Paramour
-
రహీమ్‌ది హత్యే..!
సాక్షి, కోదాడరూరల్ : కోదాడలో అదృశ్యమై..ఖమ్మం జిల్లా పాలేరు వాగులో విగతజీవుడిగా తేలిన యువకుడిది హత్యగానే పోలీసులు తేల్చారు. ఆ యువకుడితో సఖ్యతగా మెలిగిన వివాహిత, తన భర్త, తల్లి, మరో వ్యక్తి కలిసి దారుణానికి ఒడిగట్టారని ఖాకీల విచారణలో తేలింది. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. నడిగూడెం మండల కాగిత రామచంద్రాపురానికి చెందిన షేక్ రహీమ్(24) లారీక్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు కోటయ్య భార్య త్రివేణితో సఖ్యతగా మెలిగాడు. ఎనిమిది మాసాలు సాగిన అనంతరం విషయం భర్తకు తెలియడంతో గొడవలు జరిగాయి. కోటయ్య విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలించాడు. కానీ రహీమ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కోటయ్య తన భార్య త్రివేణిని కోదాడలోని ఆజాద్‌నగర్‌లో నివాసముంటున్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం పంపించాడు. నెల రోజుల కిత్రం భార్య వద్దకు వచ్చిన కోటయ్య నీ వల్ల గ్రామంలో మన పరువు పోయింది.. చనిపోదామని చెప్పాడు. రహీమ్ తనను వేధిస్తున్నాడు.. మనమెందుకు చనిపోవాలి.. అతడినే మట్టుబెడదామని తీర్మానించుకున్నారు. ప్లాన్ ప్రకారమే... రహీమ్‌ను హత్య చేద్దామని కోటయ్య ,భార్య త్రివేణి అతని అత్త శ్రీదేవి ఆమెతో సఖ్యతగా ఉంటున్న బండి వాసులు నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారమే గత ఫిబ్రవరి 26 రాత్రి 11.30 గంటల సమయంలో త్రివేణి తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను రమ్మని రహీమ్‌ను ఫోన్‌చేసి పిలిచింది. అతను ఇంట్లోకి వెళ్లగానే అçప్పటికే కాపుకాసుకుని ఉన్న ముగ్గురు ఇంట్లోకి వెళ్లిన రహీమ్‌ను రొకలిబండతో కళ్లపై కొట్టి ..చున్నితో మెడకు ఉరేసి హత్య చేశారు. అనంతరం సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని గొనెసంచిలో కట్టి మునగాల వద్ద సాగర్ కాల్వలో పడేసారు. ఆ తర్వాత అనుమానం రాకుండా యాథా విధిగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. రహీమ్ కొద్ది రోజులుగా కనిపించడం లేదని తండ్రి నాగుల్ మీరా ఈ నెల 8వ తేదీన పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిశగా గతంలో జరిగిన గొడవలను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కోటయ్య, త్రివేణి కదలికలు, ఫోన్‌కాల్స్‌పై దృష్టిసారించారు. రహీం మృతదేహం సోమవారం పాలేరువాగులో లభ్యం కావడం, అతడి ఒంటిపై గాయాలుండడంతో హత్యగానే ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. మంగళవారం కోదాడలోని ఆజాద్‌నగర్‌లో కోటయ్య అతని భార్య త్రివేణి, అత్త శ్రీదేవి ఈమే సహజీవనం చేస్తున్న బండి వాసులను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ క్రాంతికుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
వివాహిత, ప్రియున్ని చెట్టుకు కట్టేసి..
పట్నా : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరిని గ్రామస్తులు చితక్కొట్టారు. గ్రామపంచాయితీ ఇచ్చిన ఆదేశాలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా కొట్టారు. ఉత్తర బిహార్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా వివాహిత ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. 100మంది వరకు గ్రామస్తులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని గోపినాథ్ పుర్ గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు దాదాపు 20 గంటల వరకు బంధించారు. ఇద్దరినీ చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు వారిని కాపాడారు. ఈ ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురు గ్రామస్తులపై, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు మహిళతోపాటూ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 ఏళ్ల మహిళ తమ పక్క జిల్లా సితామర్హికి చెందిన 27 ఏళ్ల యువకునితో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలని అనుకుంటున్నానని చెప్పినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. ఈ రెండు ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 8 ఏళ్ల కిందటే వివాహమైనా, గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని సదరు మహిళ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫోన్ చేస్తే ఆమె ప్రియుడు గోపీనాథ్‌పుర్ నుంచి సితామర్హికి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
కడప అర్బన్ : తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంబీఏ పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం కానిస్టేబుల్‌గా ఎంపికైన యువకుడు తన కాలు ప్రమాదానికి గురైందని శిక్షణకు వెళ్లలేదు. ఈనెల 6 వతేదీన రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుళ్ల ప్రిలిమనరీ రాత పరీక్ష జరిగింది. ఆ పరీక్ష రాసి వస్తానని ఇంటినుంచి బయలుదేరి వెళ్లిన యువకుడు కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో ఓ ఇంటిలో మృతదేహమై కనిపించాడు. సంఘటనపై మృతుని బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన ఎం.సురేంద్ర (26) పిచ్చన్న, బాలనాగమ్మల రెండవ కుమారుడు. ఎంబీఏ వరకు చదువుకుని 2013 బ్యాచ్‌లో కానిస్టేబుల్‌గా కూడా ఎంపికయ్యాడు. కాలు ప్రమాదానికి గురైందని శిక్షణకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ పోలీసుస్టేషన్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌లో సదరు మహిళతో సంబంధం లేకుండా చేసుకునేందుకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పాలని కూడా పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈనెల 6వ తేది పోలీసు కానిస్టేబుళ్ల ప్రిలిమినరి పరీక్షకు చిత్తూరులో హాజరు కావాలని గత శనివారం తల్లిదండ్రులకు చెప్పి వచ్చాడు. వారం రోజుల తర్వాత ప్రకాశ్‌నగర్‌లోని జయలక్ష్మి అనే మహిళ నివసిస్తున్న ఇంటిలో మృతదేహమై కనిపించాడు. ఈ సంఘటనపై జయలక్ష్మి అనే మహిళ తన తల్లి వెంకటలక్ష్మితో కలిసి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తన సోదరుడు రవికుమార్ స్నేహితుడు సురేంద్ర అని, తన తండ్రి, తమ్ముడు మరణించిన తర్వాత తమ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని ఈనెల 10వ తేదీ గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో కడపలోని తమ ఇంటికి వచ్చాడని, శుక్రవారం అతను లోపల వేసుకున్న గడియ పగులగొట్టేందుకు ప్రయత్నించామన్నారు. శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. మృతదేహాన్ని చిన్నచౌకు సీఐ బి.రామకృష్ణ, ఎస్ఐ యోగేంద్రలు తమ సిబ్బందితో మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. -
తోడల్లుడే హంతకుడు
- వివాహేతర సంబంధమే హత్యకు కారణం - మూడు రోజుల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు తిరుచానూరు : వివాహేతర సంబంధం కారణంగా తోడల్లుడే వరుసకు తమ్ముడిని హత్యచేశాడు. ఈ నెల 16వ తేదీ దామినేడు రా మక్కచెరువులో లభ్యమైన మృతదేహం కేసును తిరుచానూరు పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసు వివరాలను మంగళవారం సాయంత్రం తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేం ద్రనాయుడు వివరించారు. సీఐ కథనం మేరకు...కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాల గ్రామానికి చెందిన బతుకమ్మ, హనుమంతు దంపతులకు జ్యోతి, సుజాత కుమార్తెలు ఉన్నారు. అదే జిల్లా ఎమ్మిగనూరు మండలం అలువాల గ్రామానికి చెందిన ధర్మరాజుకు పెద్దకుమార్తె జ్యోతిని ఇచ్చి వివాహం చేశారు. అలాగే రెండో కుమార్తె సుజాతను కర్నూలు జిల్లా సీ.