మహిళా టీచర్పై హెడ్మాస్టర్ ప్రతాపం | Headmaster assaults woman teacher, detained | Sakshi
Sakshi News home page

మహిళా టీచర్పై హెడ్మాస్టర్ ప్రతాపం

Published Fri, Jul 24 2015 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

మహిళా టీచర్పై హెడ్మాస్టర్ ప్రతాపం

మహిళా టీచర్పై హెడ్మాస్టర్ ప్రతాపం

జాయ్నగర్: విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉండాల్సిన హెడ్మాస్టరే రౌడీలా ప్రవర్తించాడు. స్కూల్లో స్టాఫ్ రూమ్లో ఓ మహిళా టీచర్ను చెంపదెబ్బ కొట్టి జుట్టుపట్టిలాగాడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లో 24 పరగనాల జిల్లాలోని జాయ్నగర్లో జరిగింది.

జాయ్నగర్లోని ఓ స్కూల్లో హెడ్ మాస్టర్ అశోక్ నస్కర్, మ్యాథ్స్ టీచర్ సస్వతి కుందు మధ్య ఓ విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. స్పెషల్ క్లాసులు తీసుకోవాల్సిందిగా అశోక్ చెప్పగా.. సస్వతి అందుకు నిరాకరించారు. అశోక్ కోపంతో సస్వతిని చెంపదెబ్బ కొట్టి, ఆమె జట్టు పట్టుకొని ఈడ్చాడు. మహిళా టీచర్ను తోసివేసి, ఆమె మొబైల్ ఫోన్ను నేలకేసికొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మహిళా టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు హెడ్మాస్టర్ను అరెస్ట్ చేశారు. సస్పతికి ఆస్పత్రిలో చికిత్స చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement