అతి నవ్వు ఆమె ఆయుష్షు తీసింది
అతి నవ్వు ఆమె ఆయుష్షు తీసింది
Published Sun, Aug 20 2017 2:12 PM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM
వాషింగ్టన్: నవ్వు ఆయుష్షు పెంచటం మాట ఏమోగానీ మెక్సికోలో మాత్రం ఓ టీచర్ ప్రాణాలు తీసింది. బిగ్గరగా నవ్వుతూనే పై అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.
షారోన్ రెగోలి సిఫోర్రోనో (50) పెన్నిసైల్వేనియాలోని హుస్టన్ మిడిల్ స్కూల్‌లో టీచర్ గా పని చేస్తోంది. సమ్మర్ సెలవులు కావటంతో సోమవారం తన కూతురితో ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ సరదాగా బాల్కనీలో ఓ బెంచ్ మీద కబుర్లు చెబుతూ గడిపింది. ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ బిగ్గరగా నవ్వటం ప్రారంభించిన ఆమె ఆ కుదుపులో వెనక్కి ఒరిగి, అదుపు తప్పి బాల్కనీ నుంచి కింద పడిపోయింది.
తలకు తీవ్రగాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఆ సమయంలో ఆమె మద్యం సేవించి ఉన్నట్లు అనుమానించినా.. తర్వాత పరీక్షల్లో నిజం కాదని తేలింది. బాల్కనీకి రక్షణ చర్యలు లేకపోవటమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. వివాహిత అయిన రెగోలికి ఇద్దరు పిల్లలు.
Advertisement
Advertisement