బెళగళ్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన గజేంద్ర(30)కిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం అలుళ్లు ఇద్దరూ అత్తగారింట్లోనే ఉంటున్నారు. హనుమంతు పెద్దల్లుడు ధర్మరాజు ఎనిమిదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం తిరుపతి వచ్చి, సాయినగర్‌లో స్థిరపడ్డాడు. ఇక్కడికి వచ్చిన కొన్నాళ్లకు లగేజీ ఆటోను కొనుగోలు చేసి, బాడుగులకు తిప్పుతుండేవాడు. ధర్మరాజు తోడల్లుడు, వరుసకు తమ్ముడైన గజేంద్ర కూడా మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చి చేరి, డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెల క్రితం తన భార్య సుజాతను తీసుకొచ్చి ఓటేరులో కాపు రం పెట్టాడు. ఈ క్రమంలో ధర్మరాజు తన మరదలైన సుజాతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష యం గజేంద్రకు తెలిసింది. దీంతో భార్య భర్తల మధ్య గొడవ రావడంతో తాళి బొట్టు తీసి, గజేంద్రకు ఇచ్చేసి సాయినగర్‌లోని అక్క ఇంటికి సుజాత వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ ధర్మరాజు, అతని భార్య జ్యోతి, మరద లు సుజాత వారి పిల్లలతో కలిసి లగేజీ ఆటోలో కప్పట్రాళ్లకు వెళ్లారు. 14వ తేదీన వారిని అక్కడ విడిచిపెట్టి ధర్మరాజు ఒక్కడే తిరుపతికి వచ్చాడు. ఎలాగైన గజేంద్రను అంతమొందించాలని పథకం పన్నాడు. దీంతో అదే రోజు రా త్రి సాయినగర్‌లోని ధర్మరాజు ఇంట్లో ఇద్దరు మద్యం సేవించారు. అనంతరం గొడవ పడ్డారు. దీంతో ధర్మరాజు ఇం ట్లోని చిన్న సిలిండర్‌తో గజేంద్ర నుదిటి పై కొట్టాడు. స్పృహ తప్నిన గజేంద్రను తన ఆటోలో రామక్క చెరువు వద్దకు తీసుకొచ్చి, అక్కడ పడేసి, కాలితో గొంతు నొక్కి చంపేసి వెళ్లిపోయాడు. 16వ తేదీ పందులు మేపుకునే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జేబులోని ఫోన్ డైరీ, నల్లపూసల తాళిబొట్టు ద్వారా ఆధారాలు సేకరించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. ధర్మరాజుపై పోలీసులకు అనుమానం రావడంతో అతన్ని పట్టుకోవడానికి నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మూడో మైలు వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ధర్మరాజు కంటపడడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. దీం తో ధర్మరాజును అరెస్టు చేసి హత్యకు వాడిన లగేజీ ఆటో, గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించడంలో చొరవ చూపిన డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ సురేంద్రనాయుడు, ఎస్ఐలు మల్లేష్‌యాదవ్, చిరంజీవి, ఏఎస్సైలు ఈఎంఎస్.నాయుడు, శంకరయ్య, సిబ్బంది మణి, అలీ, షణ్ముగం, మునిమోహన్, సోము, ఐడీ పార్టీ రవిప్రకాష్, విజయకుమార్‌రాజు, రవిరెడ్డిలను తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టి అభినందించారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
మహిళ దారుణహత్య.. ప్రియుడే కాలయముడు ఖమ్మం: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం శాంతినగర్ ప్రాంతంలో నివసిస్తున్న గంధం కళావతి(45)కి 20 ఏళ్ల క్రితం ఓ కానిస్టేబుల్‌తో పెళ్లయింది. వీరికి ఓ కొడుకున్నాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఖమ్మంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కళావతి జీవిస్తుంది. ఆమెతోపాటు ఆమె కుమారుడు ఉంటున్నాడు. కొడకు రాజేష్ (18) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రవీణ్‌తో కళావతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. మద్యం తాగి కళావతిని ప్రవీణ్ నిత్యం వేధించేవాడు. తన తల్లిని వేధించడం మానుకోవాలని రాజేష్ హెచ్చరించినా.. ప్రవీణ్‌లో మార్పురాలేదు. బుధవారం రాత్రి కుమారుడు ఇంటికి వచ్చే సరికి గదిలో కళావతి చాపమీద నిర్జీవంగా పడి ఉంది. వెంటనే రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్థానికులు విచారించగా ఉదయం నుంచి ప్రవీణ్ ఆమెతోనే ఉన్నట్లు, ఆమెతో గొడవ జరిగినట్లు తెలిపారు. తన తల్లిని ప్రవీణే చంపాడని పోలీసులకు రాజేష్ ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ ఆమెతో గొడవపడి వెనుక గదికి తీసుకోని వచ్చి ముఖంపై దిండు పెట్టి హత్య చేసి ఉండొచ్చని తేదా గొంతు నులిమి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డబ్బు అడిగిందని హత్య చేశాడు
జైపూర్: తనతో అక్రమ సంబంధంతో పెట్టుకున్న మహిళను ప్రియుడు హతమార్చిన ఘటన రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో చోటు చేసుకుంది. పటాన్ ప్రాంతంలోని బాద్వాడీ గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సుమన్(25) అనే వివాహిత ధర్మపాల్(24) అనే ట్రక్కు డైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా డబ్బు కోసం అతడిని వేధించసాగింది. తనకు రూ.10 వేలు కావాలని డిమాండ్ చేయడంతో ఆమెను అంతమొందించాలని ధర్మపాల్ పన్నాగం పన్నాడు. ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన మామగారికి చెప్పాడు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో ధర్మపాల్ ను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా సుమన్ తో పరిచయం ఉందని, పదేపదే తనను డబ్బు అడుగుతుండడంతో ఆమెను హత్య చేశానని ఇంటరాగేషన్ లో ధర్మపాల్ చెప్పాడని పోలీసులు తెలిపారు. -
తల్లీకూతుళ్లతో సంబంధం.. తల్లి హత్య!
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. తర్వాత ఆమె కూతురిపై కన్నేసి, ఆమెను కూడా ముగ్గులోకి దింపి, చివరకు తల్లిని పీకపిసికి చంపేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా బిలాస్పూర్ గ్రామంలో జరిగింది. రామ్‌వీర్ అనే వ్యక్తి ఓ వితంతువుతో సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత ఆమె 18 ఏళ్ల కుమార్తె మీద కూడా అతడి కన్ను పడింది. నెమ్మదిగా ఆమెను ప్రేమ పేరుతో వలలోకి దించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అయితే తన కూతురు అతడికి కూడా కూతురి వరస అవుతుందని, ఇలా చేయొద్దని ఆమె తల్లి పెళ్లికి నిరాకరించింది. దాంతో అతడు అనుజ్, సతీష్, అర్జున్ అనే ముగ్గురు సహచరులను వెంటబెట్టుకుని, ఆ వితంతువును పీక పిసికి చంపేశాడు. అనంతరం బిలాస్పూర్ గ్రామ సమీపంలో ఢిల్లీ - డెహ్రాడూన్ జాతీయ రహదారిపై పడేశాడు. ఆమె మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితులు నలుగురినీ అరెస్టు చేశారు. -
భార్యను చంపి ముక్కలుగా నరికి...
కాకినాడ క్రైం : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భర్త తన భార్యను అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికాడు. అంతేకాదు ఆమె మృతదేహాన్ని మూటలుగా కట్టి వేర్వేరు చోట్ల చెత్తకుప్పల్లో పడేశాడు. కాకినాడలో గురువారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజోలుకు చెందిన గుమ్మడి శ్రీరామకృష్ణతో విజయవాడకు చెందిన మరియమ్మ(38)కు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి వెంకటేష్, సీమోను అనే కుమారులున్నారు. విజయవాడలో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించిన రామకృష్ణ ఏడాది క్రితం కాకినాడ ఫ్రేజర్పేటకు మకాం మార్చి, మెయిన్రోడ్లోని ఓ షాపింగ్ మాల్లో టైలర్‌గా పని చేస్తున్నాడు. ఈ కుటుంబం ఫ్రేజర్‌పేట నుంచి రాగంపేటకు, అక్కడి నుంచి మూడు నెలల క్రితం పాతబస్టాండు సమీపంలోని వెంకటేశ్వర కాలనీకి మారింది. మరియమ్మకు వివాహేతర సంబంధం ఉందని రామకృష్ణ భావించడంతో భార్యాభర్తలు తరచూ ఘర్షణ పడుతుండేవారు. అదే క్రమంలో బుధవారం రాత్రి వాగ్వివాదానికి దిగారు. దీంతో పెద్ద కొడుకు వెంకటేష్ స్నేహితుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లోనే ఉన్న చిన్న కుమారుడు సీమోను రాత్రి చాలా వరకూ టీవీ చూసి నిద్రించాడు. రామకృష్ణ కూడా కుమారుడితో పాటు నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి లేచి చూసేసరికి మరియమ్మ పక్క గదిలో మరో వ్యక్తితో కనిపించింది. అతని అలికిడి విని ఆ వ్యక్తి పరారయ్యాడు. వివస్త్రగా కనిపించిన మరియమ్మను చూసిన రామకృష్ణ పట్టరాని ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కత్తితో ఆమెను హతమార్చాడు. అంతటితో ఆగకుండా తల, ఛాతీ, మొండెంలను వేరు చేశాడు. ఛాతీ భాగం ఒక ఖాళీ బియ్యం సంచిలో, మొండెంను మరో ఖాళీ సంచిలో, తల, పేగులు కేన్‌లో వేసి రాత్రంతా ఇంట్లోనే ఉంచాడు. ఇల్లంతా రక్తమయం కావడంతో కిరోసిన్, ఫినాయిల్‌తో నేలను శుభ్రంగా కడిగేశాడు. ఉదయం కుమారులిద్దరూ స్కూలుకు వెళ్లాక రామకృష్ణ ఆ మూటలు, కేన్ని సైకిల్‌పై తీసుకువెళ్లాడు. అతడు మూటలు తీసుకు వెళ్తున్నట్లు మాత్రమే స్థానికులు గమనించారు. మూటలను తీసుకెళ్లిన అతడు కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీ సమీపంలోని ఫ్రేజర్పేటలోని చెత్తకుండీలో ఓ మూట, కచ్చేరీపేట సీపీఎం కార్యాలయం ఎదుట గల చెత్తకుండీలో మరోమూట, కేన్‌ను ఉప్పుటేరులో పడేశాడు. తిరిగి ఇంటికి చేరుకున్న అతడు తలుపులు తెరిచేసరికి కిరోసిన్ వాసనతో ఘాటైన దుర్గంధం వెదజల్లడంతో స్థానికులు భార్యను చంపేసి ఉంటాడని భావించి పోలీసులకు సమాచారం అందించారు. నవ్వుతూ సమాధానం.. ఉదయం పది గంటల నుంచి పోలీసులు రామకృష్ణ నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మద్యం తాగి ఉన్న అతడు ప్రతిదానికీ నవ్వుతూ సమాధానం చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. భార్యను విజయవాడ రైలు ఎక్కించి వచ్చానని, ఇల్లు సరిగా లేకపోవడంతో కిరోసిన్ పోసి కడిగానని చెప్పాడు. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చి విచారించినా ఫలితం లేకపోయింది. వారు ఏమీ చెప్పలేకపోయారు. రామకృష్ణ మాత్రం తన భార్యను విజయవాడ పుట్టింటికి పంపించానని చెబుతూ వచ్చాడు. పుట్టింటికి ఫోన్ చేసిన పోలీసులు మరియమ్మ అక్కడకు చేరుకోలేదని తెలియడంతో భర్తే ఆమెను హతమార్చి ఉంటాడని భావించారు. గదిలో, ఇంటి ఆవరణలో అక్కడకక్కడా కనిపించిన రక్తపు మరకలు వారి అనుమానాన్ని బలపరిచాయి. అయితే రామకృష్ణ తనకేమీ తెలియనట్టు నవ్వుతుండడంతో పోలీసులు తీవ్ర అసహనానికి గురయ్యారు. స్థానికులు మాత్రం మరియమ్మను అతడే హతమార్చి ఉంటాడని, ఉదయం రెండు మూటలు సైకిల్‌పై తీసుకెళ్లడం చూశామని పోలీసులకు చెప్పారు. పోలీసు స్టేషన్లో విచారణ సాయంత్రం ఐదు గంటల సమయంలో రామకృష్ణను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి మళ్లీ ప్రశ్నించారు. అప్పుడు అసలు విషయం చెప్పాడు. తాను భార్యను హతమార్చానని, ఆమె నగ్నంగా మరో వ్యక్తితో ఉండడం చూసి సహించలేకే ఈ పని చేశానని చెప్పాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఆర్.విజయభాస్కరరెడ్డి, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అద్దంకి శ్రీనివాసరావు, ఎస్సైలు సంఘటనా స్థలంతో పాటు చెత్తకుండీలను పరిశీలించారు. మృతదేహాన్ని ముక్కలు చేసి చెత్తకుండీలలో పడేసినట్టు జరిగిన ప్రచారం తీవ్ర కలకలం రేపింది. పలువురు చెత్తకుండీల వద్దకు చేరారు. నిత్యం రద్దీగా ఉండే వార్ఫు రోడ్డులో కొద్ది సమయం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రామకృష్ణను రక్షక్ వాహనంలో తీసుకువెళ్లి చెత్తకుండీలలోని సంచులను అతడితోనే తీయించారు. అప్పటికే మృతదేహం ముక్కలు పాడవడంతో దుర్గంధం వెదజల్లింది. వీటిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. వారిని అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. తల్లి తండ్రి చేతిలో హతమవడంతో కుమారులిద్దరూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. వారి బంధువులంతా సుదూర ప్రాంతాల్లో ఉండడంతో పోలీసులే వారిని చేరదీశారు. వారి బంధువులకు సమాచారం అందించి హుటాహుటిన కాకినాడ రావాల్సిందిగా సూచించారు. మరియమ్మ శరీర భాగాలను కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం, శరీర భాగాలను పడేసిన చెత్తకుండీలు ఉన్న ప్రాంతం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కావడం విశేషం. తలపేగులున్న కేన్‌ను ఉప్పుటేరు నుంచి వెలికితీయాల్సి ఉంది. -
'ఈ చేతులతోనే మొగుడిని చంపేశాను...'
ఉంచుకున్న వాడి కోసం ఉన్నవాడిని చంపేసుకుంది ఆమె. ఉంచుకున్న వాడు ఇప్పుడు మోసం చేశాడు. దాంతో అక్కసు పట్టలేక ఆమె పాత హత్య కథంతా కక్కేసింది. అదే టీవీ ఛానెల్ స్టుడియోలో. దాంతో ఇప్పుడామె, ఆమె లవర్ అరెస్టై కటకటాలు లెక్కిస్తున్నారు. తమిళనాడులో బేబీకళ అనే మహిళ రాధాకృష్ణన్ ను వివాహం చేసుకున్నారు. అయితే ఆ తరువాత బేబీకళ గౌరీశంకర్ అనే యువకుడిపై మనసు పడింది. బేబీకళ, గౌరీశంకర్ లు కలిసి రాధాకృష్ణన్ కు మద్యం బాగా తాగించి, ప్లాస్టిగ్ బ్యాగ్ తో ఊపిరందకుండా నొక్కి చంపేశారు. ఆ తరువాత రాధాకృష్ణన్ గుండెపోటుతో చనిపోయారని నమ్మబలికారు. రాధాకృష్ణన్ అంత్యక్రియలు కూడా అయిపోయాయి. ఇదంతా నాలుగేళ్ల కిందటి సంగతి. నాలుగేళ్ల తరువాత గౌరీశంకర్ బేబీకళను వదిలేసి, ఇంకో అమ్మాయి వెంట పడటం మొదలుపెట్టాడు. దీంతో బేబీకళ భగ్గుమంది. కోపం పట్టలేక ఓ టీవీ స్టుడియోకి చేరుకుని ఆమె తన నిర్వాకాన్ని బయటపెట్టింది. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
301 మిస్టరీ
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో సంచలనం సృష్టించిన మధుసూదన్‌రెడ్డి దంపతుల హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. క్రైం సినిమా కథను తలపించే లా ఉన్నాయి. వ్యాపార లావాదేవీలకు సంబంధించి మధుసూదన్‌రెడ్డి హత్య చేసినట్లు మొదట పోలీసులు భావించారు. అతనికి సంబంధించిన భాగస్వాములతో విభేదాలున్నాయా.? లేక కుటుంబ కలహాలతో బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారా.? వివాహేతర సంబంధం ఏమైనా ఉందా.? అనే విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టినప్పటికీ చిన్న ఆధారం కూడా లభించకపోవడంతో తల పట్టుకున్నారు. అయితే హత్య చేసింది మాత్రం కిరా యి హంతకులే అని నిర్ధారణకు వచ్చి ఆ కోణం లో దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లాలో కరుడుగట్టిన కిరాయి హంతకులు ఏయే ప్రాంతంలో ఉన్నారనే విషయాలపై ఆరా తీసి దర్యాప్తు బృందాలు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నాయి. ఆళ్లగడ్డ, వెల్దుర్తి, ఆత్మకూరు, డోన్, పత్తికొండ, నంద్యాల ప్రాంతాల్లో ఉన్న కిరాయి హంతకులపై ప్రత్యేక దృష్టి సారించారు. సంఘటన జరిగిన రోజు ఆయా ప్రాంతాలకు సంబంధించిన కిరాయి హంతకులు ఎక్కడున్నారు, ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చిన నేరస్తుల కదలికలు తదితర వాటి వివరాలను సేకరిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి హంతకులకు దెబ్బలు తగిలినట్లు పోలీసులకు సమాచారం ఉండటంతో ఆసుపత్రుల్లో ఎవరైనా కిరాయి హంతకులు, నేరస్తులు చికిత్స పొందుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదుపులో ఒకరు : గత నెల 30వ తేదీన హత్యకు గురైన మధుసూదన్‌రెడ్డి నివాసం ఉండే గిబ్సన్ కాలనీలోని అపార్ట్మెంట్ పేరు తేజ డీలక్స్. అయితే సంఘటనకు వారం రోజుల క్రితమే హంతకులు కొత్తపేటలోని తేజ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి మధుసూదన్‌రెడ్డి ఏ ప్లాట్‌లో ఉన్నాడంటూ హంతకులు ఆరా తీసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆ కోణం లో కూడా దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఎస్వీ కాంప్లెక్స్ సమీపంలో టిజె.అపార్ట్మెంట్లో 301 ప్లాట్‌లో మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన కూడా బేతంచెర్లలో మైనింగ్ ఉంది. మూడేళ్ల క్రితం కర్నూలుకు వచ్చి టిజే.అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. బేతంచెర్లకు సంబంధించిన మైనింగ్ వ్యవహారంపై మాట్లాడేందు కు వచ్చామని హంతకులు ఆరా తీసిన విషయంపై అనుమానంతో కొత్తకోణంలో పోలీసు లు దర్యాప్తు చేపట్టగా టీజే.అపార్ట్మెంట్లో కూడా బేతంచెర్ల ప్రాంతానికి సంబంధించి అదే పేరు గల వ్యక్తి నివాసం ఉండటంతో పోలీసులు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఈయనకు కూడా బెంగళూరులో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈయన కోసం వచ్చి ఆయనను హత్య చేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, రెండో పట్టణ సీఐ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో నాలుగు క్రైం పార్టీ బృందాలు జిల్లాలోని ఫ్యాక్ష న్ ప్రభావిత ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఓవెపు శాస్త్రీయ పద్ధతిలో నేర చరిత్ర ఉన్న వారి ఆధారాలతో పాటు సీసీఎస్, ఫ్యాక్షన్‌జోన్, స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు కూడా ఈ కేసును సవాల్‌గా స్వీకరించి మిస్టరీని ఛేదించేం దుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
చిట్యాల (గోపాలపురం), : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన భర్త అనంతరం పోలీసులకు లొంగిపోయూడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళకు కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామానికి చెందిన కలిదిండి పాటియ్యతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. పాటియ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పాటియ్య స్నేహితుడు, ఆటో డ్రై వర్ ఈడుగుబంటి శ్రీను(31) మూ డేళ్లుగా జ్యోతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అనుమానం వచ్చిన పాటియ్య భార్యను కొట్టి పుట్టింటికి పంపేశాడు. అయితే 20 రోజుల క్రితం చిట్యాలలో ఉన్న భార్య దగ్గరకు వచ్చిన పాటియ్య అక్కడే ఉంటున్నాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో భర్త నిద్రిస్తుండగా బయటకు వచ్చిన జ్యోతి ప్రియుడు శ్రీనుతో కలిసి ఆటోలో ఊరి బయటకు వెళ్లడాన్ని పాటియ్య గమనించాడు. ఊరి బయట భార్య, శ్రీను కలిసి ఉండటాన్ని చూసిన అతను తనతో తీసుకువచ్చిన ఇనుప రాడ్‌తో శ్రీను తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. జ్యోతి పారిపోవడంతో కొనఊపిరితో ఉన్న శ్రీనును ఆటోలో వేసుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చాడు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే శ్రీను మతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో పాటియ్య పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మతుడు శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు పాటియ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇదిలావుండగా పథకం ప్రకారం తన భర్తను హత్యచేసినట్లు మృతుని భార్య ఆరోపిస్తోంది. జ్యోతి, ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చే స్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రాఘవ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.