
ప్రతీకాత్మక చిత్రం
రాంచీ : జార్ఖండ్‌లోని ఓ ప్రైమరీ స్కూల్ టీచర్‌ను మతిస్థిమితం లేని వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సుకురు హీరెసా(35) అనే మహిళ సెరైకెలా ఖర్సవాన్ జిల్లా ఖప్సారై గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. మతిస్థిమితం లేని హరి హెంబ్రోం(45) ఆమె వైపు ఎప్పుడు అదోలా చూస్తు ఉండేవాడు. మంగళవారం సుకురు పాఠశాలకు వెళ్లిన తర్వాత హరి ఆమెను స్కూల్ బయటకు రావాలని పిలిచాడు. సుకురు స్కూలు బయటకు రాగానే ఆమెపై పదునైన ఆయుధంతో విచక్షణ రహితంగా దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా సుకురు తల నరికి.. ఆమె తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరగసాగాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని హరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియలేదు.
Comments
Please login to add a commentAdd a comment