leader died
-
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత మృతి
లెబనాన్: పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరూరిని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్‌కు బీరూట్ కేంద్రంగా మారింది. బీరూట్ శివారులో ఉన్న హమాస్ కార్యాలయంపై ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి. హమాస్ డిప్యూటీ నాయకుడిని చంపిన వార్తను హమాస్ టీవీ కూడా పేర్కొంది. లెబనీస్‌లో జరిగిన దాడిలో ఆరుగురు మరణించినట్లు వెల్లడించింది. అటు.. గాజాలోనూ హమాస్ సైన్యానికి ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర పోరు జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 70 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ సేనలు ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ దాడి నుంచి అప్రమత్తమైన ఇజ్రాయెల్.. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ యుద్ధంలో ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ వైపు 22,185 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,140 మంది మరణించారు. ఇదీ చదవండి: ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం.. అరగంట వ్యవధిలో రెండుసార్లు -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నేత మృతి
సాక్షి, ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల విక్రమ్‌రెడ్డి(28) దుర్మణం పాలయ్యారు. ఏఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. విక్రమ్‌రెడ్డి మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం పనులకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి తన ద్విచక్రం వాహనంపై బయటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల నుంచి వస్తున్న బానోతు గంగు ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో విక్రమ్‌రెడ్డి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వివరించారు. ఆయనకు తల్లిదండ్రులు మంజుల– సత్యంరెడ్డి ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం బలోపేతం కోసం ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ఆరుట్ల విక్రమ్‌రెడ్డి విశేష కృషి చేశారు. యూత్ విభాగాన్ని బలోపేతం చేయడంలో అహర్నిశలు శ్రమించారు. విద్యార్థులు, రైతుల సమస్యలపై పోరు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందినట్లు తెలియడంతో అందరూ దిగ్భ్రాంతి చెందారు. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చినా విక్రమ్‌రెడ్డికి ఎంతో భవిష్యత్తు ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆదినుంచీ ఆయన వైఎస్సార్సీపీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఏ కార్యక్రమాలు చేపట్టినా విజయవంతంగా పూర్తి చేసేవారు. విక్రమ్‌రెడ్డి సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా రెండేళ్ల క్రితం ప్రకటించింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలియడంతో హైదరాబాద్‌కి వెళ్లి ఆమెకు మద్దతు ప్రకటించారు. కొత్త పార్టీని జిల్లాలో బలోపేతం చేస్తామని చెప్పి వచ్చారు. అనూహ్యంగా విక్రమ్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం కలచివేసింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము కన్నీటి పర్యంతమయ్యారు. విక్రమ్‌రెడ్డి స్వగ్రామం పదిరలో తీవ్ర విషాదం నెలకొంది. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, ఆర్ఎస్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, సింగిల్‌విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రమేశ్‌గౌడ్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు నర్సయ్య, తిరుపతిరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. స్వగ్రామంలో విక్రమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. విక్రమ్ రెడ్డి మృతి చెందడం పార్టీకి తీరని లోటు అని వైఎస్సార్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి అన్నారు. చదవండి: తల్లీకొడుకులపై పిడుగు -
కరోనాతో ఎంసీపీఐ(యూ) జాతీయ నేత మహ్మద్‌గౌస్ మృతి
సాక్షి, ఉప్పల్: ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్(60) కరోనా బారినపడి ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఈ నెల 14న ఆస్పత్రిలో చేరారు. గౌస్ స్వగ్రామం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు. ఈయనకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో నివాసం ఉంటున్నారు. దేశంలో వామపక్షాల ఐక్యత, సామాజిక న్యాయం సాధనపై మహ్మద్ గౌస్ తన వంతు కృషి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బహుజన ప్రజలు అధికారం సాధించాలని కోరుకున్న ఆయన నిరంతరం అందుకు కృషి చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను దేశవ్యాప్తంగా నిర్మాణం చేయడానికి పూనుకున్నారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా అనేక మేధావులు సామాజికవేత్తలతో చర్చలు జరిపారు. మంగళవారం గౌస్ స్వగ్రామం కొత్తూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఎంసీపీఐ(యూ)నేత వనం సుధాకర్ తెలిపారు. చాడ, తమ్మినేని సంతాపం మహ్మద్ గౌస్ మృతిపై సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. వామపక్ష ఉద్యమ బలోపేతానికి గౌస్ నిరంతరం కృషి చేశారని, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారని నివాళులర్పించారు. గౌస్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. చదవండి: రెండేళ్ల కింద హడావుడి.. తరలింపు అంతా కాగితాల్లోనే -
రోడ్డు ప్రమాదం: వైఎస్సార్సీపీ నేత మృతి
సాక్షి, ప్రకాశం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని టంగుటూరుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రావురి అయ్యవారయ్య, గాయపడిన వ్యక్తి కూడా వైఎస్సార్సీపీకి చెందిన మండల ఇంచార్జ్ శ్రీహరిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అన్నాడీఎంకే నేత హత్య
టీనగర్, న్యూస్‌లైన్: శుక్రవారం రాత్రి అన్నాడీఎంకే డివిజన్ కార్యదర్శి హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన రాయపేటలో చోటుచేసుకుంది. చెన్నై థౌజండ్‌లైట్స్ అజీజ్ ముల్క్ వీధికి చెందిన మోజస్(44). 109వ అన్నాడీఎంకే డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. శుక్రవారం రాత్రి ఈయన స్నేహితులతో కలిసి చెన్నై రాయపేట న్యూ కాలేజీ సమీపంలో మద్యం సేవించారు. మోజస్, స్నేహితుల మధ్య గొడవ ఏర్పడింది. ఆగ్రహించిన స్నేహితులు మోజస్పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో మోజస్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ ఇతన్ని స్థానికులు రాయపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందు తూ మోజస్ మృతి చెందాడు. ఈ సంఘటనపై రాయపేట పోలీసులు విచారణ జరిపారు. విచారణలో ఆరుగురు ఈ హత్యకు పాల్పడినట్టు తెలిసింది. పాతకక్షల కారణంగా ఈ హత్య జరిగినట్టు తెలిసింది.