School headmaster
-
నీ కాల్మొక్తా సార్.. నా కొడుకు భవిష్యత్ కాపాడండి
కారేపల్లి: ‘‘నీ కాల్మొక్తా సార్.. నా కొడుకు భవిష్యత్‌ను కాపాడండి.. ఎలాగైనా సరే నా కొడుకు పదో తరగతి పరీక్ష రాసేలా చేయండి సార్’’ అంటూ ఓ తల్లి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కాళ్లపై పడి రోదించింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండాకు చెందిన గుగులోతు రమేష్ – సునీత దంపతుల కుమారుడు తరుణ్.. గతేడాది కారేపల్లి హైస్కూల్లో పదో తరగతి చదివాడు. అయితే గణితంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో, ఈ ఏడాది పరీక్ష రాసేందుకు హైస్కూల్ జూనియర్ అసిస్టెంట్ సులోచనకు పరీక్ష ఫీజు రూ.150తో పాటు ఆలస్యమైనందుకు అదనపు రుసుము రూ.వెయ్యి కూడా చెల్లించాడు. అయితే, ఆమె సెలవులో వెళ్తూ హెచ్ఎం పవన్‌కుమార్‌కు ఫీజు ఇచ్చినట్లుగా చెబుతోంది. బోర్డుకు మాత్రం ఫీజు అందకపోవడంతో తరుణ్‌కు హాల్‌టికెట్ రాలేదు. ఈ విషయమై విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్లో అడగ్గా.. ఎవరికి వారు తమకు సంబంధం లేదని చెబుతూ చివరకు తాము బోర్డుకు ఫీజు చెల్లించలేదని ఒప్పుకున్నారు. ఏం చేయాలో తెలియని తరుణ్ తల్లిదండ్రులు బుధవారం కారేపల్లి హైస్కూల్‌కు చేరుకుని హెచ్ఎం పవన్‌కుమార్ కాళ్లపై పడి రోదిస్తూ ఎలాగైనా తమ కుమారుడి భవిష్యత్‌ను కాపాడాలని వేడుకున్నారు. -
భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు!
లక్నో: అల్లరి పిల్లలను దారిలోకి తీసుకురావడం కోసం రకరకాలుగా బెదిరిస్తాం. అల్లరి గడుగ్గాయిల గురించి తల్లిదండ్రులు కూడా వారి టీచర్లకు ఫిర్యాదు చేస్తారు. ఏదో మాట వరసకు మా పిల్లాడికి భయం చెప్పండి అన్నందుకు.. విద్యార్థికి చుక్కలు చూపించాడు. ఓ ప్రధానోపాధ్యాయుడు. రెండో తరగతి చదువుతున్న ఓ పిల్లాడి కాలు పట్టుకుని కింద పడేస్తాను అంటూ బిల్డింగ్ మీద నుంచి వేలాడదీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో.. సదరు ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి పేరు సోను యాదవ్. రెండో తరగతి చదువుతున్న సోను యాదవ్.. గురువారం లంచ్ బ్రేక్ సమయంలో పలువురు విద్యార్థులను కొరికినట్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు మనోజ్ విశ్వకర్మ.. సోను కాలు పట్టుకుని లాక్కొచ్చాడు. చేసిన తప్పుకు క్షమాపణ కోరమని.. లేదంటే సోనుని బిల్డింగ్ పై నుంచి కిందకు పడేస్తానని బెదిరించసాగాడు. చెప్పడమే కాక సోను కాలు పట్టుకుని బిల్డింగ్ మీద నుంచి కిందకు వేలాడదీశాడు. (చదవండి: ప్రధానోపాధ్యాయుడి కష్టాలు.. పని చేస్తున్న స్కూల్లోనే నైట్ డ్యూటీలు) మనోజ్ చర్యతో బిక్కచచ్చిపోయాడు సోను. భయంతో గుక్కపట్టి ఏడవసాగాడు. దాంతో మిగతా స్టూడెంట్స్, టీచర్లు అక్కడకు పరిగెత్తుకువచ్చారు. మనోజ్ చేతి నుంచి సోనుని విడిపించారు. ఇంటికెళ్లిన సోను తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. కొందరు టీచర్లు మనోజ్ చేసిన పనిని వీడియో తీశారు. ఈ క్రమంలో సోను తండ్రి.. మనోజ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సోను తండ్రి