Three Devotees Died In Stampede Outside At Rajasthan Khatu Shyamji Temple - Sakshi
Sakshi News home page

Rajasthan: ఆలయంలో ఘోర ప్రమాదం.. తొక్కిసలాటలో ముగ్గురు మహిళా భక్తులు మృతి

Published Mon, Aug 8 2022 10:38 AM | Last Updated on Mon, Aug 8 2022 11:42 AM

Khatu Shyamji Temple Stampede Three Devotess Dead - Sakshi

జైపూర్‌: రాజస్థాన్ సీకర్‌లోని కాటుశ్యామ్‌జీ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయం గేట్లు తెరవగానే భారీగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని జైపూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్ని పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళా భక్తులు చనిపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషద ఘటన బాధాకరమన్నారు. మృతుల  కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.

చదవండి: దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement