పట్నా: ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల బారి నుంచి మహిళలకు, చిన్నారులకు రక్షణ కరువైంది. బీహార్‌లో ఓ కామ పిశాచి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై నగ్నంగా చెట్టుకు వేలాడదీశాడు. ఈ దారుణం మధుబాని జిల్లా కొయోతి సమీపంలోని ఓ గ్రామంలో జరిగింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నారిని గుర్తించిన బంధువులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. జననా వయవాల వద్ద తీవ్ర గాయాలవడంతో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు(20)ని పోలీ సులు శనివారం అరెస్టు చేశారు.
నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్న బామ్మను చూడటానికి గురువారం బాధితురాలు తల్లితో కలిసివచ్చింది. రూంలో ఆడుకుంటున్న ఆ చిన్నారి దగ్గరకు వచ్చిన కామాంధుడు.. స్నాక్స్ కొనిస్తానని బయటకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.