
సాక్షి, ప్రకాశం జిల్లా: పేదలకు మేలు జరుగుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేనితనంతో అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ‘‘ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు’’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో దళితులు, బీసీలకు చేసిన నిర్వాకాలను ప్రజలు మరిచిపోలేదన్నారు. (చదవండి: నాడు-నేడు పనుల వేగం పెంచండి)
‘‘దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు మాటలు ప్రజలు మరిచిపోలేదు. నాయి బ్రాహ్మణులు మీ వద్దకు వచ్చి మాట్లాడుతుంటే మీకు ఎంత ధైర్యం.. మీ తోకలు కత్తిరిస్తా అన్న మాటలు గుర్తుకులేదా..? మీ హయాంలో మంత్రి వర్గ సహచరులు కూడా దళితులపై ఏ విధంగా నోరు పారేసుకున్నారో ప్రజలకు తెలీదా? మీరా దళితులు, బీసీలు గురించి మాట్లాడేది. ఇప్పుడు భూ అక్రమాలు అని మా పార్టీ నాయకులపై లేనిపోనీ అభాండాలు వేస్తున్నారు. భూములను ఆక్రమించి రికార్డుల్లోకి చేర్చి , అక్రమాలకు పాల్పడింది మీ హయాంలో కదా? మా హయాంలో అన్యాయంగా ఒక్క ఎకరా కూడా ఆన్లైన్ చేసిన దాఖలా లేదని సవాల్ చేస్తున్నా. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. దాన్ని చూసి తట్టుకోలేకే చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని’’ మంత్రి ఆదిమూలపు సురేష్ దుయ్యబట్టారు. (చదవండి: ఇలాంటివి రాసే బాబుకు 23 ఇచ్చారు: సోము)
Comments
Please login to add a commentAdd a comment