డబ్బు అడిగిందని హత్య చేశాడు | Woman stabbed to death by paramour | Sakshi
Sakshi News home page

డబ్బు అడిగిందని హత్య చేశాడు

Published Wed, Oct 1 2014 5:17 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

డబ్బు అడిగిందని హత్య చేశాడు

డబ్బు అడిగిందని హత్య చేశాడు

జైపూర్: తనతో అక్రమ సంబంధంతో పెట్టుకున్న మహిళను ప్రియుడు హతమార్చిన ఘటన రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో చోటు చేసుకుంది. పటాన్ ప్రాంతంలోని బాద్వాడీ గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సుమన్(25) అనే వివాహిత ధర్మపాల్(24)  అనే ట్రక్కు డైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా డబ్బు కోసం అతడిని వేధించసాగింది.

తనకు రూ.10 వేలు కావాలని డిమాండ్ చేయడంతో ఆమెను అంతమొందించాలని ధర్మపాల్ పన్నాగం పన్నాడు. ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన మామగారికి చెప్పాడు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో ధర్మపాల్ ను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా సుమన్ తో పరిచయం ఉందని, పదేపదే తనను డబ్బు అడుగుతుండడంతో ఆమెను హత్య చేశానని ఇంటరాగేషన్ లో ధర్మపాల్ చెప్పాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement