
సాక్షి, హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు ఆర్నవ్ (6) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నీలోఫర్ వైద్యులు బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.
పోలీసులు వివరాల మేరకు.. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌కు చెందిన ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో అర్నవ్ ఇరుక్కుపోయాడు. మూడో ఫ్లోర్ నుంచి కిందకు దిగే క్రమంలో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో లిఫ్ట్- స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడు కేకలు వేశాడు. కేకలు విన్న అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.
అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్ సిబ్బంది సైతం ఘటనా స్థలికి చేరుకున్నారు. లిఫ్ట్-స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడిని నాలుగు గంటల పాటు శ్రమించి వెల్డింగ్ మిషన్‌ల సాయంతో లిఫ్ట్ డోర్‌లు తొలగించి బయటకు తీశారు. అనంతరం, అత్యవసర చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నీలోఫర్ వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment