సేలం : విద్యా బుద్ధులు నేర్పించాల్సిన హెడ్ మాస్టరే తోటి మహిళా టీచర్ను వేధింపులకు గురి చేసిన ఘటన తమిళనాడు సేలంలో జరిగింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు వేధింపులు నిజమేనని తేలడంతో హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేశారు.
వివరాల్లో వెళితే నల్లూరు పంచాయితీ పరిధిలోని పాఠశాలలో సత్యరాజ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్ను పెళ్లి చేసుకోవాలని లేకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరింపులకు దిగాడు. సత్యరాజ్ వేధింపులు తాళలేక బాధిత టీచర్ డీఈఓకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజమేనని తేల్చారు. సత్యరాజ్ను సస్పెండ్ చేస్తూ విద్యాధికారి జ్ఞానగౌరి ఆదేశాలు జారీ చేశారు. హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేయడాన్ని మహిళా టీచర్లు స్వాగతించారు.
మహిళా టీచర్ కు హెడ్మాస్టర్ వేధింపులు
Published Thu, Oct 15 2015 12:20 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM
Advertisement