husband murders wife
-
కూర మాడిందని భార్యను చంపేసి.. గుట్టుచప్పుడు కాకుండా..!
భువనేశ్వర్: కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటి వెనకాల పూడ్చిపెట్టాడు. ఆపై తన భార్య నెల రోజులుగా కనిపించటం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. అసలు విషయం బయటపెట్టాడు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 35 ఏళ్ల బాధితురాలి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజుల క్రితం బద్మాల్ పంచాయతీలోని రౌత్‌పారా గ్రామానికి చెందిన రంజన్ బడింగ్(36) అనే వ్యక్తి అక్రమంగా వేటాడి తాబేలును ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య సావిత్రిని కూర చేయమని చెప్పాడు. అయితే, వంట చేస్తుండగా అది కాస్త మాడిపోయింది. దీంతో తాగిన మత్తులో ఉన్న నిందితుడు భార్యతో గొడవకు దిగాడు. తీవ్రంగా కొట్టటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను అలాగే వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రి తిరిగి వచ్చే సరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఇంటి వెనకాల ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు. తనపై కోపంతో ఇంట్లోంచి వెళ్లిపోయిందని అందరి నమ్మించే ప్రయత్నం చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. వారిని చూసిన నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, గ్రామస్థులు కలిసి పట్టుకోవటంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: స్నేహితుడిని బెదిరించి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై 10 మంది గ్యాంగ్ రేప్ -
భార్యపై అనుమానంతో తల నరికి...
లక్నో: భార్యపై అనుమానంతో ఓ కిరాతక భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమె తలను తెగ నరికి నేరుగా పోలీస్‌స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బందా ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. చిన్నార్ యాదవ్, విమలా (35) దంపతులు నేతానగర్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా చిన్నార్కు విమలాకు మధ్య వాగ్వివాదం జరిగింది. మాటామటా పెరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. సహనం కోల్పోయిన చిన్నార్ ఓ పదునైన ఆయుధంతో విమలపై దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తలను మొండెం నుంచి వేరు చేసిన నిందితుడు.. దానిని తీసుకుని బబేరు పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. అతని వద్ద నుంచి పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమలా మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు తలను పట్టుకుని పోలీస్‌స్టేషన్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: పన్నెండేళ్ల బాలికపై కజిన్స్ అత్యాచారం) -
భార్యను చంపిన భర్తపై లుకౌట్ నోటీసులు జారీ
చండీఘడ్ : ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న భార్యను స్కూల్ ఆవరణ బయట హత్య చేసిన కేసులో భర్తపై చండీఘడ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. సరబ్జీత్ కౌర్, హర్విందర్ సింగ్‌లు భార్యాభర్తలు. హర్విందర్ ఏపనీ చేయకుండా తిరుగుతుండడంతో దంపతుల మధ్య విభేదాలొచ్చాయి. ఈ నేపథ్యంలో భార్య సరబ్జీత్ ప్రైవేటు టీచర్‌గా పనిచేసుకుంటూ భర్త నుంచి విడిగా ఉంటోంది. దీంతో కక్ష పెంచుకున్న హర్వీందర్ ఆమెను స్కూల్ ఆవరణ బయట దారుణంగా చంపేశాడు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందే భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని సరబ్జీత్ ఫిర్యాదు చేసి ఉండడంతో ఆ దిశగా విచారించిన పోలీసులు భర్త హర్వీందర్ సింగ్‌ను ప్రధాన నిందితుడిగా భావించి అతని కోసం వెతకటం ప్రారంభించారు. అతను ఆజ్ఞాతంలో ఉన్నట్టు తేలడడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, సరబ్జీత్ ఫోన్లో భర్త హర్వీందర్ సింగ్ ఫోన్ నెంబరు కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. దంపతులిద్దరూ విడిగా ఉంటున్నప్పటి నుంచీ కనీసం మాట్లాడుకోలేదని దంపతుల ఉమ్మడి స్నేహితుడొకరు పోలీసులకు తెలిపాడు. మరోవైపు హత్య చేయబడ్డ సరబ్జీత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె బంధువులు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
తాగడానికి డబ్బులు ఇవ్వలేదని...
