సీమాంధ్ర పీఠంపై ఎక్కిన చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు ప్రకటనలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు.
కనిగిరి: సీమాంధ్ర పీఠంపై ఎక్కిన చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు ప్రకటనలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు క నిగిరిలోని చర్చి సెంటర్‌లో రాస్తోరోకో నిర్వహించారు. రుణమాఫీ కోసం ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
అయితే ఆందోళ చేస్తున్న వారిలో 20 మంది కార్యకర్తలు, రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వైఎం ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రంగనాయకులరెడ్డి, తమ్మినేని శ్రీను, యూత్ విభాగం మండల కన్వీనర్ ఎస్‌కే రహీం పాల్గొన్నారు.