woman stabbed
-
దేశ రాజధానిలో దారుణం
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దోపిడీ యత్నాన్ని అడ్డుకున్న ఓ మహిళ దుండగుడి కత్తిపోట్లకు బలైంది. వాయవ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమ్రాన్ కౌర్ (25) శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో తన రెండేళ్ల కుమార్తె, తల్లితో కలిసి మార్కెట్ నుంచి ఇంటికి వెళుతోంది. తమ ఇంటికి సమీపంలో ఉండగా వెనుక నుంచి వచ్చిన దుండగుడు సిమ్రాన్ మెడలో గొలుసును లాక్కునేందుకు యత్నించాడు. ఆమె అప్రమత్తమై, అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాటలో ఆ దుండగుడు కిందపడి పోయాడు. అనంతరం తిరిగి లేచి, తన వద్ద ఉన్న కత్తితో ఆమె పొట్టలో పొడిచి పరారయ్యాడు. అక్కడికి సమీపంలోనే ద్విచక్ర వాహనంతో సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి మాయమ య్యాడు. తీవ్రంగా గాయపడిన సిమ్రాన్‌ను ఇరుగు పొరుగువారు ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దుండగులను పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ ఉషా రంగ్నానీ తెలిపారు. ఈ ఘటనతో ఇద్దరు వ్యక్తులకు ప్రమేయం ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. दिल्ली के आदर्श नगर में स्नैचिंग का विरोध करने पर गोद मे बच्चा लेकर जा रही महिला के गर्दन पर बदमाश ने दो बार चाकू से किया वार, अस्पताल में महिला की मौत। दिल्ली में आए दिन होती है स्नैचिंग की वारदात, इस वारदात ने फिर उठाए पुलिस पैट्रोलिंग पर सवाल। @indiatvnews @DelhiPolice pic.twitter.com/gsrlIr18la — Abhay parashar (@abhayparashar) February 28, 2021 -
ఫేస్బుక్ ప్రేమ... యువతిపై కత్తితో దాడి
టీనగర్(చెన్నై): ఫేస్బుక్లో పరిచయమైన యువతి వివాహానికి నిరాకరించడంతో ఆమెపై ప్రియుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె సోదరిపైనా దాడిచేసి గాయపరిచాడు. ఈ సంఘటన చెన్నైలోని రాయపేటలో ఆదివారం జరిగింది. వివరాలు.. చెన్నైలోని రాయపురానికి చెందిన షబీవుల్లా(28) ఫేస్బుక్ ద్వారా అనేక మందితో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాయపేట మహ్మద్ ఖాసీం రెండో వీధికి చెందిన ఓ యువతితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల షబీవుల్లా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే అతన్ని వివాహం చేసుకునేందుకు యువతి తిరస్కరించింది. దీంతో షబీవుల్లా ఆదివారం యువతి ఇంటి దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతపెట్టాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె కేకలు విని ఇంట్లోంచి బయటకు వచ్చిన యువతి సోదరిపై కూడా దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్థానికులు షబీవుల్లాను చుట్టుముట్టి పోలీసులకు అప్పగించారు. -
కొడుకైనా అరెస్టు చేయిస్తా.. డ్యూటీ ఫస్ట్!
ఒక మహిళను దారుణంగా తొమ్మిది సార్లు కత్తితో పొడిచిన నేరంలో నిందితుడు స్వయంగా తన కన్న కొడుకని అతడికి తెలిసింది. బంధువులంతా ఆ నేరాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి.. అతడు అరెస్టు కాకుండా చూడాలని కోరారు. కానీ, ఆ తండ్రి మాత్రం వినిపించుకోలేదు. విధి నిర్వహణలో కన్న కొడుకైనా సరే ఆగేది లేదని చెప్పి, అతడిని అరెస్టు చేయించాడు. ఆయన పేరు రాజ్ సింగ్ (52). ఢిల్లీలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన కొడుకు అమిత్ ఒక మహిళను దారుణంగా కత్తితో పొడిచాడు. ఈ కేసును ఛేదించడానికి ఆధారాలు దొరక్క ఢిల్లీ పోలీసులు తల పీక్కుంటున్న సమయంలో నజఫ్‌గఢ్ పోలీసుస్టేషన్లోకి రాజ్‌సింగ్ నడుచుకుంటూ వచ్చి, తన కొడుకును అరెస్టు చేయడానికి ఆ కేసును విచారిస్తున్న అధికారికి సాయం చేస్తానన్నారు. వేరే జిల్లాలో పనిచేస్తున్న రాజ్‌సింగ్ ఏడు రోజుల మెడికల్ లీవ్‌లో ఉన్నారు. అదే సమయంలో నజఫ్గఢ్లో జరిగిన కత్తిపోట్ల వెనక తన కొడుకు ఉన్న విషయం ఆయనకు తెలిసింది. కొద్ది గంటల్లోనే ఆయన ఆ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులను సంప్రదించారు. దానికి ముందు తన బంధువులందరితో మాట్లాడి ఎవరూ అమిత్‌కు షెల్టర్ ఇవ్వద్దని హెచ్చరించారు. అతడు ఏం చేశాడో వాళ్లకు సరిగ్గా తెలియకపోవడంతో.. మహిళను పొడిచేశాడని చెప్పారు. రోషన్‌పురా ప్రాంతంలోని కొంతమంది బంధువుల ఇళ్లకు వెళ్లి, అమిత్ అక్కడ దాగున్నాడేమోనని తనిఖీ కూడా చేశారు. విధి నిర్వహణే ముందని, దాని కంటే ఏదీ ముఖ్యం కాదని రాజ్‌సింగ్ అన్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. తన కన్న కొడుకును కూడా ఇతర నిందితుల్లాగే చూడగలిగే పోలీసులు ఉండటం చాలా అరుదని జాయింట్ పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ చెప్పారు. విధి నిర్వహణ పట్ల ఆయన చిత్తశుద్ధిని తాము గౌరవిస్తామని, ఆయన అందరికీ ఆదర్శప్రాయులని ప్రశంసించారు. -
ఫోన్ ఎత్తలేదని పొడిచి.. పొడిచి చంపేశాడు!
తనను కలవాలని, ఫోన్లో మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పినా.. వినిపించుకోకుండా, తన ఫోన్లు ఆన్సర్ చేయకుండా వదిలేయడంతో కోపం వచ్చిన ఓ వ్యక్తి.. తనతో పాటు ఆఫీసులో పనిచేసే సహోద్యోగినిని కత్తితో కసితీరా పొడిచి పొడిచి చంపేశాడు! ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో జరిగింది. రామ్‌నారాయణ్ రామ్‌సుమేర్ (40) అనే వ్యక్తి.. తన సహోద్యోగిని పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అక్కడికక్కడే ఆమెను పదే పదే కత్తితో పొడిచేసి, అక్కడినుంచి పారిపోయాడు. వాళ్లిద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవారు. పని అయిపోయాక తనను కలవాలని అతడు అడిగేవాడు కానీ, ఆమె మాత్రం పట్టించుకునేది కాదు. విషయం ఆమె భర్తకు తెలియడంతో ఆయన రామ్సుమేర్ను హెచ్చరించారు. దాంతో అతడు మరింత కసి పెంచుకుని, ఆమెను హతమార్చాడు. నిందితుడు, బాధితురాలు ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ ప్రాంతానికి చెందినవారు. మహారాష్ట్రకు ఉద్యోగాల కోసం వలస వచ్చారు. -
కట్టుకున్న భార్యను.. 14 సార్లు పొడిచి చంపాడు!!
కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను 14 సార్లు పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని టాంక్ నగరంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. అతడు పొడిచేందుకు ముందు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో ఆమె కర్ర తీసుకుని భర్త ఆసిఫ్ (24)ను తలమీద కొట్టింది. భార్య షర్మీన్ బానో (32) తనను కొట్టడంతో విపరీతంగా కోపం వచ్చిన ఆసిఫ్.. కత్తి తీసుకుని ఆమెను పొడిచేశాడు. ఆమెను జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా తీవ్రగాయాలతో మరణించింది. తలమీద గాయంతో ఆసిఫ్‌ను కూడా అదే ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అనంతరం అతడిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నేళ్ల క్రితం తన మొదటి భర్త మున్నా నుంచి విడాకులు తీసుకున్న బానో.. ఆసిఫ్‌ను పెళ్లిచేసుకుంది. అతడు ఆమెను తరచు అనుమానించేవాడు. ఇదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. -
డబ్బు అడిగిందని హత్య చేశాడు
జైపూర్: తనతో అక్రమ సంబంధంతో పెట్టుకున్న మహిళను ప్రియుడు హతమార్చిన ఘటన రాజస్థాన్ లోని సికార్ జిల్లాలో చోటు చేసుకుంది. పటాన్ ప్రాంతంలోని బాద్వాడీ గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సుమన్(25) అనే వివాహిత ధర్మపాల్(24) అనే ట్రక్కు డైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా డబ్బు కోసం అతడిని వేధించసాగింది. తనకు రూ.10 వేలు కావాలని డిమాండ్ చేయడంతో ఆమెను అంతమొందించాలని ధర్మపాల్ పన్నాగం పన్నాడు. ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. తర్వాత ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన మామగారికి చెప్పాడు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో ధర్మపాల్ ను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా సుమన్ తో పరిచయం ఉందని, పదేపదే తనను డబ్బు అడుగుతుండడంతో ఆమెను హత్య చేశానని ఇంటరాగేషన్ లో ధర్మపాల్ చెప్పాడని పోలీసులు తెలిపారు.