రైతుదీక్ష విజయవంతం చేయాలని పాదయాత్ర | March to succeed raitudiksa | Sakshi
Sakshi News home page

రైతుదీక్ష విజయవంతం చేయాలని పాదయాత్ర

Published Tue, Jan 27 2015 5:57 PM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

March to succeed raitudiksa

అనంతపురం: వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి చేపట్టనున్న రైతు దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వై మధుసూదన్ రెడ్డి రెండు రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఉర్వకొండ నుంచి మొదలైన ఈ పాదయాత్ర మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లా కేంద్రంలో ముగియనుంది.

ఈ దీక్షకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తమ సంఘీభావాన్ని తెలిపారు. నాగిరెడ్డి మంగళవారం ఉదయం మధుసూదన్ రెడ్డితో పాటు కొద్ది దూరం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు వీరాంజనేయులు, ఎస్సీ సెల్ రాష్ట్ర సభ్యుడు ఎగ్గుల శ్రీనివాసులు పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement