నయవంచకుడి అరెస్టు | Video filming Illegal relationship woman | Sakshi
Sakshi News home page

నయవంచకుడి అరెస్టు

Published Tue, Jul 4 2017 2:20 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

నయవంచకుడి అరెస్టు

నయవంచకుడి అరెస్టు

శారీరకంగా అనుభవిస్తూ.. నగ్న దృశ్యాల చిత్రీకరణ
ఓ మహిళపై సహచరుడు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరణ
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు


అమలాపురం టౌన్‌ : వారిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని అడ్డుపెట్టుకుని ఆమెను తరచూ శారీకంగా అనుభవిస్తూ...  రహస్యంగా నగ్న దృశ్యాలు సెల్‌ఫోన్‌ వీడియోలో చిత్రీకరించి తన స్నేహితుల సెల్‌ఫోన్లకు పోస్టింగ్‌లు చేశాడు. ఈ అక్రమాలకు పాల్పడ్డ నిందితుడిని అమలాపురం పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలేనికి చెందిన కారు డ్రైవర్‌ పలివెల వెంకట సూరిబాబు ఆ మోసానికి పాల్పడినట్టు అదే మండలం చిన్న తిళ్లకుప్ప గ్రామానికి చెందిన బాధితురాలైన 35 ఏళ్ల మహిళ తనకు జరిగిన అవమానాన్ని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతడిపై కేసు నమోదైంది. నిందితుడి సూరిబాబును పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీఐ శ్రీనివాస్‌లు పట్టణ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టి అతడు చేసిన నేరాన్ని వివరించారు.

 బాధిత  మహిళ గతంలో ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి అక్కడ కొంత కాలం ఉంది. తర్వాత ఓ వ్యక్తిని వివాహం చేసుకుని ముంబైలో కొన్నాళ్లు కాపురం చేసింది. ఇద్దరి మధ్య గొడవలు రావటతో భర్తను వదిలేసి తన ఇద్దరు  మగ పిల్లలతో చిన్న తిళ్లకుప్పలో నివాసం ఉంటోంది. మోటారు సైకిల్‌పై ఆమె ఊరూరూ వెళ్లి  చీరలను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.  సూరిబాబు కారులో వస్త్రాల కొనుగోలుకు ద్వారపూడి, రాజమహేంద్రవరం వెళ్లేది. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధంలో సహచర్యం చేస్తున్నారు.

ఆమెను సూరిబాబు కారులో తీసుకు వెళుతూ అమలాపురంలోని ఓ లాడ్జిలో, మురమళ్లలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో కొన్నిసార్లు బస చేశాడు. ఆ సమయంలో సూరిబాబు ఆమెను శారీకంగా అనుభవిస్తూ ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌లో వీడియో ద్వారా వారు కలుసుకున్న, నగ్న దృశ్యాలు చిత్రీకరించాడు. వీడియోలో తాను మాత్రం కనిపించకుండా కేవలం ఆమెను మాత్రమే చిత్రీకరించి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ నీలి దృశ్యాలతో ఉన్న వీడియోను సూరిబాబు తన సెల్‌ఫోన్‌ ద్వారా తన మిత్రుల సెల్‌ఫోన్లకు పంపించాడు.

 చివరకు ఆ వీడియో బాధితురాలు చూసి నిర్ఘాంతపోయింది. బెడ్‌ రూమ్‌లోని దృశ్యాలను అందరికీ బహిర్గతం చేస్తావా? అంటూ బాధితురాలు సూరిబాబును నిలదీసింది. నా ఇష్టం అందరికీ చూపిస్తాను...ఎక్కువగా మాట్లాడితే చంపేస్తానని సూరిబాబు బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మురమళ్ల, అమలాపురంలోని అతిథి గృహం, లాడ్జీలో సూరిబాబు ఆమెను నగ్నంగా వీడియో చిత్రీకరించినట్టు ఆధారాలు లభ్యం కావడంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరు పరచినట్టు డీఎస్పీ అంకయ్య వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement