woman Teacher
-
దీన్నే పిచ్చి అంటారండి ! మహిళా టీచర్ క్రేజీ రీల్ వైరల్
సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వడం కోసం, లైక్‌ల కోసం యూజర్లు చేస్తున్న పనులకు హద్దు లేకుండా పోతోంది. తాజాగా ఒక ఉపాధ్యాయురాలు పేపర్లు దిద్దుతూ కూడా రీల్ చేసింది. దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనిపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.. కట్ చేస్తే...బిహార్‌లోని పాటలీ పుత్ర యూనివర్శిటీ (పీపీయూ) చెందిన టీచర్ పరీక్ష పేపర్ కరెక్షన్స్ చేస్తోంది. దీన్ని ఏకంగా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విచిత్ర విచిత్రమైన ఫన్నీ కామెంట్స్ చేశారు. पीपीयू एग्जाम का कॉपी जांचने का रील्स इंस्टाग्राम पर वायरल, मैडम पर FIR दर्ज। pic.twitter.com/GlnZhH4Yuk— छपरा जिला 🇮🇳 (@ChapraZila) May 26, 2024 హే మేడమ్, కొత్తగా పెళ్లైన పెళ్లికూతురులా కనిపిస్తోంది' అని ఒకరంటే, దీన్నే పిచ్చి అంటారండి అంటూ మరొకరు ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఒక టీచర్‌గా మీరు చేయాల్సిన పని ఇదేనా అంటూచాలామంది మండి పడ్డారు. ఇలాంటివాళ్లు సిగ్గుతో చచ్చిపోవాలి.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదైనాయి అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. చివరికి ఇది ఉన్నతాధికారులదాకా చేరడంతో టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
Savitribai Phule: మహిళా విద్యా ప్రదాత
విద్య ద్వారా సమాజంలో ఉన్న అసమానతలను చదును చేయాలని... 18వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు ప్రయత్నించారు. మొక్కవోని వారి దీక్ష వల్ల అప్పటి సమాజంలో హీన స్థితిలో ఉన్న స్త్రీల జీవితాలకు అండ దొరికింది. భర్త జ్యోతిబా ఫూలే ప్రోత్సాహంతో స్వయంగా చదువుకున్న సావిత్రీబాయి దేశంలో మహిళా విద్యకు దారిదీపం అయింది. 1840లో 9 ఏళ్ల సావిత్రీబాయి వివాహం 13 ఏళ్ల జ్యోతిబా ఫూలేతో జరిగింది. స్త్రీలకు విద్య చాలా అవసరం అని గ్రహించి ముందు తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పాడు జ్యోతిబా. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్ట మొదట ప్రవేశపెట్టిన వాడు జ్యోతిబాఫూలే. తన పొలం దగ్గర మామిడి చెట్టు నీడలో మొట్ట మొదటి పాఠశాల పెట్టాడు. ఆ పాఠశాలలో ఆయన అక్క సుగుణబాయి, భార్య సావిత్రీ బాయి విద్యార్థులు! స్త్రీ విద్యా ప్రయోగశాలగా ఆ పాఠశాల చరిత్రలో మిగిలిపోయింది. 1848లో ఓ భవంతిలో స్త్రీల కోసం పాఠశాలను ఏర్పాటు చేశాడు ఫూలే. చదువు నేర్చుకునే క్రమంలో సావిత్రీబాయి ఎన్నో పుస్తకాలు చదివి స్త్రీ ఎంత దారుణ స్థితిలో ఉందో అర్థం చేసుకుంది. అదే సమయంలో అమెరికా నల్లజాతి వివక్ష వ్యతిరేక పోరాట నాయకులు థామస్ క్లార్క్ జీవిత చరిత్ర చదివి స్ఫూర్తి పొందింది. బ్రాహ్మణ స్త్రీలతోపాటూ బహు జన స్త్రీ జనోద్ధరణకు భర్తతో పాటూ నడుం బిగించింది. స్త్రీ జనోద్ధరణకు సంబంధించిన అన్ని కార్యక్రమాలకూ ఆమే ఇన్చార్జ్గా వ్యవహరించింది. 1851లో పూణేలో అమ్మాయిల కోసం మరో స్కూలు ప్రారంభించారు. మెల్లమెల్లగా పూలే దంప తులు 18 పాఠశాలలను స్థాపించారు. అయితే నాటి ఛాందసవాదులు సావిత్రీబాయి మామగారిని... ఆయన కొడుకూ, కోడలూ శ్రాస్త విరుద్ధంగా వ్యవహ రిస్తున్నారని రెచ్చగొట్టారు. దీంతో ఫూలే దంపతులను మామగారు ఇంటి నుండి వెళ్లగొట్టారు. అయినా ఆ దంప తులు తమ మార్గాన్ని మార్చు కోలేదు. ఆత్మహత్య చేసుకోబోతున్న కాశీ బాయి అనే గర్భవతి అయిన బ్రాహ్మణ వితంతు మహిళను కాపాడి ఆమె కన్న పిల్లవాడిని దత్తత తీసుకుని ‘యశ్వంతరావు’ అని పేరు పెట్టుకొని పెంచి పెద్ద చేశారు. 1876–77లో మహా రాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చి జనాలు ఆకలితో అలమటిస్తుంటే తమ ‘సత్య శోధక సమాజ్’ ద్వారా ఆహార సేకరణ చేసి ఆదుకున్నారు. ఆమె మంచి ఉపాధ్యాయురాలే కాదు, కవయిత్రి కూడా. ఆమె రచించినటువంటి ‘కావ్య పుష్పాలు’ అనే సంపుటి చాలా గొప్పది. ప్లేగు వ్యాధి గ్రస్థులకు సేవ చేస్తూ ఆ వ్యాధికే బలై 1897 మార్చి 10వ తేదీన తుది శ్వాసవిడిచి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మహనీయురాలు సావిత్రీబాయి. (క్లిక్ చేయండి: ‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!) – తండ సదానందం, టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ (జనవరి 3 సావిత్రిబాయి ఫూలే జయంతి) -
khammam: కరోనాతో ఉపాధ్యాయురాలి కన్నుమూత
సాక్షి, జూలూరుపాడు(ఖమ్మం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం నెలకొంది. పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి.. చుంచుపల్లి మండలం ఎస్.కె.నగర్లో నివాసముంటున్నారు. శనివారం వరకు విధులు నిర్వర్తించిన ఆమెకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న విజయలక్ష్మి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూక్యా వీరబాబు, ఎంఈవో గుగులోత్ వెంకట్ ఆధ్వర్వంలో 124 మంది విద్యార్థులు, 16 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు మధ్యాహ్న భోజన వర్కర్లకు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. బంగారం ఇవ్వడం ఆలస్యమైందని.. -
దేశం కోసం మహిళా టీచర్ సాహసం
సాక్షి, చెన్నై: దేశ సమైక్యతను కాంక్షిస్తూ మహిళా టీచరు బుల్లెట్ పయనానికి శ్రీకారం చుట్టారు. తమిళనాడుతో అనుబంధం ఉన్న టీచర్ రాజ్యలక్ష్మి ఢిల్లీలో పని చేస్తున్నారు. ఈమె దేశంపై యువతలో చైతన్యం, అవగాహన కల్పించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మదురై గోరిపాలయం నుంచి ఆమె తన ప్రయాణం మొదలెట్టారు. బుల్లెట్ నడుపుకుంటూ, మార్గమధ్యలో ఆయా ప్రాంతాల్లో అవగాహన కల్పించి, దేశ సమైక్యతే లక్ష్యంగా ముందుకు సాగారు. ఆమె వెన్నంటి క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన 12 మంది, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మరో 12 మంది యువకులు మోటారు సైకిళ్ల మీద వెళ్లనున్నారు. చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఢిల్లీ మీదుగా హిమాచల్ ప్రదేశ్ వరకు 4450 కి.మీ దూరం 19 రోజుల పాటు ఈ ప్రయాణం సాగనుంది. అలాగే ధర్మపురి జిల్లా పెన్నగరం సమీపంలోని ఒప్పగౌండన్ హల్లిలో సమాచార శాఖ నేతృత్వంలో గ్రంథాలయం నిర్మించారు. ఇక్కడే భరతమాత స్మారక ఆలయాన్ని సైతం ఏర్పాటు చేయగా, వీటిని మంత్రి స్వామినాథన్ ప్రారంభించారు. -
Priyanka Kumari: స్మార్ట్ ఫోనే మనకు అన్నీ చెప్పేస్తుంది
ప్రియాంక కుమారి పంచాయితీ స్కూల్ టీచర్. అయితే ఏడాదిగా ఆమె ‘డిజీ–శావీ’ కూడా! లాక్డౌన్లో టీచర్స్ అంతా పిల్లలకు డిజిటల్ క్లాసులు తీసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు.. సాటి టీచర్స్ అందరికీ ఆమె డిజిటల్ టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చో ఆన్లైన్ పాఠాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 250 మంది ప్రభుత్వ మహిళా టీచర్లను డిజిటల్ వారియర్లుగా మలిచారు. నదీతీరాలను అనుసరించి బిహార్ నాలుగు భాగాలుగా ఉంటుంది. ఆంగిక, భోజ్‌పురి, మగధి, మిథాలి. ప్రియాంక (36).. మిథాలి ప్రాంత పరిధిలోకి వచ్చే సీతామఢి లోని ప్రభుత్వ పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల టీచర్. సీతామఢి పట్టణం, జిల్లా కేంద్రం కూడా. బిహార్‌లోని పై నాలుగు ప్రాంతాలు ఒకే భాషను మాట్లాడతాయి కనుక మాండలికం తప్ప భాష అర్థం కాకపోవడం ఉండదు. అయితే గత ఏడాది.. లాక్డౌన్ మొదలయ్యాక స్కూలు పిల్లలకు డిజిటల్ నాలెడ్జ్ అనేది నేర్చుకుని తీరవలసిన ఒక ‘భాష’ అయింది. అది పిల్లలకే కాదు, వాళ్ల తల్లిదండ్రులకు, టీచర్స్‌కి కూడా తెలియని భాష. ఆ భాషలోనే ఆన్లైన్ క్లాసులు జరగాలి. ఎలా? ఇందుకు ప్రియాంకకు ఒక ఆలోచన వచ్చింది. తనే టీచర్లందరికీ డిజిటల్ నాలెడ్జ్‌ని ఇస్తే! వాళ్లకు ఇస్తే పిల్లలకూ వచ్చేస్తుంది. పాఠాలు మాత్రమే చెప్పడం కాకుండా.. ఈమెయిల్స్ క్రియేట్ చెయ్యడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, సోషల్ మీడియాను ఫాలో అవడం, అక్కడొచ్చే పోస్టులలో పిల్లలకు పనికొచ్చేవేమైనా ఉంటే షేర్ చేయడం, ఇంకా సెక్యూరిటీ రూల్స్, ఇతర డిజిటల్ సదుపాయాలు, సౌకర్యాల గురించి ప్రియాంక సాటి టీచర్లకు చెప్పడం మొదలుపెట్టారు. మొదట 20 టీచర్లతో ప్రారంభమైన ఆమె శిక్షణ ఇప్పుడు సీతామఢి జిల్లాలోని పంచాయితీలో దాదాపు 250 మంది మహిళా టీచర్లకు చేరింది. మరి ప్రియాంకకు అంత పరిజ్ఞానం ఎక్కడిది? ‘‘ఇదేమంత పెద్ద పరిజ్ఞానం కాదు. ఆసక్తి ఉంటే స్మార్ట్ ఫోనే మనకు అన్నీ చెప్పేస్తుంది’’ అని నవ్వేస్తున్నారు ప్రియాంక. ఈ డిజిటల్ శావీ (డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కలిగిన వ్యక్తి) దగ్గర మెళకువలు నేర్చుకున్న టీచరమ్మలంతా ఇప్పుడు పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా ఆన్లైన్ పాఠాలు చెప్పగలుగుతున్నారు. కేవలం పాఠాలే కాదు, నిత్య జీవితంలో పనికొచ్చే డిజిటల్ విశేషాలను కూడా. ప్రియాంక బి.ఇడి. చేశారు. ‘ఎడ్యుకేషన్’లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. 1985లో ఆమె పుట్టేనాటికి డిజిటల్ టెక్నాలజీ కాదు కదా.. ఇండియాలో కలర్ టీవీలు కూడా లేవనే చెప్పాలి. ఆమెకు పదేళ్లు వచ్చేసరికి అప్పుడప్పుడే దేశం ఇంటర్నెట్కు అలవాటు అవుతోంది. ఆమె డిగ్రీ అయ్యేనాటికి మొబైల్ ఫోన్లు, ఆ తర్వాత పదేళ్లకు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. డిగ్రీ అయిన రెండేళ్లకు 2007 ఆమెకు సీతామఢిలో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పెళ్లి కూడా అయింది. ఈ మధ్యలో ఎక్కడా ప్రియాంక డిజిటల్ ప్రపంచంతో టచ్‌లోనే లేరు. నెట్లోకి ఫేస్బుక్ ప్రవేశించాక ఆమెకు సోషల్ మీడియా అనే వండర్ వరల్డ్‌పై ఆసక్తి కలిగింది. ఆ క్రమంలోనే మహిళల ఉపాధికి, సంక్షేమానికి ప్రయోజనకరంగా ఉండే టెక్నాలజీపై ఆమె శ్రద్ధ పెట్టారు. కొత్తకొత్త సంగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, వాటిని నేర్చుకుంటూ వచ్చారు. అదిప్పుడు ఈ లాక్డౌన్లో తనకే కాకుండా, తక్కిన టీచర్లందరికీ ఉపయోగపడుతోంది. ‘‘2020 జూన్ నుంచి నేను మహిళా టీచర్లకు ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాను. కష్టం అనుకుని నేర్చుకోడానికి సంశయించిన వాళ్లు.. ప్రాక్టికల్‌గా చూసి, ఆసక్తి కలిగి డిజిటల్ టెక్నాలజీని ఇష్టపడటం ఆరంభించారు..’’ అంటున్నారు ప్రియాంక. తన ప్రయత్నానికి ఆమె ‘డిజిటల్ ఎంపవర్మెంట్ ఇనిషియేటివ్’ అని పేరు పెట్టారు. ‘‘అందులో చేరకుముందు వరకు నేను నా స్మార్ట్ ఫోన్‌ని కాల్స్ చెయ్యడానికి, వాట్సాప్ మెసేజ్‌లు చూడ్డానికి మాత్రమే వాడేదాన్ని. ప్రియాంక ఇచ్చిన ఆన్లైన్ ట్రైనింగ్‌తో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పడు నాకు ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. వాటిని భద్రంగా యూజ్ చెయ్యడానికి అవసరమైన సైబర్ సెక్యూరిటీ టిప్స్ కూడా ప్రియాంకే చెప్పింది. ఇప్పుడైతే జూమ్ మీటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాను’’ అని బథనహా మిడిల్ స్కూల్లో పని చేసే శివానీ అనే సీనియర్ టీచర్ చెబుతున్నారు. యోగబనా మిడిల్ స్కూల్ టీచర్ మధు కూడా.. ‘‘ఇప్పడు నేను ఆన్లైన్ వర్క్ ఏదైనా నా అంతట నేను చేయగలను. ఇదంతా నాకు ప్రియాంకే నేర్పించారు’’ అని అంటున్నారు. ప్రియాంక దగ్గర ఆన్లైన్ శిక్షణకు చేరిన వారు మొదటి రోజున.. ‘‘నేను నేర్చుకున్నాక మిగతా టీచర్లకు నేర్పిస్తాను’’ అని ప్రతిజ్ఞ పలకాల్సి ఉంటుందట! సీతామఢిలో ఇప్పుడు ఇంటింటికీ తెలిసిన పేరు ప్రియాంక. విద్యాశాఖ ఎప్పుడు ఏ డిజిటల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించినా అందులోని సందేహాల గురించి మొదట ప్రియాంకకే ఫోన్ వెళుతుంది. ‘‘ప్రపంచాన్ని ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ నడిపిస్తోంది. ఎప్పటికప్పుడు మనం ‘అప్డేట్’ కాకపోతే వెనకపడిపోతాం. పైగా అమ్మాయిలకు ఇప్పుడు చదువు, ఉద్యోగం అంటే కేవలం డిగ్రీలు, ఫైల్స్ మాత్రమే కాదు.. డిజిటల్ నాలెడ్జి కూడా. మహిళలు, బాలలకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. వాటన్నిటకీ కూడా తొలి వేదిక ఆన్లైన్. ఆన్‌లైన్‌ని చూసి భయపడితే లైన్లోనే ఉండిపోతాం. లోపలికి అడుగుపెట్టాలి. లబ్దిపొందాలి’’ అని ప్రియాంక ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతున్నారు. -
విద్యార్థితో మహిళా టీచర్ వాంఛ..
విద్యాబుద్ధులు నేర్పి భావిపౌరులుగా తీర్చిదిద్దాల్సిన పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ మహిళా టీచర్ ఆ వృత్తికే కళంకం తెచ్చారు. తన స్కూల్లో చదువుతున్న విద్యార్థితో లైంగిక వాంఛ తీర్చుకున్నారు. వ్యవహారం బయటపడడంతో కటకటాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లూసియానాలోని మిడిల్ స్కూల్లో ఓ మహిళ(34) సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. తన స్కూల్ విద్యార్థిని ఇంటికి పిలిపించుకుని లైంగిక వాంఛను తీర్చుకునేది. ఇలా కనీసం 9 సార్లు ఆ మహళా టీచర్ ఇద్దరు విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె తన నగ్న ఫోటోలు, వీడియోలను కూడా స్టూడెంట్‌కు ఈ-మెయిల్ పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. టీచర్ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో స్కూల్ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. ఈ మెయిల్లో నగ్న ఫోటోలు శారీరక సంబంధం కోసం ముందుగా స్కూల్‌కు సంబంధించిన అధికారిక ఈ-మెయిల్ ద్వారానే టీచర్ స్టూడెంట్‌కి ఈ-మెయిల్ పంపేది. ఆ తర్వాత పర్సనల్ ఈ-మెయిల్ ద్వారా ఇద్దరు మాట్లాడుకునేవారు. తన నగ్న ఫోటోలు, వీడియోలను స్టూడెంట్‌కి పంపి అనంతరం తన మనసులోని మాట చెప్పేది. దానికి అంగీకరించిన విద్యార్థిని ఇంటికి రప్పించుకొని అఘాయిత్యానికి పాల్పడేవారు. గంజాయి ఇచ్చి.. ఈ మెయిల్ ద్వారా నగ్న ఫోటోలు పెట్టి విద్యార్థిని వలలో వేసుకున్న టీచర్.. అనంతరం తన కారులో అతన్ని ఇంటికి తీసుకువెళ్లేది. అక్కడ ఆ విద్యార్థితో లైంగిక కోరిక తీర్చుకొని ఇంటికి పంపించేది. స్టూడెంట్లో కామవాంఛ పెంచేందుకు గంజాయిలాంటి మాధక ద్రవ్యాన్ని కూడా అతనికి ఇచ్చేదని పోలీసులు పేర్కొన్నారు. ఓ విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని విచారణ చేపట్టగా ఈ ‘నగ్న’సత్యాలు బయటపడ్డాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోఉండి విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించిన సదరు మహిళను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
టీచర్‌ను తాళ్లతో కట్టి.. రోడ్డుపై ఈడ్చి..
బలుర్ఘాట్: రోడ్డు వేసేందుకు స్థలం ఇవ్వడం లేదన్న కారణంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని కాళ్లు, చేతులు కట్టేసి, రోడ్డుపై ఈడ్చిన దారుణ దుర్ఘటన పశ్చిమబెంగాల్లోని దీనజ్‌పూర్‌లో జరిగింది. ఆ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టడంతో రాజకీయ సెగ అలుముకుంది. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గంగారాంపూర్ బ్లాక్‌కు చెందిన ప్రభుత్వ టీచర్, బీజేపీ మద్దతుదారు స్మృతికానా దాస్ స్థలంలో రోడ్డు నిర్మాణం చేపట్టేలా పంచాయతీ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి ఆమె అంగీకరించకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఉప ప్రధాన్ (డిప్యూటీ చీఫ్) అమల్ సర్కార్.. స్మృతికానా దాస్ కుటుంబాన్ని హింసించారు. టీచర్ కాళ్లను, చేతులను కట్టేయడంతో ఆమె కిందపడిపోవడం, ఆమెను కొందరు దుండగులు దాదాపు 30 అడుగులు ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకెళ్లి బంధించడం వీడియోలో రికార్డయ్యింది. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో గూండాయిజం సాగుతున్నదనడానికి ఇది ఉదాహరణ అంటూ విమర్శించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు తృణమూల్ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ చెప్పారు. -
మహిళా టీచర్‌పై ఇంటి ఓనర్ కొడుకు..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో దారుణం జరిగింది. ఇంట్లో కిరాయికి ఉంటున్న 50 ఏళ్ల మహిళా టీచర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు యజమాని కొడుకు. కాఫీలో మత్తుమందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని జిన్నాపార్క్ ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయ జంట అదే ప్రాంతంలో ఓ ఇంటిని కిరాయికి తీసుకొని నివాసం ఉంటుంది. వృత్తి రిత్యా వేరు వేరు ప్రాంతాలకు వెళ్తునందున.. సెలవు దినాల్లో మాత్రమే వచ్చి అక్కడ గడిపేవారు. కాగా, అక్టోబర్ 1న ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో ఇంటి యజమాని కుమారుడే దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో దొంగతనం విషయాన్ని ఆ యువకుడు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇంటి యజమాని ఆ వస్తువులు తిరిగి కొనిస్తాని చెప్పడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. వారం రోజుల అయినప్పటికీ వస్తువులు కొనివ్వకపోవడంతో మహిళా టీచర్ భర్త ఇంటి యజనమానిని నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన యజమాని.. వారి కూతురిని కిడ్నాప్ చేసి హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో వస్తువులను అడగడం మానేశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 15న ఇంటి యజమాని పెద్ద కుమారడు, యువకుడు మహిళా టీచర్ ఇంటికి వెళ్లాడు. తన తమ్ముడు దొంగిలించిన వస్తువులను తిరిగి ఇస్తానని తన ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం కాఫీలో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళా టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని యుకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
టీచర్ తలనరికి.. రోడ్డుపై తిరిగాడు
రాంచీ : జార్ఖండ్‌లోని ఓ ప్రైమరీ స్కూల్ టీచర్‌ను మతిస్థిమితం లేని వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సుకురు హీరెసా(35) అనే మహిళ సెరైకెలా ఖర్సవాన్ జిల్లా ఖప్సారై గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. మతిస్థిమితం లేని హరి హెంబ్రోం(45) ఆమె వైపు ఎప్పుడు అదోలా చూస్తు ఉండేవాడు. మంగళవారం సుకురు పాఠశాలకు వెళ్లిన తర్వాత హరి ఆమెను స్కూల్ బయటకు రావాలని పిలిచాడు. సుకురు స్కూలు బయటకు రాగానే ఆమెపై పదునైన ఆయుధంతో విచక్షణ రహితంగా దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా సుకురు తల నరికి.. ఆమె తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరగసాగాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని హరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియలేదు. -
బాలుడిపై మహిళా టీచర్ లైంగిక వేధింపులు
చంఢీగర్: విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు బాలుడిని లైంగికంగా వేధించి కటకటాల పాలయ్యారు. ట్యూషన్ పేరుతో బాలుడిని తన ఇంట్లో పెట్టుకొని అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్‌కి సమాచారమివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. చండీగఢ్, సెక్టార్ 31లోని రామ్‌దర్బార్‌లో నివాసముండే 34 ఏళ్ల మహిళా టీచర్ తన ఇంటి పక్కనే ఉండే 14 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించారు. పదో తరగతి చదువుతున్న బాలుడికి, అతని చెల్లికి ఆమె 2017 నుంచి ట్యూషన్ చెప్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం వారిద్దరినీ వేర్వేరుగా ట్యూషన్‌కి పంపించమని నిందితురాలు తల్లిదండ్రులని కోరింది. అప్పటినుంచి చదువులో చురుగ్గా ఉండే బాలుడు సరిగా చదవడం లేదు. మార్కుల్లో తగ్గుదల గమనించిన తల్లిదండ్రులు అతన్ని ఏప్రిల్‌లో ట్యూషన్‌కి మాన్పించారు. అయితే, తిరిగి ట్యూషన్‌కి పంపించాలని బాలుడి తల్లిదండ్రులని ఆ టీచర్ గత నెలలో ఒత్తిడి చేసిందని పోలీసులు వెల్లడించారు. వారు ససేమిరా అనడంతో సోమవారం దగ్గుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిందని వారు తెలిపారు. పరిస్థితి భయానకంగా మారడంతో బాలుడి తల్లిదండ్రులు చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్కో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చండీగఢ్ ఎస్పీ నీలాంబరి విజయ్ జగదల్ తెలిపారు. నిందితురాలిని జ్యూడీషియల్ కస్టడీకి తరలించామన్నారు. తనతో టచ్‌లో ఉండాలని సదరు టీచర్ బాలుడికి ఒక సిమ్ కార్డు కూడా ఇవ్వడం గమనార్హం. -
ఉపాధ్యాయురాలి ఒంటరి పోరాటం
మైసూరు: ముందస్తు హెచ్చరికలు లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నగరానికి చెందిన మహిళా ఉపాధ్యాయురాలు సంపత్‌కుమారి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒంటరిగా నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ 26 సంవత్సరాలుగా నగరంలోని మహాజన ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నానన్నారు. ఎటువంటి కారణాలు లేకుండా, ముందస్తు హెచ్చరికలు లేకుండా పాఠశాల యజమాన్యం తనను ఉద్యోగం నుంచి తొలగించిందని కన్నీటి పర్యంతమైంది. కనీసం పరిహారాన్ని కూడా ఇవ్వకుండా యజమాన్యం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని, తనను తిరిగి విధుల్లోకి తీసుకునేలా యాజమాన్యాన్ని ఒప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. -
అతి నవ్వు ఆమె ఆయుష్షు తీసింది
వాషింగ్టన్: నవ్వు ఆయుష్షు పెంచటం మాట ఏమోగానీ మెక్సికోలో మాత్రం ఓ టీచర్ ప్రాణాలు తీసింది. బిగ్గరగా నవ్వుతూనే పై అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. షారోన్ రెగోలి సిఫోర్రోనో (50) పెన్నిసైల్వేనియాలోని హుస్టన్ మిడిల్ స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది. సమ్మర్ సెలవులు కావటంతో సోమవారం తన కూతురితో ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ సరదాగా బాల్కనీలో ఓ బెంచ్ మీద కబుర్లు చెబుతూ గడిపింది. ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ బిగ్గరగా నవ్వటం ప్రారంభించిన ఆమె ఆ కుదుపులో వెనక్కి ఒరిగి, అదుపు తప్పి బాల్కనీ నుంచి కింద పడిపోయింది. తలకు తీవ్రగాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఆ సమయంలో ఆమె మద్యం సేవించి ఉన్నట్లు అనుమానించినా.. తర్వాత పరీక్షల్లో నిజం కాదని తేలింది. బాల్కనీకి రక్షణ చర్యలు లేకపోవటమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. వివాహిత అయిన రెగోలికి ఇద్దరు పిల్లలు. -
ప్రేమోన్మాదానికి యువతి బలి
సాక్షి, చెన్నై: ఓ యువకుడు వన్ సైడ్ లవ్‌తో ప్రేమోన్మాదిగా మారాడు. చర్చిలో ప్రార్థనలో నిమగ్నమై ఉన్న యువతిని నరికి చంపాడు. తమిళనాడులోని తూత్తుకుడి జార్జ్ రోడ్డులో ఇందిరానగర్‌కు చెందిన ఫ్రాన్సీనా(24) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. బుధవారం ఉదయం చర్చిలో ప్రార్థన చేస్తుండగా కీనన్ అనే వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేసి హత మార్చాడు. అతని ప్రేమను తిరస్కరించడంతో పాటు మరో వ్యక్తితో పెళ్లికి ఫ్రాన్సీనా సిద్ధపడటాన్ని జీర్ణించుకోలేకే కీనన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. -
వెంటాడిన ప్రాణం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఫ్పై రోజులు కష్టపడి సంపాదించుకున్న జీతాన్ని మూడు నిమిషాల్లో దొంగలు తన్నుకుపోతుంటే తట్టుకోలేని ఓ యువతి వారి వెంటపడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన చెన్నైలో సోమవారం రాత్రి జరిగింది. ఇదే సంఘటనలో మరో వృద్ధుడు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో యువతి విషమ పరిస్థితిలో చికిత్స పొందుతోంది. క్రైంసినిమాలా సాగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై పట్టినపాక్కం శ్రీనివాసపురానికి చెందిన వడివేలు కుమార్తె నందిని (24) నీలాంగరైలోని ఒక ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటలకు జీతం సొమ్మును డ్రా చేసేందుకు హోండా యాక్టివా టూ వీలర్లో మైలాపూర్ రామకృష్ణ మఠ్ సమీపంలోని ఏటీఎంకు వెళ్లారు. డాక్టర్ ఎంజీఆర్ నగర్ జానకీ మహిళా కళాశాలలో చదువుతున్న నందినీ అత్త కూతురు న జ్జూను తోడుగా తీసుకుని ఏటీఎంకు చేరుకున్నారు. ఏటీఎం నుంచి రూ.25 వేలు డ్రా చేసి హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని ఇంటికి బయలుదేరారు. డబ్బున్న హాండ్ బ్యాగ్‌ను నజ్జూ పట్టుకోగా బైక్‌ను నందిని నడుపుతోంది. కొద్ది దూరం వీరు ప్రయాణించగానే ఒక బైక్‌లో వాయువేగంలో దూసుకువచ్చిన ఇద్దరు యువకులు నజ్జూ చేతిలోని హాండ్‌బ్యాగ్‌ను లాక్కుని ఉడాయించారు. జీతం సొమ్మును దోచుకుపోవడంతో కంగారుపడిన నందిని తన టూవీలర్‌పై దొంగల బైక్‌ను వెంబడించింది. పట్టినబాక్కం బీచ్, కరుమారి అమ్మన్ కోవిల్ ఆలయం మీదుగా రెండు బైక్‌లు 80 కిలోమీటర్ల వేగంతో ఒకదాని వెనుక ఒకటి వేగంగా పరుగులుపెట్టాయి. దొంగ తన బైక్‌కు సడన్ బ్రేక్ వేసి అకస్మాత్తుగా వెనక్కుతిప్పి శ్రీనివాసపురం వైపు పరుగులు పెట్టించాడు. విపరీతమైన వేగంతో వస్తున్న నందిని తన బైక్‌ను అదుపుచేయలేక పోవడంతో వెనుక కూర్చుని ఉన్న నజ్జూ కిందపడి పోయి తీవ్రగాయాలకు గురైంది. ఆ తరువాత కూడా ముందుకు పరుగులు తీస్తున్న బైక్‌పై నుంచి కిందపడిన నందిని తలకు సిమెంట్ దిమ్మె తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనపై పట్టినపాక్కం పోలీసులు సమాచారం ఇవ్వడంతో పాటూ దొంగ శ్రీనివాసపురం వైపు వెళ్లాడని తెలుసుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో తప్పించుకునేందుకు వీలులేని దొంగ తాను వచ్చిన మార్గంలోని మళ్లీ తిరుగు ప్రయాణమై ప్రజల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శేఖర్ అనే వృద్ధుడిని ఢీకొట్టి కిందపడిపోయాడు. వెంటనే ప్రజలు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. బైక్ ఢీకొన్న వేగానికి తీవ్రంగా గాయపడిన శేఖర్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న నజ్జూను ఆసుపత్రిలో చేర్పించారు. పెరియమేడుకు చెందిన దొంగల్లో కరుణాకరన్ పట్టుబడగా మరో దొంగ తప్పించుకున్నాడు. నందినికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు తీవ్ర ప్రయత్నాల్లో ఉండగా మృత్యు ఒడిలోకి చేరి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహం: ప్రజలు చూస్తుండగానే దొంగలు స్వైర విహారం చేయడం, ఇద్దరి ప్రాణాలను హరించడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుమారు రెండు వందలకు పైగా జనం గుంపులుగా చేరి పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. దొంగ వినియోగించిన బైక్‌ను తగులబెట్టారు. పట్టుబడిన దొంగను తీసుకుని పోతున్న పోలీసులను ప్రజలు అనుసరించారు. పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకు రావడంతో ఆగ్రహించిన పోలీసులు ‘వెళ్లిపోండి లేకుంటే తుపాకీతో కాల్చి వేస్తాను’ అని బెదిరించడంతో ప్రజలు మరింతగా రెచ్చిపోయారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని అనేక విడత చర్చ తరువాత అందోళనను విరమింపజేశారు. -
దొంగను పట్టుకునే ప్రయత్నంలో మహిళా టీచర్ మృతి
► పారిపోతూ వృద్దుడిని బలితీసుకున్న దొంగలు ► టీచర్ వెంట ఉన్న యువతికి తీవ్రగాయాలు చెన్నై: నెల రోజుల కష్టార్జితమైన జీతం సొమ్మును దోచుకెళుతున్న దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఓ మహిళా టీచర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో వృద్ధుడు సైతం ప్రాణాలు కోల్పోగా, మరో యువతి పరిస్థితి విషమంగా మారింది. సోమవారం రాత్రి చెన్నైలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై, పట్టినపాక్కం శ్రీనివాసపురానికి చెందిన నందిని (24) నీలాంగరైలోని ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పనిచేస్తోంది. తన జీతం డబ్బులు డ్రా చేసుకునేందుకు సోమవారం రాత్రి తన అత్తకూతురు నజ్జూను తోడుగా తీసుకుని ఏటీఎంకు వెళ్లింది. రూ.25 వేలు డ్రా చేసి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఇంటికి వెళుతుండగా బైక్ పై దూసుకొచ్చిన ఇద్దరు యువకులు నజ్జూ చేతిలోని హాండ్‌బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు. వేగంగా పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు అతివేగంతో వెంటపడిన నందిని తన స్కూటీని అదుపుచేయలేక కిందపడ్డారు. ఆమె తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నజ్జూకు తీవ్రగాయాలయ్యాయి. పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు ప్రజలు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగలు తమ బైక్‌తో శేఖర్ అనే వృద్ధుడిని ఢీకొట్టడంతో అతనూ అక్కడికక్కడే చనిపోయాడు. దొంగలు బైక్ పై నుంచి పడిపోవడంతో స్థానికులు దొంగల్లో ఒకడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, మరో దొంగ చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి నో చెప్పిందని.. టీచర్ ను..!
ఇస్లామాబాద్: పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పిందన్న కారణంతో ఓ స్కూలు టీచర్ ను సజీవ దహనం చేశారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన యువతి చివరికి తనువు చాలించింది. ఈ దారుణ ఘటన పాకిస్తాన్ లో బుధవారం చోటుచేసుకుంది. పాక్ రాజధాని ఇస్లామాబ్ కు సమీపంలోని ముర్రీ ప్రాంతంలో మరియా సదాఖత్(19) అనే స్కూల్ టీచర్ పై కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ముందుగా యువతిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నించారు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆవేశానికి లోనై సజీవ దహనానికి యత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆమె అంకుల్ తెలిపారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న సదాఖత్ నేడు చనిపోయిందని తెలిపారు. సదాఖత్ ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్ గా పనిచేస్తుందని, ఆ స్కూలు ప్రిన్సిపాల్ తన కొడుకును వివాహం చేసుకోవాలని ఆమెను కోరాడు. పెళ్లికొడుకు వయసు తనకంటే రెట్టింపు ఉందని, అతడు అది వరకే మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడన్న కారణంతో పెళ్లికి నో చెప్పింది. టీచర్ జాబ్ కూడా వదిలేసింది. చనిపోయేముందు ఈ ఘటనపై ఆమె వాంగ్మూలం ఇచ్చిందని, ప్రిన్సిపాల్ తో పాటు మరో నలుగురు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్టేట్ మెంట్ ఇచ్చిందని పోలీస్ అధికారి మజార్ ఇక్బాల్ తెలిపారు. నిందితులలో ఒకరిని అరెస్ట్ చేశామని, మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
విద్యార్థితో పారిపోయింది! టీచర్‌పై రేప్ కేసు!!
తిరున్వేలి: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలే దారితప్పింది. తన కన్నా వయస్సులో చిన్నవాడైన 15 ఏళ్ల బాలుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఏడాది పాటు అతనితో గడిపి.. చివరకు గర్భవతి అయింది. దీంతో ఆ 23 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడి జరిపినట్టు అభియోగాలు మోపారు. తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని కడయనల్లూరు గ్రామంలో ఓ ప్రైవేటు స్కూల్లో 23 ఏళ్ల యువతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పీజీ చదివిన ఆమె తన విద్యార్థి అయిన 15 ఏళ్ల బాలుడితో ఏడాది కిందట ఇంటి నుంచి పారిపోయింది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆ బాలుడు 60 తులాల బంగారం, రూ. 10వేలు ఎత్తుకుపోయాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిగా రహస్యంగా గడుపుతున్న ఇద్దరిని పోలీసులు తాజాగా తిరుపూర్ సమీపంలోని ఓ ప్రైవేటు మిల్లు వద్ద గుర్తించారు. ఇద్దరు కూడా మిల్లులో పనిచేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఓ ప్రైవేటు టెలిఫోన్ కేంద్రం నుంచి వారు స్నేహితులకు, సన్నిహితులకు ఫోన్ చేస్తుండటంతో ఈ నంబర్ ద్వారా పోలీసులు వాళ్ల ఆచూకీని కనిపెట్టారు. గర్భవతి అయిన టీచర్‌ను అరెస్టు చేసి మేజిస్ట్రేటు ముందు హాజరు పరుచగా.. ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రేప్, కిడ్నాప్ తోపాటు బాలలపై లైంగిక నేరాల వ్యతిరేక చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. -
విశాఖలో మహిళా టీచర్ వీరంగం
-
విశాఖలో మహిళా టీచర్ వీరంగం
విశాఖ: విశాఖ జిల్లాలోని అనకాపల్లి మండలం కొండకొప్పాక హైస్కూల్లో మంగళవారం ఓ మహిళా టీచర్ వీరంగం సృష్టించింది. హైస్కూల్లో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి.. సహా ఉపాధ్యాయులపై విరుచకపడింది. స్కూల్లో బెంచీలు, కుర్చీలను తన్నుతూ టీచర్లను కొట్టింది. మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విజయలక్ష్మి ఇలా ప్రవర్తిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. -
మహిళా టీచర్ కు హెడ్మాస్టర్ వేధింపులు
సేలం : విద్యా బుద్ధులు నేర్పించాల్సిన హెడ్ మాస్టరే తోటి మహిళా టీచర్‌ను వేధింపులకు గురి చేసిన ఘటన తమిళనాడు సేలంలో జరిగింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు వేధింపులు నిజమేనని తేలడంతో హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేశారు. వివరాల్లో వెళితే నల్లూరు పంచాయితీ పరిధిలోని పాఠశాలలో సత్యరాజ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్‌ను పెళ్లి చేసుకోవాలని లేకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరింపులకు దిగాడు. సత్యరాజ్ వేధింపులు తాళలేక బాధిత టీచర్ డీఈఓకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజమేనని తేల్చారు. సత్యరాజ్‌ను సస్పెండ్ చేస్తూ విద్యాధికారి జ్ఞానగౌరి ఆదేశాలు జారీ చేశారు. హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేయడాన్ని మహిళా టీచర్లు స్వాగతించారు. -
మహిళా టీచర్‌పై హెడ్మాస్టర్ ప్రతాపం
జాయ్నగర్: విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉండాల్సిన హెడ్మాస్టరే రౌడీలా ప్రవర్తించాడు. స్కూల్లో స్టాఫ్ రూమ్‌లో ఓ మహిళా టీచర్‌ను చెంపదెబ్బ కొట్టి జుట్టుపట్టిలాగాడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లో 24 పరగనాల జిల్లాలోని జాయ్‌నగర్‌లో జరిగింది. జాయ్‌నగర్‌లోని ఓ స్కూల్లో హెడ్ మాస్టర్ అశోక్ నస్కర్, మ్యాథ్స్ టీచర్ సస్వతి కుందు మధ్య ఓ విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. స్పెషల్ క్లాసులు తీసుకోవాల్సిందిగా అశోక్ చెప్పగా.. సస్వతి అందుకు నిరాకరించారు. అశోక్ కోపంతో సస్వతిని చెంపదెబ్బ కొట్టి, ఆమె జట్టు పట్టుకొని ఈడ్చాడు. మహిళా టీచర్‌ను తోసివేసి, ఆమె మొబైల్ ఫోన్‌ను నేలకేసికొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మహిళా టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు హెడ్మాస్టర్ను అరెస్ట్ చేశారు. సస్పతికి ఆస్పత్రిలో చికిత్స చేయించారు. -
స్కూల్లో ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం
-
ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం
గుంటూరు : తోటి ఉద్యోగుల వేధింపులతో గిరిజన ఉపాధ్యాయురాలు శనివారం ఉదయం స్కూల్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. బొల్లాపల్లిలోని కస్తూర్భా స్కూల్లో జ్యోతి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెపై తోటి ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో ఈ విషయంపై ఆమె పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు కూడా చేసింది. ఆ విషయంపై ప్రధాన ఉపాధ్యాయుడు మిన్నకుండటంతో తోటి ఉద్యోగుల వేధింపులు మరింత అధికమైనాయి. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీచర్‌పై మరో టీచర్ అత్యాచారం
బెంగళూరు: ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. సహచర ఉపాధ్యాయురాలిపై అత్యాచారం చేశాడు. బెంగళూరులో ఈ దారుణ సంఘటన జరిగింది. గెస్ట్ టీచర్‌గా పాఠాలు చెప్పేందుకు వచ్చిన మహిళపై, మరో టీచర్ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దుండగులు టీచర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.