
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
కనిగిరి: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి తాగు, సాగు నీరు అందిస్తామని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో బూత్‌లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రతి కుటుంబానికి రూ. లక్ష నుంచి 5 లక్షల లబ్ది చేకూరుతుందని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని, మోసపూరిత హామీలతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు 35 కుటుంబాల వారితో మన నవరత్నాల గురించి వివరించాలని, చంద్రబాబు నాయుడు చేసిన గత హామీలను కూడా వారి వద్ద ప్రస్తావించాలని కోరారు. బీసీ డిక్లరేషన్‌తో ప్రతీ బీసీ కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని, ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment