కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను 14 సార్లు పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని టాంక్ నగరంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది.
కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను 14 సార్లు పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని టాంక్ నగరంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. అతడు పొడిచేందుకు ముందు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో ఆమె కర్ర తీసుకుని భర్త ఆసిఫ్ (24)ను తలమీద కొట్టింది. భార్య షర్మీన్ బానో (32) తనను కొట్టడంతో విపరీతంగా కోపం వచ్చిన ఆసిఫ్.. కత్తి తీసుకుని ఆమెను పొడిచేశాడు.
ఆమెను జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా తీవ్రగాయాలతో మరణించింది. తలమీద గాయంతో ఆసిఫ్ను కూడా అదే ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అనంతరం అతడిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నేళ్ల క్రితం తన మొదటి భర్త మున్నా నుంచి విడాకులు తీసుకున్న బానో.. ఆసిఫ్ను పెళ్లిచేసుకుంది. అతడు ఆమెను తరచు అనుమానించేవాడు. ఇదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది.