![Head Master Night Outs In School Goods Theft Of Related Lunch Scheme - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/6/Night.jpg.webp?itok=TDtEzWjf)
పాఠశాలలో నిద్రిస్తున్న ప్రధానోపాధ్యాయుడు
రాయచూరు: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులు దొంగలపాలు కాకుండా ప్రధానోపాధ్యాయుడు కాపలా కాయాల్సిన దుస్థితి యాదగిరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాలు.. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మాలహళ్లిలోని పాఠశాలలో 1నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు సంబంధించిన బియ్యం, బేడలు, ఇతర నిత్యావసరాలను పాఠశాలలోనే నిల్వ చేశారు. ఇటీవల చుట్టు పక్కల ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయి. దీంతో సరుకులను కాపాడుకునేందుకు ప్రధానోపాధ్యాయుడే రోజూ రాత్రి పాఠశాలకు వెళ్లి గదికి తాళం వేసి అక్కడే నిద్రిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment