
తనపై కొద్ది రోజులుగా పనిగట్టుకుని ఆరోపణ చేస్తున్నారని, రాజకీయంగా తనను హింసించడమే ధ్యేయంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షి, ప్రకాశం జిల్లా: తనపై కొద్ది రోజులుగా పనిగట్టుకుని ఆరోపణ చేస్తున్నారని, రాజకీయంగా తనను హింసించడమే ధ్యేయంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ మరణం తర్వాత పార్టీని అంటిపెట్టుకొని ఉన్నానని అయినా తనపైన నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని వాపోయారు.
హవాలా కుంభకోణం నుంచి భూ కుంభకోణం దాకా అన్నీ నా మీద రుద్ది ఒక పద్ధతి ప్రకారం అభాసుపాలు చేస్తున్నారని బాలినేని మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. తనను తన కుమారుడిని రాజకీయంగా వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఎవరు ఏం చేసినా తాను వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని బాలినేని స్పష్టం చేశారు. పార్టీలో బాధ్యత గల వ్యక్తిగా తను ఒకరి గురించి మాట్లాడనని బాలినేని అన్నారు.
చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్