madhu sudhan reddy
-
సీఎంను విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదు : ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుటుంబ అవసరాల కోసమే రాజకీయాల్లో ఉన్న డీకే అరుణ సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిందని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలుచేస్తున్నామని, పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. డీకే అరుణ పాలమూరుకు చేసిందేమిలేదని, ఆమె మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రంలో మోదీ, పాలమూరులో డీకే అరుణ ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు అలాంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, మాజీ చైర్మన్ రాధ, నాయకులు బెనహర్, బెక్కరి అనిత, సిరాజ్ ఖాద్రీ, సాయిబాబా, లక్ష్మణ్‌యాదవ్, ఫయాజ్, అజ్మత్‌అలీ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ, బీఆర్ఎస్లు ప్రజలకు చేసిందేమీలేదు : మంత్రి సీతక్క -
శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
-
రైతుదీక్ష విజయవంతం చేయాలని పాదయాత్ర
అనంతపురం: వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న రైతు దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి రెండు రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఉర్వకొండ నుంచి మొదలైన ఈ పాదయాత్ర మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లా కేంద్రంలో ముగియనుంది. ఈ దీక్షకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తమ సంఘీభావాన్ని తెలిపారు. నాగిరెడ్డి మంగళవారం ఉదయం మధుసూదన్ రెడ్డితో పాటు కొద్ది దూరం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు వీరాంజనేయులు, ఎస్సీ సెల్ రాష్ట్ర సభ్యుడు ఎగ్గుల శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఆర్‌అండ్‌బీలో ప్రక్షాళన!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం రహదారుల నిర్మాణం, విస్తరణ కు పెద్దపీట వేయడమే కాకుండా, ఆ శాఖను ప్రక్షాళన చేస్తోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అధికారుల నియామకానికి శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యం లోనే జిల్లాలో బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడం అధికారులలో చర్చనీయాంశంగా మారింది. ఆర్అండ్బీ ఎస్ఈగా పనిచేసిన ఎన్.మాధవి సుకన్యను ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. ఆమె స్థానంలో పి.మధుసూదన్‌రెడ్డి నియమించగా, ఆయన ఈ నెల నాలుగున బాధ్యతలు తీసుకున్నారు. నిజామాబాద్ డివిజన్ ఈఈగా పనిచేస్తున్న సీహెచ్ అంజయ్యను అకస్మాత్తుగా బదిలీ చేస్తూ గురువారం ఉ త్తర్వులు వెలువడ్డాయి. ఆయనను బోధన్ ఈఈగా పంపించి, రంగారెడ్డి జిల్లా సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఇంజనీరింగ్ విభాగంలో డెప్యూటేషన్‌పై విధులు నిర్వ హిస్తున్న ఎస్.రాఘవేందర్రెడ్డిని నిజామాబాద్ ఈఈగా నియమించారు. జిల్లాలో రూ.1011.50 కోట్ల విలువ చేసే పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే మరికొందరు డెప్యూటీ ఈఈలు, ఎఈఈలకు స్థానచలనం కలిగే అవశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. టెండర్ల ద్వారా పనులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, వంతెనల విస్తరణ, నిర్మాణాల కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఆయా మండల కేంద్రాలకు అనుసంధానం చేసే తారురోడ్లు, శిథిలమైన, కొత్త వంతెనల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1011.50 కోట్లను కేటాయిం చింది. రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షణలో జిల్లాలోని 49 సింగిల్‌లైన్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చనున్నారు. గ్రామాలకు మండల అనుసంధానం కోసం 14 రహదారులు, శిథిలమైన వాటితో కలిపి మొత్తం 35 వంతెనలు నిర్మించేందుకు అధికారులు గతంలో పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పను ల కోసం మొత్తంగా రూ.1011.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ల ద్వారా పనుల చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాటిని త్వరి తగతిన పూర్తి చేసేందుకు రహదారులు, భవనాల శాఖలో బదిలీల ప్రక్షాళన జరుగుతుండటం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
301 మిస్టరీ
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లాలో సంచలనం సృష్టించిన మధుసూదన్‌రెడ్డి దంపతుల హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. క్రైం సినిమా కథను తలపించే లా ఉన్నాయి. వ్యాపార లావాదేవీలకు సంబంధించి మధుసూదన్‌రెడ్డి హత్య చేసినట్లు మొదట పోలీసులు భావించారు. అతనికి సంబంధించిన భాగస్వాములతో విభేదాలున్నాయా.? లేక కుటుంబ కలహాలతో బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారా.? వివాహేతర సంబంధం ఏమైనా ఉందా.? అనే విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టినప్పటికీ చిన్న ఆధారం కూడా లభించకపోవడంతో తల పట్టుకున్నారు. అయితే హత్య చేసింది మాత్రం కిరా యి హంతకులే అని నిర్ధారణకు వచ్చి ఆ కోణం లో దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లాలో కరుడుగట్టిన కిరాయి హంతకులు ఏయే ప్రాంతంలో ఉన్నారనే విషయాలపై ఆరా తీసి దర్యాప్తు బృందాలు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నాయి. ఆళ్లగడ్డ, వెల్దుర్తి, ఆత్మకూరు, డోన్, పత్తికొండ, నంద్యాల ప్రాంతాల్లో ఉన్న కిరాయి హంతకులపై ప్రత్యేక దృష్టి సారించారు. సంఘటన జరిగిన రోజు ఆయా ప్రాంతాలకు సంబంధించిన కిరాయి హంతకులు ఎక్కడున్నారు, ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చిన నేరస్తుల కదలికలు తదితర వాటి వివరాలను సేకరిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి హంతకులకు దెబ్బలు తగిలినట్లు పోలీసులకు సమాచారం ఉండటంతో ఆసుపత్రుల్లో ఎవరైనా కిరాయి హంతకులు, నేరస్తులు చికిత్స పొందుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అదుపులో ఒకరు : గత నెల 30వ తేదీన హత్యకు గురైన మధుసూదన్‌రెడ్డి నివాసం ఉండే గిబ్సన్ కాలనీలోని అపార్ట్మెంట్ పేరు తేజ డీలక్స్. అయితే సంఘటనకు వారం రోజుల క్రితమే హంతకులు కొత్తపేటలోని తేజ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి మధుసూదన్‌రెడ్డి ఏ ప్లాట్‌లో ఉన్నాడంటూ హంతకులు ఆరా తీసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆ కోణం లో కూడా దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఎస్వీ కాంప్లెక్స్ సమీపంలో టిజె.అపార్ట్మెంట్లో 301 ప్లాట్‌లో మధుసూదన్‌రెడ్డి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయన కూడా బేతంచెర్లలో మైనింగ్ ఉంది. మూడేళ్ల క్రితం కర్నూలుకు వచ్చి టిజే.అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. బేతంచెర్లకు సంబంధించిన మైనింగ్ వ్యవహారంపై మాట్లాడేందు కు వచ్చామని హంతకులు ఆరా తీసిన విషయంపై అనుమానంతో కొత్తకోణంలో పోలీసు లు దర్యాప్తు చేపట్టగా టీజే.అపార్ట్మెంట్లో కూడా బేతంచెర్ల ప్రాంతానికి సంబంధించి అదే పేరు గల వ్యక్తి నివాసం ఉండటంతో పోలీసులు అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఈయనకు కూడా బెంగళూరులో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈయన కోసం వచ్చి ఆయనను హత్య చేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, రెండో పట్టణ సీఐ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో నాలుగు క్రైం పార్టీ బృందాలు జిల్లాలోని ఫ్యాక్ష న్ ప్రభావిత ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఓవెపు శాస్త్రీయ పద్ధతిలో నేర చరిత్ర ఉన్న వారి ఆధారాలతో పాటు సీసీఎస్, ఫ్యాక్షన్‌జోన్, స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు కూడా ఈ కేసును సవాల్‌గా స్వీకరించి మిస్టరీని ఛేదించేం దుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
సూట్ కేసులో దుంగలు
రాజంపేట, న్యూస్‌లైన్ : ఎర్రచందనం దొంగలు స్మగ్లింగ్‌ను కొత్తపంథాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కార్లు, లారీలు, స్కార్పియాలలో దుంగలు తరలిపోయేవి. అవి పట్టుబడుతున్నాయని..స్మగ్లర్లు కొత్తరూట్‌ను ఎంచుకున్నారు. సూట్ కేసుల్లో దుంగలను అమర్చి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం మన్నూరు పోలీసులకు రైల్వేకోడూరు చెందిన యువకుడు పట్టుబడిన ఉదంతం. ఎస్ఐ మధూసూదన్‌రెడ్డి కథనం మేరకు .. రాజంపేట పట్టణ శివార్లలో ఉన్న బోయనపల్లె ఇంజనీరింగ్ కళాశాల వద్ద వాహనాలను గురువారం రాత్రి మన్నూరు పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రైల్వేకోడూరుకు చెందిన సందీప్, రవి అనే యువకులు స్కూటర్లో సూట్‌కేసును పెట్టుకొని పోవడాన్ని గమనించారు. పోలీసులను గమనించి స్కూటరు, సూట్‌కేసును వదలి పరారయ్యారు. పోలీసులు వారిని వెంటాడి సందీప్‌ను పట్టుకున్నారు. రవి అని మరో యువకుడు తప్పించుకున్నాడు. వీరికి రైల్వేకోడూరు సమీపంలో దొరస్వామినాయుడు రూ.5వేలు ఆశచూపి, సూట్‌కేసులో ఉన్న దుంగలను కడపలో తాను చెప్పిన వ్యక్తికి అప్పగించాలని కోరారు. అందుకు ఒప్పుకున్న యువకులు చివరికి పోలీసులు పట్టుబడ్డారు. సందీప్ పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలావుండగా రోళ్లమడుగు వద్ద ఓ వ్యక్తి ప్లాస్టిక్ సంచిలో 11కేజీల బరువు కలిగిన దుంగను తీసుకుపోతుండగా రేంజర్ టీవైఎన్ గౌడ్ పట్టుకున్నారు. గుండ్లూరు చెక్‌పోస్టు వద్ద... గుండ్లూరు చెక్‌పోస్టు వద్ద లారీని తనిఖీ చేసి అందులో ఉన్న 70 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు రేంజర్ టీవైఎన్ గౌడ్ శుక్రవారం తెలిపారు. అలాగే డ్రైవర్ సయ్యద్ ముబారక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముబారక్ కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ఊసకోట మండలానికి చెందిన వాడు.