మాట్లాడుతూ.. గురువు అంటే విద్యార్థులను ప్రేమగా చూడాలి.. కానీ మనోజ్ రాక్షసంగా ప్రవర్తించాడు అన్నాడు. సోను తడ్రి ఫిర్యాదు మేరకు మనోజ్‌ను అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద అతడి మీద కేసు నమోదు చేశారు. (చదవండి: పదవీ విరమణ పొందిన 15 రోజుల్లోనే.. ) మనోజ్ మాట్లాడుతూ.. ‘‘సోను చాలా తుంటరి పిల్లాడు. విద్యార్థులనే కాదు టీచర్లను కూడా కొరుకుతాడు. బుద్దిగా ఉండడు.. ఎవరి మాట వినడు. సోను తండ్రే తనను మార్చమని నాకు చెప్పాడు. విద్యార్థిని భయపెట్టడం కోసం ఇలా చేశాను. అంతే’’ అన్నాడు. భయపెట్టమంటే.. మరీ ఇలా చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. చదవండి: వైరల్ వీడియో: తందూరి కాదు ‘ఉమ్మి’ రోటీ -
ప్రధానోపాధ్యాయుడి కష్టాలు.. పని చేస్తున్న స్కూల్లోనే నైట్ డ్యూటీలు
రాయచూరు: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులు దొంగలపాలు కాకుండా ప్రధానోపాధ్యాయుడు కాపలా కాయాల్సిన దుస్థితి యాదగిరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాలు.. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మాలహళ్లిలోని పాఠశాలలో 1నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు సంబంధించిన బియ్యం, బేడలు, ఇతర నిత్యావసరాలను పాఠశాలలోనే నిల్వ చేశారు. ఇటీవల చుట్టు పక్కల ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయి. దీంతో సరుకులను కాపాడుకునేందుకు ప్రధానోపాధ్యాయుడే రోజూ రాత్రి పాఠశాలకు వెళ్లి గదికి తాళం వేసి అక్కడే నిద్రిస్తున్నాడు. -
పదవీ విరమణ పొందిన 15 రోజుల్లోనే..
సాక్షి,ఎమ్మిగనూరు: శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్న రిటైర్డ్ హెచ్ఎంను మృత్యువు కబళించింది. పదవీ విరమణ పొందిన 15 రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్‌లో నివాసముంటున్న రిటైర్డ్ హెచ్ఎం ప్రసాద్ (60), అరుణ దంపతులకు ముగ్గురు సంతానం. వీరి కుమారుడు కృష్ణసాగర్ మైసూర్లో రైల్వే ఉద్యోగిగా పని చేస్తుండగా, కుమార్తె మానస విజయవాడలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. మరో కుమార్తె మేఘనకు వివాహమైంది. ప్రసాద్ కడివెళ్ల గ్రామంలోని ఎంపీపీ మెయిన్ స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ గత నెల 31వ తేదీన రిటైర్డ్ అయ్యారు. పదవీ విమరణ బిల్లులతో పాటు నాడు–నేడు బిల్లులు అందజేసేందుకు మంగళవారం ఉదయం బైక్‌పై కర్నూలుకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి ఎమ్మిగనూరుకు బయలుదేరాడు. అదే సమయంలో కోడుమూరుకు చెందిన భాస్కర్ ఎమ్మిగనూరులో తమ బంధువులు చేసిన దేవరకు హాజరై సాయంత్రం బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎర్రకోట – రాళ్లదొడ్డి గ్రామాల మధ్య ఏడు మోరీల బ్రిడ్జి దగ్గర రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రిటైర్డ్ హెచ్ఎం ప్రసాద్, భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని 108లో ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయమైన ప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న భార్య అరుణ, బంధువులు, ఉపాధ్యాయులు ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త మృతదేహం వద్ద అరుణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ చెల్లెలు అరుణ భర్త. మెరుగైన చికిత్స నిమిత్తం భాస్కర్‌ను కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ హెడ్‌కానిస్టేబుల్ చంద్ర విలేకరులకు తెలిపారు. చదవండి: వీడియో వైరల్: వేలు చూపిస్తూ వార్నింగ్, అంతలోనే తుపాకీతో.. -
'నాకు రిటైర్మెంట్ వయసు పెంపు వద్దు'
కొడిమ్యాల: ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటుండగా.. ఓ ప్రధానోపాధ్యాయుడు మాత్రం తనకు పెంపు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా నల్లబ్యాడ్జీ ధరించి విధులకు హాజరవుతున్నారు.జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నమిలికొండ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఏనుగు మల్లారెడ్డి తనకు రిటైర్మెంట్ వయస్సు పెంపు వద్దని మంగళవారం ప్రకటించారు. ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల నిరుద్యోగ యువతకు అవకాశాలు దక్కకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకుని సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పదో తరగతిలోనే పాఠశాల హెచ్ఎంగా..
చెన్నై ,వేలూరు(తిరువణ్ణామలై): పదో తరగతి అర్ధ సంవత్సరపు పరీక్షల్లో పాఠశాలలోనే మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని ఒక్క రోజు ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా పుదుపట్టు గ్రామానికి చెందిన సౌందర్‌రాజన్ కుమార్తె మధుమిత(14) నెచ్చల్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. హెచ్ఎం వెంకటేశన్, 8 మంది టీచర్లు, ఇద్దరు కార్యాలయ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. విద్యార్థులను ఉత్సాహ పరిచేందుకు 10వ తరగతి అర్థ సంవత్సర పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించే వారిని ఒక్క రోజు హెచ్ఎంగా పనిచేయవచ్చని హెచ్ఎం వెంకటేశన్ తెలిపాడు. ఈ నేపథ్యంలో మధుమిత 447 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఒక రోజు హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించిన మధుమితతో హెచ్ఎం, టీచర్లు దీంతో సోమవారం హెచ్ఎం వెంకటేశన్, ఉపాధ్యాయులు మధుమితను విద్యార్థుల సమక్షంలో ప్రధానోపాధ్యాయుడి సీటులో కూర్చో పెట్టారు. ఈ సందర్భంగా మధుమిత రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి గదికి వెళ్లి సహ విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలకు సంబంధించి ప్రశ్నలను అడిగారు. అనంతరం హెచ్ఎంగా ఒక రోజు పనిచేసిన వేతనాన్ని పాఠశాల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా మధుమిత మాట్లాడుతూ.. ఒక రోజు హెచ్ఎంగా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వీటిని జీవితంలో మరవలేనంది. తనను ఉత్సాహ పరిచి మొదటి ర్యాంకులు సాధించేందుకు కారణమైన హెచ్ఎం వెంకటేశన్, టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
నా అనుమతి అక్కర్లేదా?!
సాక్షి, భీమారం(చెన్నూర్): తన అనుమతి లేకుండా జిల్లా స్థాయి క్రీడల్లో ఎందుకు పాల్గొన్నారని మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణ విద్యార్థులను దండన విధించాడు. ఈ మేరకు మంగళవారం విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని హెచ్ఎంతో వాగ్వివాదానికి దిగారు. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులను శనివారం రేచినిలో జరిగిన హ్యాండ్ బాల్ పోటీలకు పీఈటీ విఠల్ తీసుకెళ్లారు. పోటీలకు హాజరైన విద్యార్థులు సోమవారం పాఠశాలకు యథావిధిగా హాజరయ్యారు. అయితే ప్రార్థన అనంతరం పోటీలకు వెళ్లిన విద్యార్థులను దాదాపు 3 గంటల సేపు ఎండలో నిలబెట్టారు. దీంతో పాఠశాలలో జరిగిన సంఘటనపై తల్లిదండ్రులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు స్థానిక నాయకులతో కలిసి పాఠశాలకు వెళ్లి హెచ్ఎంను నిలదీశారు. ఆటల పోటీలకు వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. ఆటల పోటీలకు వెళ్లేందుకు తాను అనుమతిని ఇవ్వలేదని, పీఈటీ విఠల్ కొందరు విద్యార్థులను తీసికెళ్లాడని తెలిపారు. విద్యార్థులను మందలించానని, ఎండలో నిలబెట్టలేదని హెచ్ఎం తెలిపాడు. హెచ్ఎం అనుమతితోనే క్రీడలకు విద్యార్థులను తీసుకువెళ్లానని పీఈటీ చెప్పారు. పాఠశాలలోని గ్రూప్ తగాదాలే ఈ గొడవకి కారణమన్నారు. -
భవిష్యత్తులో ‘టెన్త్’ పునఃమూల్యాంకనం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల పునఃమూల్యాంకనం (రీ వ్యాల్యుయేషన్) నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది కాకపోయినా, భవిష్యత్తులో అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. పునఃమూల్యాంకనం నిర్వ హించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పునఃమూల్యాంకనానికి సంబంధించిన కోర్టు తీర్పులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై విద్యాశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో సమీక్షించారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో లోపాలు చోటుచేసుకున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షా ఫలితాల ప్రకటనలో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. అత్యంత పకడ్బందీగా పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించామన్నారు. ఫలితాలపట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, జవాబు పత్రాల ఐదంచెల పరిశీలన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ప్రతి విద్యార్థీ గ్రేడ్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నారమన్నారు. ఎవరికైనా సున్నా మార్కులొచ్చినా, గైర్హాజరని వచ్చినా, ఒక సబ్జెక్టులో ఫెయిలై మిగిలిన సబ్జెక్టుల్లో మంచి మార్కులొచ్చినా సంబంధిత విద్యార్థుల జవాబు పత్రాల పునః పరిశీలన నిర్వహించి ధ్రువీకరించుకున్నామన్నారు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఇలాంటి కేసులను గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని విజయ్ కుమార్ చెప్పారు. అయితే ఫలితాల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రెండు రోజుల ముందే ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు ఫలితాలు.. ఎప్పటిలాగే పదో తరగతి ఫలితాలను ఆన్లైన్లో విడుదల చేయడంతోపాటు ఈ ఏడాది తొలిసారిగా ప్రధానోపాధ్యాయుల లాగిన్‌కు సంబంధిత పాఠశాల విద్యార్థులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ షీట్‌ను పంపిస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. దీనివల్ల గ్రామీణ విద్యార్థులు వారి పాఠశాలకు వెళ్లి ఫలితాలను తెలుసుకోవడంతోపాటు ప్రధానోపాధ్యాయుడి నుంచి కౌన్సెలింగ్, సలహాలు పొందొచ్చని వివరించారు. పదో తరగతి ఫలితాలపై విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు/ఫిర్యాదులు స్వీకరించేందుకు కొత్త మొబైల్ యాప్‌ను త్వరలో విడుదల చేస్తామన్నారు. హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని యాప్‌లో ఎంటర్ చేయడం ద్వారా విద్యార్థులు తమ విజ్ఞప్తిని టైప్ చేసి పదో తరగతి బోర్డుకు పంపొచ్చని, అలా పంపిన వారికి అక్నాలెడ్జ్మెంట్ సైతం పంపిస్తామన్నారు. -
ఐదో తరగతి విద్యార్థినిపై ప్రిన్సిపాల్, టీచర్..
పట్నా : ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ ఐదో తరగతి చదువుతున్న బాలికపై దారుణానికి ఒడిగట్టారు. బ్లాక్ మెయిల్ చేస్తూ పల్లుమార్లు అత్యాచారం చేసి.. గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ‘పట్నాలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన ఆ నిందితులు.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఆ తరువాత నెలరోజుల పాటు అత్యాచారం చేశారు. ఆ బాలిక కడుపులో నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు తెలుపగా.. వైద్య పరీక్షల అనంతరం గర్భవతి అని తేలింది. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఫిర్యాదు చేశార’ని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నట్లు, ఆ స్కూల్‌ను కూడా మూసేసినట్లు తెలిపారు. ఆ స్కూల్లోని ప్రిన్సిపాల్ రూమ్‌లోనే బెడ్రూమ్ కూడా ఉండేదని అక్కడే ఆ విద్యార్థిని అత్యాచారం చేసేవారని తెలిపారు. -
లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్ఎం
నాయుడుపేటటౌన్ : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిని లైంగికంగా వేధిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నాయుడుపేట ఎల్‌ఏసాగరం అగ్రహారపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. పట్టణంలోని ఏల్ఎసాగరం అగ్రహారపేట ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కావేరిపాకం అంజయ్య మధ్యాహ్న భోజన పథక నిర్వాహకురాలిని కొద్దిరోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సరుకులు తీసుకెళుతుండగా ప్రధానోపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై రవినాయక్, ఎంఈఓ ఎన్ శ్రీనివాసులు పాఠశాల వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై విచారించారు. ప్రధానోపాధ్యాయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రధానోపాధ్యాయుడికి అరెస్ట్ వారెంట్
గన్నేరువరం(మానకొండూర్): మండలంలోని మైలారం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు చీటింగ్ కేసుకు సంబంధించి కరీంనగర్ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ రావడంలో ఆ పాఠశాలలో అలజడి నెలకొంది. వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయుడిగా 2009లో మైలారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఈయనపై ఒక చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని, వాయిదా ప్రకారం కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసిందని పోలీసులు తెలిపారు. ఈనెల 6తో గడువు ముగుస్తుండడంతో సోమవారం ఎస్సై వంశీకృష్ణ పాఠశాలకు వచ్చారు. ప్రధానోపాధ్యాయుడు అందుబాటులో లేవపోవడంతో.. మండల ఇన్చార్జి విద్యాధికారి లక్ష్మణ్‌రావును ఎస్సై ఫోన్లో సంప్రదించగా పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానోపాధ్యాయుడిపై ఎంఈవో విచారణ చేపట్టారు. గత నెల 24 సాయంత్రం నుంచి 27 ఉదయం పూట పాఠశాలకు అధికారికంగా సెలవు తీసుకున్నారని తెలిపారు. సెలవులు ముగిసిన నుంచి తిరిగి పాఠశాలకు రావడం లేదని ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు, గ్రామస్తులు ఎంఈవోకు తెలిపారు. దీనిపై జిల్లా విద్యాధికారికి సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. -
మహిళా టీచర్ కు హెడ్మాస్టర్ వేధింపులు
సేలం : విద్యా బుద్ధులు నేర్పించాల్సిన హెడ్ మాస్టరే తోటి మహిళా టీచర్‌ను వేధింపులకు గురి చేసిన ఘటన తమిళనాడు సేలంలో జరిగింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు వేధింపులు నిజమేనని తేలడంతో హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేశారు. వివరాల్లో వెళితే నల్లూరు పంచాయితీ పరిధిలోని పాఠశాలలో సత్యరాజ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే స్కూల్లో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్‌ను పెళ్లి చేసుకోవాలని లేకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరింపులకు దిగాడు. సత్యరాజ్ వేధింపులు తాళలేక బాధిత టీచర్ డీఈఓకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆరోపణలు నిజమేనని తేల్చారు. సత్యరాజ్‌ను సస్పెండ్ చేస్తూ విద్యాధికారి జ్ఞానగౌరి ఆదేశాలు జారీ చేశారు. హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేయడాన్ని మహిళా టీచర్లు స్వాగతించారు.