న్యూఢిల్లీ: బహు భాషా నటుడు హిరో సిద్ధార్థ్ తల్లిదండ్రులకు ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. తమినాడులోని మధురై ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను వేధించారని సిద్ధార్థ్ ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రులను బ్యాగులోంచి కొన్ని నాణేలను తీసేయమని ఒత్తిడి చేశారని అన్నారు. సుమారు 20 నిమిషాల పాటు వేధింపులకు గురిచేశారని చెప్పారు.
తాము ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే వారు పదే పదే హిందీలో మాట్లాడి ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. దీన్ని తాము వ్యతిరేకించగా.. ‘భారత్‌లో ఇలానే ఉంటుంద’ని ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ అన్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాం వేదికగా సిద్ధార్థ్ వెల్లడించారు. మధురై విమానాశ్రయంలోని భద్రతను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) నిర్వహిస్తోంది.
(చదవండి: రాజుకుంటున్న సరిహద్దు వివాదం: ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం)
Comments
Please login to add a commentAdd a comment