అనుమానంతో భార్య గొంతు కోసేశాడు.. | A Man Killed His Wife In Kurnool District | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 21 2018 8:30 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

A Man Killed His Wife In Kurnool District - Sakshi

ప్రతికాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు: అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలోని పగిడ్యాల మండలం వనములపాడులో గురువారం చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. రోజు రోజుకు ఆమెపై అనుమానం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బుధవారం వారి మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

విచక్షణ కోల్పోయి భర్త రుతమ్మను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. భార్యపై అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement