beheads
-
వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు
ఇటీవల కాలంలో మనుషులు చాల ఘోరంగా తయారవుతున్నారు. ఏదో వివాదం తలెత్తితే చాలు హత్యలు దాక వెళ్లిపోతున్నారు. పైగా ఏదో ఘనకార్యం చేసినట్లుగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. వినేందుకే జుగుప్పకరంగా ఉంటున్నాయి ఆ ఘటనలు. అచ్చం అలాంటి ఘటనే జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో 20 ఏళ్ల గిరిజన యువకుడు 24 ఏళ్ల తన బంధువుని అతి కిరాతకంగా తల నరికి చంపాడు. ఈ ఘటన ముర్హు ప్రాంతంలో చోటు చేసుకుంది. 55 ఏళ్ల తండ్రి తన కొడుకు కను ముండా డిసెంబర్ 1న ఇంట్లో ఒక్కడే ఉన్నాడనొ, మిగతావాళ్లంతో పొలాలకు వెళ్లారని చెప్పారు. తాము ఇంటికి తిరిగి వచ్చి చూడగా కను కనిపించలేదు. దీంతో మృతుడి తండ్రి కొడుకు కోసం గాలించి విఫలమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో తన మేనల్లుడు సాగర్ ముండా, అతని స్నేహితులే తన కొడుకుని అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలించడం ప్రారంభించారు. విచారణలో... నిందితులు కనుని దారుణంగా నరికి చంపి, తెగిపడిన తలతో నిందితుడు, అతని స్నేహితులు సెల్ఫీలు దిగారని చెప్పారు. మృతుడి మొండం గోప్లా అడవిలోనూ తల 15 కిలో మీటర్ల దూరంలో దుల్వా తుంగ్రీ ప్రాంతంలో కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐతే ఓ భూమి విషయమై మృతుడి కుటుంబానికి, నిందితుల కుటుంబాలకి మధ్య చాలా కాలంగా ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని చెప్పారు. పోలీసులు మృతుడితో సహా నిందితుల దగ్గర ఉన్న ఐదు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, ఎస్యూవీ కారుని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితుల తోపాటు ప్రధాన నిందితుడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: భర్త క్రూరత్వం! భార్య అనారోగ్యంతో ఉందని...) -
పాలు తక్కువ ఇస్తోందని ఇంటిముందే నరికి పూడ్చి
జైపూర్: మూఢనమ్మకంతో ఒంటెను దారుణంగా హత్య చేశాడో ఓ వ్యక్తి. ఒంటెను చంపేసి తన ఇంటి ముందే గుంతలో పూడ్చిపెట్టాడు. కొన్నాళ్లకు పూడ్చిపెట్టిన ఒంటె తల బయటకు రావడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. అయితే అతడి చంపింది రాష్ట్ర జంతువుగా ఉన్న ఉంటెను కావడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒంటెను హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా..) సూరజ్‌పోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోవర్ధన్ విలాస్ ప్రాంతంలో రాజేశ్ అహిర్ డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడికి 24కు పైగా ఆవులు ఉన్నాయి. అయితే డెయిరీలోని ఆక ఆవు అనారోగ్యం పాలైంది. పాలు తక్కువగా ఇస్తుండడంతో ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని అతడికి తెలిసిన వ్యక్తి చేతన్‌ను ఆశ్రయించాడు. చేతన్ తన తండ్రి శోభాలాల్‌కు పరిచయం చేశాడు. శోభాలాల్ మూఢనమ్మకాలు వదిలిస్తానని మంత్రతంత్రాలు చేస్తుంటాడు. ఒంటె తల నరికి ఇంటి వెలుపల పాతిపెడితే సమస్య పరిష్కారమవుతుందని శోభాలాల్ రాజేశ్ అహీర్‌కు చెప్పాడు. మంత్రగాడు చెప్పినట్టు రాజేశ్ ఒంటెను తీసుకువచ్చి తన స్నేహితుల సహాయంతో ఒంటె మెడను నరికి చంపేశాడు. అనంతరం ఒంటె మొండాన్ని ఇంటి ముందు పాతిపెట్టాడు. కొన్ని రోజులకు ఒంటె మొండెం పోలీసులకు చిక్కింది. విచారణ చేపట్టగా ఓ వ్యక్తి రాజేశ్ పేరు చెప్పాడు. అనంతరం పోలీసులు రాజేశ్‌ను విచారించగా నేరం అంగీకరించాడు. అక్కడ ఒంటెను చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీంతో రాజేశ్‌తో పాటు అతడి స్నేహితుడు చేతన్, అతడి తండ్రి శోభాలాల్‌తో పాటు అతడి స్నేహితుడు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. మూఢ నమ్మకాలతో ఒంటెను రాజేశ్ హత్య చేశాడని సూరజ్‌పోల్ పోలీస్ అధికారి డాక్టర్ హనుమంత్ సింగ్‌రాజ్ పురోహిత్ తెలిపారు. రాష్ట్ర జంతువుగా ఉన్న ఒంటెను హతమార్చడంతో ఈ కేసును తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. చదవండి: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
భార్యపై అనుమానంతో తల నరికి..
నారాయణఖేడ్: అనుమానం పెనుభూత మైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడో భర్త. శరీరం నుంచి తలను వేరు చేసి.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఇంటి గుమ్మం ఎదుట పడేశాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జుర్రు సాయిలు, అనుషమ్మ (35) దంపతులు. తన భార్యఅనంతసాగర్ గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుందని సాయిలు అనుమానం వ్యక్తం చేసేవాడు. జైపాల్‌రెడ్డి నారాయణఖేడ్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వివాహేతర సంబంధం విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన సాయిలు.. గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. మొండెంను ఇంటికి కొద్ది దూరంలో పడేశాడు. తలను వేరు చేసి జైపాల్‌రెడ్డి ఇంటి గుమ్మం ముందు ఉంచాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది. (చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం) ఘటనాస్థలంలో రోధిస్తున్న కుటుంబ సభ్యులు, గుమిగూడిన గ్రామస్తులు -
భార్యపై అనుమానంతో తల నరికి...
లక్నో: భార్యపై అనుమానంతో ఓ కిరాతక భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమె తలను తెగ నరికి నేరుగా పోలీస్‌స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బందా ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. చిన్నార్ యాదవ్, విమలా (35) దంపతులు నేతానగర్లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా చిన్నార్కు విమలాకు మధ్య వాగ్వివాదం జరిగింది. మాటామటా పెరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. సహనం కోల్పోయిన చిన్నార్ ఓ పదునైన ఆయుధంతో విమలపై దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె తలను మొండెం నుంచి వేరు చేసిన నిందితుడు.. దానిని తీసుకుని బబేరు పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. అతని వద్ద నుంచి పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమలా మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు తలను పట్టుకుని పోలీస్‌స్టేషన్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: పన్నెండేళ్ల బాలికపై కజిన్స్ అత్యాచారం) -
టీచర్ తలనరికి.. రోడ్డుపై తిరిగాడు
రాంచీ : జార్ఖండ్‌లోని ఓ ప్రైమరీ స్కూల్ టీచర్‌ను మతిస్థిమితం లేని వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సుకురు హీరెసా(35) అనే మహిళ సెరైకెలా ఖర్సవాన్ జిల్లా ఖప్సారై గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. మతిస్థిమితం లేని హరి హెంబ్రోం(45) ఆమె వైపు ఎప్పుడు అదోలా చూస్తు ఉండేవాడు. మంగళవారం సుకురు పాఠశాలకు వెళ్లిన తర్వాత హరి ఆమెను స్కూల్ బయటకు రావాలని పిలిచాడు. సుకురు స్కూలు బయటకు రాగానే ఆమెపై పదునైన ఆయుధంతో విచక్షణ రహితంగా దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా సుకురు తల నరికి.. ఆమె తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరగసాగాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని హరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియలేదు. -
తనపై అత్యాచారం చేశాడని..
లక్నో: ఓ వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక(13) అతడి కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. మాంసం ముద్దగా మారిన బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండంతో ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం తనపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కొడుకు అమిత్(5)ను బాధితురాలు పథకం ఎత్తుకెళ్లి దారుణంగా హత్య చేసింది. ఆ బాలుడి తల నరికి నరికి.. ముఖాన్ని గుర్తుపట్టలేనంతగా రాళ్లతో చిధ్రం చేసింది. అనంతరం మృతదేహాన్ని పాలిథీన్ బ్యాగ్ లో చుట్టి కిరోసిన్ పోసి నిప్పంటించింది. అయితే మరునాడు ఆ మూటను కుక్కలు వీధిలోకి లాక్కొచ్చాయి. దీంతో సగం కాలిన మృతదేహపు శరీర భాగాలు బయటపడ్డాయి. ఆ దృశ్యాలను చూసిన పోలీసులు సైతం నివ్వెర పోయారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగారు. చివరిసారిగా అమిత్‌తో ఉన్న బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఆమె నేరాన్ని అంగీకరించింది. బాలుని తండ్రి రింకూ.. తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిపింది. అందుకు ప్రతీకారంగానే తాను ఈ హత్య చేసినట్టు ఒప్పుకుంది. దీంతో రింకూతోపాటు బాలికపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.