
సాక్షి, ప్రకాశం : ఒంగోలులో పంద్రాగస్టు జెండా ఆవిష్కరణ ఏర్పాట్లులో విషాదం చోటుచేసుకుంది. ఎన్‌సీసీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేస్తుండగా కరెంట్ షాక్‌తో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. జెండా ఎత్తుతుండగా ట్రాన్స్‌ఫార్మర్‌కు ఇనుప రాడ్డు తగలడంతో విద్యుదాఘాతానికి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతులు బసంత్ రాణా, అప్పలనాయుడిగా గుర్తించారు. ఇదిలా వుండగా మరో ఘటనలో ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్‌తో మృతి చెందారు.