సాక్షి, ప్రకాశం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని టంగుటూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రావురి అయ్యవారయ్య, గాయపడిన వ్యక్తి కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన మండల ఇంచార్జ్ శ్రీహరిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదం: వైఎస్సార్‌సీపీ నేత మృతి
Published Thu, Dec 10 2020 7:18 AM | Last Updated on Thu, Dec 10 2020 10:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment