
లక్నో: భార్యపై అనుమానంతో ఓ కిరాతక భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమె తలను తెగ నరికి నేరుగా పోలీస్‌స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బందా ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. చిన్నార్ యాదవ్, విమలా (35) దంపతులు నేతానగర్‌లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా చిన్నార్‌కు విమలాకు మధ్య వాగ్వివాదం జరిగింది.
మాటామటా పెరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. సహనం కోల్పోయిన చిన్నార్ ఓ పదునైన ఆయుధంతో విమలపై దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తలను మొండెం నుంచి వేరు చేసిన నిందితుడు.. దానిని తీసుకుని బబేరు పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. అతని వద్ద నుంచి పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమలా మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు తలను పట్టుకుని పోలీస్‌స్టేషన్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(చదవండి: పన్నెండేళ్ల బాలికపై కజిన్స్ అత్యాచారం)
Comments
Please login to add a commentAdd a comment