PM: Narendra Modi Praises Andhra Pradesh Retired Teacher in Mann Ki Baat - Sakshi
Sakshi News home page

PM Narendra Modi: 100 మందికి సుకన్య సమృద్ధి యోజన

Published Mon, May 30 2022 1:13 PM | Last Updated on Mon, May 30 2022 3:40 PM

PM Narendra Modi Praises Andhra Pradesh Retired Teacher in Mann Ki Baat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగ విరమణతో వచ్చిన సంపాదనతో 100 మందికి సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం వాసి రాంభూ పాల్‌రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అంశాన్ని ఆదివారం మన్‌కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. 

‘‘సమాజానికి సేవ చేయాలనే మంత్రం మన విలువలు, సంస్కారంలో ఒక భాగం. దేశంలో లెక్కలే నంత మంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో ఉంటున్న మిత్రుడు రాంభూ పాల్‌ రెడ్డి గురించి తెలుసుకున్నా. తన రిటైర్మెం ట్‌ తర్వాత వచ్చిన సంపాదనంతా చదువుకొనే కుమార్తెలకు విరాళంగా ఇచ్చారని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సుకన్య సమృద్ధి యోజన కింద 100 ఖాతాలు తెరవడంతో పాటు వారికి రూ.25 లక్షలు డిపాజిట్‌ చేశారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  


ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి 35 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించి గతేడాది పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్‌ ద్వారా వచ్చిన రూ.25,71,676 యడవల్లి పోస్టాఫీసులో డిపాజిట్‌ చేశారు. (క్లిక్‌: ఇందుకూరు పేట.. కూరగాయల తోట)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement