
హుండీలో చేయి ఇరుక్కుపోయి..
సంతమాగులూరు: ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు ఓ దొంగ. ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడో దొంగ.
హుండీలో చేయి పెట్టి సొమ్ము నొక్కేసేందుకు యత్నించాడు. హుండీలో చేయి ఇరుక్కుపోవడంతో బుక్కైపోయాడు. బాధతో కేకలు వేస్తూ విలవిల్లాడు. గట్టు రట్టవడంతో అక్కడున్న వారు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.