్ర‌బాబుకు లేదు కదా.  

‘‘అనగనగా ఓ పులి ఉండేది. ఆ పులి మనిషి మాంసం ఒక పద్థతి ప్రకారం రెగ్యులర్‌గా తినేది. సంవత్సరాలుగా నరమాంసం తినేందుకు అలవాటుపడ్డ పులి.. ఏళ్లు గడిచాక ముసలిదైపోయింది. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక పోయింది. ఉన్నచోటే కూర్చుని.. నాలుగు నక్కలను తోడేసుకుంది. మనుషుల్ని ఎలా తినాలనే ప్లాన్‌ వేసుకుంది. దారిలో ఓ ముడగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగల్ని ఆశ చూపెట్టేది.. ‘‘తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి’’ అంటూ ఊరించేది. ‘‘ఈ పులిని నమ్మాం అంటే.. తినేస్తుంది కదా’’ అని అందరూ నమ్మకుండా పోయారు.

కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్‌ మోస్ట్‌ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదు. పైగా వయసు పెరిగింది. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదతో ఇరుక్కుంటే.. పులి చంపేసి తినేసేది.  

ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు ఆడేవారిని, వంచకుల్ని, మాయమాటలు చెప్పేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ కథ వింటే గుర్తొచ్చేది.. అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు.. వేటాడే శక్తి కోల్పోయిన పులి, గుంట నక్కల్నివెంటేసుకుని తిరిగినట్లు ఉంది చంద్రబాబు తీరు. బంగారు కడియం ఇస్తానంటాడు. జాబు రావాలంటే బాబు రావాలంట.. బాబుకు ఎప్పటికీ బుద్ధిరాదని అనిపిస్తోంది. నేను సీనియర్‌ని, ఇప్పుడు మంచోడ్ని అయ్యాను అంటూ నమ్మించే యత్నం చేస్తాడు. కానీ,   చంద్రబాబు లాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదు.

పంచతంత్రం కథల్లోని ముసలి పులి లాంటి వాడు మన సీనియర్‌ మోస్ట్‌ పోలిటీషియన్‌. మనిషి మాంసం రుచి మరిగిన పులి మారిందంటే ఎలా నమ్ముతారు?. బంగారు కడియం ఆశచూపి మనుషుల్ని మింగేసే ఆ పులి బాపతే ఈ వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు’’ 

ఇక కనిగిరి సభలో చంద్రబాబు ఎన్నిలక హామీలు ప్రకటిస్తూ.. రైతులకు ఏటా 25 వేలు ఇస్తాడట. మరి.. గత నాలుగున్నరేళ్ల కాలంలో రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన సాయాన్ని చంద్రబాబు అధికారంలో ఉండగా ఎందుకు చేయలేకపోయాడంటారు?.

నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తాట. ఏడాదికి ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాడట. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, ఉద్యోగం కల్పించేంత వరకు ప్రతి నిరుద్యోగికీ నెలనెలా రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పింది మరిచిపోయాడా?

ఇక షరా మాములుగా తనదైన శైలిలో విజన్‌ 2029 ప్రస్తావన.. అనుభవంతో రాష్ట్రాన్ని బాగు చేస్తానని అనగానే.. బాబోయ్‌..  ఈ బిల్డప్‌ బాబు ఇంక మార‌రా!.. అంటూ అక్కడి నుంచి జనం ఇంటి బాట పట్టారు. అదీ అసలు విషయం.. 

కిందటి ఏడాది అనంత బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగంలోనిదే ముసలి పులి కథ ప్రస్తావన.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement