పట్నా : ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ ఐదో తరగతి చదువుతున్న బాలికపై దారుణానికి ఒడిగట్టారు. బ్లాక్ మెయిల్ చేస్తూ పల్లుమార్లు అత్యాచారం చేసి.. గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ‘పట్నాలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన ఆ నిందితులు.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఆ తరువాత నెలరోజుల పాటు అత్యాచారం చేశారు. ఆ బాలిక కడుపులో నొప్పి వస్తుందని తల్లిదండ్రులకు తెలుపగా.. వైద్య పరీక్షల అనంతరం గర్భవతి అని తేలింది. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఫిర్యాదు చేశార’ని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నట్లు, ఆ స్కూల్‌ను కూడా మూసేసినట్లు తెలిపారు. ఆ స్కూల్‌లోని ప్రిన్సిపాల్ రూమ్‌లోనే బెడ్‌రూమ్ కూడా ఉండేదని అక్కడే ఆ విద్యార్థిని అత్యాచారం చేసేవారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment