ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్‌కు గురైన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం రేపింది.
కనిగిరి (ప్రకాశం) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్‌కు గురైన సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం రేపింది. స్థానిక కొత్తపేటకు చెందిన సహస్ర(7) అనే చిన్నారి గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. బ్లాక్ పల్సర్ బైక్‌పై హెల్మెట్‌లు పెట్టుకొని వచ్చిన ఇద్దరు వ్యక్తులు అపహరించుకెళ్లారు.
దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు కావడంతో చిన్నారి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుండగా.. ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.