సాక్షి, తాడేపల్లి: పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాదని తాను ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు. నేను జీవితాంతం జగన్‌తోనే ఉంటానని తెలిపారు. సామాన్య కుటుంబ నుంచి వచ్చిన తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని తెలిపారు.
కనిగిరిలో కొత్త ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్‌కు పూర్తిగా సహకరిస్తానని మధుసూదన్‌యాదవ్ పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పిన వారి గెలుపు కోసం పనిచేస్తామని అన్నారు. అందరం కలిసి వైఎస్సార్‌సీపీ విజయం కోసం పనిచేస్తామని చెప్పారు. కనిగిరి కొండమీద వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సీటిస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలా ఉండనని అన్నారు. సీఎం జగన్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు.
‘టీటీడీలో సభ్యులుగా సీఎం అవకాశం కల్పించారు. నాకు ఇద్దరు దేవుళ్లు, ఒకరు సీఎం జగన్, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి. నా రాజకీయ దేవుడు వైఎస్ జగన్ ఏం చెబితే అది చేస్తా. నామీద ప్రేమతో కొందరు రాజీనామాలు అంటూ హడావుడి చేశారు. కానీ అదేంలేదు. అందరం కలిసి పనిచేస్తాం’ అని తెలిపారు.
చదవండి: చంద్రబాబుకు భవిష్యద్దర్శనం
Comments
Please login to add a commentAdd a comment