
వధూవరులను ఆశీర్వదిస్తున్న ఎమ్మెల్యే బుర్రా మధు సూదన్ యాదవ్
కనిగిరి రూరల్: వైఎస్సార్ టీఎఫ్ నాయకుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి కుమారుడి వివాహ వేడుకలు శనివారం కనిగిరిలో వైభవంగా జరిగాయి. స్థానిక పవిత్ర కళ్యాణ మండపంలో జరిగిన వివాహ రిసప్షన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు బుర్రా మధుసూదన్ యాదవ్ హాజరై నూతన వధువరులు విష్ణువర్ధన్‌రెడ్డి, హారితలను ఆశీర్వదించచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్‌గఫార్, వైస్ చైర్మన్ పులి శాంతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయకులరెడ్డి, జెడ్పీటీసీలు కస్తూరిరెడ్డి, గుంటక తిరుపతిరెడ్డి, ఒకే రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జి.బొర్రారెడ్డి, ఎస్‌కే రహీం, ముల్లంగి శ్రీహరిరెడ్డి, పల్లా మాల కొండ్రాయుడు, మండాది కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment