
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న సీఐ
గిద్దలూరు: మైనర్‌పై లైంగిక దాడి చేసిన కేసులో ఆర్మీ జవాన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సర్కిల్ పోలీసుస్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ వి.శ్రీరామ్ నిందితుల వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పట్టణంలోని కొంగళవీడు రోడ్డులో ఉంటున్న ఆర్మీ జవాన్ గుండాల అభిలాష్ ఈ ఏడాది జనవరిలో సెలవుపై వచ్చి అదే ప్రాంతంలో ఉన్న ఓ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి మాయ మాటలు చెప్పి లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మార్చి 11వ తేదీన ఫోక్సో కేసు నమోదు చేశారు. అప్పటికే నిందితుడు ఆర్మీలో విధుల్లో చేరాడు. అతను పనిచేస్తున్న ఆర్మీ యూనిట్ నుంచి పిలిపించి అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారు. సీఐతో పాటు ఎస్‌ఐ కె.మల్లిఖార్జున ఉల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment