Madhyana Bhojanam
-
ప్రధానోపాధ్యాయుడి కష్టాలు.. పని చేస్తున్న స్కూల్లోనే నైట్ డ్యూటీలు
రాయచూరు: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులు దొంగలపాలు కాకుండా ప్రధానోపాధ్యాయుడు కాపలా కాయాల్సిన దుస్థితి యాదగిరి జిల్లాలో వెలుగు చూసింది. వివరాలు.. యాదగిరి జిల్లా సురపుర తాలూకా మాలహళ్లిలోని పాఠశాలలో 1నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు సంబంధించిన బియ్యం, బేడలు, ఇతర నిత్యావసరాలను పాఠశాలలోనే నిల్వ చేశారు. ఇటీవల చుట్టు పక్కల ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయి. దీంతో సరుకులను కాపాడుకునేందుకు ప్రధానోపాధ్యాయుడే రోజూ రాత్రి పాఠశాలకు వెళ్లి గదికి తాళం వేసి అక్కడే నిద్రిస్తున్నాడు. -
వారంలో మూడు రోజులు గుడ్లు ఇవ్వాలి
మహబూబ్నగర్ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్లు ఇచ్చే విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి మంగళవారం ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, మోడల్, ఎయిడెడ్ స్కూళ్లలో సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు గుడ్లు ఇచ్చేవిధంగా డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు చర్యలు