జీవితాంతం తోడుంటానంటూ అగ్నిసాక్షిగా తాళి కట్టాడు.. మద్యానికి బానిసగా మారాడు.. భార్యను చిత్రహింసలకు గురిచేశాడు.. కూలి డబ్బులతో పాటు పంట విక్రయించగా వచ్చిన సొమ్మును మద్యంకే పోశాడు. చివరకు తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కడతేర్చిన విషాద ఘటన మక్కువ మండలం మూలవలసలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మక్కువ: మద్యం వ్యసనం... పేద, మధ్యతరగతి కుటుంబాలను చిత్తుచేస్తోంది. ఆస్తులు అమ్మించేస్తోంది. ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తోంది. చివరకు ప్రాణాలను తీస్తోంది. దీనికి మక్కువ మండలం మూలవలసలో ఆదివారం జరిగిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. తాగేందుకు డబ్బులు ఇవ్వలేని కట్టుకున్న భార్యనే కత్తితో కడతేర్చాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చిలకమ్మ(34) భర్త ఎరకయ్య ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తాగిన మందు చాలలేదని, జీడిపిక్కలు విక్రయించగా వచ్చిన డబ్బులను ఇవ్వాలని భార్య చిలకమ్మను వేధించాడు. దీనికి ఆమె నిరాకరించి ఇంటిబయటకు వచ్చింది. సీసీరోడ్డుపై కూర్చొని ఆమె చుట్ట చుట్టుకుంటుండగా ఇంటిలో ఉన్న కత్తిని తీసుకొని వచ్చి, మెడపై, నుదుటపై కత్తితో వేటువేశాడు. దీంతో అక్కడికక్కడే నెత్తురు చిమ్ముతూ చిలకమ్మ కుప్పకూలిపోయింది. గ్రామస్తులు వచ్చి చూసేసరికి మరణించింది. పరారయ్యేందుకు ఎరకయ్య ప్రయత్నించగా గ్రామస్తులు పట్టుకుని కర్ర స్తంభానికి కట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మన్యప్రాంతం కావడం, అర్ధరాత్రి సమయంలో వెళ్లేందుకు పోలీసులకు అవకాశంలేకపోవడంతో సోమవారం తెల్లవారుజామున ఎస్ఐ కె.కృష్ణప్రసాదు, ప్రొహిబిషన్ ఎస్ఐ షేక్ శంకర్లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ సీహెచ్ షణ్ముఖరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలు తీస్తున్న నాటుసారా... మన్యం పల్లెల్లో నాటుసారా ఏరులై ప్రవహిస్తోంది. గిరిజనులు సారా మత్తుకు అలవాటుపడుతున్నారు. పనసభద్ర పంచాయతీకి ఒడిశా రాష్ట్రం సమీపంలో ఉండడంతో గిరిజన గ్రామాల్లోకి నాటుసారా సరఫరా అవుతోంది. ఓ వైపు ఎక్సేజ్ అధికారులు దాడులు నిర్వహించి, ఎప్పటికప్పుడు నాటుసారా విక్రయించకుండా అదుపుచేస్తున్నా పరిస్థితి షరామామూలే అవుతోంది. ఎక్సైజ్ కార్యాలయం సాలూరులో ఉండడంతో నిత్యం దాడులు జరగడంలేదు. ఇది సారా వ్యాపారులకు కలిసొస్తోంది. నాటుసారా మత్తు ఎక్కువగా ఉండడంతో పాటు, తక్కువ ధరకు దొరకడంతో గిరిజనులు నాటుసారాకు బానిసలవుతున్నారు. -
భార్యను చంపిన భర్త..ఆత్మహత్య
సాక్షి, కరీమాబాద్: భార్యను గొడ్డలితో నరికి తాను సమీపంలోని రైలు పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని అండర్ రైల్వేగేట్ 23వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటలోని హనుమాన్ గుడి వీధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ పోలీసులు, కుటుంబ సభ్యుల, స్థానికుల కథనం ప్రకారం... ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో చాలా కాలంగా ఊగ చిన్న,కన్నమ్మ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఉగ చిన్న (57)తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ తన భార్య కన్నమ్మ(52)తో గొడవకు దిగడంతో పాటు కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కన్నమ్మను మద్యం మత్తులో ఉన్న చిన్న అతి కిరాతరంగా కన్నమ్మను గొడ్డలితో తలపై నరికి చంపాడు. అక్కడి నుంచి పారిపోయిన చిన్న సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళం చెవి కోసం మనవరాలు ప్రియదర్శిని కన్నమ్మ చనిపోయి ఉన్న విషయాన్ని చూసి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ లోగా మిల్స్‌కాలనీ సీఐ దయాకర్, ఎస్సై భీమేష్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు తీసుకుని పంచనామా చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అదే విధంగా వరంగల్ జీఆర్పీ పోలీసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న చిన్న మృతదేహాన్ని సైతం ఎంజీఎంకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా కన్నమ్మ–చిన్నలకు నాగలక్ష్మి, శ్రీలత, లావణ్య, శివ ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడని స్థానికులు చెబుతున్నారు. మిన్నంటిన కూతుళ్ల రోదనలు అటు తల్లిని చంపి, ఇటు తండ్రి కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కూతుర్లు నాగలక్ష్మి, లావణ్యల రోదనలు మిన్నంటాయి. తన తల్లి తమను పండ్లు, కూరగాయలు, కంకులు అమ్మి సాదుకుందని, తమకు ఎలాంటి లోటు లేకుండా పెంచిందని ఏడుస్తూ గుర్తు చేశారు. తమ తండ్రి చిన్న తాగుడుకు బానిసై తమ కుటుంబాన్ని ఏనాడు పట్టించుకోలేదని బోరున విలపించారు. -
కట్టుకున్న భార్యను.. 14 సార్లు పొడిచి చంపాడు!!
కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను 14 సార్లు పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని టాంక్ నగరంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. అతడు పొడిచేందుకు ముందు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో ఆమె కర్ర తీసుకుని భర్త ఆసిఫ్ (24)ను తలమీద కొట్టింది. భార్య షర్మీన్ బానో (32) తనను కొట్టడంతో విపరీతంగా కోపం వచ్చిన ఆసిఫ్.. కత్తి తీసుకుని ఆమెను పొడిచేశాడు. ఆమెను జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా తీవ్రగాయాలతో మరణించింది. తలమీద గాయంతో ఆసిఫ్‌ను కూడా అదే ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అనంతరం అతడిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నేళ్ల క్రితం తన మొదటి భర్త మున్నా నుంచి విడాకులు తీసుకున్న బానో.. ఆసిఫ్‌ను పెళ్లిచేసుకుంది. అతడు ఆమెను తరచు అనుమానించేవాడు. ఇదే ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది.