కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో సంచలనం సృష్టించిన మధుసూదన్‌రెడ్డి దంపతుల హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. క్రైం సినిమా కథను తలపించే లా ఉన్నాయి. వ్యాపార లావాదేవీలకు సంబంధించి మధుసూదన్‌రెడ్డి హత్య చేసినట్లు మొదట పోలీసులు భావించారు. అతనికి సంబంధించిన భాగస్వాములతో విభేదాలున్నాయా.? లేక కుటుంబ కలహాలతో బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారా.? వివాహేతర సంబంధం ఏమైనా ఉందా.? అనే విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టినప్పటికీ చిన్న ఆధారం కూడా లభించకపోవడంతో తల పట్టుకున్నారు. అయితే హత్య చేసింది మాత్రం కిరా యి హంతకులే అని నిర్ధారణకు వచ్చి ఆ కోణం లో దర్యాప్తును వేగవంతం చేశారు.
జిల్లాలో కరుడుగట్టిన కిరాయి హంతకులు ఏయే ప్రాంతంలో ఉన్నారనే విషయాలపై ఆరా తీసి దర్యాప్తు బృందాలు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నాయి. ఆళ్లగడ్డ, వెల్దుర్తి, ఆత్మకూరు, డోన్, పత్తికొండ, నంద్యాల ప్రాంతాల్లో ఉన్న కిరాయి హంతకులపై ప్రత్యేక దృష్టి సారించారు. సంఘటన జరిగిన రోజు ఆయా ప్రాంతాలకు సంబంధించిన కిరాయి హంతకులు ఎక్కడున్నారు, ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చిన నేరస్తుల కదలికలు తదితర వాటి వివరాలను సేకరిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి హంతకులకు దెబ్బలు తగిలినట్లు పోలీసులకు సమాచారం ఉండటంతో ఆసుపత్రుల్లో ఎవరైనా కిరాయి హంతకులు, నేరస్తులు చికిత్స పొందుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అదుపులో ఒకరు : గత నెల 30వ తేదీన హత్యకు గురైన మధుసూదన్‌రెడ్డి నివాసం ఉండే గిబ్సన్ కాలనీలోని అపార్ట్‌మెంట్ పేరు తేజ డీలక్స్. అయితే సంఘటనకు వారం రోజుల క్రితమే హంతకులు కొత్తపేటలోని తేజ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి మధుసూదన్‌రెడ్డి ఏ ప్లాట్‌లో ఉన్నాడంటూ హంతకులు ఆరా తీసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆ కోణం లో కూడా దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఎస్వీ కాంప్లెక్స్ సమీపంలో టిజె.అపార్ట్‌మెంట్‌లో 301 ప్లాట్‌లో మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన కూడా బేతంచెర్లలో మైనింగ్ ఉంది. మూడేళ్ల క్రితం కర్నూలుకు వచ్చి టిజే.అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు విదేశాల్లో చదువుకుంటున్నాడు.
బేతంచెర్లకు సంబంధించిన మైనింగ్ వ్యవహారంపై మాట్లాడేందు కు వచ్చామని హంతకులు ఆరా తీసిన విషయంపై అనుమానంతో కొత్తకోణంలో పోలీసు లు దర్యాప్తు చేపట్టగా టీజే.అపార్ట్‌మెంట్‌లో కూడా బేతంచెర్ల ప్రాంతానికి సంబంధించి అదే పేరు గల వ్యక్తి నివాసం ఉండటంతో పోలీసులు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఈయనకు కూడా బెంగళూరులో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈయన కోసం వచ్చి ఆయనను హత్య చేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, రెండో పట్టణ సీఐ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో నాలుగు క్రైం పార్టీ బృందాలు జిల్లాలోని ఫ్యాక్ష న్ ప్రభావిత ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఓవెపు శాస్త్రీయ పద్ధతిలో నేర చరిత్ర ఉన్న వారి ఆధారాలతో పాటు సీసీఎస్, ఫ్యాక్షన్‌జోన్, స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు కూడా ఈ కేసును సవాల్‌గా స్వీకరించి మిస్టరీని ఛేదించేం దుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
301 మిస్టరీ
Published Thu, Jan 9 2014 2:27 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM
Advertisement
Advertisement