వివాహిత, ప్రియున్ని చెట్టుకు కట్టేసి.. | Woman, paramour tied to tree, beaten up on panchayat orders in Bihar | Sakshi
Sakshi News home page

వివాహిత, ప్రియున్ని చెట్టుకు కట్టేసి..

Published Fri, Jun 30 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

Woman, paramour tied to tree, beaten up on panchayat orders in Bihar


పట్నా :

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరిని గ్రామస్తులు చితక్కొట్టారు. గ్రామపంచాయితీ ఇచ్చిన ఆదేశాలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా కొట్టారు. ఉత్తర బిహార్లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా వివాహిత ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. 100మంది వరకు గ్రామస్తులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గోపినాథ్ పుర్ గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు దాదాపు 20 గంటల వరకు బంధించారు. ఇద్దరినీ చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు వారిని కాపాడారు.

ఈ ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురు గ్రామస్తులపై, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు మహిళతోపాటూ  ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 ఏళ్ల మహిళ తమ పక్క జిల్లా సితామర్హికి చెందిన 27 ఏళ్ల యువకునితో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలని అనుకుంటున్నానని చెప్పినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. ఈ రెండు ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

8 ఏళ్ల కిందటే వివాహమైనా, గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని సదరు మహిళ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫోన్ చేస్తే ఆమె ప్రియుడు గోపీనాథ్పుర్ నుంచి సితామర్హికి వచ్చేవాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement